బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్‌డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.
కొత్త స్కీమ్ వడ్డీ రేట్లు
బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్‌లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్‌తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment