న్యూఢిల్లీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ – ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇటీవలే ప్రైవే టు రంగ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇదే స్థాయిలో కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే కెనరా బ్యాంక్ మాత్రం అన్ని కాలపరిమితులపై రుణ రేటును పెంచింది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి.
పెంచిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కెనరా బ్యాంక్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం– సాధారణంగా ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదికన అయిన ఏడాది ఎంసీఎల్‌ఆర్ 8.70 శాతం నుంచి 8.75%కి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment