Nokia phone
-
పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకున్న నోకియా
-
ఆ ఇంట్లో ఎటుచూసినా సెల్‌ఫోనే!:కొట్టేసినవి కాదు.. కొన్నవే
ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్‌ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్‌కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్‌బోర్డులు, బెడ్రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు. ‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్‌గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్మెంట్లో. ప్రస్తుతం నా కలెక్షన్స్‌లో 3,500 హ్యాండ్సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్. ఆ ఘటన తర్వాత.. చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్‌లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్‌సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు. భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను. పాత వీడియో చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు.. -
నోకియా 2.3 ఆవిష్కరణ
కైరో/ఈజిప్టు: ఫిన్లాండ్కు చెందిన నోకియా బ్రాండ్ ఫోన్స్ విక్రయ సంస్థ హెచ్ఎమ్డీ గ్లోబల్.. నోకియా 2.3 పేరిట అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదలచేసింది. దీని ధర 109 యూరోలు కాగా, భారత్‌లో రూ. 8,600 వరకు ఉండే అవకాశం ఉంది. 6.2 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ జనరల్ మేనేజర్ ప్రణవ్ ష్రాఫ్ అన్నారు. -
జియో ఎఫెక్ట్ : ఆ నోకియా ఫోన్లోకి వాట్సాప్
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీ తన జియోఫోన్‌లో మూడు పాపులర్ యాప్స్ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను అందించనున్నట్టు ప్రకటించగానే.. మిగతా ఫీచర్ ఫోన్ యూజర్లు కూడా జియోతో పోటీకి సిద్ధమవుతున్నాయి. జియో దెబ్బకు హెచ్ఎండీ గ్లోబల్ కూడా తన బనానా ఫోన్ నోకియా 8110 4జీ లో వాట్సాప్ అందించనున్నట్టు తెలిపింది. త్వరలోనే వాట్సాప్ సపోర్టును ఇవ్వనున్నట్టు తెలుపుతూ నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ల తయారీదారి హెచ్ఎండీ గ్లోబల్ టీజ్‌చేసింది. నోకియా ఈ ఫోన్ కూడా.. జియో ఫోన్ మాదిరి కిఓఎస్తో పనిచేస్తోంది. 2018 ఎండబ్ల్యూసీ ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, లెజెండరీ స్నేక్ గేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ అప్పడు వాట్సాప్ సపోర్టును ఈ బనానా ఫోన్ అందించలేకపోయింది. తాజాగా జియో తన ఫీచర్ ఫోన్‌కు వాట్సాప్ సపోర్టు తేవడంతో, ఇది కూడా తమ నోకియా ఫోన్‌కు త్వరలోనే వాట్సాప్ అందివ్వనున్నట్టు సంకేతాలిచ్చింది. ‘చూడండి. కిఓఎస్‌లో వాట్సాప్. ‘బనానా’స్లోకి వెళ్లడానికి చూస్తోంది’ అని హెచ్ఎండీ గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే నోకియా 8110 4జీ లోకి వాట్సాప్ వస్తున్నట్టు తెలిసింది. నోకియా 8110 4జీ ఫీచర్లు... డ్యూయల్ సిమ్ కిఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.45 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 1.1గిగాహెడ్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్ 512 ఎంబీ ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డు ద్వారా మరింత విస్తరణ 2 ఎంపీ రియర్ కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ Oh look, #Whatsapp on #KaiOS! Looking forward to going 🍌s! https://t.co/Av6gW3T2M0 — Juho Sarvikas (@sarvikas) July 5, 2018 -
రూ.3799 కే నోకియా స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : నోకియా ఫ్యాన్స్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నోకియా కొత్త స్మార్ట్ఫోన్లు నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, నోకియా 6(2018) ఫోన్లను తన ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంచామని, ఈ ఫోన్లపై డౌన్‌పేమెంట్ రూ.3799 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్టెల్ పేర్కొంది. తక్షణ ఫైనాన్సింగ్ ఆమోదంతో ఎయిర్టెల్ ఈ-స్టోర్ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చని, వీటిపై ఈఎంఐ రూ.1499 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్టెల్ ప్రకటించింది. తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై నోకియా స్మార్ట్‌ఫోన్ రేంజ్‌లను ప్రవేశపెడుతున్నామని భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ తెలిపారు. అదనంగా పోస్టు పెయిడ్ ప్లాన్లతో కలిపి ఈఎంఐలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు. 2017 అక్టోబర్ నుంచి ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. ఈ స్టోర్‌లో ఆపిల్, శాంసంగ్, ఇతర ఫోన్లు సరసమైన డౌన్‌పేమెంట్లలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘ప్రాజెక్ట్ నెక్ట్స్’ అనే డిజిటల్ ఇన్నోవేషన్ ప్రొగ్రామ్‌లో ఇది భాగం. డివైజ్ డౌన్‌పేమెంట్ ఈఎంఐ నోకియా 6.1 రూ.3799 రూ.1499తో 12 ఈఎంఐలు (3జీబీ ర్యామ్) నోకియా 6.1 రూ.5799 రూ.1499తో 12 ఈఎంఐలు (4జీబీ ర్యామ్) నోకియా 7 ప్లస్ రూ.5599 రూ.2099తో 12 ఈఎంఐలు నోకియా సిరొక్కో రూ.8599 రూ.2799తో 18 ఈఎంఐలు -
చౌకైన నోకియా ఫోన్ వచ్చేసింది..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వేదికగా తన చౌకైన నోకియా స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 99 యూరోలుగా కంపెనీ పేర్కొంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,500 రూపాయలు. నవంబర్ మధ్య నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని లాంచ్ ఈవెంట్లో కంపెనీ తెలిపింది. హెచ్ఎండీ గ్లోబల్ ఇప్పటి వరకు విడుదల చేసిన నోకియా బ్రాండు స్మార్ట్ఫోన్లలో ఇదే చాలా చౌక. ఈ ఫోన్ ప్రత్యేకత 4100 ఎంఏహెచ్ బ్యాటరీ. రెండు రోజులు వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉండనుంది. షావోమి రెడ్మి 4ఏ, మోటో సీ స్మార్ట్ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. నోకియా 2 ఫీచర్లు..5 అంగుళాల ఎల్టీపీఎస్ హెచ్డీ స్క్రీన్, గొర్రిల్లా గ్లాస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నోగట్, త్వరలోనే ఓరియో అప్డేట్ కాపర్ బ్లాక్, క్లియర్ బ్లాక్, క్లియర్ వైట్ రంగుల్లో ఇది అందుబాటు -
రేవంత్ రెడ్డి కేసులో పురోగతి?
హైదరాబాద్: :నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో మరింత పురోగతి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు గాను ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అత్యధిక మొత్తంలో డబ్బులతో ఎరవేసిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో తవ్వినకొద్దీ నిజాలు బయటకొస్తున్నాయి. ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే టీడీపీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే బ్యాంకు నుంచి రూ.2.50 కోట్లు డ్రా చేసినట్లు ఏసీబీ వద్ద ఆధారాలున్నట్లు సమాచారం. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్ము మరో నలుగురి అందజేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్ము నేరుగా ఓ సినీ నిర్మాత ఇంటికి చేరవేసి అక్కడ్నుంచి వ్యవహారం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై ఏసీబీ కొంత గోప్యత పాటిస్తోంది. -
స్విస్ ఫోన్‌ను పక్కనబెట్టి నోకియాతో రేవంత్ డీల్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందు కోసమే తెలుగుదేశం నేత ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఫోన్‌ను ఉపయోగించారు. ఏడాదికో సెల్‌ఫోన్, నంబర్ మార్చే అలవాటున్న ఆయన సాధారణంగా తెలిసిన వారి నంబర్లు మినహా మిగతా ఏ నంబర్లకు స్పందించరు. తాను పర్సనల్‌గా ఉపయోగించే సెల్‌ఫోన్ నంబరు కూడా సన్నిహితులు, పార్టీలోని ముఖ్యులకే తెలుస్తుంది. ఈ మేరకు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏడాది తరువాత ఆ నంబర్ అందరికీ తెలిసిందని అర్థం కాగానే అప్పటి వరకు ఉపయోగించిన ఫోన్‌ను వ్యక్తిగత సహాయకుడికి ఇచ్చి... కొత్త ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగించడం ఆయనకు అలవాటు. రేవంత్ రెడ్డి ఉపయోగించే ఫోన్లు, వాటికి వచ్చిన కాల్స్‌పై ఏసీబీ జరిపిన విచారణలో తేలిన విశేషాలు ఇవి. 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు నంబర్లు మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వినియోగించే వ్యక్తిగత ఫోన్ నంబర్ 9505900009 కాగా, ఆయన పీఏ వద్ద ఉన్న నంబర్ 8790900009 (ఏడాది క్రితం వరకు ఈ నంబరే ఆయన పర్సనల్ నంబర్). కాగా ఓటుకు నోటు డీల్‌లో ఆయన వినియోగించిన తాత్కాలిక ఫోన్ 8991072510. ఐడియాకు చెందిన ఈ సిమ్ కార్డును ప్రత్యేకంగా ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కోసమే వాడినట్లు ఏసీబీ సేకరించిన కాల్ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆయన ఉపయోగించే వ్యక్తిగత ఫోన్ స్విట్జర్లాండ్‌కు చెందిన ఖరీదైన ‘వర్చ్యు డ్రాగన్ సిగ్నేచర్’ ఫోన్ కాగా డీల్ కోసం సాధారణ నోకియా ఫోన్‌ను కొత్త సిమ్‌తో వాడడం గమనార్హం.