సాక్షి, న్యూఢిల్లీ : నోకియా అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ రేపే భారత్‌లోకి లాంచ్ కాబోతుంది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను రేపు భారత్‌లో లాంచ్ చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్ సర్వం సిద్ధం చేసింది. వెనుక వైపు రెండు కెమెరాలతో నోకియా 8 భారత మార్కెట్‌లోకి వస్తోంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో రాబోతున్న కంపెనీ తొలి డివైజ్ కూడా నోకియా 8 స్మార్ట్‌ఫోనే. మెరుగైన మల్టిమీడియా అనుభవం కోసం 360 డిగ్రీ ఆడియో టెక్నాలజీని ఇది కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఐఫోన్లకు గట్టిపోటీ ఇచ్చే మాదిరే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆ స్మార్ట్‌ఫోన్ ఆగస్టులోనే లాంచైంది.
నోకియా 8 ఫీచర్స్
- 5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
- 1440 x 2560 రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
- 4 జీబీ ర్యామ్
- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 256 జీబీ వరకు విస్తరణ మెమరీ
- 13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా(4కే వీడియో)
- 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 3090 ఎంఏహెచ్ బ్యాటరీ