న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నేడు (బుధవారం) లాంచ్ కానుంది. ముందుగా అంచనా వేసినట్టుగా కాకుండా అంతకంటే ముందుగానే విడుదల కానుంది. నోకియా 8 పేరుతో వస్తున్న ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను లండన్ లో ఈ సాయంత్రం 7.30గంటలకు ప్రత్యేకంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను విడుదల చేస్తారు. డ్యుయల్ లెన్స్ కెమెరా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో, మార్కెట్‌లోని లీడింగ్ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బ్లూ, గోల్డ్ బ్లూ,గోల్డ్ కాపర్, స్టీల్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (6జీబీ, 128 స్టోరేజ్, 4 జీబీ 64 స్టోరేజ్)ఇది లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది 8 జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందట. మరోవైపు దీని ధర రూ.44 వేలు రూ. 55వేల మధ్య ఉంటుందని అంచనా.
ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నోకియా 8 ఫీచర్స్ ఇలా ఉండనున్నాయి.
నోకియా 8 ఫీచర్స్
5.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 2560 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
4జీబి ర్యామ్
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్
13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా
12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ