జియో దీపావళి ధమాకా ఆఫర్‌.. 90 రోజులు అన్‌లిమిటెడ్‌ | Jio Diwali Dhamaka offer Rs 899 prepaid plan benefits | Sakshi
Sakshi News home page

జియో దీపావళి ధమాకా ఆఫర్‌.. 90 రోజులు అన్‌లిమిటెడ్‌

Published Sat, Nov 2 2024 9:13 PM | Last Updated on Sat, Nov 2 2024 9:16 PM

Jio Diwali Dhamaka offer Rs 899 prepaid plan benefits

దేశంలో అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్‌ జియో పరిమిత-కాల దీపావళి ధమాకా ఆఫర్‌లో భాగంగా రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. మొత్తం 200GB డేటా, అపరిమిత కాల్స్‌, రూ. 3,350 వరకు విలువైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్‌ కస్టమర్‌లకు నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.

ప్రయోజనాలు ఇవే..
జియో రూ. 899 ప్లాన్‌ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో మొత్తం 200GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. మీది 5G ఫోన్‌ అయితే, మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంటే ఉచిత అపరిమిత 5Gని కూడా పొందవచ్చు.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్‌.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!

అదనపు బెనిఫిట్స్‌ 
అజియోలో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లకు ఫ్లాట్ రూ. 200 తగ్గింపు లభిస్తుంది. ఈజీట్రిప్‌ ద్వారా చేసిన విమానాలు, హోటల్ బుకింగ్‌ చేస్తే రూ. 3,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. స్విగ్గిలో రూ. 399 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు రూ. 150 ఆదా చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement