స్విస్ ఫోన్‌ను పక్కనబెట్టి నోకియాతో రేవంత్ డీల్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందు కోసమే తెలుగుదేశం నేత ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఫోన్‌ను ఉపయోగించారు. ఏడాదికో సెల్‌ఫోన్, నంబర్ మార్చే అలవాటున్న ఆయన సాధారణంగా తెలిసిన వారి నంబర్లు మినహా మిగతా ఏ నంబర్లకు స్పందించరు. తాను పర్సనల్‌గా ఉపయోగించే సెల్‌ఫోన్ నంబరు కూడా సన్నిహితులు, పార్టీలోని ముఖ్యులకే తెలుస్తుంది. ఈ మేరకు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏడాది తరువాత ఆ నంబర్ అందరికీ తెలిసిందని అర్థం కాగానే అప్పటి వరకు ఉపయోగించిన ఫోన్‌ను వ్యక్తిగత సహాయకుడికి ఇచ్చి... కొత్త ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగించడం ఆయనకు అలవాటు. రేవంత్ రెడ్డి ఉపయోగించే ఫోన్‌లు, వాటికి వచ్చిన కాల్స్‌పై ఏసీబీ జరిపిన విచారణలో తేలిన విశేషాలు ఇవి.
2009లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు నంబర్లు మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వినియోగించే వ్యక్తిగత ఫోన్ నంబర్ 9505900009 కాగా, ఆయన పీఏ వద్ద ఉన్న నంబర్ 8790900009 (ఏడాది క్రితం వరకు ఈ నంబరే ఆయన పర్సనల్ నంబర్). కాగా ఓటుకు నోటు డీల్‌లో ఆయన వినియోగించిన తాత్కాలిక ఫోన్ 8991072510. ఐడియాకు చెందిన ఈ సిమ్ కార్డును ప్రత్యేకంగా ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కోసమే వాడినట్లు ఏసీబీ సేకరించిన కాల్ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆయన ఉపయోగించే వ్యక్తిగత ఫోన్ స్విట్జర్లాండ్‌కు చెందిన ఖరీదైన ‘వర్చ్యు డ్రాగన్ సిగ్నేచర్’ ఫోన్ కాగా డీల్ కోసం సాధారణ నోకియా ఫోన్‌ను కొత్త సిమ్‌తో వాడడం గమనార్హం.