![Jio Introduced Two new Plans On the Occasion of IPL 15 season - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/26/JIO.jpg.webp?itok=7dAtSaxg)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ వచ్చేయడంతో క్రికెట్ లవర్స్ కోసం జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్ లైవ్‌లను చూసి ఆనందించేందుకు వీలుగా రెండు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.555 జియో క్రికెట్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లో 55 జీబీ డేటా, వన్ ఇయర్ హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ చందాలతో పాటు కాంప్లిమెంటరీగా జియో యాప్స్ యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 55 రోజులు.
రూ. 2999 విలువ చేసే వార్షిక ప్లాన్‌లో ప్రతీరోజు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్, డెయిలీ వంద మెసేజ్‌లు, డిస్నీ హాట్ స్టార్ వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్, జియో యాప్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్యాక్ 365 రోజుల గడువుతో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment