ఆటలో సిక్స్‌... జీవితంలో ఔట్‌! | Man Dies Immediately After Hitting Six In Match Near Mumbai | Sakshi
Sakshi News home page

ఆటలో సిక్స్‌... జీవితంలో ఔట్‌!

Published Mon, Jun 3 2024 3:34 PM | Last Updated on Mon, Jun 3 2024 3:42 PM

Man Dies Immediately After Hitting Six In Match Near Mumbai

ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్‌ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.

తాజాగా ఓ యువకుడు క్రికెట్‌ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్‌లో రెండు టీమ్‌లు క్రికెట్‌ ఆడుతుండగా.. పింక్‌ జెర్సీ ధరించి బ్యాటింగ్‌ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్‌ కొట్టాడు. బాల్‌ అమాంతం ఎగిరి పార్క్‌ గ్రౌండ్‌ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్‌ కుప్పకూలిపోయాడు. 

గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని  రామ్‌ గణేష్‌ తేవార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement