జియో మరో ఆసక్తికరమైన ఆఫర్ | Reliance Jio's Vivo Jio Cricket Mania offer will let users win up to 168GB data | Sakshi
Sakshi News home page

జియో మరో ఆసక్తికరమైన ఆఫర్

Published Fri, Apr 14 2017 2:09 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

జియో మరో ఆసక్తికరమైన ఆఫర్

జియో మరో ఆసక్తికరమైన ఆఫర్

రిలయన్స్ జియో మరో ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు 168జీబీ వరకు జియో 4జీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. ''వివో జియో క్రికెట్ మానియా'' పేరుతో ఓ ఆసక్తికరమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీనికోసం తొలుత వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంపికచేసుకున్న ఐపీఎల్ టీమ్ పేరును జియో కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.. యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా,  ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయిన జియో వారికి 4జీ డేటాను అందిస్తుంది.
 
కానీ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు మే 10 కంటే ముందస్తుగా తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును జియోకు పంపించాల్సి ఉంటుంది. వచ్చే పది రీఛార్జ్ లలో అంటే జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు చేసుకునే రీఛార్జ్ లలో కూడా యూజర్లు తమ అకౌంట్ పై అదనపు డేటా ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది. ఈ డేటా బెనిఫిట్స్ ను వాడుకోవడానికి కచ్చితంగా ప్రతినెలా రూ.303తో రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట.
 
168జీబీ కంప్లిమెంటరీ డేటా పొందడమెలా...?
  • ఫస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనెక్షన్ ఉండాలి.
  • ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎస్ఎంఎస్ చేయాలి. టీమ్ పేర్లను, వాటి కోడ్స్ ను జియో తన వెబ్ సైట్లో పొందుపరిచింది. 
  • తర్వాత యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా, మ్యాచ్ డ్రా అయినా 3జీబీ, 2జీబీ, 1జీబీ 4జీ డేటాను జియో అందిస్తోంది.
  • ఒకవేళ యూజర్ల ఫేవరెట్ టీమ్ క్వాలిఫైర్స్ గా వెళ్తే, వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ అవుతుంది. ఫైనల్స్ కు రీచ్ అయితే ఆ డేటా ట్రిపుల్ అవుతుంది. 
  • సిరిసీ ముగిసే సమయానికి మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటాను విన్ అయ్యే అవకాశముంటుంది. 
ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ కు వివో ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తుండగా... ఆ మొబైల్స్ తో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఈ  ఆసక్తికరమైన ఆఫర్ ను జియో వివో యూజర్లకు అందిస్తోంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement