bezel-less display
-
4 టీబీ స్టోరేజ్‌తో ఆ ఫోన్ వచ్చేస్తోంది..
10 లక్షల ఫోటోలు, 2000 హెచ్డీ మూవీలు స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ చేసుకునేలా.. అత్యధిక మొత్తంలో స్టోరేజ్ ఆప్షన్‌తో లెనోవో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జూన్ 5న చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని తెలిసింది. లెనోవో మొబైల్స్ అధికారిక వైబో అకౌంట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. లాంచ్ డేట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం షేర్ చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో బీజింగ్‌లో లాంచ్ చేయనుంది. అయితే భారత్ లాంటి ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. వైబోలో లెనోవో షేర్ చేసిన పోస్టులో ‘కేవలం ఈ క్షణం, జూన్ 5, బీజింగ్‌లో కొత్త నేషనల్ ఫ్లాగ్షిప్ వచ్చేస్తోంది’ అని ఉంది. చైనాలో స్టాండర్డ్ టైమ్ మధ్యాహ్నం రెండు గంటలకు(భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం 11.30కు) లాంచ్ ఈవెంట్ జరుగనుంది. లెనోవో లాంచ్ చేయబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ పేరు జెడ్5గా తెలిసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్లను సైతం లెనోవో విడుదల చేసింది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా, బెజెల్-లెస్ డిజైన్ ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అంతకముందు లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ విడుదల చేసిన కెమెరా శాంపుల్స్‌లో కూడా ‘ఏఐ డ్యూయల్ కెమెరా’ ఉన్నట్టే ఆ ఫోటోల కింద భాగంలో ఆయన రాశారు. కాగ, ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌లో 2000 హెచ్డీ మూవీలు, 1,50,000 మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ అంతకముందే తెలిపారు. తక్కువ వెలుతురులో కూడా క్లారిటీ ఫోటో తీసుకునేలా, ఫోటోగ్రఫీ అనుభవాన్ని పెంచేలా ఏఐ ఫీచర్‌ను కంపెనీ కల్పిస్తోంది. 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్ రూపొందుతుంది. అంటే ఈ ఫోన్లో అత్యంత ఎక్కువ స్టోరేజ్ మాత్రమే కాక, అతిపెద్ద బ్యాటరీ కూడా ఉండబోతుందన్నమాట. జెడ్5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్కెచ్లను సైతం లెనోవో షేర్ చేసింది. ఈ పిక్చర్స్‌లో ముందు భాగమంతా బెజెల్-లెస్ డిస్ప్లేతోనే రూపొందిందని తెలిసింది. -
నోకియా మరో కొత్త ఫోన్: టాప్ ఫీచర్లివేనట!
నోకియా బ్రాండులో ఇటీవలే మూడు స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో రెండు డివైజ్‌లు నోకియా 8, నోకియా 9 లను కూడా లాంచ్‌చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే నోకియా 9 మరో రెండు నెలల్లో లాంచ్ అవుతున్నట్టు ధృవీకరణ అవగా.. తాజాగా నోకియా 8పై రూమర్లు చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ను చైనీస్ అవుట్లెట్ సీఎన్ఎంఓ.కామ్ రివీల్చేసింది. ఇమేజ్‌తో పాటు కొన్ని ఫీచర్లను కూడా బయటపెట్టింది. కొద్దిగా వంగిన బెజెల్-లెస్ డిస్ప్లేను నోకియా 8 కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు ఉన్నమాదిరిగా ఉండబోతుందట. అదేవిధంగా రెండు వేరియంట్లలలో ఇది లాంచ్ కాబోతుందని టాక్. ఒకటి 5.2 అంగుళాల క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే కాగ, మరొకటి 5.5 అంగుళాల డిస్ప్లే. అంతేకాక ఈ అవుట్లెట్ విడుదల చేసిన ఇమేజ్‌లో టైపీ-సీ యూఎస్బీ పోర్టు కూడా కిందవైపు స్టీరియో స్పీకర్ల పక్కన కనిపిస్తోంది. ఐరిష్ స్కానర్ కూడా దీనిలో ప్రధానమైన ఫీచరేనట. ఈ ఫీచర్ ఇప్పటికే శాంసంగ్ కొత్త గెలాక్సీలు ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో ఉండగా.. ఆపిల్ అప్‌కమింగ్ ఐఫోన్లో కూడా ఉండే అవకాశాలున్నాయని టెక్‌వర్గాలు చెప్పాయి. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కూడా ఉండబోతున్నాయి. ఇమేజ్‌లను బట్టి చూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఆపిల్ అప్‌కమింగ్ యానివర్సరీ ఎడిషన్ ఐఫోన్‌కు గట్టిపోటీ ఇవ్వగలదని అర్థమవుతోంది. ఇక బ్యాటరీ విషయానికి కొస్తే నాన్ రిమూవబుల్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ. మిగతా ఫీచర్లు కూడా ఈ విధంగా ఉన్నాయి.. స్నాప్‌డ్రాగన్ 821, 4జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 835, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీలలో ఇంటర్నల్‌స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.