దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్‌ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్‌ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.
ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
కొత్త ఎంసీఎల్‌ఆర్‌లు
ఓవర్ నైట్: 9.20 శాతం
ఒక నెల: 9.20 శాతం
మూడు నెలలు: 9.30 శాతం
ఆరు నెలలు: 9.45 శాతం
ఒక సంవత్సరం: 9.45 శాతం
రెండు సంవత్సరాలు: 9.45 శాతం
మూడు సంవత్సరాలు: 9.50 శాతం
ఎంసీఎల్ఆర్ అంటే..
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment