జియో అదిరిపోయే బంపరాఫర్‌, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్‌స్క్రిప్షన్! | Jiofiber Launches entertainment Bonanza Broadband Plans | Sakshi
Sakshi News home page

జియో అదిరిపోయే బంపరాఫర్‌, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్‌స్క్రిప్షన్!

Apr 19 2022 7:31 PM | Updated on Apr 19 2022 9:44 PM

Jiofiber Launches entertainment Bonanza Broadband Plans - Sakshi

 వినియోగదారులు నెలకు రూ.100, రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులోకి వస్తాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

దేశీయ టెలికాం దిగ్గజం జియో తన కస్టమర్లు బంపరాఫర్‌ ప్రకటించింది. జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం "ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా" కేటగిరీ కింద కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లోని జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లతో  వినియోగదారులు నెలకు రూ.100, రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులోకి వస్తాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు, కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు:

►కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు జీరో ఇన్‌స్టలేషన్‌ ఛార్జీతో  జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇన్‌స్టలేషన్‌ చేయించుకున్న యూజర్లకు ఇంటర్నెట్ బాక్స్ (గేట్‌వే రూటర్), సెట్ టాప్ బాక్స్ పొందవచ్చు. 
 
► జియో ఫైబర్‌ పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులు నెలకు 30ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రూ. 399తో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, ఎంటర్‌టైన్మెంట్‌ పొందాలంటే నెలకు రూ.100 చెల్లిస్తే  6 ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్‌, రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ పొందవచ్చు. 

 (ఒక్క​ ఇంటర్నెట్‌కు రూ.399, 6 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్‌న్‌ కు 100తో కలిపి రూ.499, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. 
 
►ఒక్క ఇంటర్నెట్‌ అయితే రూ.699 చెల్లిస్తే 100ఎంబీపీఎస్‌ పొందవచ్చు. ఇక 6 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌కు 100తో కలిపి రూ.799, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.

►ఒక్క ఇంటర్నెట్‌ అయితే రూ.999 చెల్లించి 150ఎంబీపీఎస్‌ పొందవచ్చు. ఉచితంగా  6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ పొందవచ్చు. అదనంగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌ స్క్రిప్షన్‌ వినియోగించుకోవచ్చు. 

►ఒక్క ఇంటర్నెట్‌ అయితే  300ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది.  ఉచితంగా  6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ పొందవచ్చు. అదనంగా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌ స్క్రిప్షన్‌ వినియోగించుకోవచ్చు.

►500ఎంబీపీఎస్‌ వినియోగించుకోవాలంటే రూ.2499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా  6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ పొందవచ్చు. అదనంగా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌ స్క్రిప్షన్‌ వినియోగించుకోవచ్చు.

►1000ఎంబీపీఎస్‌ కావాలంటే రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా  6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ పొందవచ్చు. అదనంగా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌ స్క్రిప్షన్‌ వినియోగించుకోవచ్చు.

చదవండి:  గ్లాన్స్‌లో జియో భారీ పెట్ట‌బడులు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ముఖేష్ అంబానీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement