వెబ్ సిరీస్‌ల నుండి సినిమాల వరకు అన్నింటినీ చూడటానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి ఎంపికగా మారాయి. అయితే వీటిని వీక్షించాలంటే ప్రత్యేక సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మొబైల్‌కి రీఛార్జ్ చేసుకుంటే చాలు కొన్ని ఓటీటీలను ఉచితంగా చూసేయచ్చు.
దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వీటి ఖర్చు కూడా చాలా తక్కువే. రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంపిక చేసిన ప్లాన్‌లతో మీరు ఈ కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ. 448 ప్లాన్
జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లలో భాగమైన ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఇందులో సోనీలివ్, జీ5 వంటి డజను ఓటీటీ సేవలు ఉన్నాయి. అంతే కాకుండా జియో యాప్‌లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.
రూ. 175 ప్లాన్
ఇది జియోలో చౌకైన డేటా ప్లాన్. 28 రోజుల చెల్లుబాటుతో 10జీబీ అదనపు డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఓటీటీల విషయానికి వస్తే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా ఆనందించవచ్చు.
రూ.329 ప్లాన్
కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టంగా ఉంటుంది. యాప్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రకటనలు చికాకు పెడతాయి. రూ. 329 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుసుకుంటే ప్రకటన రహితంగా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. దీంతో జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment