ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్‌ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్‌కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్‌బోర్డులు, బెడ్‌రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు.
‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్‌గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్‌మెంట్‌లో. ప్రస్తుతం నా కలెక్షన్స్‌లో 3,500 హ్యాండ్‌సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్.
ఆ ఘటన తర్వాత..
చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్‌లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్‌లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్‌సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్‌సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్‌లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు.
భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట
జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను.
పాత వీడియో
చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు..
Comments
Please login to add a commentAdd a comment