Vivo Y36 With Launched in India: Check Features and Price - Sakshi
Sakshi News home page

Vivo Y36: సరికొత్త టెక్నాలజీతో వివో వై36 లాంచ్‌: ధర తక్కువే!

Published Thu, Jun 22 2023 4:30 PM | Last Updated on Thu, Jun 22 2023 4:54 PM

Vivo Y36 with launched in India check features and price  - Sakshi

ప్రముఖ  స్మార్ట్‌ఫోన్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో  వివో వై సిరీస్‌లో వివో వై 36 కెమెరాను  భారత మార్కెట్లో తీసు కొచ్చింది.  ఫ్లిప్‌కార్ట్,  వివో  ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్‌-రీడబుల్ డిస్‌ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. 

ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్‌ కొత్త సూపర్‌ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!

వివో వై36 ధరలు, లభ్యత  
8జీబీ ర్యామ్‌ +128జీబీ స్టోరేయ్‌  వేరియంట్‌  రూ. 16,999గా నిర్ణయించింది.   'డైనమిక్ డ్యూయల్ రింగ్' డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ వైబ్రాంట్ గోల్డ్  మెటోర్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది.   ICICI & HDFC కార్డ్‌  ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు

వివో వై36 ఫీచర్లు
 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్
స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
 50+2  ఎంపీ రియర్‌కెమెరా
ఆరా స్క్రీన్ లైట్‌తో 16MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్

(Global Chess League 2023 ఆనంద్‌ VS ఆనంద్‌: మహీంద్ర ట్వీట్‌ వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement