
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా 6, నోకియా 8 స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను నవంబర్ 13 నుంచి నవంబర్17 మధ్యలో అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లిదరికీ రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. ఒకవేళ యూజర్లు అమెజాన్ పే, ఇతర పేమెంట్ విధానంలో చెల్లించిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భిన్నంగా ఉండనున్నాయి.
నోకియా 6ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్‌బ్యాక్ అందనుంది. అదే నాన్-ప్రైమ్ యూజర్లైతే రూ.1500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ మెంబర్లు ఒకవేళ ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.500ను తగ్గించనుంది. అదే ప్రైమ్ మెంబర్లు ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఎలాంటి తగ్గింపు ఉండదు.
నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందబాటులో ఉండనుంది. ఇతర పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి క్యాష్‌బ్యాక్‌ను ప్రైమ్ మెంబర్లు ఇవ్వదు. అంతేకాక ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై అదనంగా 1000 రూపాయల ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందించనుంది. కాగ, నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,199కాగ, నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ధర 36,999 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment