nokia 6
-
నోకియా స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది
నోకియా 6.1 ప్లస్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు ముందు నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసే హెచ్ఎండీ గ్లోబల్, నోకియా 6.1/నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. నోకియా 6.1 ధరను 1500 రూపాయలు తగ్గిస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. నోకియా 6.1 లాంచ్ అయి ఐదు నెలలే కావొస్తోంది. ఏప్రిల్‌లోనే నోకియా 6.1 భారత్‌లోకి వచ్చింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర లాంచింగ్ సందర్భంగా 16,999 రూపాయలు ఉండగా... ధర తగ్గించిన అనంతరం 15,499 రూపాయలుగా ఉంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర లాంచింగ్ సందర్భంగా 18,999 రూపాయలు ఉండగా.. ధర తగ్గింపు తర్వాత 17,499 రూపాయలుగా నిర్ణయించింది. నోకియా 6.1 వేరియంట్ల కొత్త ధరలు కంపెనీ ఇండియా సైట్లో చూడవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లపై ఆఫర్ చేసే మిగతా ఆఫర్లు అదే విధంగా ఉన్నాయి. నోకియా 6.1 ఫీచర్లు.. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. -
నోకియా 3 స్మార్ట్ఫోన్లు, ఫీచర్లు అదుర్స్...
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ మరింత దూకుడుగా దూసుకెళ్లోంది. ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా విడుదల చేసిన మూడు కొత్త నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ నేడు భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నోకియా 6 (2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో పేర్లతో ఈ స్మార్ట్ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నోకియా 8 సిరోకో ధర, ఆఫర్లు.... నోకియా 8 సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 20 నుంచి ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్, నోకియా సొంత ఆన్లైన్ స్టోర్లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌పై ఎయిర్టెల్ అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు 120జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.రూ.199, రూ.349 మొత్తాల తొలి ఆరు రీఛార్జ్‌లపై 20జీబీ చొప్పున ఈ అదనపు డేటా అందించనుంది. అదే పోస్టు పెయిడ్ యూజర్లకైతే, రూ.399, రూ.499 ప్లాన్లపై ఆరు నెలల పాటు ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. దీనిలోనే 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్టెల్ టీవీ యాప్ ఉచిత సబ్స్క్రిప్షన్ ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 8 సిరోకో ఫీచర్లు... 5.5 ఇంచ్ క్యూహెచ్డీ పీఓలెడ్ డిస్ప్లే 2560 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ వన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు అవకాశం లేదు 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నోకియా 7 ప్లస్ ధర, ఆఫర్లు... ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి నోకియా వెబ్సైట్, అమెజాన్ ఇండియా, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఎయిర్టెల్ టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకూ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ నోకియా 6 కొత్త ఫోన్ ధర, ఆఫర్లు... నోకియా 6 కొత్త ఫోన్ ధర రూ.16,999గా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 6 నుంచి నోకియా షాపు, దిగ్గజ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుదారులకు లభించనుంది. మేక్మైట్రిప్ హోటల్ బుకింగ్స్‌పై ఈ ఫోన్ యూజర్లు డిస్కౌంట్ పొందుతారు. నోకియా 6 కొనుగోలుదారులకు 12 నెలల కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. నోకియా 6 (2018) ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 6పై రెండోసారి ధర తగ్గింపు
నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర మరోసారి తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను హెచ్ఎండీ గ్లోబల్ రూ.12,999కు తగ్గించింది. గతేడాది జూన్‌లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర 14,999 రూపాయలుగా ఉండేది. గత నెలలో దీని ధరను 1500 రూపాయలు తగ్గించి, 13,499 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో దీని ధరను మరింత తగ్గించి రూ.12,999కు ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ధర నోకియా 6 3జీబీ ర్యామ్ వేరియంట్ సిల్వర్, మేట్ బ్లాక్ రంగుల ఆప్షన్లకు అందుబాటులో ఉంది. నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు కొన్ని గంటల ముందు ఈ స్మార్ట్‌ఫోన్ ధరను హెచ్ఎండీ గ్లోబల్ తగ్గించింది. ఈ కొత్త ధరతో పాటు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్‌తో నోకియా 6 స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువగా రూ.9,915కే లభ్యమవుతోంది. నోకియా 6 3జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ ర్యామ్ వేరియంట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 16,999 రూపాయలుగా ఉన్న దీని ధరను, కంపెనీ ఏ మాత్రం మార్పు చేయలేదు. నోకియా 6 ఫీచర్లు డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియా 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెన్సార్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 128జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫామ్‌పై నోకియా మొబైల్ వీక్ నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ మొబైల్ వీక్‌లో నోకియా 8, నోకియా 6 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు అంటే జనవరి 12 వరకు ఈ మొబైల్ వీక్‌ను అమెజాన్ నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.1500 వరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో రూ.14,999గా ఉన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ రూ.13,499కు దిగొచ్చింది. అంతేకాక రూ.36,999గా ఉన్న నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ.35,499కు తగ్గింది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే, అదనంగా ఫ్లాట్ రూ.1500 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నోకియా 8 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అమేజింగ్ మొబైల్స్ లేదా గ్రీన్ మొబైల్స్‌లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది. అంతేకాక కస్టమర్లకు రూ.1500 ఐసీఐసీఐ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ.2000 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. -
న్యూఇయర్‌లో నోకియా కొత్త ఫోన్
పలు రూమర్లు, పలు లీక్స్ అనంతరం హెచ్ఎండీ గ్లోబల్ కొత్త ఏడాదిలో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 6 సక్సర్గా నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనీస్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్‌లో విక్రయానికి రానుంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. జనవరి 10 నుంచి దీని సేల్ మొదలవుతుంది. 32జీబీ నోకియా 6(2018) వేరియంట్ ధర సుమారు రూ.14,600 ఉండగా.. 64జీబీ వేరియంట్ ధర రూ.16,600గా ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ రెండు వేరియంట్లు బ్లాక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒరిజినల్ నోకియా 6 మోడల్ మాదిరిగా కాకుండా.. ఈ ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ కొత్త నోకియా 6 మెటల్ యూనిబాడీతో 6000 సిరీస్ అల్యూమినియంతో రూపొందింది. నోకియా 6(2018) ఫీచర్లు... డ్యూయల్ సిమ్(నానో) ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే విత్ ఫుల్-హెచ్డీ రెజుల్యూషన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ఎస్ఓసీ 2.2గిగాహెడ్జ్ మైక్రోఎస్డీ కార్డు స్లాట్ 16 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
డిస్కౌంట్లో నోకియా 8, నోకియా 6
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను నవంబర్ 13 నుంచి నవంబర్17 మధ్యలో అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లిదరికీ రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. ఒకవేళ యూజర్లు అమెజాన్ పే, ఇతర పేమెంట్ విధానంలో చెల్లించిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భిన్నంగా ఉండనున్నాయి. నోకియా 6ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్‌బ్యాక్ అందనుంది. అదే నాన్-ప్రైమ్ యూజర్లైతే రూ.1500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ మెంబర్లు ఒకవేళ ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.500ను తగ్గించనుంది. అదే ప్రైమ్ మెంబర్లు ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఎలాంటి తగ్గింపు ఉండదు. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందబాటులో ఉండనుంది. ఇతర పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి క్యాష్‌బ్యాక్‌ను ప్రైమ్ మెంబర్లు ఇవ్వదు. అంతేకాక ఈ రెండు స్మార్ట్ఫోన్లపై అదనంగా 1000 రూపాయల ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందించనుంది. కాగ, నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,199కాగ, నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ధర 36,999 రూపాయలు. -
నోకియా 6పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్
నోకియా బ్రాండులో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసమే అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2,200 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. 32జీబీ అయిన నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ ధర 17,199 రూపాయలు. 13 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 14,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక అమెజాన్ పే ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. అదేవిధంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,601 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ టచ్-స్క్రీన్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 16 ఎంపీ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరా 8 ఎంపీ ఏఎఫ్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ స్కానర్ మేట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ రంగులో ఇది అందుబాటు -
నోకియా 6 ష్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్స్
న్యూడిల్లీ: నోకియా 6 స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ మరోసారి ప్రారంభం. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన హెచ్ఎండీ గ్లోబల్ ఎఫర్డబుల్ మిడ్-రేంజ్ హ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాలో ఈ హ్యాండ్ సెట్ ప్రత్యేకంగా కొనుగోలుకు లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ( ఆగష్టు 23న) సందర్భంగా ఒకే ఒక్క నిమిషంలో మొత్తం ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. మరి ఈసారి ఎన్ని నిమిషాల్లో ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రూ.14,999ధరలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మాట్ట్ బ్లాక్, సిల్వర్, కాపర్ వైట్, టెంపర్డ్ బ్లూ, కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఆగస్టు 28 న సోమవారం ఇ-కామర్స్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ అమ్మకం. అలాగే ఆగస్టు 23 లేదా ఆగస్టు 30న రిజిష్టర్ చేసుకున్నవారు సెప్టెంబరు 6 న జరగబోయే తరువాతి సేల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ ఫ్లాష్ సేల్ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. నోకియా 6 సేల్ ఆఫర్స్ అమెజాన్ పే ద్వారా నోకియా 6ను కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రూ.1000 డిస్కౌంట్. కిండ్లే యాప్ ద్వారా ఈ-బుక్స్ పై 80శాతం రాయితీ(దాదాపు రూ.300దాకా) . రూ.2500 మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ (రూ. 1,800 హోటళ్లు, విమానాల మీద రూ .700), ఐదు నెలల కాలంలో 45జీబి వొడాఫోన్ ఉచిత 4జీడేటా ఉచితం నోకియా 6 ఫీచర్స్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్ విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ 3జీబి ర్యామ్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 6 విక్రయం నేటి నుంచే...
హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసిన మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6 తొలి విక్రయం నేటి(బుధవారం) నుంచే ప్రారంభమవుతోంది. అమెజాన్ ఇండియాలో నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. జూన్‌లో నోకియా 3, నోకియా 5తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. మిగతా రెండు స్మార్ట్ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి వచ్చాయి. నోకియా 6 మాత్రం నేడే విక్రయానికే వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లను కూడా అమెజాన్ లిస్టు చేసింది. సోమవారంతోనే ఈ ఫోన్ తొలి సేల్ రిజిస్ట్రేషన్లు క్లోజయ్యాయి. మేట్ బ్లాక్, సిల్వర్, టాంపర్డ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి ఉండనుంది. నోకియా 6 లాంచ్ ఆఫర్స్... నోకియా 6 ధర 14,999 రూపాయలు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.1000 అమెజాన్ పే బ్యాలెన్స్. కిండ్లీ బుక్స్‌పై 80 శాతం తగ్గింపు. మేక్‌మైట్రిప్‌లో రూ.2500 డిస్కౌంట్. ఐదు నెలల వ్యవధిలో 45జీబీ ఉచిత డేటా. నోకియా 6 ఫీచర్లు... 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ డ్యూయల్ సిమ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ స్మార్ట్‌ఫోన్ 10లక్షల రిజిస్ట్రేషన్లను దాటేసింది
బెంగళూరు: మొబైల్ మార్కెట్లోకి మళ్లీ దూసుకొచ్చిన నోకియా ఇప్పటికే కొన్ని స్మార్ట్పోన్లతోపాటు ఫీచర్ ఫోన్లను కూడా లాంచ్ చేసింది. ఒకప్పుడు దూసుకుపోయిన నోకియా..రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా నోకియా 6 ఇప్పటికే 10లక్షలను మించిన రిజిస్ట్రేషన్లను సొంతం చేసుకుంది. అమెజాన్ లో నోకియా 6 ఒక మిలియన్ పైగా రిజిస్ట్రేషన్లను పొందిందని అమెజాన్ ప్రకటించింది. నోకియా 6 తోపాటు నోకియా 5, 3 స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 6 కోసం జూలై 14 న కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆగష్టు 23 నుంచి రూ.14,999 ధరలో కొనుగోలుకు ఇది అందుబాటులోఉంది. జూలై 14న కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆగష్టు 23 నుంచి రూ.14,999 ధరలో కొనుగోలుకు ఇది అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన అమెజాన్ 'ప్రైమ్' సభ్యులకు రూ. 1000 క్యాష్‌బ్యాక ఆఫర్కూడా అందిస్తోంది. అంతేకాదు యూనిక్ డైలీ డీల్స్ విడ్జెట్ లో మెజాన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియోయాప్ ను ముందే ఇన్స్టాల్ చేసింది. దీంతో వేలకొద్దీ సినిమాలు,టీవీ కార్యక్రమాలను కూడా కస్టమర్లు పొందవచ్చు.మాట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ అండ్ కాపర్ రంగుల్లో అందుబాటులో ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. నోకియా 6 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, షహైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీ వీవోఎల్టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
నోకియా ఫోన్లు వచ్చేశాయ్..ధరలు?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నోకియా బ్రాండ్ ఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో సరికొత్త నోకియా స్మార్ట్ఫోన్లు మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ప్రస్తుత నోకియా బ్రాండ్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 6, నోకియా 5, నోకియా 3 పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. నోకియా 6, నోకియా 5, నోకియా 3 ధరలు వరుసగా రూ .14,999, రూ .12,899 మరియు రూ .9,499. నోకియా 5 ప్రత్యేకంగా ఆఫ్ లైన్ రిటైలర్లలోఅందుబాటులో ఉంటుంది, అయితే నోకియా 6 అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నోకియా 3 ఇతర రిటైల్ దుకాణాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. నోకియా 3 స్మార్ట్‌ఫోన్ జూన్ 16 నుంచి, నోకియా 5ను జులై 7 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అలాగే జూలై 14నుంచి నోకియా 6 అమెజాన్‌లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నోకియా 6 5.5 ఇంచ్‌ల హెచ్డీ స్క్రీన్, అల్యూమినియం కేసుతో నాలుగు రంగులలో లభ్యంకానుంది. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 గ్రాఫిక్స్ ప్రాసెసర్లతో రూపొందింది. 32జీబీ/3జీబీ- 64జీబీ/4జీబీ వెర్షన్లో లభ్యం. ఎస్డీ కార్డ్ ద్వారా 256 జీబీ వరకూ మెమరీ పెంచుకోవచ్చు. వెనుక 16 ఎంపీ, సెల్ఫీలకు ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాలను అమర్చింది. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం. నోకియా 5 5.2 డిస్ ప్లే, 720x1280 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 13 ఎంపీరియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కాపర్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ లో లభ్యం. ఇక నోకియా 3 విషయానికి వస్తే 5 అంగుళాల డిస్ప్లే, 8 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 2630 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా కొత్త ఫోన్లు మన మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్ ఫోన్లను ఈ నెల 13వ న్యూఢిల్లీ వేదికగా భారత్ లో లాంచ్ చేయనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ ఫోన్లు లాంచింగ్ ఈవెంట్ కు ఆహ్వానాలను కూడా కంపెనీ పంపిస్తోంది. నోకియా బ్రాండ్ హ్యాండ్ సెట్లను రూపొందించడానికి, డిజైన్ కు సంబంధించి ఫిన్నిస్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కు గతేడాదే వాటి లైన్సెన్సులను సంపాదించుకుంది. ఇటీవలే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310ను హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017లో హెచ్ఎండీ గ్లోబల్ ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఈ కొత్త ఫోన్లను జూన్ లోనే భారత్ లోకి ప్రవేశపెడతారంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ మూడు ఫోన్లను జూన్ లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. నోకియా 6... నోకియా ఆండ్రాయిడ్ రేంజ్ లో నోకియా 6 టాప్ లైన్ మోడల్. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ 3, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ముందు వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. నోకియా 5... గొర్రిల్లా గ్లాస్ తో 5.2 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లేను ఇది కలిగిఉంటుందని, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ షూటర్ ఈ ఫోన్లో ఫీచర్లు. నోకియా 3... 5.0 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లే, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, 2జీబీ ర్యామ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ లో ఉండబోయే ఫీచర్లు. ఈ మూడు డివైజ్ ల ధరలు కూడా 17,600 రూపాయలు, 13,300 రూపాయలు, 9,800 రూపాయలుగా ఉండబోతున్నాయని అంచనాలు వస్తున్నాయి. -
రిలీజ్ కు ముందే.. ఆన్లైన్లో నోకియా 6!
పునరాగమనానికి నోకియా భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాదిలో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి నోకియా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, గత కొంతకాలంగా నోకియా ప్రవేశపెడుతున్న నోకియా 6 ఫోన్‌కు సంబంధించిన లీక్‌లు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ-కామర్స్ సైట్ ఈబే నోకియా 6 ఫోన్ ఆన్లైన్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా, నోకియా6ను నోకియా భారత్‌లో అధికారికంగా విడుదల చేయలేదు. భారత్‌లో నోకియా ఫోన్ల అమ్మకందారు హెచ్ఎండీ గ్లోబల్ కూడా మార్కెట్లో నోకియా 6ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చైనాలో మాత్రమే నోకియా6 అధికారికంగా అందుబాటులో ఉంది. ఈబే సైట్లో నోకియా 6 పేరిట అందుబాటులో ఉన్న ఫోన్ ధరను రూ.32,440గా పేర్కొంది. కాగా, చైనాలో ఈ ఫోన్ ధర రూ.17 వేలు మాత్రమే. ఇదిలావుండగా ఈ నెలాఖరులో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)లో నోకియాకు సంబంధించిన రైట్స్‌ను ఫిన్నిష్ కంపెనీ దక్కించుకుంది. (చదవండి: నోకియా 6జీబీ ర్యామ్ మొబైల్: ధర ఎంతో తెలుసా?)