టారిఫ్ పెంపు తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్‌లతో సంతృప్తి చెందని వారిలో మీరు కూడా ఉన్నట్లయితే వ్యాలిడిటీ, డేటా పరంగా అత్యధిక ప్రయోజనాలను అందించే మూడు ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి అంత చవకైన రీఛార్జ్ ప్లాన్‌లు కానప్పటికీ అపరిమిత 5జీ వంటి సేవలను అందిస్తాయి.
రూ. 349 ప్లాన్
ఇది 28 రోజుల చెల్లుబాటు అందిస్తుంది అపరిమిత 5G డేటా, రోజువారీ 2 GB పరిమితితో 4G డేటా లభిస్తాయి. ఈ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ సెల్యులార్ డేటాను ఎక్కువగా వినియోగించే వారికి ఇది ఉత్తమ నెలవారీ రీఛార్జ్ ఎంపిక.
రూ. 749 ప్లాన్
ఈ ప్లాన్ రోజుకు 2 GB 4G డేటాతో పాటు అపరిమిత 5G, కాలింగ్‌తో 72 రోజులు అంటే రెండున్నర నెలలకుపైగా వ్యాలిడిటీని అందిస్తుంది. అదనంగా ఇది మొత్తం చెల్లుబాటు వ్యవధికి అదనంగా 20 GB 4G డేటా వస్తుంది. ఇది 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఉపయోగకరమైన యాడ్-ఆన్.
రూ. 3,599 ప్లాన్
ఇది వార్షిక రీఛార్జ్ ప్లాన్. అపరిమిత 5G డేటా, 2.5 GB రోజువారీ 4G డేటాతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. నెలకు కేవలం రూ. 276 ఖర్చుతో ఏడాది పొడవునా వ్యాలిడిటీ డేటా పరిమితుల గురించి చింతించకుండా ఒకేసారి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడే వారికి ఈ ప్లాన్ అనువైనది.
Comments
Please login to add a commentAdd a comment