
దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉప్పొంగుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జియో (Jio) తన కస్టమర్ల కోసం స్పెషల్ అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 90 రోజులపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కోసం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలు జియోహాట్‌స్టార్ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 17 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

జియో కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. మొబైల్, టీవీలలో 4కే స్ట్రీమింగ్ సర్వీస్ కూడా పొందవచ్చు. అంతే కాకుండా 50 రోజులపాటు జియో ఫైబర్ సేవలు కూడా ఉచితంగా అందుకోవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ వైఫై, 800 కంటే ఎక్కువ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్‌లు వీక్షించవచ్చు.
ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
జియో ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్‌ను ఎంచుకోవడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment