న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేట్లను పెంచింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్) రుణరేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
సవరిత రేట్లు 12వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన రేట్లను చూస్తే బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి 8.05%కి చేరింది. ఇది వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు అనుసంధానమైన రేటు. ఏడాది, మూడేళ్లు, 6 నెలల రేట్లు 10 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగసి వరుసగా 7.70%, 7.75%, 7.90 శాతాలకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment