నోకియా మరో కొత్త ఫోన్: టాప్ ఫీచర్లివేనట!
నోకియా మరో కొత్త ఫోన్: టాప్ ఫీచర్లివేనట!
Published Fri, Jul 7 2017 11:45 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
నోకియా బ్రాండులో ఇటీవలే మూడు స్మార్ట్‌ఫోన్లను హెచ్‌ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో రెండు డివైజ్‌లు నోకియా 8, నోకియా 9 లను కూడా లాంచ్‌చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్ సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే నోకియా 9 మరో రెండు నెలల్లో లాంచ్ అవుతున్నట్టు ధృవీకరణ అవగా.. తాజాగా నోకియా 8పై రూమర్లు చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌ను చైనీస్ అవుట్‌లెట్ సీఎన్‌ఎంఓ.కామ్ రివీల్‌చేసింది. ఇమేజ్‌తో పాటు కొన్ని ఫీచర్లను కూడా బయటపెట్టింది. కొద్దిగా వంగిన బెజెల్-లెస్ డిస్‌ప్లేను నోకియా 8 కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఉన్నమాదిరిగా ఉండబోతుందట. అదేవిధంగా రెండు వేరియంట్లలలో ఇది లాంచ్ కాబోతుందని టాక్. ఒకటి 5.2 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే కాగ, మరొకటి 5.5 అంగుళాల డిస్‌ప్లే.
అంతేకాక ఈ అవుట్‌లెట్ విడుదల చేసిన ఇమేజ్లో టైపీ-సీ యూఎస్‌బీ పోర్టు కూడా కిందవైపు స్టీరియో స్పీకర్ల పక్కన కనిపిస్తోంది. ఐరిష్ స్కానర్ కూడా దీనిలో ప్రధానమైన ఫీచరేనట. ఈ ఫీచర్ ఇప్పటికే శాంసంగ్ కొత్త గెలాక్సీలు ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ఉండగా.. ఆపిల్ అప్‌కమింగ్ ఐఫోన్లో కూడా ఉండే అవకాశాలున్నాయని టెక్‌వర్గాలు చెప్పాయి. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కూడా ఉండబోతున్నాయి. ఇమేజ్‌లను బట్టి చూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఆపిల్ అప్‌కమింగ్ యానివర్సరీ ఎడిషన్ ఐఫోన్‌కు గట్టిపోటీ ఇవ్వగలదని అర్థమవుతోంది.
ఇక బ్యాటరీ విషయానికి కొస్తే నాన్ రిమూవబుల్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ. మిగతా ఫీచర్లు కూడా ఈ విధంగా ఉన్నాయి.. స్నాప్‌డ్రాగన్ 821, 4జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 835, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీలలో ఇంటర్నల్‌స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
Advertisement
Advertisement