ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మూడవ సారి కూడా 6.5 శాతం వద్దనే ఎటువంటి సవరణ చేయకుండా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తరువాత యాక్సిస్ బ్యాంక్ & కెనరా బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను సవరించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్..
యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరణల తరువాత సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్లలోపు చేసుకునే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ అందించనుంది. అంతే కాకుండా నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వెసలుబాటు కూడా ఇందులో లభిస్తుంది.
- 7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజులు 3.50%
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00%
- 61 రోజులు నుంచి 3 నెలలు 4.50%
- 3 నెలలు నుంచి 4 నెలలు, 4 నెలలు నుంచి 5 నెలలు, 5 నెలలు నుంచి 6 నెలలు 4.75%
- 6 నెలలు నుంచి 7 నెలలు, 7 నెలలు నుంచి 8 నెలలు, 8 నెలలు నుంచి 9 నెలలు 5.75%
- 9 నెలలు నుంచి 10 నెలలు, 10 నెలలు నుంచి 11 నెలలు, 11 నెలల నుంచి 11 నెలల 24 రోజులు 6.00%
- 11 నెలల 25 రోజులు నుంచి 1 సంవత్సరం 6.00%
- 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75%
- 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజులు & 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80%
- 1 సంవత్సరం 25 రోజులు నుంచి 13 నెలలు 6.80%
- 13 నెలలు నుంచి 14 నెలలు, 14 నెలలు నుంచి 15 నెలలు, 15 నెలలు నుంచి 16 నెలలు వరకు 7.10%
- 16 నెలలు నుంచి 17 నెలలు 7.30%
- 17 నెలలు నుంచి 18 నెలలు & 18 నెలలు నుంచి 2 సంవత్సరాలు 7.10%
- 2 సంవత్సరాలు నుంచి 30 నెలలు 7.20%
- 30 నెలలు నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.00%
కెనరా బ్యాంక్..
ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే.. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త సవరణ తర్వాత, సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకునే డిపాజిట్లపై బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్
- 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.00%
- 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 5.25%
- 91 రోజుల నుంచి 179 రోజులు 5.50%
- 180 రోజుల నుంచి 269 రోజుల వరకు 6.25%
- 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 6.50%
- 1 సంవత్సరం మాత్రమే 6.90%
- 444 రోజులు 7.25%
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.90%
- 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.85%
- 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 5 సంవత్సరాల కంటే తక్కువ 6.80%
- 5 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 10 సంవత్సరాల వరకు 6.70%
Comments
Please login to add a commentAdd a comment