అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది | Nokia 8 could launch on July 31, priced over Rs 40,000 | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది

Published Mon, Jul 17 2017 4:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది

అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది

నోకియా బ్రాండులో హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ త్వరలో మార్కెట్లోకి వచ్చేస్తోంది.

నోకియా బ్రాండులో హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ త్వరలో మార్కెట్లోకి వచ్చేస్తోంది. నోకియా 8 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 40వేల రూపాయలకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ నెల 31న గ్లోబల్‌గా లాంచ్‌ చేయబోతుందట. హెచ్‌ఎండీ కొత్తగా లాంచ్‌ చేయబోతున్న ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌ల గురించి ఇప్పటికే మార్కెట్లో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నోకియా 8 లేదా నోకియా 9 ఫ్లాగ్‌షిప్‌ను కంపెనీ లాంచ్‌ చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా జర్మన్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన రిపోర్టులో నో​కియా బ్రాండులో తర్వాత రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8గా తెలిసింది.
 
ఈ డివైజ్‌ మోడల్‌ నెంబర్‌ టీఏ-1004గా జర్మన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అదనంగా ఈ ఫోన్‌ జూలై 31 నుంచి విక్రయానికి రానుందని కూడా చెప్పింది. ఇదే సమయంలో నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ గురించి ఊసైన ఎత్తలేదు. అదేవిధంగా నోకియా 8 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో 40వేల రూపాయలుగా ఉండబోతుందని తెలిపింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ కూడా తమ తొలి హైఎండ్‌ ఫోన్‌ లాంచ్‌ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. అది నోకియా 8గా మార్కెటింగ్‌ కూడా చేస్తుందట. 
 
నోకియా 8లో ఉండబోతుందన్న ఫీచర్లేమిటో ఓ సారి తెలుసుకుందాం...
స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
డ్యూయల్‌ సిమ్‌ కార్డులు 
నాలుగు రంగులు(బ్లూ, స్టీల్‌, గోల్డ్‌/బ్లూ, గోల్డ్‌/కాపర్‌)
అంచనా ధర రూ.43,415
ఇటీవలే కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌ పార్టనర్‌షిప్‌ జర్మన్‌ ఆప్టిక్స్‌ జీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఫేమస్‌ జీస్‌ లెన్స్‌ ఉండబోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement