నెట్‌ఫ్లిక్స్, వాల్‌డిస్నీ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌కు చెక్ పెట్టేందుకు రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో పాపులారిటీ పొందిన జియో సినిమాను లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌గా మార్చడానికి కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా జియో సినిమా యాప్‌లోకి 100కి పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లు అందుబాటులోకి తేనున్నది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా రిలయన్స్ మీడియా కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా జియో సినిమా యాప్‌కు వచ్చిన ఆదరణ కొనసాగించడానికి జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ జత చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను జియో యాప్ ద్వారా ఉచితంగా ప్రేక్షకులు.. కొత్త కంటెంట్ జత చేశాక చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఎంత చార్జీ వసూలు చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
మరోవైపు వచ్చేనెల 28తో ఐపీఎల్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అప్పటికల్లా కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు జ్యోతి దేశ్ పాండే తెలిపారు. జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ మీద వీక్షకులందరికీ అందుబాటు ధరలో చార్జీ విధిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment