నోకియా 6.1/నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్
నోకియా 6.1 ప్లస్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు ముందు నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే హెచ్‌ఎండీ గ్లోబల్, నోకియా 6.1/నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. నోకియా 6.1 ధరను 1500 రూపాయలు తగ్గిస్తున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది. నోకియా 6.1 లాంచ్ అయి ఐదు నెలలే కావొస్తోంది. ఏప్రిల్‌లోనే నోకియా 6.1 భారత్‌లోకి వచ్చింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది.
3జీబీ ర్యామ్ వేరియంట్ ధర లాంచింగ్ సందర్భంగా 16,999 రూపాయలు ఉండగా... ధర తగ్గించిన అనంతరం 15,499 రూపాయలుగా ఉంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర లాంచింగ్ సందర్భంగా 18,999 రూపాయలు ఉండగా.. ధర తగ్గింపు తర్వాత 17,499 రూపాయలుగా నిర్ణయించింది. నోకియా 6.1 వేరియంట్ల కొత్త ధరలు కంపెనీ ఇండియా సైట్‌లో చూడవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ చేసే మిగతా ఆఫర్లు అదే విధంగా ఉన్నాయి.
నోకియా 6.1 ఫీచర్లు..
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
Comments
Please login to add a commentAdd a comment