
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ పోర్ర్‌టెయిట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.
వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్ ధర రూ. 21,999 కాగా 8GB+256GB వేరియంట్ ధర రూ.23,999. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.
నవంబర్ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ కార్డ్, బీవోబీ కార్డ్ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు బాలీవుడ్ నటి సుహానా ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment