unlimited offer
-
రూ. 129కే అన్లిమిటెడ్ మూమూస్.. కండీషన్స్ అప్లై!
‘మూమూస్’... ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఇష్టమైన చిరుతిండి. ఈ స్నాక్స్‌ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. పైగా మూమూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఆహార ప్రియులు మూమూస్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి.. రూ. 125కే అన్లిమిటెడ్ మూమూస్ ఎక్కడైనా దొరికితే.. ఎవరైనా ఈ ఆఫర్ వదులుకుంటారా? దేశ రాజధాని ఢిల్లీలో లెక్కకు మించిన మూమూస్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల మూమూస్ అందుబాటులో ఉంటాయి. పలువురు దుకాణదారులు కొత్త ప్రయోగాలు చేస్తూ రకరకాల మూమూస్ను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక మూమూస్ దుకాణంలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. కేవలం రూ. 129కే ఎవరికి నచ్చినన్ని మూమూస్ వారు తినవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిన దుకాణం ఢిల్లీలోని తిలక్ నగర్ జైలు రోడ్డులో ‘ఎస్జీఎఫ్’ పేరుతో ఉంది. ఈ షాప్ మేనేజర్ దీప్ సింగ్ తాము అపరిమిత మూమూస్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. తాము రకరకాల మూమూస్ తయారు చేస్తున్నామని, వారంలోని అన్ని రోజుల్లోనూ ఈ బంపర్ ఆఫర్‌తో మూమూస్ అందిస్తున్నామని తెలిపారు. అయితే ఈ అపరిమిత మూమూస్ ఆఫర్ అందుకోవాలంటే ఒక కండీషన్ ఉన్నదన్నారు. రూ. 129కు ఒక ప్లేట్ మూమూస్ కొనుగోలు చేసి, దానిని తినేశాక నచ్చినన్నిసార్లు ప్లేటును రీఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్‌ను మరొకరితో షేర్ చేసుకోకూడదని, ఒక్క మూమూస్ కూడా వృథా చేయకూడదన్నారు. ఒకవేళ ప్లేట్ మూమూస్ను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అందుకు విడిగా నగదు చెల్లించాలన్నారు. -
అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆఫర్: రూ. 399 లకే పిజియాన్ గ్రైండర్
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.7వేల కొనుగోలుపై రెండు జార్ల పిజియాన్ మిక్సర్ గ్రైండర్(రూ.3,175 విలువైన)ను రూ.399లకే పొందవచ్చు. అలాగే 3,500 కొనుగోలుపై రూ.2వేలు విలువ చేసే 10 పీసుల సెల్లో డిన్నర్ సెట్ రూ.199లకే అందిస్తుంది. ప్రారంభ ధర రూ.200తో అన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గొప్ప అవకాశాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీవోవో వినీత్ జైన్ కోరారు. -
కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుగాను ‘స్విగ్గీ వన్’ అనే అప్‌గ్రేడ్ మెంబర్షిప్ ప్రోగ్రాంతో స్విగ్గీ ముందుకొచ్చింది. ఈ మెంబర్‌షిప్‌తో వినియోగదారులకు అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు, మరిన్ని ప్రయోజనాలను స్విగ్గీ అందించనుంది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న ‘స్విగ్గీ సూపర్’ ప్లాన్‌తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 70 వేల కంటే ఎక్కువగా రెస్టారెంట్ల నుంచి అపరిమిత ఉచిత డెలివరీలను కస్టమర్లు పొందవచ్చును. అలాగే రూ. 99 కంటే ఎక్కువ గ్రాసరీ ఆర్డర్స్‌పై అపరిమిత ఉచిత ఇన్‌స్టామార్ట్ డెలివరీలను కూడా అందించనుంది. దాంతోపాటుగా స్విగ్గీ భాగస్వామి రెస్టారెంట్ల నుంచి కస్టమర్లు పుడ్ ఆర్డర్స్‌పై 30శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చును. చదవండి: పాతికేళ్ల ఫ్యాషన్ డిజైనర్ కేరాఫ్ బంజారా మార్కెట్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ రేట్స్ ఏంతంటే..! మూడు నెలలకుగాను రూ. 299, ఏడాది గాను రూ. 899 చెల్లించి స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌ను కస్టమర్లు పొందవచ్చును. స్విగ్గీ వన్ సేవలు ప్రస్తుతం లక్నో, పూణే, త్రివేండ్రం, విజయవాడలో అందుబాటులో ఉంది. రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలకు స్విగ్గీ వన్ మెంబర్షిప్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వారికి అప్‌గ్రేడ్..! ఇప్పటికే స్విగ్గీ సూపర్ మెంబర్స్‌గా ఉన్నవారు ‘స్విగ్గీ వన్’ మెంబర్‌షిప్‌కు ఏలాంటి ఖర్చులేకుండా ఉచితంగా అప్‌గ్రేడ్ అవుతారని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా స్విగ్గీ సూపర్ మెంబర్స్‌కు కాంప్లిమెంటరీగా నెల రోజుల పొడిగింపు కూడా రానుంది. చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
రాత్రంతా ఉచితం : వొడాఫోన్ ఐడియా
సాక్షి, ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అపరిమిత డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డెయిలీ డేటా రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదార్లు ఉచిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటునూ కల్పిస్తోంది. (పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?) -
ఎమ్మెల్యేల రేట్లు పెరిగాయి
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జోరందుకుందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం వ్యాఖ్యానించారు. ‘ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా రూ. 10 కోట్లు, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన తరువాత.. ఎంత కావాలో చెప్పండి అంటూ అపరిమిత ఆఫర్‌తో ముందుకు వస్తున్నారు’ అని ఆరోపించారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని బీజేపీపై పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీఎస్పీ చీఫ్ మాయావతి బీజేపీ తరఫున మాట్లాడుతున్నారని గెహ్లోత్ విమర్శించారు. 200 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తంగా 107 మంది సభ్యులుండగా, వారిలో సచిన్ పైలట్ నేతృత్వంలో 19 మంది నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేయడంతో, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తన వర్గం ఎమ్మెల్యేలను పైలట్ గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉంచారు. మరోవైపు, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్ శివార్లలోని ఫెయిర్మాంట్ హోటల్‌కి సీఎం గహ్లోత్ తరలించారు. ఆగస్ట్ 14 వరకు కూడా వారంతా ఒకే దగ్గర ఉంటారని కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి అన్నారు. ఫెయిర్మాంట్ హోటల్లోనే సీఎల్పీ భేటీని నిర్వహించారు. కాగా, తమ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై గురువారం హైకోర్టు స్పందించింది. ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశిస్తూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. -
జియో బంపర్ ప్లాన్: ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్
సాక్షి,ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కస్టమర్లకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను ప్రకటించింది. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్ కాలింగ్ యాక్టివేషన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్ లో నెలకు 199రూపాయల ప్యాక్‌లో 25జీబీ డేటాని ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్ మే 15నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో జియో తెలిపింది. ముఖ్యంగా ఈ ప్యాక్ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన, ఇంటర్నేషనల్ కాలింగ్ అండ్ రోమింగ్ సౌలభ్యాన్నికూడా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ ఆఫర్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అన్లిమిటెడ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.349 రీచార్జ్‌తో 28 రోజుల పాటు అన్ని కాల్స్ ఉచితం అన్నారు. వీటితోపాటు 2జీబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తిగల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.