Nokia 8
-
ఆ రెండు నోకియా ఫోన్ల ప్రీ-ఆర్డర్లు
హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల లాంచ్ చేసిన నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. మార్చిలో ఈ రెండు స్మార్ట్ఫోన్లు గ్లోబల్‌గా అందుబాటులోకి రాగ, ఈ నెల మొదట్లో భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఏప్రిల్ 30 నుంచి ఈ స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతిలోకి రానున్నాయి. నోకియా 7 ప్లస్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించగా.. అమెజాన్ ఇండియా, నోకియా.కామ్/ఫోన్లలో ఇది అందుబాటులో ఉండనుంది. నోకియా సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, నోకియా మొబైల్ షాపులో లభ్యం కానుంది. సంగీత, పూర్విక, బిగ్ సి, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఎంపిక చేసిన అవుట్లెట్లలో కూడా ఈ రెండు హ్యాండ్సెట్లు దొరకనున్నాయి. నోకియా 7 ప్లస్ కొనుగోలుదారులకు ఎయిర్టెల్ నెట్వర్క్ రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అదేవిధంగా నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్‌ఫై ఎయిర్టెల్ తన యూజర్లకు 20జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనుంది. పోస్టుపెయిడ్ కస్టమర్లు రూ.399, రూ.499 ప్లాన్లపై నెలకు 20జీబీ కాంప్లిమెంటరీ డేటా పొందనున్నారు. 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్టెల్ టీవీ యాప్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. మేక్మైట్రిప్ ద్వారా జరిపే దేశీయ హోటల్స్ బుకింగ్స్‌పై 25 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నోకియా 8 సిరోకో ఫీచర్లు 5.5 ఇంచ్ డిస్ప్లే, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్బీ టైప్ సి, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్. -
నోకియా 3 స్మార్ట్ఫోన్లు, ఫీచర్లు అదుర్స్...
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ మరింత దూకుడుగా దూసుకెళ్లోంది. ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా విడుదల చేసిన మూడు కొత్త నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ నేడు భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నోకియా 6 (2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో పేర్లతో ఈ స్మార్ట్ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నోకియా 8 సిరోకో ధర, ఆఫర్లు.... నోకియా 8 సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 20 నుంచి ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్, నోకియా సొంత ఆన్లైన్ స్టోర్లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌పై ఎయిర్టెల్ అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు 120జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.రూ.199, రూ.349 మొత్తాల తొలి ఆరు రీఛార్జ్‌లపై 20జీబీ చొప్పున ఈ అదనపు డేటా అందించనుంది. అదే పోస్టు పెయిడ్ యూజర్లకైతే, రూ.399, రూ.499 ప్లాన్లపై ఆరు నెలల పాటు ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. దీనిలోనే 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్టెల్ టీవీ యాప్ ఉచిత సబ్స్క్రిప్షన్ ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 8 సిరోకో ఫీచర్లు... 5.5 ఇంచ్ క్యూహెచ్డీ పీఓలెడ్ డిస్ప్లే 2560 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ వన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు అవకాశం లేదు 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నోకియా 7 ప్లస్ ధర, ఆఫర్లు... ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి నోకియా వెబ్సైట్, అమెజాన్ ఇండియా, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఎయిర్టెల్ టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకూ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ నోకియా 6 కొత్త ఫోన్ ధర, ఆఫర్లు... నోకియా 6 కొత్త ఫోన్ ధర రూ.16,999గా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 6 నుంచి నోకియా షాపు, దిగ్గజ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుదారులకు లభించనుంది. మేక్మైట్రిప్ హోటల్ బుకింగ్స్‌పై ఈ ఫోన్ యూజర్లు డిస్కౌంట్ పొందుతారు. నోకియా 6 కొనుగోలుదారులకు 12 నెలల కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. నోకియా 6 (2018) ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు
నోకియా 5, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై భారత్‌లో హెచ్ఎండీ గ్లోబల్ ధరలు తగ్గించింది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 8 వేల రూపాయల ధర తగ్గించి రూ.28,999కు తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను గతేడాది అక్టోబర్‌లో లాంచ్ చేసినప్పుడు రూ.36,999గా ఉండేది. అంతేకాక నోకియా 5 (3జీబీ వేరియంట్) స్మార్ట్‌ఫోన్‌పై కూడా వెయ్యి రూపాయలు ధర తగ్గించి, రూ.12,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సమీక్షించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2018 జరుగబోతున్న తరుణంలో ఈ రేట్లను తగ్గించింది. నోకియా 5 స్పెషిఫికేషన్లు.. 5.2 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 8 స్పెషిఫికేషన్లు.... 5.3 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫామ్‌పై నోకియా మొబైల్ వీక్ నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ మొబైల్ వీక్‌లో నోకియా 8, నోకియా 6 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు అంటే జనవరి 12 వరకు ఈ మొబైల్ వీక్‌ను అమెజాన్ నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.1500 వరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో రూ.14,999గా ఉన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ రూ.13,499కు దిగొచ్చింది. అంతేకాక రూ.36,999గా ఉన్న నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ.35,499కు తగ్గింది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే, అదనంగా ఫ్లాట్ రూ.1500 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నోకియా 8 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అమేజింగ్ మొబైల్స్ లేదా గ్రీన్ మొబైల్స్‌లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది. అంతేకాక కస్టమర్లకు రూ.1500 ఐసీఐసీఐ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ.2000 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. -
డిస్కౌంట్లో నోకియా 8, నోకియా 6
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను నవంబర్ 13 నుంచి నవంబర్17 మధ్యలో అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లిదరికీ రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. ఒకవేళ యూజర్లు అమెజాన్ పే, ఇతర పేమెంట్ విధానంలో చెల్లించిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భిన్నంగా ఉండనున్నాయి. నోకియా 6ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్‌బ్యాక్ అందనుంది. అదే నాన్-ప్రైమ్ యూజర్లైతే రూ.1500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ మెంబర్లు ఒకవేళ ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.500ను తగ్గించనుంది. అదే ప్రైమ్ మెంబర్లు ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఎలాంటి తగ్గింపు ఉండదు. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందబాటులో ఉండనుంది. ఇతర పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి క్యాష్‌బ్యాక్‌ను ప్రైమ్ మెంబర్లు ఇవ్వదు. అంతేకాక ఈ రెండు స్మార్ట్ఫోన్లపై అదనంగా 1000 రూపాయల ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందించనుంది. కాగ, నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,199కాగ, నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ధర 36,999 రూపాయలు. -
నోకియా 8 లాంచ్, ఫీచర్లు అదుర్స్
నోకియా అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హైఎండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8 స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను న్యూఢిల్లీ వేదికగా నేడు(మంగళవారం) భారత్‌లోకి లాంచ్ చేస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ, వెనుకవైపు రెండు కెమెరాల సెటప్, ప్రీమియం యూనిబాడీ డిజైన్, బోతీస్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. అక్టోబర్ 14 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో దీన్ని విక్రయించనున్నారు. అంతేకాక క్రోమా, రిలయన్స్, సంగీత మొబైల్స్, పూర్వికా, బిగ్ సీ వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. దీని ధర 32,999 రూపాయలు. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ధర కూడా 32,999 రూపాయలే కావడం విశేషం. నోకియా 8 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి అదనంగా 100 జీబీ జియో డేటా అందించనున్నారు. అంటే రూ.309, ఆపై రీఛార్జ్‌లపై నెలకు 10జీబీ అదనపు డేటా చొప్పున 10 రీఛార్జ్‌లపై 2018 ఆగస్టు వరకు ఈ ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కస్టమర్లకు కంపెనీ ఆఫర్ చేయనుంది. నోకియా 8 ఫీచర్లు.... ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ డ్యూయల్ సిమ్(నానో) 5.3 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఒకేసారి ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను వాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు(బోతీస్గా ఈ ఫీచర్ పేరు కూడా పెట్టింది) 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ 3090ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ -
నోకియా 8.. రేపే లాంచింగ్
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ రేపే భారత్‌లోకి లాంచ్ కాబోతుంది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను రేపు భారత్‌లో లాంచ్ చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సర్వం సిద్ధం చేసింది. వెనుక వైపు రెండు కెమెరాలతో నోకియా 8 భారత మార్కెట్లోకి వస్తోంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో రాబోతున్న కంపెనీ తొలి డివైజ్ కూడా నోకియా 8 స్మార్ట్ఫోనే. మెరుగైన మల్టిమీడియా అనుభవం కోసం 360 డిగ్రీ ఆడియో టెక్నాలజీని ఇది కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఐఫోన్లకు గట్టిపోటీ ఇచ్చే మాదిరే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆ స్మార్ట్‌ఫోన్ ఆగస్టులోనే లాంచైంది. నోకియా 8 ఫీచర్స్ 5.3 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే 1440 x 2560 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా(4కే వీడియో) 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా ఫస్ట్ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్.. త్వరలో
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హవా చాటాలని ప్రయత్నిస్తున్న నోకియా త్వరలోనే అత్యంత శక్తివంతమైన మొబైల్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8 ను సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేస్తోంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఓ స్పెషల్ ఈవెంట్లో దీన్ని భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఇందులో డ్యుయల్ రియర్ కెమెరా విత్ డబుల్ సెన్సర్( ఒకటి కలర్ సెన్సార్, రెండవది మోనోక్రోమ్ సెన్సార్) అమర్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్ 8ప్లస్ లోవాడిన క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ తో రూపొందించింది. ఇండియాలో దీని ధర సుమారు రూ.45 వేల ఉండొచ్చని అంచనా. నోకియా 8 ఫీచర్లు 5.3 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 256 జీబీ దాకా విస్తరణ అవకాశం 13+13 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
‘నోకియా–8’వచ్చేస్తోంది..
హెల్సింకి/న్యూఢిల్లీ: నోకియా ప్రియుల ఎదురుచూ పులు తీరాయి. నోకియా తొలి హైఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర దాదాపుగా రూ.45,000గా (599 యూరోలు) ఉంది. ఇవి వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నవి. అయితే ఈ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఎప్పుడు భారతీయ మార్కెట్లో ఆవిష్కరిస్తుందో ప్రకటించలేదు. ఇక ఇందులో క్విక్ చార్జ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 3,090 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ హెడ్సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ క్యూహెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.1.1 ఓఎస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. డ్యూయెల్ సైట్ మోడ్: నోకియా–8లో డ్యూయెల్ సైట్ మోడ్ అనే ఫీచర్ ఉంది. ఇక్కడ ఫ్రంట్, రియర్ కెమెరాలను రెండింటినీ ఒకేసారి ఉపయోగించొచ్చు. అది ఫోటోలకైనా, వీడియోలకైనా. ఫ్రంట్, రియర్ కెమెరాలను ఒకే సమయంలో వాడేటప్పుడు స్క్రీన్ స్పి›్లట్ అవుతుంది. డ్యూయెల్ సైట్ మోడ్ ఫీచర్‌తో వస్తోన్న తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ ఇదే. జీస్ ఆప్టిక్స్ కెమెరాలతో 4కే వీడియోలను తీసుకోవచ్చు. -
ఆపిల్ ఐ ఫోన్‌తో పోటీ.. తనకు తనే సాటి
న్యూఢిల్లీ: ఆపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలను నిలువరించి మార్కెట్లో రారాజుగా వెలిగేందుకు మళ్లీ రంగంలోకి వచ్చిన నోకియా తన ఫ్లాగ్షిప్ ఫోన్ నోకియా 8ను బుధవారం లాంచ్ చేసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ఆపిల్ ఐ ఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8లు మార్కెట్లో నోకియా 8 దెబ్బకు కుదేలవుతాయని నిపుణులు భావిస్తున్నారు. విడుదలైన ఫోన్ వచ్చే నెల నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. డ్యుయల్ లెన్స్ కెమెరా ఈ ఫోన్లో అందుబాటులో ఉంది. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో, మార్కెట్లోని లీడింగ్ ప్రాసెసర్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నోకియా 8 విడుదలైంది. బ్లూ, గోల్డ్ బ్లూ, గోల్డ్ కాపర్, స్టీల్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (6జీబీ-128 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్- 64 జీబీ స్టోరేజ్) నోకియా 8 అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు వచ్చే ఏడాది 8 జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసేందుకు నోకియా సన్నాహాలు చేస్తోంది. దీని ధర రూ.45,200/-లు గా ఉంటుందని భావిస్తున్నారు. నోకియా 8 ఫీచర్స్ 5.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1440 x 2560 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4 జీబి ర్యామ్ 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా(4కే వీడియో) 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 8 భారత్‌లోకి ఎప్పుడు?
నోకియా 8... ఎన్నో రూమర్లు, అంచనాల తర్వాత అధికారికంగా వినియోగదారుల ముందుకు వచ్చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లండన్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నోకియా 8 కేవలం నోకియా తొలి ఫ్లాగ్‌షిఫ్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాక, ఆండ్రాయిడ్‌తో రన్ అయ్యే ఫిన్నిస్ కంపెనీ నుంచి విడుదలైన తొలి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కూడా. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఆపిల్ ఐఫోన్లకు పోటీగా దీన్ని హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో, మార్కెట్లోని లీడింగ్ ప్రాసెసర్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఐఫోన్లకు గట్టిపోటీ ఇచ్చే మాదిరే ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు కూడా 599 యూరోలు అంటే సుమారు 45వేల రూపాయలు. అంతర్జాతీయంగా విడుదలైన ఈ ఫోన్ భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించనుందో మాత్రం ఆ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. కానీ సెప్టెంబర్‌లో ఈ ఫోన్ భారత్‌లోకి వచ్చేస్తుందని, అప్పటి నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ ధర 39,999గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనే హెచ్ఎండీ గ్లోబల్ ముచ్చటగా మూడు స్మార్ట్ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్ఫోన్లను భారత్‌లోకి లాంచ్ చేసింది. నోకియా 5, నోకియా 3లు విక్రయానికి కూడా వచ్చాయి. ఆగస్టు 23 నుంచి నోకియా 6 కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. నోకియా 8 ఫీచర్స్ 5.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1440 x 2560 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4 జీబి ర్యామ్ 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా(4కే వీడియో) 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 8 లాంచింగ్..నేడే
న్యూఢిల్లీ: హెచ్ఎండి గ్లోబల్ నుంచి మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నేడు (బుధవారం) లాంచ్ కానుంది. ముందుగా అంచనా వేసినట్టుగా కాకుండా అంతకంటే ముందుగానే విడుదల కానుంది. నోకియా 8 పేరుతో వస్తున్న ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను లండన్ లో ఈ సాయంత్రం 7.30గంటలకు ప్రత్యేకంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్లోకి ఈ ఫోన్‌ను విడుదల చేస్తారు. డ్యుయల్ లెన్స్ కెమెరా ఈ ఫోన్లో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో, మార్కెట్లోని లీడింగ్ ప్రాసెసర్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బ్లూ, గోల్డ్ బ్లూ,గోల్డ్ కాపర్, స్టీల్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (6జీబీ, 128 స్టోరేజ్, 4 జీబీ 64 స్టోరేజ్)ఇది లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది 8 జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందట. మరోవైపు దీని ధర రూ.44 వేలు రూ. 55వేల మధ్య ఉంటుందని అంచనా. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నోకియా 8 ఫీచర్స్ ఇలా ఉండనున్నాయి. నోకియా 8 ఫీచర్స్ 5.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1440 x 2560 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4జీబి ర్యామ్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
అత్యంత ఖరీదైన నోకియా ఫోన్ వచ్చేస్తోంది
నోకియా బ్రాండులో హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి వచ్చేస్తోంది. నోకియా 8 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 40వేల రూపాయలకు హెచ్ఎండీ గ్లోబల్ ఈ నెల 31న గ్లోబల్‌గా లాంచ్ చేయబోతుందట. హెచ్ఎండీ కొత్తగా లాంచ్ చేయబోతున్న ఫ్లాగ్షిప్ డివైజ్‌ల గురించి ఇప్పటికే మార్కెట్లో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నోకియా 8 లేదా నోకియా 9 ఫ్లాగ్‌షిప్‌ను కంపెనీ లాంచ్ చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా జర్మన్ వెబ్సైట్ విడుదల చేసిన రిపోర్టులో నోకియా బ్రాండులో తర్వాత రాబోతున్న స్మార్ట్‌ఫోన్ నోకియా 8గా తెలిసింది. ఈ డివైజ్ మోడల్ నెంబర్ టీఏ-1004గా జర్మన్ వెబ్సైట్ పేర్కొంది. అదనంగా ఈ ఫోన్ జూలై 31 నుంచి విక్రయానికి రానుందని కూడా చెప్పింది. ఇదే సమయంలో నోకియా 9 స్మార్ట్‌ఫోన్ గురించి ఊసైన ఎత్తలేదు. అదేవిధంగా నోకియా 8 ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 40వేల రూపాయలుగా ఉండబోతుందని తెలిపింది. హెచ్ఎండీ గ్లోబల్ కూడా తమ తొలి హైఎండ్ ఫోన్ లాంచ్ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. అది నోకియా 8గా మార్కెటింగ్ కూడా చేస్తుందట. నోకియా 8లో ఉండబోతుందన్న ఫీచర్లేమిటో ఓ సారి తెలుసుకుందాం... స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ సిమ్ కార్డులు నాలుగు రంగులు(బ్లూ, స్టీల్, గోల్డ్/బ్లూ, గోల్డ్/కాపర్) అంచనా ధర రూ.43,415 ఇటీవలే కంపెనీ ఎక్స్‌క్లూజివ్ పార్టనర్షిప్ జర్మన్ ఆప్టిక్స్ జీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఫేమస్ జీస్ లెన్స్ ఉండబోతున్నాయి. -
నోకియా మరో కొత్త ఫోన్: టాప్ ఫీచర్లివేనట!
నోకియా బ్రాండులో ఇటీవలే మూడు స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో రెండు డివైజ్‌లు నోకియా 8, నోకియా 9 లను కూడా లాంచ్‌చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే నోకియా 9 మరో రెండు నెలల్లో లాంచ్ అవుతున్నట్టు ధృవీకరణ అవగా.. తాజాగా నోకియా 8పై రూమర్లు చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ను చైనీస్ అవుట్లెట్ సీఎన్ఎంఓ.కామ్ రివీల్చేసింది. ఇమేజ్‌తో పాటు కొన్ని ఫీచర్లను కూడా బయటపెట్టింది. కొద్దిగా వంగిన బెజెల్-లెస్ డిస్ప్లేను నోకియా 8 కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు ఉన్నమాదిరిగా ఉండబోతుందట. అదేవిధంగా రెండు వేరియంట్లలలో ఇది లాంచ్ కాబోతుందని టాక్. ఒకటి 5.2 అంగుళాల క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే కాగ, మరొకటి 5.5 అంగుళాల డిస్ప్లే. అంతేకాక ఈ అవుట్లెట్ విడుదల చేసిన ఇమేజ్‌లో టైపీ-సీ యూఎస్బీ పోర్టు కూడా కిందవైపు స్టీరియో స్పీకర్ల పక్కన కనిపిస్తోంది. ఐరిష్ స్కానర్ కూడా దీనిలో ప్రధానమైన ఫీచరేనట. ఈ ఫీచర్ ఇప్పటికే శాంసంగ్ కొత్త గెలాక్సీలు ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో ఉండగా.. ఆపిల్ అప్‌కమింగ్ ఐఫోన్లో కూడా ఉండే అవకాశాలున్నాయని టెక్‌వర్గాలు చెప్పాయి. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కూడా ఉండబోతున్నాయి. ఇమేజ్‌లను బట్టి చూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఆపిల్ అప్‌కమింగ్ యానివర్సరీ ఎడిషన్ ఐఫోన్‌కు గట్టిపోటీ ఇవ్వగలదని అర్థమవుతోంది. ఇక బ్యాటరీ విషయానికి కొస్తే నాన్ రిమూవబుల్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ. మిగతా ఫీచర్లు కూడా ఈ విధంగా ఉన్నాయి.. స్నాప్‌డ్రాగన్ 821, 4జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 835, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీలలో ఇంటర్నల్‌స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.