సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్‌ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ 9200 SoC,కెమెరా-ఫోకస్డ్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్, V2 చిప్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇప్పటికే చైనా, మలేషియాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే వారం దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి గత ఏడాది ఎక్స్ 80 సిరీస్‌ను లాంచ్ చేసిసక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
వివో ఎక్స్ 90 ప్రొ, వివో ఎక్స్ 90 ధర, లభ్యత
వివో ఎక్స్ 90 ప్రొ ధర సింగిల్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999. లెజెండరీ బ్లాక్ షేడ్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో)
వివో ఎక్స్ 90 రూ. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999. ఆస్టరాయిడ్ బ్లాక్ , బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభ్యం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)
ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి . మే 5 నుండి అమ్మకాలు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.ఎస్‌బీఐ, ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్‌కి వస్తే..దాదాపు రెండు మోడల్స్ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి.
వివో ఎక్స్ 90 ప్రొ స్పెసిఫికేషన్స్
6.78-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లే
1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్
Android 13-ఆధారిత FunTouch OS, 120Hz రిఫ్రెష్ రేట్
ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC
50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 4,870mAh బ్యాటరీ
8 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్
ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!
Comments
Please login to add a commentAdd a comment