
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా అన్‌లిమిటెడ్ ఫ్యాషన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.7వేల కొనుగోలుపై రెండు జార్ల పిజియాన్ మిక్సర్ గ్రైండర్(రూ.3,175 విలువైన)ను రూ.399లకే పొందవచ్చు. అలాగే 3,500 కొనుగోలుపై రూ.2వేలు విలువ చేసే 10 పీసుల సెల్లో డిన్నర్ సెట్ రూ.199లకే అందిస్తుంది. ప్రారంభ ధర రూ.200తో అన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గొప్ప అవకాశాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీవోవో వినీత్ జైన్ కోరారు.