Basis points
-
భారత్ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 30 బేసిస్ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్ ఇంజిన్’’గా భారత్ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. -
భారత్ వృద్ధి స్పీడ్ 6.4 శాతం
న్యూఢిల్లీ: భారత్ 2023–24 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ భారీగా 40 బేసిస్ పాయింట్లు (0.4%) పెంచింది. దీనితో ఈ అంచనా 6 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయని తన తాజా ఎకనమిక్ అవుట్‌లుక్ ఫర్ ఆసియా పసిఫిక్ నివేదికలో పేర్కొంది. తమ అంచనాల అప్‌గ్రేడ్‌కు ఈ అంశాలు కారణాలుగా వివరించింది. అయితే 2024–25 అంచనాలను మాత్రం క్రితం 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. అధిక బేస్ ఎఫెక్ట్, గ్లోబల్ వృద్ధిపై బలహీన అంచనాలు, వడ్డీరేట్ల పెంపు ప్రతికూలతలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఏడీబీ, ఫిచ్ అంచనాలకన్నా (6.3 శాతం) ఎస్అండ్పీ తాజా అంచనాలు కొంచెం అధికంగా ఉండడం గమనార్హం. 2023 మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలే షియా, ఫిలిప్పైన్స్‌లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని ఎస్అండ్పీ నివేదిక పేర్కొంది. -
పెరిగిన వడ్డీరేట్లు - కెనరా బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ – ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇటీవలే ప్రైవే టు రంగ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇదే స్థాయిలో కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే కెనరా బ్యాంక్ మాత్రం అన్ని కాలపరిమితులపై రుణ రేటును పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. పెంచిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కెనరా బ్యాంక్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం– సాధారణంగా ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదికన అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.75%కి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు భారీ షాక్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేట్లను పెంచింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణరేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సవరిత రేట్లు 12వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన రేట్లను చూస్తే బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి 8.05%కి చేరింది. ఇది వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు అనుసంధానమైన రేటు. ఏడాది, మూడేళ్లు, 6 నెలల రేట్లు 10 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగసి వరుసగా 7.70%, 7.75%, 7.90 శాతాలకు చేరాయి. -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
ఇక వడ్డీరేట్లు పైపైకి!
ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది. మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు 4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి. ద్రవ్యోల్బణంపై అందోళన... అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. ఏకగ్రీవ నిర్ణయం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని ‘‘రిమైనింగ్ అకామిడేటివ్’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్ ఆఫ్ అకామిడేటివ్’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది. వృద్ధి బాట పటిష్టం కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది. ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇంతక్రితమే వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే. రిజిస్టర్‌కాని డిజిటల్ లెండింగ్ యాప్‌లపై హెచ్చరిక కాగా, డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్ యాప్‌లపైనే ఆర్బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిట్ కార్డులకు ‘యూపీఐ’ లింక్ క్రెడిట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం. అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా మర్చంట్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్ చార్జ్ ఉంటుంది. తాజా ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్ జరిగినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మ్యాండేట్ పరిమితి రూ.15,000కు పెంపు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్ (కస్టమర్ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్ అవసరం లేదన్నమాట. రియల్టీ మందగమనమే ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్ జోన్లోకి నెట్టేసింది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ సహకార బ్యాంక్ గృహ రుణ పరిమితి రెట్టింపు రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది. డెవలపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్బీఐ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ (సీఆర్ఈ–ఆర్‌హెచ్) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల నిర్వహణకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలపడం మరో విశేషం. సమగ్ర అంచనాలు... ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ కీలక దశ... ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ సమతుల్య పాలసీ... ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది. – అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి. -
స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్త!
ముంబై: భారత వృద్ది రేటు అంచనాలను 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు గాను 30 బేసిస్ పాయింట్ల మేర మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోవచ్చంటూ హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 7.9 శాతంగా ఈ సంస్థ ప్రకటించింది. 2023–24లో వృద్ధి రేటు 6.7 శాతానికి క్షీణిస్తుందని తెలిసింది. గత అంచనా 7 శాతంగా ఉంది. అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అధిక కమోడిటీల ధరలు, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో రిస్క్‌తీసుకునే ధోరణి తగ్గడం భారత్ వృద్ధి రేటు క్షీణతకు రిస్క్‌లుగా పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం (రేట్ల పెంపు) అన్నవి వ్యాపార సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి మూలధన రికవరీని ఆలస్యం చేయవచ్చు’’అని మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసి నివేదికలో పేర్కొంది. సరఫరా వైపు ప్రభుత్వం తీసుకునే చర్యల మద్దతు, వ్యాపార కార్యకాలపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం అన్నవి ఈ రిస్క్‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 2022–23కు 6.5 శాతం, కరెంటు ఖాతా లోటు పదేళ్ల గరిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. -
ఎస్బీఐ బొనాంజా..!
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. ప్రకటనకు సంబంధించి మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ► ఎనిమిది మెట్రో నగరాల విషయంలో రూ.3 కోట్ల రుణం వరకూ ఇదే క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీరేటు విధానం అమలవుతుంది. యోనో ద్వారా దరఖాస్తుచేస్తే, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. ► ప్రస్తుతం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలుపైబడితే ఈ రేటు 7 శాతంగా ఉంది. ఈ విషయంలో మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఉంది. ► ఎస్బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది. ► కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా అందిస్తోంది. ► వ్యక్తిగత రుణాలపై 9.6% నుంచి వడ్డీ రేటు ఉంటోంది. ► ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. డిమాండ్ వృద్ధిపై విశ్వాసం: ఎస్బీఐ కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధి్దకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. రుణ వృద్ధి పలు సంవత్సరాల కనిష్టస్థాయి 6 శాతం వద్దే కొనసాగుతుండడం గమనార్హం. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల పోటీ... పండుగల సీజన్లో డిమాండ్‌ను సొంతం చేసుకోడానికి ప్రైవేటు బ్యాంకులూ ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యస్‌బ్యాంక్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణాలు, తక్కువ వ్యయ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు రద్దుసహా పలు ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ‘ఖుషియోంకీ కరే జిమ్మెదారి సే తయారీ’ పేరిట ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 శాతం ఆన్–రోడ్ ధరతో 7.99 శాతం నుంచి కారు రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 72 నెలల అత్యధిక కాలవ్యవధితో 10.45 శాతం ప్రారంభ వడ్డీకి రూ.50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం పొందే సౌలభ్యం ఉన్నట్లు వివరించింది. రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కారు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహన, నిర్మాణ పరికరాల రుణాలకు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు అమలవుతుంది. బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే, రూ.250 వోచర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు ఈ వోచర్‌ను వినియోగిచుకోవచ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతానికి గృహ రుణ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
యాక్సిస్ బ్యాంక్ గృహ రుణ రేటు తగ్గింపు
ముంబై: ప్రైవేటు రంగంలో మూడవ బ్యాంకింగ్ దిగ్గజం– యాక్సిస్ బ్యాంక్ గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెడీఎఫ్సీ వంటి పోటీ పూర్వక బ్యాంకులు ఇటీవలే గృహ రుణ రేట్లు తగ్గించడంతో యాక్సిస్ కూడా ఇదే దారిలో నడిచింది. గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం– ♦ ఉద్యోగస్తులకు సంబంధించి రూ.30 లక్షల వరకూ రుణంపై రేటు 0.30 శాతం తగ్గి 8.35 శాతానికి చేరుతుంది. ♦ పురుషులు, మహిళలకు సంబంధించి రేట్ల తగ్గింపులో ఎలాంటి మార్పునూ పేర్కొనలేదు. ♦∙మే 16 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. -
గృహ, వాహన రుణాలు మరింత చౌక!
ఎస్బీఐ రుణ రేట్లు 0.90% తగ్గింపు అదే బాటలో పీఎన్బీ, యూనియన్ బ్యాంకులు జనవరి 1 నుంచే అమల్లోకి.. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు బ్యాంకులు వడ్డీ రేట్ల కోత దిశగా చర్యలు ప్రారంభించాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ తన ప్రామాణిక లెండింగ్ రేటును 90 బేసిస్ పాయింట్లు (0.90%) తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూనియన్ బ్యాంకులు సైతం నడిచాయి. పీఎన్బీ 70 బేసిస్ పాయింట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 90 బేసిస్ పాయింట్ల మేర కోత విధించాయి. దీనివల్ల గృహ, వాహన రుణాలు మరింత చౌకగా మారనున్నాయి. డీమోనిటైజేషన్ నేపథ్యంలో భారీ స్థాయిలో డిపాజిట్లు రావడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రుణ విపణిని పెంచుకునే వ్యూహంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు ఈ స్థాయిలో లెండింగ్ రేటును తగ్గించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. నెల నుంచి మూడేళ్ల రుణాలపై... ఎస్బీఐకి చెందిన నిధుల సేకరణ వ్యయం ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ఏడాది కాల వ్యవధికి ప్రస్తుతం 8.90 శాతం ఉండగా, తాజాగా దాన్ని 8 శాతానికి తగ్గించింది. రెండేళ్లు, మూడేళ్లు కాల వ్యవధిగల రుణాలపై ఇంతే మొత్తం తగ్గిస్తూ 8.10, 8.15 శాతానికి తీసుకొచ్చింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల కాలావధి కలిగిన రుణాలపైనా వడ్డీ రేటును 0.9 శాతం తగ్గించింది. రేట్ల తగ్గింపు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. పీఎన్బీ ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.7 శాతం తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి దిగి వచ్చింది. మూడేళ్లు, ఐదేళ్ల రుణాలపైనా ఇంతే మొత్తం తగ్గించడం ద్వారా ఎంసీఎల్ఆర్ను 8.60 శాతం, 8.75 శాతాలకు సవరించింది. గత నవంబర్ నుంచి తాము మొత్తం 0.85 శాతం మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించామని పీఎన్బీ తన ప్రకటనలో తెలిపింది. కాగా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.65 శాతం నుంచి 0.90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. దీంతో గతేడాది కాల వ్యవధిగల రుణాలపై ప్రామాణిక వడ్డీ రేటు 8.65 శాతానికి తగ్గింది. గతవారం ఎస్బీఐ అనుబంధ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్తోపాటు ఐడీబీఐ బ్యాంకు సైతం లెండింగ్ రేటును తగ్గించిన విషయం తెలిసిందే. త్వరలో డిపాజిట్లపైనా కోత ‘‘డిపాజిట్ల రాక అధిక స్థాయిలో ఉన్నందున బ్యాంకుల వద్ద లిక్విడిటీ అధిక స్థాయికి చేరింది. దీంతో లెండింగ్ రేటు తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. దీనివల్ల రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సమీక్షిస్తాం’’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఆర్థిక రంగానికి సానుకూలం... బ్యాంకుల నిర్ణయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆహ్వానించారు. దీనివల్ల రుణాల జారీ ఊపందుకుంటుందని, ఇది ఆర్థిక రంగానికి సానుకూలమన్నారు. డీమోనిటైజేషన్ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించే ధోరణి మొదలైందని, బ్యాంకుల వద్ద గణనీయ స్థాయిలో తక్కువ వ్యయ ఆధారిత నిధులు ఉన్నట్టు ట్వీట్ చేశారు. ఎంసీఎల్ఆర్ అంటే... బ్యాంకులు గతేడాది జూన్‌లో బేస్ రేటు విధానం నుంచి నూతన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు అయిన ఎంసీఎల్ఆర్కు మళ్లాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపును రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో బదిలీ చేసేందుకు ఈ విధానాన్ని అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకొచ్చారు. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు కొత్తగా జారీ చేసే రుణాలపై అమలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే కచ్చితంగా ఇంతే మొత్తంపై రుణాలు జారీ చేయాలని లేదు. కాకపోతే ఇంతకంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలను ఇవ్వవు. ఈ విధానం కింద బ్యాంకులు నిధుల సేకరణ వ్యయాలు, వివిధ కాలావధిగల డిపాజిట్లపై అయ్యే వ్యయాలు, రుణాల జారీకి అయ్యే వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తాయి. రాజన్ తన హయాంలో 1.5 శాతం మేర రేట్లను తగ్గించగా... తర్వాత వచ్చిన ఉర్జిత్ పటేల్ మరో పావు శాతం మేర కోత విధించారు. అయినా బ్యాంకులు వీటిలో సగం శాతం కూడా కస్టమర్లకు బదిలీ చేయని విషయం గమనార్హం. రుణ రేట్లు ఎంత తగ్గొచ్చు... బ్యాంకులు సాధారణంగా గృహ రుణాలకు ఎంసీఎల్ఆర్పై 0.25–0.60 శాతం స్ప్రెడ్‌తో గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో కాలావధిగల ఎంసీఎల్ఆర్ ఆధారంగా రుణాలిస్తున్నాయి. ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుపై 25 శాతం స్ప్రెడ్ వేసుకొని గృహ రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐకి సంబంధించిన ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పటివరకూ 8.9 శాతం అయినందున, 75 లక్షల వరకూ తీసుకునే గృహ రుణంపై 9.15 శాతం వడ్డీని విధిస్తున్నది. మహిళలకైతే ఇది 9.10 శాతం. ఇప్పుడు తాజాగా ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ను 8 శాతానికి తగ్గించినందున గృహ రుణంపై రేటు 8.25 శాతం (మహిళలకు 8.2 శాతం) వుండవచ్చు. వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్ రుణాలు...ఇలా వివిధ రకాల రుణాలకు బ్యాంకు వివిధ కాలావధులకు సంబంధించిన ఒక ఎంసీఎల్ఆర్ను బెంచ్‌మార్క్‌గా పెట్టుకుని, దానికి కొంత స్ప్రెడ్‌ను జతచేసి బ్యాంకులు రేట్లను నిర్ణయిస్తాయి. -
యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి తగ్గింది. జూలై 27వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. తాజా ఫండ్స్ సమీకరణ ఆధారిత రుణ రేటు (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత- ఎంసీఎల్ఆర్)ను కూడా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీలపై ఐదు నుంచి 10 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గించింది. కాగా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బ్యాంక్ షేర్ ధర 1.67% (రూ.9.45) తగ్గి రూ.556 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గింపు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 25 - 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి (నేటి నుంచి) అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం 181 రోజుల పైబడిన కాలవ్యవధికి సంబంధించి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు నుంచి అరశాతం దాకా తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. -
కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.90 శాతానికి దిగింది. ఫలితంగా దీనితో అనుసంధానమైన నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల(ఈఎంఐ) భారం కస్టమర్లపై తగ్గనుంది. తాజా రేటు ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానుందని బీఎస్ఈకి బ్యాంక్ తెలిపింది. -
బేస్ రేటు తగ్గించిన ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఎస్బీహెచ్ బేస్ రేటు 10.05 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలకు చెల్లించే ఈఎంఐలు తగ్గుతాయని, 30 ఏళ్ల గృహరుణానికి లక్ష రూపాయలకు రూ. 874 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు- బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు 0.75 శాతం(7.25 శాతానికి) తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు కొంతమేర బదలాయించాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానకీ సంకేతం.