
యాక్సిస్ బ్యాంక్ గృహ రుణ రేటు తగ్గింపు
ముంబై: ప్రైవేటు రంగంలో మూడవ బ్యాంకింగ్ దిగ్గజం– యాక్సిస్ బ్యాంక్ గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెడీఎఫ్‌సీ వంటి పోటీ పూర్వక బ్యాంకులు ఇటీవలే గృహ రుణ రేట్లు తగ్గించడంతో యాక్సిస్ కూడా ఇదే దారిలో నడిచింది. గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం–
♦ ఉద్యోగస్తులకు సంబంధించి రూ.30 లక్షల వరకూ రుణంపై రేటు 0.30 శాతం తగ్గి 8.35 శాతానికి చేరుతుంది.
♦ పురుషులు, మహిళలకు సంబంధించి రేట్ల తగ్గింపులో ఎలాంటి మార్పునూ పేర్కొనలేదు.
♦∙మే 16 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.