సాక్షి, న్యూఢిల్లీ : నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్ కంపెనీ మరింత దూకుడుగా దూసుకెళ్లోంది. ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా విడుదల చేసిన మూడు కొత్త నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను హెచ్‌ఎండీ గ్లోబల్ నేడు భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. నోకియా 6 (2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో పేర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
నోకియా 8 సిరోకో ధర, ఆఫర్లు....
నోకియా 8 సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 20 నుంచి ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్, నోకియా సొంత ఆన్‌లైన్ స్టోర్లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌పై ఎయిర్‌టెల్ అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు 120జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.రూ.199, రూ.349 మొత్తాల తొలి ఆరు రీఛార్జ్‌లపై 20జీబీ చొప్పున ఈ అదనపు డేటా అందించనుంది. అదే పోస్టు పెయిడ్ యూజర్లకైతే, రూ.399, రూ.499 ప్లాన్లపై ఆరు నెలల పాటు ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. దీనిలోనే 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్‌టెల్ టీవీ యాప్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
నోకియా 8 సిరోకో ఫీచర్లు...
5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ పీఓలెడ్ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ వన్
6 జీబీ ర్యామ్
128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు అవకాశం లేదు
12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
నోకియా 7 ప్లస్ ధర, ఆఫర్లు...
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి నోకియా వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఎయిర్‌టెల్ టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకూ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
నోకియా 6 కొత్త ఫోన్ ధర, ఆఫర్లు...
నోకియా 6 కొత్త ఫోన్ ధర రూ.16,999గా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 6 నుంచి నోకియా షాపు, దిగ్గజ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుదారులకు లభించనుంది. మేక్‌మైట్రిప్ హోటల్ బుకింగ్స్‌పై ఈ ఫోన్ యూజర్లు డిస్కౌంట్ పొందుతారు. నోకియా 6 కొనుగోలుదారులకు 12 నెలల కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
నోకియా 6 (2018) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
16 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment