Vivo Mobiles
-
వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ 9200 SoC,కెమెరా-ఫోకస్డ్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్, V2 చిప్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇప్పటికే చైనా, మలేషియాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్లు వచ్చే వారం దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి గత ఏడాది ఎక్స్ 80 సిరీస్‌ను లాంచ్ చేసిసక్సెస్ అయిన సంగతి తెలిసిందే. వివో ఎక్స్ 90 ప్రొ, వివో ఎక్స్ 90 ధర, లభ్యత వివో ఎక్స్ 90 ప్రొ ధర సింగిల్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999. లెజెండరీ బ్లాక్ షేడ్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) వివో ఎక్స్ 90 రూ. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999. ఆస్టరాయిడ్ బ్లాక్ , బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి . మే 5 నుండి అమ్మకాలు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.ఎస్బీఐ, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొత్త స్మార్ట్ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్కి వస్తే..దాదాపు రెండు మోడల్స్ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. వివో ఎక్స్ 90 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే 1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ Android 13-ఆధారిత FunTouch OS, 120Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC 50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 4,870mAh బ్యాటరీ 8 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే! -
మొబైల్స్ ఎగుమతికి కొత్త వ్యూహాలు.. ఈ ఏడాది టార్గెట్ ఇదే!
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీలో ఉన్న వివో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 2023 చివరినాటికి మరో రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలో నూతనంగా రాబోతున్న యూనిట్లో ఉత్పత్తి 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. 169 ఎకరాల విస్తీర్ణంలో నెలకొంటున్న ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 కోట్ల యూనిట్లు. ఈ ఏడాది 10 లక్షలకుపైగా మేడిన్ ఇండియా మొబైల్స్‌ను ఎగుమతి చేసే పనిలో నిమగ్నమైనట్టు కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా వివో మేడిన్ ఇండియా ఫోన్లు గతేడాది థాయ్‌లాండ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో విక్రయిస్తున్న ప్రతి వివో ఫోన్ దేశీయంగా తయారైనదే. బ్యాటరీ 95 శాతం, చార్జర్ విడిభాగాలు 70 శాతం స్థానికంగా సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో వివో తయారీ కేంద్రం ఉంది. రూ. 7,500 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా తొలిదశలో 2023 చివరినాటికి ర.3,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ‘ఇప్పటికే రూ. 2,400 కోట్లు వ్యయం చేశాం. మరో రూ. 1,100 కోట్లు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఇక్కడ అడుగు పెట్టిన నాటి నుండి వ్యూహాత్మక మార్కెట్ గా భారత్ కొనసాగుతోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల తెలిపారు. -
Vivo V27 Pro: విడుదలకు ముందే వివరాలు లీక్, ధర ఎంతంటే?
మార్కెట్లో వివో కంపెనీ తన 5జీ సిరీస్‌లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ విడుదల చేయకముందే ప్రైస్, డీటైల్స్ అన్నీ కూడా ప్రకటించింది. కంపెనీ వీ27 సిరీస్‌లో వీ27, వీ27 ప్రో విడుదలచేయనుంది. ఈ రెండూ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి. వివో వీ27 ప్రో భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అవి 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, చివరగా టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999. కంపెనీ విడుదల చేసే వివో వీ27 ప్రారంభ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు మర్చి 01న అధికారికంగా విడుదలవుతాయి. ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో వెల్లడయ్యాయి. వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది. -
Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో.. వై సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్‌లో వివో వై100 విడుదలైన కొద్దిసేపటికే వివో వై56 5జీ మార్కెట్లోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ బడ్జెట్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ రంగుల్లో లభిస్తోంది. వివో అఫీషియల్ వెబ్‌సైట్‌తోపాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు. మరి ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేయండి.. వివో వై56 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్: 6.58 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (SD కార్డ్‌తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు) 50ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బరువు 184 గ్రాములు (ఇదీ చదవండి: రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?) -
బంపరాఫర్.. రూ. 999కే అదిరిపోయే ఫీచర్లున్న వివో స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
వివో (Vivo) కొన్ని నెలల క్రితం మార్కెట్లో కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా వివో టీ1 ఎక్స్( Vivo T1X) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది యూజర్లకు మంచి గేమింగ్ ఎక్సపీరియన్స్ కోసం ప్రత్యేకంగా తయారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌కు సంబంధించి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కేవలం రూ.999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అదెలా అనుకుంటున్నారా, దానిపై ఓ లుక్కేద్దాం! Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అవి ఫ్లిప్‌కార్ట్( Flipkart)లో.. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.16,999గా ఉండగా, 4GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ.17,990, ఉంది. వీటితో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన దాని టాప్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లతో అందిస్తోంది. ఇవి గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. చదవండి: సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేవలం.. రూ.999లకే ఈ ఫోన్ మీ జేబులోకి ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సెల్లో, మీరు 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ. 999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే .. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,990గా ఉంది. ఇందులో 21 శాతం తగ్గింపు ఆఫర్‌తో వస్తోంది. అంటే ఈ ఫోన్‌ని రూ.14,999కే వస్తుంది. దీంతో పాటు, మీరు ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్. కంపెనీ దీనిపై రూ.14,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కనుక కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వనియోగం చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కు మీ సొంతం చేసుకుని జేబులో పెట్టుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్న కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట! -
ఎక్స్70 సిరీస్ కస్టమర్లకు వివో ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం ఆవిష్కరించిన ఎక్స్ సిరీస్ ఫోన్ల కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడానికి ఎక్స్ కేర్ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించినట్లు స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం వివో వెల్లడించింది. ఈ ప్రోగ్రాం కింద వివో ఎక్స్70 సిరీస్ కస్టమర్లందరూ వర్చువల్ లైవ్ డెమో సెషన్లు, ఉత్పత్తుల హోమ్ డెలివరీ, ఇంటి వద్దే రిపేర్ సర్వీసులు మొదలైన సదుపాయాలు పొందవచ్చని పేర్కొంది. ఇరవై నాలుగ్గంటలూ నేరుగా ఏజంటుకు కాల్ చేసే ఫీచర్‌తో పాటు వివో సర్వీస్ సెంటర్లలో ఎక్స్‌క్లూజివ్ కౌంటర్ కూడా ఉంటుందని వివరించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కస్టమర్ల ఇంటి దగ్గరే రిపేర్ సర్వీసులు కూడా పొందవచ్చని వివో తెలిపింది. సెంటర్‌కు 30 కి.మీ. పరిధిలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని, అది దాటితే పికప్, డ్రాప్ సర్వీసు పొందవచ్చని పేర్కొంది. ఒక ఐఎంఈఐ నంబరుకు మూడు ఉచిత సర్వీసులు అందుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి విజిట్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. -
వివో నుంచి మరో వై-సిరీస్ మొబైల్
మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై31ను నేడు భారతదేశంలో విడుదల చేసింది. వివో వై-సిరీస్‌లో ఇప్పటికే మూడు ఫోన్లు విడుదలయ్యాయి. వివో వై31లో వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 600-సిరీస్ ప్రాసెసర్ ను అందించారు. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వివో వై31ఎస్ ఇటీవలే చైనాలో 5జీ సపోర్ట్‌తో లాంచ్ అయింది.(చదవండి: వివో వై31 ఫీచర్స్: వివో వై31 ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఇది 6.58-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపిఎస్ డిస్ప్లేతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ 2-మెగాపిక్సెల్ యూనిట్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 మీద పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశంలో వివో వై31 ధర రూ.16,490గా నిర్ణయించబడింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల నుండి మీరు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది రేసింగ్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. -
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్‌లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్‌లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్‌కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్‌గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్‌లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
జియో మరో ఆసక్తికరమైన ఆఫర్
రిలయన్స్ జియో మరో ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు 168జీబీ వరకు జియో 4జీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. ''వివో జియో క్రికెట్ మానియా'' పేరుతో ఓ ఆసక్తికరమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం తొలుత వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంపికచేసుకున్న ఐపీఎల్ టీమ్ పేరును జియో కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.. యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయిన జియో వారికి 4జీ డేటాను అందిస్తుంది. కానీ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు మే 10 కంటే ముందస్తుగా తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును జియోకు పంపించాల్సి ఉంటుంది. వచ్చే పది రీఛార్జ్ లలో అంటే జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు చేసుకునే రీఛార్జ్ లలో కూడా యూజర్లు తమ అకౌంట్ పై అదనపు డేటా ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది. ఈ డేటా బెనిఫిట్స్ ను వాడుకోవడానికి కచ్చితంగా ప్రతినెలా రూ.303తో రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట. 168జీబీ కంప్లిమెంటరీ డేటా పొందడమెలా...? ఫస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనెక్షన్ ఉండాలి. ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎస్ఎంఎస్ చేయాలి. టీమ్ పేర్లను, వాటి కోడ్స్ ను జియో తన వెబ్ సైట్లో పొందుపరిచింది. తర్వాత యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా, మ్యాచ్ డ్రా అయినా 3జీబీ, 2జీబీ, 1జీబీ 4జీ డేటాను జియో అందిస్తోంది. ఒకవేళ యూజర్ల ఫేవరెట్ టీమ్ క్వాలిఫైర్స్ గా వెళ్తే, వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ అవుతుంది. ఫైనల్స్ కు రీచ్ అయితే ఆ డేటా ట్రిపుల్ అవుతుంది. సిరిసీ ముగిసే సమయానికి మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటాను విన్ అయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ కు వివో ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తుండగా... ఆ మొబైల్స్ తో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఈ ఆసక్తికరమైన ఆఫర్ ను జియో వివో యూజర్లకు అందిస్తోంది.