Axis Bank
-
బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
బడ్జెట్లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్‌లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టుక్యాన్సర్పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు. -
రూ.4,789 కోట్లు నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ABFRL) నిధుల సమీకరణ చేపట్టనుంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(QIP), ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మొత్తం రూ.4,789 కోట్లు అందుకునే యోచనలో ఉంది. వృద్ధి వ్యూహాలకు పెట్టుబడులను సమకూర్చుకునే ప్రణాళికలో భాగంగా బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రమోటర్ సంస్థ పిలానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌కు రూ. 1,298 కోట్లు, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ. 1,081 కోట్లు విలువైన ప్రిఫరెన్షియల్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా క్విప్ ద్వారా మరో రూ. 2,500 కోట్ల సమీకరణ(funds)కు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2024 సెపె్టంబర్ 19న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు అనుమతించిన నిధుల సమీకరణ ప్రతిపాదనకు తాజాగా బోర్డు మరోసారి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది చివరిలోగా కంపెనీ మదురా ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ బిజినెస్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా లైఫ్‌స్టైల్ బ్రాండ్స్కింద విడదీయనుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుయాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్(Axis Bank) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 6,304 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 6,071 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 27,961 కోట్ల నుంచి రూ. 30,954 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 13,483 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.08 శాతం తగ్గి 3.93 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,028 కోట్ల నుంచి రూ. 2,156 కోట్లకు ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,923 కోట్ల నుంచి రూ. 5,432 కోట్లకు పెరిగాయి. దీంతో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.44 శాతం నుంచి 1.46 శాతానికి స్వల్పంగా పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 17.01 శాతంగా నమోదైంది. కాగా.. క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,491 కోట్ల నుంచి రూ. 6,742 కోట్లకు పుంజుకుంది. -
బ్యాంకులో రూ.6.5 కోట్లు మోసం.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో ఇటీవల రూ.6.5 కోట్ల ఘరానా మోసం జరిగినట్లు వచ్చిన కథనాలపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్ఆర్ఐ బ్యాంకు కస్టమర్ పరితోష్ ఉపాధ్యాయ్ ఖాతా వివరాలు ఉపయోగించి బ్యాంకు సిబ్బంది అనధికారికంగా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు బ్యాంకు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.‘పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై క్రిమినల్ అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ పరితోష్కి పూర్తిగా తెలిసే జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సిబ్బందిపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా బ్యాంకు విచారణకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ, అధికారులపై గానీ తప్పుడు లేదా తమ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయ్‌కు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం అకౌంట్ ఉంది. ఇటీవల అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట యాక్సిస్ బ్యాంకులోని కొంతమంది సిబ్బంది తన పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారని ఉపాధ్యాయ్ తెలిపారు. -
ఎన్ఆర్ఐ అకౌంట్లోని రూ.6.5 కోట్లు మాయం
పంజగుట్ట: ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు. ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం -
మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్
ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా మహిళలకు సమగ్రమైన ఆర్థిక సేవలు అందించే దిశగా ‘ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంటు’ను ఆవిష్కరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడేలా ఫ్యామిలీ బ్యాంకింగ్ ప్రోగ్రాం, చిన్న–మధ్య స్థాయి లాకర్లపై తొలి ఏడాది జీరో రెంటల్ ఫీజు, పీవోఎస్లలో రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితితో ఏరైజ్ డెబిట్ కార్డు, కాంప్లిమెంటరీగా నియో క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను దీనితో పొందవచ్చు.అలాగే, మహిళా నిపుణులతో ఆర్థిక సలహాలు, తొలి ఏడాది డీమ్యాట్ అకౌంటుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీల నుంచి మినహాయింపు, ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్ చేసిన స్టాక్స్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మొదలైన సర్వీసులను అందుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలకు సంబంధించిన ప్యాప్‌స్మియర్ తదితర నిర్దిష్ట వైద్యపరీక్షలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు, ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులతో అపరిమిత కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది.దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఇటీవలే ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. గత అక్టోబర్ 21 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వారం రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందుతోంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. కనీసం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తోంది. -
క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు.. డిసెంబర్ 20 నుంచి..
దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ వచ్చే డిసెంబర్ నెల నుండి తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో అనేక మార్పులు చేయబోతోంది. వీటిలో కొత్త రిడెంప్షన్ ఫీజులు, సవరించిన వడ్డీ రేట్లు, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 20 నుండి అమలుకానున్నాయి.ఎడ్జ్ రివార్డ్‌లపై రిడెంప్షన్ ఫీజుయాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ రివార్డ్‌లు లేదా మైల్స్‌ను వినియోగించడం కోసం రిడెంప్షన్ ఫీజులను ప్రవేశపెడుతోంది. క్యాష్ రిడెంప్షన్‌కు రూ. 99 (18 శాతం జీఎస్టీ అదనం), మైలేజ్ ప్రోగ్రామ్‌కు పాయింట్లను బదిలీ చేయడానికి రూ. 199 (18 శాతం జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. డిసెంబర్ 20 లోపు పాయింట్లను రీడీమ్ లేదా బదిలీ చేసుకుంటే ఈ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.రిడెంప్షన్ ఫీజు వర్తించే కార్డులు ఇవే..» యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్» యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ » యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్సవరించిన ఇతర ఛార్జీలునెలవారీ వడ్డీ రేటు 3.75 శాతానికి పెరుగుతుంది. ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్‌పై చెల్లింపు మొత్తంలో 2 శాతం రుసుము ఉంటుంది. కనిష్ట పరిమితి రూ. 500 కాగా గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. దీంతో శాఖలలో నగదు చెల్లింపుపైనా రూ.175 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ట బకాయి మొత్తాన్ని చెల్లించడంతో వరుసగా రెండు సార్లు విఫలమైతే రూ. 100 అదనపు రుసుము విధిస్తారు.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్‌ను డీసీసీని 1.5 శాతానికి సవరించారు. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం, క్రెడ్, గూగుల్ పే వంటి ఏదైనా థర్డ్-పార్టీ యాప్ ద్వారా విద్యా రుసుము చెల్లిస్తే 1 శాతం రుసుము ఉంటుంది. అయితే, విద్యా సంస్థలకు నేరుగా చెల్లించే చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది.రూ. 10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్‌పై 1% రుసుము చెల్లించాలి. ఒక స్టేట్మెంట్ సైకిల్లో రూ. 50,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులు, రూ. 25,000 లకు మించిన యుటిలిటీ, రూ. 10,000 కంటే ఎక్కువ గేమింగ్ లావాదేవీలు ఉంటే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.ఏ బ్యాంక్ ఖాతాకైనా..యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!డిపాజిట్ ఇలా.. » యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.ప్రయోజనాలు» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది. -
యాక్సిస్ బ్యాంక్ నుంచి రెండు డిజిటల్ సొల్యూషన్స్
హైదరాబాద్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా రిటైల్, వ్యాపార వర్గాల కోసం రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. యూపీఐ–ఏటీఎం, భారత్ కనెక్ట్ (గతంలో బీబీపీఎస్) ఫర్ బిజినెస్ వీటిలో ఉన్నాయి. కార్డ్‌లెస్ నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) టెక్నాలజీ ఆధారిత ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్‌గా యూపీఐ–ఏటీఎం పని చేస్తుంది. అకౌంటు తెరవడం, క్రెడిట్ కార్డుల జారీ, డిపాజట్లు, రుణాలు, ఫారెక్స్ మొదలైన సరీ్వసులన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫాం మీద అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు డిప్యుటీ ఎండీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, వ్యాపార సంస్థలు సప్లై చెయిన్లోని వివిధ దశల్లో నిర్వహణ మూలధన అవసరాల కోసం, అకౌంట్ రిసీవబుల్స్–పేయబుల్స్ను సమర్ధవంతంగా క్రమబదీ్ధకరించుకునేందుకు భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎన్పీసీఐలో భాగమైన భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. -
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
యాక్సిస్ లాభం రూ. 7,129 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,129 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2022–23 క్యూ4లో బ్యాంకు రూ. 5,728 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 28,758 కోట్ల నుంచి రూ. 35,990 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ. 13,089 కోట్లుగా నమోదైంది.మరోవైపు, 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు నికర లాభం 160 శాతం పెరిగి రూ. 24,861 కోట్లకు చేరింది. వ్యాపార పరిమాణం 12% వృద్ధి చెంది రూ. 14,77,209 కోట్లకు ఎగిసింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 1 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయించింది. సిటీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేసే ప్రక్రియ వచ్చే ఆరు నెలల్లో పూర్తి కావచ్చని బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. భారత్‌లో సిటీబ్యాంక్ కన్జూమర్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం బ్యాంకు షేరు బీఎస్ఈలో 0.69% పెరిగి రూ. 1,063.70 వద్ద క్లోజయ్యింది.మరిన్ని విశేషాలు..► స్థూల మొండి బాకీలు 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475, నాలుగో క్వార్టర్లో 125 శాఖలను తెరవడంతో దేశీ యంగా మొత్తం బ్రాంచీల నెట్వర్క్ 5,377కి చేరింది.► మార్చి క్వార్టర్లో 12.4 లక్షల క్రెడిట్ కార్డులను కొత్తగా జారీ చేయడం ద్వారా గత తొమ్మిది క్వార్టర్లలో దేశీయంగా అత్యధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ నిలి్చంది. -
కస్టమర్లకు ఊరట.. దిగ్గజ బ్యాంక్‌తో పేటీఎం ఒప్పందం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ppbl)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల గడువును పెంచింది. మార్చి 15 పీపీబీఎల్ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ తరుణంలో ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు పేటీఎం అధినేత విజయ్ కుమార్ శర్మ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ (పేటీఎం) నోడల్ అకౌంట్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది పేటీఎం. తద్వారా ఆర్బీఐ పొడిగించిన తర్వాత అంటే మార్చి 15 తర్వాత వినియోగదారులు తమ కార్యకలాపాల్ని యధావిధిగా కొనసాగించవచ్చు. పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాతా వ్యాపారులకు యధావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు. వినియోగదారులకు ఆర్బీఐ సలహా కస్టమర్ల సౌకర్యార్థం పీపీబీఎల్‌తో లావాదేవీలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూలను (సాధారణంగా తలెత్తే ప్రశ్నలు, జవాబులు) కూడా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. వాటి ప్రకారం.. మార్చి 15 తర్వాత జీతాలు, పెన్షన్లు పీపీబీఎల్ ఖాతాల్లో జమ కావు. పీపీబీఎల్ ద్వారా ఈఎంఐలు లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కడుతున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పీపీబీఎల్ వాలెట్ ఉన్న వారు అందులోని బ్యాలెన్స్ మొత్తం అయిపోయే వరకు మార్చి 15 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. ఫాస్టాగ్స్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. కానీ మార్చి 15 తర్వాత టాప్అప్ చేయ డానికి ఉండదు. డెడ్‌లైన్‌లోగా ఇతర బ్యాంకుల నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. పీపీబీఎల్ అకౌంట్ లేదా వాలెట్‌తో అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, పీవోఎస్ టెర్మినల్స్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్న వ్యాపారులు .. మరో బ్యాంకు అకౌంటు లేదా వాలెట్‌ని తీసుకోవాలి. ఇప్పటికే అవి వేరే బ్యాంకుతో అనుసంధానమై ఉంటే ఈ అవసరం ఉండదు. -
ఆర్బీఐ ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పేటీఎం బాస్‌కు బంపరాఫర్!
పేటీఎంపై ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బంపరాఫర్ ఇచ్చింది. ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ప్రకటించారు. ‘వినియోగదారులు యూపీఐ పేమెంట్ కోసం పేటీఎంను వినియోగిస్తున్నారు. తద్వారా సంస్థ స్థూల విక్రయాల విలువ (గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ ) 75 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ అనుమతిస్తే పేటీఎంతో కలుస్తాం. వారితో కలిసి పని చేస్తాం’ అని అమితామ్ చౌదరి చెప్పారు. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ యూపీఐ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు ఏ బ్యాంక్‌తో కలిసి పనిచేయడం లేదు. కానీ ఆర్బీఐ పేటీంఎపై తీసుకున్న చర్యల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ యూపీఐ పేమెంట్స్‌పై దృష్టి సారించింది. కలిసి పనిచేసేందుకు పేటీఎంతో చర్చలు జరుపుతోంది. అయితే, చర్చలు సాధారణ వ్యాపారం కోసమేనని, ఇతర కార్యకలాపాలకు సంబంధించినవి కావని ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై ఆర్బీఐ, పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. -
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్‌కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్‌పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
యాక్సిస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా - ఎందుకో తెలుసా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత కొంతకాలంగా నిబంధనలను అతిక్రమించే బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తూ, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాక్సిస్ బ్యాంక్, గోల్డ్ లోన్ అందించే మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నియమాలను అతిక్రమించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ. 90.92 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 42.78 లక్షలు, ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్‌కు రూ. 20 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా బ్యాంకింగ్ సర్వీస్ అవుట్సోర్సింగ్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదని స్పష్టం చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన 'సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ గైడ్‌లైన్స్ - 2016'ను సరిగ్గా పాటించనందుకు త్రిసూర్‌కు చెందిన మణప్పురం ఫైనాన్స్‌పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం బలపడి రూ. 5,864 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 5,330 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 24,094 కోట్ల నుంచి రూ. 31,660 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 12,315 కోట్లకు చేరింది.ప్రపంచ భౌగోళిక, రాజకీయ ఆటుపోట్ల మధ్య భారత్ వృద్ధి బాటలోనే సాగుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. ఎన్పీఏలు డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు 0.15% మెరుగై 4.11 శాతాన్ని తాకాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.96% నుంచి రూ. 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.41 % నుంచి 0.36 శాతానికి వెనకడుగు వేశాయి. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 955 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్‌టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. చూడటానికి ఎలా ఉంటుందంటే? ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్‌పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్‌లో లభ్యమవుతాయి. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్‌లెస్ క్రిడెట్ కార్డ్‌ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారుల కార్డ్‌ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు. బోలెడన్ని లాభాలు యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్లైన్,ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే సర్‌ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. మీరు నంబర్‌లెస్ కార్డ్‌ని ఎక్కడ పొందవచ్చు? ఫైబ్ యాప్‌లో కస్టమర్లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది. -
చిన్న సంస్థల కోసం యాక్సిస్ బ్యాంక్ నియో
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ‘నియో ఫర్ బిజినెస్’ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఆవిష్కరించింది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. డిజిటల్ సెల్ఫ్ ఆన్–బోర్డింగ్, బల్క్ పేమెంట్స్, జీఎస్టీకి అనుగుణమైన ఇన్వాయిసింగ్, పేమెంట్ గేట్‌వే అనుసంధానం మొదలైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ తెలిపారు. ప్రస్తుతమున్న తమ కరెంట్ అకౌంట్ ఖాతాదారులు మొబైల్ యాప్ రూపంలో, వెబ్ ఆధారిత డిజిటల్ రిజి్రస్టేషన్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతానికి సోల్ ప్రొప్రైటర్íÙప్ సంస్థలు, వ్యక్తులకు ఇది అందుబాటులో ఉంటుందని.. త్వరలోనే కంపెనీలు, పార్ట్నర్íÙప్స్, ఎల్ఎల్పీలకు కూడా విస్తరిస్తామని గంభీర్ వివరించారు. -
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
Axis Bank Fd Rates: ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 18, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.10శాతం వడ్డిని చెల్లిస్తుంది. 5 నుండి 10 ఏళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్‌డిలపై 7శాతం వడ్డి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల ఎఫ్డీలపై 7.75శాతం గరిష్ట స్టాండర్డ్ రేటు వర్తిస్తుంది. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, టీ బండి నడుపుకుంటున్నా!) 7- 10 ఏళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న FDలపై సాధారణ ప్రజలకు 3-7శాతం, సీనియర్ సిటిజన్లకు 3నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్ యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది.13 - 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై, నాన్-సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 15 నెలల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 7.10శాతంగా ఉంటుంది. కాగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీరేట్ల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్!
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది. మెజారిటీ బ్యాంక్‌లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్‌లు చార్జీలు బాదుతుంటాయి. చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
గుర్తుంచుకోండి, సెప్టెంబర్ నెలలో ఈ పనులు పూర్తి చేయండి..లేకపోతే మీకే నష్టం!
ప్రతి నెల మొదటి రోజు ప్రారంభంతో ఆర్ధికపరమైన మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో సైతం ఈ మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రూ.2,000 నోట్ల డిపాజిట్లు.. ఎక్ఛేంజ్, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ నెంబర్‌ను జత చేయడం, ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు. వీటితో పాటు.. రూ.2,000 ఎక్ఛేంజ్‌కు చివరి రోజు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 నోట్ల ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, జులై 20న ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో నోట్ల మార్పిడి గడువు పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో నోట్ల ఉపసంహరణకు ఆర్బీఐ 4నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే రూ.2,000 నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆధార్ నంబర్ తప్పని సరి కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన చందాదారులకు నో యువర్ కస్టమర్ (కేవైసి)ని అప్డేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల గడువు ఇచ్చింది. పొదుపు దారులు ఆధార్‌ను నెంబర్‌ను జత చేయకపోతే అక్టోబర్ 1నుండి పెట్టుబడులను కొనసాగించడం అసాధ్యం ట్రేడింగ్ చేయాలంటే తప్పని సరిగా సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి నెలలో స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ట్రేడింగ్ నిర్వహిస్తున్న ( existing holders) వారు తప్పని సరిగా వారి డిమ్యాట్ అకౌంట్‌కు ఒక లబ్దిదారుని వివరాల్ని జత చేయాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జూన్ నెలలో ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోనే గడువును పొడిగించింది. ఆ గడువు సెప్టెంబర్ 14 మాత్రమే ఉందని ఆధార్ ట్వీట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు - షరతులు సెప్టెంబరు 1 నుండి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వార్షిక రుసుము రూ. 10,000 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 12,500 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10,000 విలువైన వోచర్ బెన్ఫిట్స్ను నిలిపివేస్తుంది. రూ. 1,00,000 నెలవారీ ఖర్చులపై 25,000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల నెలవారీ ప్రయోజనాల్ని సైతం నిలిపివేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల కోసం (SBI WeCare FD) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం గడువును పొడిగించింది. ఎస్బీఐ వీకేర్ పథకంలో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో పెట్టుబడి దారులైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక ఈ పథకంలో చేరే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ ఐడీబీఐ బ్యాంక్ తన ప్రత్యేక పిక్స్డ్ డిపాజిట్ పథకం అమృత్ మహోత్సవ్ లో చేరే గడువు పొడిగించిన విషయం తెలిసిందే. రెండు టెన్యూర్ల కాలానికి 7.10శాతం నుండి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. గడువు తేదీ సైతం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు పొందుతారు. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
కిసాన్ క్రెడిట్ కార్డ్ లబ్ధిదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) ప్రవేశపెట్టిన పీటీపీఎఫ్సీ (పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్) ప్లాట్‌ఫాం కింద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ రెండు కొత్త రుణ సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనికింద రూ. 1.6 లక్షల వరకు పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ).. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రూ. 10 లక్షల వరకు రుణాలను అందించనుంది. కేసీసీలను పైలట్ ప్రాతిపదికన ముందుగా మధ్యప్రదేశ్‌లో ప్రవేశపెట్టనుంది. వీటిని పూర్తిగా డిజిటల్‌గానే జారీ చేయనున్నామని, కస్టమర్లు ప్రత్యేకంగా ఏ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంక్ డిప్యుటీ ఎండీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. పాన్ ధృవీకరణ, ఆధార్ ఈకేవైసీ, ఖాతా అగ్రిగేటర్ డేటా, స్థల రికార్డులు మొదలైనవన్నీ పీటీపీఎఫ్సీ ప్లాట్‌ఫాంలో అధికారికంగా అందుబాటులో ఉండటం వల్ల రుణాల మంజూరీ వేగవంతం కాగలదని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగాలు రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి కిసాన్ క్రెడిట్ కార్డులు. భారత ప్రభుత్వం 1998లో రైతుల కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక రంగాల్లో రైతులు, అవసరమైన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు స్వల్పకాలిక రుణాన్ని పొందొచ్చు. దీన్ని నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలెప్మెంట్) రూపొందించింది. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు..
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మూడవ సారి కూడా 6.5 శాతం వద్దనే ఎటువంటి సవరణ చేయకుండా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తరువాత యాక్సిస్ బ్యాంక్ & కెనరా బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను సవరించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరణల తరువాత సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్లలోపు చేసుకునే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ అందించనుంది. అంతే కాకుండా నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వెసలుబాటు కూడా ఇందులో లభిస్తుంది. 7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజులు 3.50% 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00% 61 రోజులు నుంచి 3 నెలలు 4.50% 3 నెలలు నుంచి 4 నెలలు, 4 నెలలు నుంచి 5 నెలలు, 5 నెలలు నుంచి 6 నెలలు 4.75% 6 నెలలు నుంచి 7 నెలలు, 7 నెలలు నుంచి 8 నెలలు, 8 నెలలు నుంచి 9 నెలలు 5.75% 9 నెలలు నుంచి 10 నెలలు, 10 నెలలు నుంచి 11 నెలలు, 11 నెలల నుంచి 11 నెలల 24 రోజులు 6.00% 11 నెలల 25 రోజులు నుంచి 1 సంవత్సరం 6.00% 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75% 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజులు & 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80% 1 సంవత్సరం 25 రోజులు నుంచి 13 నెలలు 6.80% 13 నెలలు నుంచి 14 నెలలు, 14 నెలలు నుంచి 15 నెలలు, 15 నెలలు నుంచి 16 నెలలు వరకు 7.10% 16 నెలలు నుంచి 17 నెలలు 7.30% 17 నెలలు నుంచి 18 నెలలు & 18 నెలలు నుంచి 2 సంవత్సరాలు 7.10% 2 సంవత్సరాలు నుంచి 30 నెలలు 7.20% 30 నెలలు నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.00% కెనరా బ్యాంక్.. ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే.. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొత్త సవరణ తర్వాత, సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకునే డిపాజిట్లపై బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.00% 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 5.25% 91 రోజుల నుంచి 179 రోజులు 5.50% 180 రోజుల నుంచి 269 రోజుల వరకు 6.25% 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 6.50% 1 సంవత్సరం మాత్రమే 6.90% 444 రోజులు 7.25% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.90% 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.85% 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 5 సంవత్సరాల కంటే తక్కువ 6.80% 5 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 10 సంవత్సరాల వరకు 6.70% -
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల కస్టమర్ల కోసం ‘సంపన్న్’ పేరిట ప్రీమియం బ్యాంకింగ్ సర్వీసులను ఆవిష్కరించింది. వీటితో వ్యవసాయోత్పత్తులపై డిస్కౌంట్లు, వ్యక్తిగత రుణ పథకాలు, రుణాలపై వడ్డీ రేట్లు మొదలైన అంశాల్లో ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంకు గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు మునీష్ సర్దా, రవి నారాయణన్ తెలిపారు. వ్యాపార విస్తరణ, వాహనాలు.. గృహాల కొనుగోలు తదితర అవసరాలకు సులభతరంగా ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా సంపన్న్ను తీర్చిదిద్దినట్లు వివరించారు. వీటికి తోడు అధిక పరిమితులతో ఉచిత డెబిట్..క్రెడిట్ కార్డులు, డీమ్యాట్ సేవలు, ప్రత్యేకంగా రిలేషన్ షిప్ మేనేజరుతో పాటు ఆరోగ్య..జీవిత బీమా కవరేజీలాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు పేర్కొన్నారు. రైతులు, వ్యాపారస్తులు, లఘు పరిశ్రమలు మొదలైన వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు సంపన్న్ తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 30 సెకన్లలో రూ.5 లక్షల లోన్!
ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. కస్టమర్లకు లోన్స్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఇందులో బజాజ్, టాటా క్యాపిటల్ మొదలైన సంస్థలు అతి తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) ప్రవేశించింది. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వల్ల సుమారు 450 మిలియన్ కస్టమర్లు అదనపు సౌలభ్యం పొందే అవకాశం ఉంది. కేవలం 30 సెకన్లలోపు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందవచ్చని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి 6 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కావున ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రముఖ బ్యాంకుల సహకారంతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 'బై నౌ పే లేటర్' (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు (EMI) అండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు వంటివి అందిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. కాగా ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంక్ సహకారంతో పర్సనల్ లోన్ విభాగంలో కూడా అడుగుపెట్టడం చాలా సంతోషముగా ఉందన్నారు. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి ప్రాథమిక వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించిన తరువాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఎంత లోన్ అందించాలి, ఎంత లోన్ తీసుకోవడానికి అర్హులు అని నిర్ధారిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి చెల్లించే అర్హతను బట్టి లోన్ మొత్తంతో పాటు.. రీపేమెంట్ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా కోకొల్లలుగా అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు వాటిని గురించి కూడా ఆరా తీయవచ్చు. -
వన్-వ్యూ ఫీచర్: ఒకే యాప్‌లో అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలన్నింటినీ ఒకే చోట చూసుకునేందుకు వీలుగా యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్‌లో వన్–వ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. దీనితో యాక్సిస్ బ్యాంక్‌యేతర ఖాతాలను కూడా తమ కస్టమర్లు.. అకౌంట్లకు జోడించుకుని బ్యాలెన్స్‌లు, వ్యయాలు, లావాదేవీల స్టేట్మెంట్లను ఒకే చోట చూసుకునేందుకు వీలుంటుందని బ్యాంకు ప్రెసిడెంట్ సమీర్ శెట్టి తెలిపారు. అకౌంట్ అగ్రిగేటర్ విధానాన్ని ఉపయోగించి ఈ కొత్త తరహా బ్యాంకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో పలు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను చూసుకోవాల్సిన శ్రమ తప్పుతుందని, లింకు చేసిన ఖాతాల నుంచి కస్టమర్లు లావాదేవీల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని లేదా ఈమెయిల్‌కు పంపుకోవచ్చని తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే ఎప్పుడైనా ఆయా ఖాతాల లింకును తీసివేయొచ్చని వివరించారు. -
బ్యాంకుల్లోకి రూ.1.5 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్ల రూపంలో రూ.1–1.5 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అదనంగా వచ్చి చేరొచ్చని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య తెలిపారు. దీంతో 2023–24లో డిపాజిట్లలో వృద్ధి 11 శాతానికి పైగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నోట్లను వచ్చే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా ఖాతాలలో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. రుణాల్లో వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతానికి తగ్గొచ్చని భట్టాచార్య అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ వచ్చే వారం సమీక్షలో రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించొచ్చని, రేట్లను తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు అయితే లేదన్నారు. వృద్ధిపై ఒత్తిళ్లు ఉన్నందున 2023–24 నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చన్నారు. ఇది ఆర్బీఐ నిర్ధేశిత లక్ష్యంలోపు అనే విషయాన్ని గుర్తు చేశారు. -
45 నిమిషాల్లోనే పీవోఎస్ ఇన్స్టాల్! యాక్సిస్ బ్యాంక్ ‘సారథి’తో..
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్ పరిశీలన, లైవ్ వీడియో ధృవీకరణ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఇది క్రమబద్ధీకరిస్తుందని బ్యాంక్ ప్రెసిడెంట్ సంజీవ్ మొఘె తెలిపారు. దీనితో క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియతో పని లేకుండా, దరఖాస్తును ప్రాసెస్ చేసిన 45 నిమిషాల్లోనే ఇన్స్టాల్ చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు రోజుల తరబడి సమయం పట్టేస్తుందని, ఈ విధానంలో పేపర్ రహితంగా కేవలం నాలుగు అంచెల్లోనే పీవోఎస్ టెర్మినల్స్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుందని మొఘె చెప్పారు. ఇదీ చదవండి: SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా.. -
నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది. బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. ఎన్పీఏలు డౌన్ క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంకు అధికారులకు టోకరా వేసిన కేటుగాడు
-
యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ జట్టు
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ (ఎస్హెచ్ఎఫ్ఎల్) సంస్థలు చేతులు కలిపాయి. యూబీ కో.లెండ్ ప్లాట్‌ఫాం ద్వారా రుణాలు ఇచ్చేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీనితో చిన్న, మధ్య తరహా సంస్థలకు అలాగే గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లోని మధ్య.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందించనున్నాయి. ఆర్థిక రంగంలో యాక్సిస్ బ్యాంక్, లోన్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఎస్హెచ్ఎఫ్ఎల్ అనుభవాలు.. రుణ గ్రహీతల ప్రొఫైల్‌ను మదింపు చేసి, రుణాలు ఇచ్చేందుకు ఉపయోగపడగలవని ఇరు సంస్థలు తెలిపాయి. ఎంఎస్ఎంఈలు, అఫోర్డబుల్ హోమ్ సెగ్మెంట్లలో విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్దా, ఎస్హెచ్ఎఫ్ఎల్ ఎండీ రవి సుబ్రమణియన్ తెలిపారు. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి10 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంత పెంచిందో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి ►7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►61 రోజుల నుంచి 3 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►3 నెలల నుంచి 6 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 6 నెలల నుంచి 9 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 9 నెలల నుంచి ఏడాది నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 24 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►13 నెలల నుంచి 2 సంవత్సరాల నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 2 నుంచి 30 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.26 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►30 నెలల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. -
ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్ అనే అగ్రిటెక్ యాప్ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ విభాగం హెడ్ మునీష్ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్ పేర్కొన్నారు. -
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!
భారత్‌లో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి. భారత్‌లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్ బిజినెస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్ ఒకటి. సిటీ బ్యాంక్ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది. ఆందోళనలో సిటీ బ్యాంక్ కస్టమర్లు ఇక సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్స్క్షన్లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు: ► సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ► అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ► బ్యాంక్ అకౌంట్లు ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లలో ఎటువంటి మార్పు ఉండదు. ► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు. ► క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ► క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ కోసం అకౌంట్ నెంబర్‌తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్‌లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. ► సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది. -
భళా.. అదరగొట్టిన యాక్సిస్ బ్యాంక్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56% ఎగసి రూ. 6,187 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 62% జంప్‌చేసి రూ. 5,853 కోట్లను తాకింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,614 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 32 శాతం వృద్ధితో రూ. 11,459 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.73% బలపడి 4.26 శాతానికి చేరాయి. ఆదాయం రూ. 21,101 కోట్ల నుంచి రూ. 26,892 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) వార్షిక ప్రాతిపదికన 3.17% నుంచి 2.38%కి, నికర ఎన్పీఏలు 0.91% నుంచి 0.47%కి దిగివచ్చాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 930 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
మ్యాక్స్ ఫిన్‌తో కొత్త ఒప్పందం
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 7 శాతం అదనపు వాటా కొనుగోలుకి సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో తాజా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ మార్గదర్శకాల ప్రకారం ఒప్పందంలో సవరణలకు తెరతీసినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ అనుబంధ కంపెనీలు యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ 2021లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తద్వారా మ్యాక్స్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్‌లో 20 శాతం వాటా కొనుగోలుకి సంతకాలు చేశాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 12.99 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. మిగిలిన వాటా కొనుగోలుకి తాజాగా ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు యాక్సిస్ బ్యాంక్, అనుబంధ కంపెనీలు తెలియజేశాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో భవిష్యత్ క్యాష్ ఫ్లో ఆధారంగా ఒక కంపెనీలో చేయనున్న పెట్టుబడి విలువను నిర్ధారిస్తారు. దీనిని ఫెయిర్ వ్యాల్యూగా పేర్కొంటారు. -
WhatsApp leak case: యాక్సిస్ బ్యాంక్ ఇన్సైడర్ కేసులో ఆరోపణల కొట్టివేత
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఆర్థిక ఫలితాలకు సంబంధించి బయటకు వెల్లడి కాని సున్నిత సమాచారాన్ని వాట్సాప్ సందేశాల ద్వారా పంపిణీ చేసినట్టు 11 సంస్థలు, వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను సెబీ కొట్టివేసింది. 2017 సంవత్సరం జూన్ క్వార్టర్ ఫలితాలను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడానికి ముందే ఆ సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు సెబీ తన దర్యాప్తులో లోగడ గుర్తించింది. మల్బారి, వకీల్, మోతివాలా, ఖన్నా దేధియా యాక్సిస్ బ్యాంక్ ఫలితాల సమాచారాన్ని లీక్ చేశారంటూ, వీరిని ఇన్సైడర్లుగా ప్రకటించింది. కోటక్ క్యాపిటల్, హింగ్లాజ్, మెహ్రా, బగ్రేచా, షా, సల్దాన్హ సున్నిత సమాచారం ఆధారంగా యాక్సిస్ బ్యాంకులో ట్రేడింగ్ చేసినట్టు ఆరోపించింది. గతేడాది కూడా సెబీ టీసీఎస్, అల్ట్రాటెక్ తదితర 12 కంపెనీలకు సంబంధించి బయటకు వెల్లడించని సున్నిత సమాచారాన్ని లీక్ చేశారంటూ ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిస్థితుల్లో యాక్సిస్ బ్యాంకు సున్నిత సమాచారం కేసులో 11 మంది సంస్థలు, వ్యక్తులపై చేసిన ఆరోపణలు నిలబడవంటూ, వాటిని ఉపసంహరిస్తున్నట్టు సెబీ తాజాగా ప్రకటించింది. -
యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చేతులు కలిపాయి. కొత్తగా ‘సూపర్ ఎలీట్ క్రెడిట్ కార్డు‘ను ఆవిష్కరించాయి. దీనితో ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌ప్లస్, క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌లో లావాదేవీలకు సంబంధించి రూ. 20,000 వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ప్రతి లావాదేవీపై 4 రెట్లు ఎక్కువగా సూపర్‌కాయిన్స్ అందుకోవచ్చని ఫ్లిప్‌కా ర్ట్ ఎస్వీపీ ధీరజ్ అనేజా తెలిపారు. యాక్టివేషన్ బెనిఫిట్ కింద 500 ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్స్ పొందవచ్చని వివరించారు. -
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.35 శాతానికి చేరింది. ఏడాది, మూడు, ఆరు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావుశాతం పెంపుతో 8.15 శాతం–8.30 శాతం శ్రేణికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని బ్యాంక్ ప్రకటన వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టిన శామ్సంగ్.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఏడాది మొత్తం!
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇండియా తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌తో జత కట్టింది. కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీనితో శాంసంగ్ ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్ అని ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. సిగ్నేచర్ వేరియంట్ కార్డుతో ఏటా రూ. 10,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 2,500), ఇన్ఫినిటీ వేరియంట్ కార్డుతో రూ. 20,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 5,000) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కనీస లావాదేవీ విలువ అంటూ ఏమీ ఉండదు. సిగ్నేచర్ కార్డు వార్షిక ఫీజు రూ. 500, ఇన్ఫినిటీ కార్డు ఫీజు రూ. 5000గా (పన్నులు అదనం) ఉంటుంది. వినియోగదారులకు మరింత మెరుగైన డీల్స్ అందించేందుకు బిగ్‌బాస్కెట్, మింత్రా, టాటా 1ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో మొదలైన సంస్థలతో చేతులు శాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపాయి. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నిన్న (మంగళవారం, సెప్టెంబర్ 20) నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు వర్తిస్తాయి. వివిధ డిపాజిట్లపై సాధారణ పౌరులకు అందించే వడ్డీ 2.75 శాతం నుంచి 5.75 మధ్య ఉండనుంది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అందించే వడ్డీ 2.75 శాతం నుండి 6.50 శాతం వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 11 రోజుల నుండి 1 సంవత్సరం, 25 రోజులు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలకు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే అత్యధిక వడ్డీ. 7 రోజులు నుంచి 29 రోజుల కాలవ్యవధికి, బ్యాంక్ 2.75 శాతం అందిస్తుంది; 7 రోజుల నుండి 14 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 2.75 శాతంఅందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం రేటు వర్తిస్తుంది. 30 నెలల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం అందిస్తుంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకుగాను సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. -
వాళ్లే టార్గెట్.. పేనియర్‌బైతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
మారుమూల ప్రాంతాల్లోనూ రిటైలర్లు, ఇతర కస్టమర్లకు కరెంటు, పొదుపు ఖాతాలను తెరిచే దిశగా ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ సర్వీస్ నెట్వర్క్ పేనియర్‌బై జట్టు కట్టాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంతో స్థానిక దుకాణాల ద్వారా కూడా సులువుగా ఖాతాల ను తెరిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్డా తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారు ఆర్థిక సర్వీసుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండని రీతిలో ఈ విధానాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఖాతాను తెరిచేందుకు పలు పత్రాలు సమర్పించడం, సుదీర్ఘ ప్రక్రియలాంటి బాదరబందీ ఉండదని పేనియర్‌బై వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. తమతో జట్టు కట్టిన స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇకపై యాక్సిస్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, వారు తమ వ్యాపార లావాదేవీలను సమర్ధమంతంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
మ్యాక్స్ లైఫ్ వాటాపై యాక్సిస్ కన్ను
న్యూఢిల్లీ: బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోగల వాటాను పెంచుకోనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రానున్న 6–9 నెలల్లో వాటాను 20 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు బ్యాంక్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ సంస్థలు రెండింటితో కలసి మ్యాక్స్ లైఫ్‌లో 12.99 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్ కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో డీల్‌కు అనుమతిని పొందాక మ్యాక్స్ లైఫ్‌లో యాక్సిస్ ఈ వాటాను సొంతం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మ్యాక్స్ లైఫ్‌లో 7 శాతంవరకూ అదనపు వాటా కొనుగోలుకు యాక్సిస్ అనుబంధ సంస్థలకు హక్కు లభించింది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి ఒకేసారి లేదా దఫదఫాలుగా వాటాను దక్కించుకోవచ్చు. గత ఐదేళ్లలో బ్యాంకెస్యూరెన్స్ విభాగం 18–20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. నూతన అమ్మకాలలో 60 శాతం ఈ విభాగం ద్వారానే నమోదవుతున్నట్లు తెలియజేశారు. బ్యాంక్, బీమా కంపెనీల మధ్య ఒప్పందమే బ్యాంకెస్యూరెన్స్. దీంతో బ్యాంక్ కస్టమర్లకు బీమా ప్రొడక్టులను విక్రయించడం, బ్యాంక్ బ్రాంచీలను ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది. -
షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?
న్యూఢిల్లీ: గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) 0.10 శాతం వరకు పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి. వివరాల్లోకి వెడితే.. ఎస్బీఐ తమ ఎంసీఎల్ఆర్ వివిధ కాలావధులకు సంబంధించి 0.10 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తమ వెబ్సైట్లో పేర్కొంది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది. ఏప్రిల్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా (కేఎంబీ) బ్యాంకులు కూడా ఏడాది కాలావధి ఎంసీఎల్ఆర్ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త రేటు ఏప్రిల్ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకివచ్చాయి. ఈబీఎల్ఆర్ రేట్లు యథాతథం ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి. ఎస్బీఐకి సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఈబీఎల్ఆర్) ఏప్రిల్ 1 నుంచి 6.65 శాతంగాను, రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతం స్థాయిలో ఉన్నాయి. హౌసింగ్, ఆటో లోన్స్ సహా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్పై కొంత క్రెడిట్ రిస్క్ ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానంలో మార్పుల ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చూసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని పాటించాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీని ప్రకారం 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు.. రుణ మంజూరీలో ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
కొత్త రూల్స్..బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు తన ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ను అందించింది. మినిమం బ్యాలన్స్ విషయంలో యాక్సిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల మినిమం బ్యాలన్స్ ను యాక్సిస్ బ్యాంకు పెంచింది. పలు కేటగిరీల్లోనీ సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్పు చేసినట్లు తెలుస్తోంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్ లేదా అలాంటి అకౌంట్స్ ఉన్నవారు ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 మెయింటైన్ చేయాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ.10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.2,000కు పెరిగింది. ఈ నిర్ణయం అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ లాంటి అకౌంట్స్‌కు వర్తించనుంది. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వుండనుంది. ఆయా ఖాతాదారులు బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీల మోత మోగనుంది. ఇప్పటికే పలు బ్యాంకులు మినిమం బ్యాలన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఖాతాదారులపై ఫైన్ వసూలు చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ నగదు లావాదేవీ పరిమితిపై కూడా నిబంధనలను సవరించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితిని తగ్గించింది. ఉచిత నగదు లావాదేవీల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించబడింది. ఈ నిబంధనల మార్పు ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. -
యాక్సిస్ చేతికి ‘సిటీ ఇండియా’
న్యూఢిల్లీ: అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగాన్ని దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కాగలదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్ చెల్లించనుంది. నియంత్రణ సంస్థ నుంచి తొమ్మిది నెలల్లో అనుమతులు రాగలవని, చెల్లింపులు పూర్తయిన తర్వాత సంక్లిష్టమైన అనుసంధాన ప్రక్రియ మొదలు కాగలదని భావిస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. సంస్థాగత క్లయింట్ల వ్యాపార విభాగం ఈ డీల్‌లో భాగంగా ఉండదని సిటీగ్రూప్ తెలిపింది. ఆయా విభాగాల్లో మరింతగా విస్తరిస్తామని సిటీ ఇండియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం (రూ. 12,500 కోట్లు) .. ఈ స్థాయి డీల్స్‌తో చివరిది. జీవితకాల అవకాశం.. సిటీ బ్యాంక్ డీల్‌ను ‘జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశం‘గా యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి అభివర్ణించారు. వ్యాపార వృద్ధి ప్రయోజనాలు గణనీయంగా ఉండటంతో ఈ డీల్వైపు మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొనుగోలు వల్ల వడ్డీ ఆదాయంతో పాటు ఫీజు, వడ్డీయేతర ఆదాయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్‌వో పునీత్ శర్మ చెప్పారు. సిటీబ్యాంక్ ఖాతాదారులకు యథాప్రకారంగా రివార్డులు, ఆఫర్లు మొదలైనవి కొనసాగుతాయని చౌదరి తెలిపారు. సిటీ బ్యాంక్ కస్టమర్లంతా యాక్సిస్ బ్యాంక్‌కు మారేందుకు తమ సమ్మతి తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. కస్టమర్లు యాక్సిస్ బ్యాంకుకు మారేందుకు ఇష్టపడితే యథాప్రకారం తమ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఇతర లావాదేవీలు కొనసాగించవచ్చు. లేదా నిష్క్రమించవచ్చు. యాక్సిస్ బ్యాంక్ విస్తృత నెట్వర్క్, ఆఫర్లు సిటీబ్యాంక్ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయని చౌదరి పేర్కొన్నారు. ఒకవేళ కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిన పక్షంలో ఆ మేరకు యాక్సిస్ చెల్లించే మొత్తం కూడా తగ్గే విధంగా ఒప్పందంలో షరతులు ఉన్నాయని, అలాగే ఇరు పక్షాలు కూడా ఏ కారణంతోనైనా వైదొలిగేందుకు కూడా వీలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయని వివరించారు. సిటీగ్రూప్ ఇకపై భారత్‌లో సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగింపుపై దృష్టి పెట్టనుంది. కార్డుల్లో టాప్ 3లోకి యాక్సిస్.. దాదాపు 86 లక్షల కార్డులతో యాక్సిస్ బ్యాంక్ దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో నాలుగో స్థానంలో ఉంది. సిటీగ్రూప్ డీల్‌తో కొత్తగా మరో 25 లక్షల క్రెడిట్ కార్డుహోల్డర్లు జతవుతారు. దీంతో కార్డుల వ్యాపార విభాగంలోని టాప్ 3 బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటిగా ఎదుగుతుంది. డిపాజిట్ల పరిమాణం మరో రూ. 50,200 కోట్ల మేర పెరుగుతుంది. అలాగే, సిటీ వెల్త్.. ప్రైవేట్ బ్యాంకింగ్ సాధనాలకు సంబంధించి రూ. 1,10,900 కోట్ల విలువ చేసే ఆస్తులు (ఏయూఎం) కూడా యాక్సిస్‌కు జతవుతాయి. తద్వారా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో 3వ అతి పెద్ద బ్యాంకుగా యాక్సిస్ ఎదగనుంది. సిటీ బ్యాంక్‌కు 18 నగరాల్లో ఉన్న 7 కార్యాలయాలు, 21 శాఖలు, 499 ఏటీఎంలు, దాదాపు 3,600 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంక్ కిందకి చేరతారు. 30 లక్షల మంది కస్టమర్లు జతవుతారు. యాక్సిస్ బ్యాంక్ రిటైల్ వ్యాపార పోర్ట్‌ఫోలియో రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. శతాబ్దం క్రితం సిటీగ్రూప్ ఎంట్రీ.. సిటీగ్రూప్ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సిటీగ్రూప్ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సిటీబ్యాంక్ ఇండియా నికర లాభం రూ. 4,918 కోట్ల నుంచి రూ. 4,093 కోట్లకు తగ్గింది. నికర మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 143 కోట్లు, స్థూల ఎన్పీఏలు రూ. 991 కోట్లుగాను ఉన్నాయి. తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్ సారథ్యంలోని సిటీబ్యాంక్ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్ తాజా డీల్ కుదుర్చుకుంది విదేశీ బ్యాంకుల గుడ్‌బై.. ఏఎన్జెడ్, ఆర్బీఎస్ తదితర బ్యాంకుల నిష్క్రమణ కొన్నాళ్లుగా పలు విదేశీ బ్యాంకులు భారత మార్కెట్ నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఏఎన్జెడ్ గ్రిండ్లేస్, ఆర్బీఎస్, కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించేసుకున్నాయి. కార్పొరేట్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెట్టే దిశగా 2012లో బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేస్ భారత్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను భారీగా తగ్గించేసుకుంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! నాన్–మెట్రో ప్రాంతాల్లో మూడో వంతు శాఖలను మూసేసింది. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా .. భారత మార్కెట్ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) కూడా అంతర్జాతీయంగా తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో కార్పొరేట్, రిటైల్, సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపార విభాగాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. గ్రిండ్లేస్ బ్యాంకును స్టాండర్డ్ చార్టర్డ్‌కు 1.34 బిలియన్ డాలర్లకు విక్రయించడం ద్వారా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, 2011లో ముంబైలో కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా దేశీ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. మరికొన్ని.. ఇక, 2011లో డాయిష్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించేసింది. 2013లో యూబీఎస్.. భారత్ నుంచి నిష్క్రమించింది. మోర్గాన్ స్టాన్లీ తన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ.. ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన లైసెన్సును అప్పగించేసింది. అదేవిధంగా 2015లో మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ మొదలైనవి తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. హెచ్ఎస్బీసీ రెండు డజన్ల పైగా శాఖలను మూసివేసి, కార్యకలాపాలను సగానికి తగ్గించుకుంది. 2020లో బీఎన్పీ పారిబా తన వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపార విభాగాన్ని మూసివేసింది. చదవండి: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..! -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
గత కొద్ది రోజుల క్రితం బ్యాంకింగ్ సంస్థలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈ వడ్డీరేట్ల పెంపు మార్చి 17, 2022 నుంచి అమలులోకి రానుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్లను యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది. ఈ వడ్డీరేట్లు 2 కోట్లకు కంటే తక్కువ డిపాజిట్లపై వర్తించనుంది. ఇక 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి గల టర్మ్ డిపాజిట్లకు యాక్సిస్ బ్యాంక్ 5.25 శాతం వడ్డీను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు..! ► 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం ► 1 రోజుల నుంచి 9 నెలల వరకు(6 నెలలగాను ): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ(9 నెలల గాను): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► ఒక ఏడాది గాను: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం ► 5 ఏళ్ల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం ► 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.25 శాతం చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
గృహిణులకు యాక్సిస్ బ్యాంక్ తీపికబురు..!
న్యూఢిల్లీ: విద్యావంతులైన పట్టణ ప్రాంత గృహిణులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ’హౌజ్వర్క్ఈజ్వర్క్(ఇంటిపని కూడా పనే)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఇంటి పనులకే పరిమితమైపోతున్న మహిళలకు, ఉద్యోగాలు చేయగల సత్తా, నైపుణ్యాలు తమలో కూడా ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) రాజ్‌కమల్ వెంపటి తెలిపారు. దీని కింద గిగ్-ఎ-ఆపర్చూనిటీస్ పేరిట వివిధ ఉద్యోగావకాశాలను యాక్సిస్ బ్యాంక్ తమ ప్లాట్‌ఫామ్‌పై ఉంచిందని వెంటి వివరించారు. దీనికి 3,000 పైచిలుకు దరఖాస్తులు రావడంతో, రాబోయే రోజుల్లో మరింత మందిని రిక్రూట్ చేసుకునేలా హైరింగ్ పరిమితిని పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల విషయానికొస్తే.. చేరే వారి నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఉంటాయని.. పూర్తి స్థాయి ఉద్యోగుల తరహాలోనే ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
ఎయిర్టెల్ కూడా మొదలెట్టింది.. ఇక మరింత సులువుగా లోన్లు
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వీసులు అందించే దిశగా టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ జట్టు కట్టాయి. ఎయిర్టెల్ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ఈ ఒప్పందం కింద యూజర్లు .. ప్రీ–అప్రూవ్డ్ ఇన్స్టంట్ రుణాలు, ‘బై నౌ పే లేటర్’ ఆఫర్లు, ఇతర సర్వీసులు పొందవచ్చు. అలాగే క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. అర్హత కలిగిన ఎయిర్టెల్ కస్టమర్లు .. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలోకి విస్తరించేందుకు యాక్సిస్ బ్యాంకుకి ఈ ఒప్పందం తోడ్పడనుంది. అటు యాక్సిస్ బ్యాంక్ ప్రపంచ స్థాయి ఆర్థిక సేవలను ఎయిర్టెల్ కస్టమర్లు పొదండానికి ఇది దోహదపడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. -
యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ బ్యాంక్ బిజినెస్
సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసే ఒప్పందం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు త్వరలోనే ప్రకటించనున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఒప్పందాన్ని కూడా ఆమోదించనుంది. సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగ భద్రతను కల్పించనుంది. ఈ విలీనం సుమారు ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అన్ని ఒప్పందాల మాదిరిగానే ఒప్పందం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారత్ నుంచి ఎగ్జిట్..! గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా దేశంలోని రిటైల్ బ్యాంకింగ్ నుంచి ఎగ్జిట్ అవుతామని గత ఏడాది ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ప్రకటించింది. రిటైల్ బిజినెస్‌లలో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్‌లు, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సెగ్మెంట్లు కలిసి ఉంటాయి. సిటీ బ్యాంక్‌కు దేశంలో 35 బ్రాంచులు ఉన్నాయి. మొత్తం 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్‌ను లెక్కించేటప్పుడు డిపాజిట్లు, కస్టమర్లు, అసెట్స్, లయబిలిటీస్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ డీల్ పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అమాంతం పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, సిటీ గ్రూప్ 1902 లో ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. 1985 లో రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఐతే రిటైల్ బిజినెస్‌ను అమ్మేసినా, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ బిజినెస్‌లో సిటీ గ్రూప్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గత ఏడాది భారత్‌కు గుడ్‌బై..! ఇప్పుడు మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..! -
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి హీరోఎలక్ట్రిక్ గుడ్‌న్యూస్..!
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకునే కస్టమర్ల కోసం యాక్సిస్‌బ్యాంక్‌తో హీరోఎలక్ట్రిక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆయా ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులకు సులభమైన రిటైల్ ఫైనాన్సింగ్ లభించనుంది. మరింత సులువుగా..! హీరో ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలుపై సులభమైన, అవాంతరాలు లేని రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను కొనుగోలుదారులకు అందించనుంది .ఈ ఫైనాన్సింగ్ సౌకర్యం 750 కంటే ఎక్కువ డీలర్ల వద్ద లభించనుంది. యాక్సిస్ బ్యాంకుతో కంపెనీ చేసుకున్న భాగస్వామ్యంతో హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు కనీస డాక్యుమెంటేషన్‌తో భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చునని కంపెనీ వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్టుగా..! గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిమాండ్ నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఈవీ స్కూటర్ల కొనుగోలులో కస్టమర్లకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్ CEO సోహిందర్ గిల్ చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌తో నాన్-టైర్ 1 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు మరింత వేగంగా ఈవీ స్కూటర్లను తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం గ్రీన్ మొబిలిటీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని గిల్ పేర్కొన్నారు. చదవండి: భారత్‌లో లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు! క్లారిటీ ఇచ్చిన కంపెనీ -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. గతేడాది ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై విధిస్తున్న ఛార్జీలను సవరించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించిన ఛార్జీలను అమల్లోకి తీసుకొని రానుంది. ►క్రెడిట్ కార్డ్ హోల్డర్లు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్(క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు బ్యాంక్ విధించే ఛార్జ్)లను సవరించింది. వాస్తవానికి అన్నీబ్యాంకులు క్రెడిట్కార్డులపై జరిపే లావాదేవీలపై 2.50 శాతం మొత్తాన్ని వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించి 2శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి. బ్యాంక్ ఇప్పుడు కనిష్టంగా రూ. 500 నుంచి క్రెడిట్ కార్డులపై 2శాతం ఛార్జీలను వసూలు చేయనున్నాయి. ►ఐసీఐసీ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను బ్యాంక్ సవరించనున్నాయి. కెడ్రిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించలేవు.మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు గరిష్టంగా రూ.1200 వసూలు చేస్తాయి. ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే వరుసగా రూ.1300, రూ.1300,రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి. ► కాగా నవంబర్ నెల ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం..అక్టోబర్ 2021తో పోలిస్తే క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 1.84 శాతం పెరిగింది.గతేడాది అక్టోబర్ 2 శాతం,సెప్టెంబర్‌లో 1.7 శాతం పెరిగింది. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్..! -
‘మాయా’ శిల్పం: లాకరుంది.. డబ్బుల్లేవు
మణికొండ: అధిక వడ్డీలు, రియల్ వ్యాపారా లంటూ సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు మూడోసారి విచారించారు. బెయిల్ పిటిషన్‌ను సోమవారం రాజేంద్రనగర్ కోర్టు రద్దు చేసి మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించటంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగికి ఆమెను తీసుకొచ్చారు. తర్వాత కోకాపేటలోని యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్‌ను తెరిపించారు. అందులో డబ్బు లేకపోవటంతో పోలీసులు నిరాశ చెందారు. ఓ ఆస్పత్రి సొసైటీ పత్రాలు, గండిపేటలోని తన సిగ్నేచర్ విల్లా జిరాక్స్ పత్రాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బులేం చేశావని అడిగితే.. ఫిర్యాదు చేసిన మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని, బినామీ పేర్లతో ఎక్కడ ఆస్తులు కొన్నావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. దానికి జవాబుగా హయత్‌నగర్‌లో తనకు 240 గజాల భూమి ఉందని, విల్లా.. బ్యాంక్ లోన్‌లో ఉందని, బయటకు రాగానే వాటిని అమ్మి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్టు తెలిసింది. హాస్పిటల్ సొసైటీలో పెట్టుబడులు పెట్టినట్టు, అందులో మోసపోయానని చెప్పినట్టు సమాచారం. యాక్సిస్ బ్యాంక్‌కు వచ్చిన సందర్భంగా మీడియా శిల్పను తన వాదన చెప్పాలని కోరగా వాళ్లను తప్పించుకుని పోలీసు వాహనం ఎక్కింది. ఆమెను బుధవారం తిరిగి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పక్కా స్కెచ్‌తోనే.. సంపన్న మహిళలే టార్గెట్‌గా వారితో ఫ్రెండ్షిప్ చేసిందని, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని కిట్టీ పార్టీలకు పిలిచి పక్కా స్కెచ్‌తోనే డబ్బు దండుకుని ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి డబ్బు తీసుకుని కొన్ని నెలలు వడ్డీ చెల్లించడం, తీరా విషయం పోలీసు స్టేషన్‌కు వచ్చిందనగానే అకౌంట్లు, లాకర్లలో డబ్బుల్లేకుండా చేయటం, విచారణలో నోరు విప్పకపోవటం వాటికి బలం చేకూరుస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తనకు డబ్బులు ఇచ్చే వారిని ముంచాలనే తరచూ కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసి వాటిల్లో తనకు లేని దర్పాన్ని ప్రదర్శించగా ఆ ఎత్తుకు కొందరు మహిళలు చిక్కి మోసపోయారని పలువురు చెబుతున్నారు. వారికి న్యాయం చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నించినా ఫలితం ఆశించినంతగా దక్కలేదని అంటున్నారు. -
హోం లోన్స్‌పై యాక్సిస్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్.. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గృహ రుణాల పథకాలపై ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. అంతేకాదు ఆన్లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపిక చేసిన హోమ్ లోన్ పథకాలపై 12 నెలసరి వాయిదాల (ఈఎంఐ) మినహాయింపుతో బంపరాఫర్ అందించింది. అంతేకాదు టూవీలర్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆన్–రోడ్ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ ఈ పండుగ సీజన్‌కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్: ఎందుకంటే ప్రతి రోజూ దీపావళి రాదు‘ పేరిట యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక దుకాణాదారుల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు, కాబట్టి కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ సుమిత్ బాలి పిలుపు ఇచ్చారు. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్! -
యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్...!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురును అందించింది. యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ నూతన బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 10 నుంచి 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాకుండా 30 కంటే ఎక్కువ బ్రాండ్లపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో "గ్రాబ్ డీల్స్" ద్వారా పొందవచ్చు. చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ ఎఏస్ఎపీ డిజిటల్ సేవింగ్స్ ఖాతాల్లో భాగంగా ఈజీ, ప్రైమ్, ప్రయారిటీ, బుర్గుండి పేరిట నాలుగు రకాల ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతాదారులు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని యాక్సిస్ అందిస్తోంది. ఈజీ ఖాతాల డెబిట్ కార్డులపై 10 శాతం, ప్రైమ్ ఖాతాల డెబిట్ కార్డులపై 12.5 శాతం, ప్రయారిటీ అండ్ బుర్గుండీ ఖాతాలపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఖాతాదారులకు 2021 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ఆర్నెల్లకుపైగా ఏఎస్ఏఎస్ ఖాతాలను కల్గిన వారికే వర్తించనుంది. క్యాష్‌బ్యాక్‌ను నేరుగా అకౌంట్లో జమా అవుతోందని యాక్సిస్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు -
యాక్సిస్ బ్యాంక్‌పై భారీ జరిమానా
సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ తో సహా కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాల నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్ పై ₹5 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్ సీబిలు/యుసీబిల మధ్య చెల్లింపు పర్యావరణ వ్యవస్థ నియంత్రణలను బలోపేతం చేయడంపై ఆర్బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక స్టేట్ మెంట్ లో తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (చట్టం) సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద ఆర్బీఐ జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31, 2017(ఐఎస్ఈ 2017), మార్చి 31, 2018(ఐఎస్ఈ 2018), మార్చి 31, 2019 (ఐఎస్ఈ 2019) నాటికి యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన లావాదేవీలపై చట్టబద్దంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు తనిఖీల సమయంలో ఆర్బీఐ జారీ చేసిన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని సలహా ఇస్తూ సెంట్రల్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. తాము ఇచ్చిన నోటీసులకు బ్యాంకు సమాధానాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ ఆదేశాలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లఘించినట్లు తేలడంతో జరిమానా విధించినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. -
యాక్సిస్ బ్యాంకు లాభంలో 94 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్లో రెట్టింపైంది. స్టాండలోన్‌గా నికర లాభం 94 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల్లో వృద్ధికి దారితీసింది. బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.19,592 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో యాక్సిస్ బ్యాంకు రూ.1,112 కోట్ల లాభాన్ని, రూ.19,032 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 మార్చి త్రైమాసికంలో (సీక్వెన్షియల్‌గా) ఆదాయం రూ.20,162 కోట్లతో పోలిస్తే తగ్గింది. లాభం కూడా మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.2,677 కోట్లతో పోలిస్తే క్షీణించింది. వడ్డీ ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.16,003 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.16,445 కోట్లతో పోలిస్తే క్షీణించింది. బ్యాంకు రుణాలు 12% వృద్ధి చెందాయి. ఆస్తుల నాణ్యత రుణ ఆస్తుల నాణ్యత కాస్త మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 3.85 శాతం, నికర ఎన్పీఏలు 1.20 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 4.72%, నికర ఎన్పీఏలు 1.23% చొప్పున ఉండడం గమనార్హం. ఎన్పీఏలకు, కంటింజెన్సీలకు రూ.3,532 కోట్లను పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.4,416 కోట్లుగా ఉన్నాయి. -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.599కే పోకో స్మార్ట్‌ఫోన్
కొద్ది రోజుల క్రితం ఇండియాలో పోకో ఇండియా తన పోకో ఎం2 రీలోడెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రూ.10,000లోపు బడ్జెట్ విభాగంలో దీనిని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు, ఇప్పటికే ఫేమస్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ విషయంలో పెద్దగా ఏమీ మార్పు లేవు, కానీ ర్యామ్ ఆప్షన్ మాత్రం మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ + 64జీబీ, 6జీబీ + 128జీబీ మోడళ్లలో విడుదల అయింది. ఈ సారి సరికొత్తగా పోకో ఎం2 రీలోడెడ్ పేరుతో 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 64జీబీ వేరియంట్ ప్రస్తుతం ధర రూ.9,499. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.8,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే మీరు పోకో ఎం2 రీలోడెడ్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను రూ.599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌తో మొదటిసారి కొన్నట్లయితే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. కొత్తగా విడుదల అయిన పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్, గతంలో రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో పెద్దగా ఏమి మార్పు లేదు. చదవండి: ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై -
హోంగార్డు పేరుతో మరో మహిళకు రుణం
ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలీసు విభాగంలో పనిచేసే హోంగార్డు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమె పేరుతో బ్యాంకు అధికారులు మరో మహిళకు రూ.8.8 లక్షల వ్యక్తిగత రుణం ఇచ్చేశారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ సమస్య వచ్చిపడింది. విషయం తెలిసిన హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని బౌరంపేటకు చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో హోంగార్డు. ముషీరాబాద్‌లోని యాక్సస్ బ్యాంకు ఖాతాలో ఈమె జీతం జమవుతోంది. ఆ బ్యాంకు నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె వివరాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు అప్పటికే ఆమె పేరుతో ఇండస్ఇండ్ బ్యాంకులో రూ.8.8 లక్షలు రుణం ఉన్నట్లు గుర్తించారు. అది తీరే వరకు మరో రుణం పొందే అవకాశం లేదన్నారు. కంగుతిన్న ఆ హోంగార్డు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా సూరారం ప్రాంతానికి చెందిన మహిళ మీ పాన్‌కార్డుతో 2018 సెప్టెంబర్ 7న రూ.8.8 లక్షల రుణం తీసుకుందని చెప్పారు. ఇప్పటికీ రూ.5,98,337 బకాయి ఉందన్నారు. పొరపాటు.. బ్యాంకు అధికారులదే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన వివరాలు వినియోగించి రుణం తీసుకున్నారంటూ హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుంకరి శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 సెప్టెంబర్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ పేరు, హోంగార్డు పేరు ఇంటి పేరుతో సహా ఒకటే. రుణం మంజూరు సమయంలో ఈ పేరు ఆధారంగా సంబంధిత వెబ్సైట్లో ఇండస్ఇండ్ బ్యాంకు అధికారులు సెర్చ్ చేశారు. ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు, పాన్ నెంబర్, సిబిల్ స్కోర్ తదతరాలు కనిపిస్తాయి. అప్పట్లో ఈ బ్యాంకు అధికారులు సెర్చ్ చేసిన సందర్భంలో దరఖాస్తు చేసుకున్న అసలు మహిళతో పాటు మహిళా హోంగార్డు వివరాలు కనిపించాయి. బ్యాంకు అధికారులు పొరపాటున హోంగార్డు పేరు, ఆమె పాన్ నంబర్‌ను ఫిక్స్ చేస్తూ దరఖాస్తు చేసుకున్న మహిళకు రుణం మంజూరు చేశారు. వాయిదాలను చెల్లిస్తుండటంతో.. అప్పటి నుంచి ఆమె నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకు అధికారులకు వివరాలు సరిచూడాల్సిన అవసరం రాలేదు. తాజాగా మహిళ హోంగార్డు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు జరిపిన పరిశీలనతో తెరపైకి వచ్చింది. ఈ విషయాలను దర్యాప్తులో గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు పక్షాలను ఠాణాకు పిలించారు. అసలు విషయం వారందరికీ వివరించగా తమ పొరపాటును సరిదిద్దుకునేందుకు అంగీకరించిన ఇండస్ ఇండ్ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. -
నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం
వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ)కి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి ఉందని కంపెనీ తెలిపింది.(చదవండి: 437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!) సందేశాన్ని సురక్షితంగా పంపినంత తేలికగా డబ్బులను పంపించుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా డబ్బులను పంపవచ్చని సంస్థ తెలిపింది. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కృషి చేస్తున్నాం అని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు. 160కి పైగా బ్యాంకులకు వాట్సప్ పేమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. డిజిటల్ ఇండియాలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 12 కోట్ల మంది యూపీఐ యూజర్స్ ఉన్నారు. మొత్తం యూపీఐ యూజర్ల సంఖ్యలో ఇది 28 శాతం. ప్రతి నెల యుపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో 2.23 బిలియన్ లావాదేవీలు జరిగాయి. అక్టోబర్(2.07 బిలియన్) నెలలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 6.7 శాతం ఎక్కువ. -
బ్యాంకు ఉద్యోగులకు బొనాంజా
ముంబై : కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు అమలవుతుందటే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తమ ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనుంది. అక్టోబర్ నుంచి ఉద్యోగుల వేతనాలను 4 నుంచి 12 శాతం వరకూ పెంచేందుకు యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 76,000 మంది ఉద్యోగులు కలిగిన యాక్సిస్ బ్యాంక్ తన ఉద్యోగులకు బోనస్ కూడా చెల్లించింది.మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏప్రిల్‌లోనే సామర్థ్యం ఆధారంగా తమ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు బోనస్‌లను చెల్లించిందని బిజినెస్ స్టాండర్డ్ కథనం పేర్కొంది. చదవండి : ‘లాక్డౌన్’ కోత జీతాలు త్వరలో చెల్లింపు ఇక దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తమ లక్ష మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి జులై నుంచి వేతన పెంపును చేపట్టడంతో పాటు బోనస్‌ను చెల్లించింది. ఇక మరో ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్ర పాతిక లక్షల రూపాయల వార్షిక వేతనం కలిగిన ఎగ్జిక్యూటివ్స్‌కు 10 శాతం వేతన కోత విధించగా, సీనియర్ మేనేజ్మెంట్ స్ధానాల్లో పనిచేసే వారి వేతనాల్లో 15 శాతం కోత విధించింది. ఇక కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో భవిష్యత్‌లో తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహింద్ర బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్‌లు ఈక్విటీ మార్కెట్ల ద్వారా 900 కోట్ల డాలర్లను సమీకరించాయి. -
మ్యాక్స్ ఫైనాన్స్- ఇండియామార్ట్.. రయ్రయ్
ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌తో కుదుర్చుకున్న వాటా కొనుగోలు ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు వెల్లడించడంతో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈకామర్స్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందంలో యాక్సిస్ బ్యాంక్ సవరణలు చేపట్టినట్లు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. వెరసి తొలుత ప్రకటించిన 29 శాతంకాకుండా 17 శాతం వాటాను మాత్రమే యాక్సిస్ సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వ్యక్తం చేసిన అభ్యంతరాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ఫైనాన్షియల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13.5 శాతం దూసుకెళ్లింది. రూ. 623 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 631ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! ఇండియామార్ట్ ఇంటర్మెష్ గతేడాది జులైలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక జోరు చూపుతూ వస్తున్న ఈకామర్స్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 10 శాతం దూసుకెళ్లి రూ. 3,870ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5 శాతం లాభపడి రూ. 3,690 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 129 శాతం జంప్‌చేసి రూ. 74 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 187 కోట్లను తాకింది. కాగా.. కోవిడ్-19 సవాళ్లలోనూ ఇండియామార్ట్ మార్జిన్లను పెంచుకున్నట్లు గత వారం బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఈ షేరుకి బయ్ రేటింగ్‌ను సైతం ప్రకటించింది. గత రెండు నెలల్లో ఈ షేరు 62 శాం ర్యాలీ చేయడం గమనార్హం! -
బయటికి వెళ్లొచ్చి బ్యాంకులో దోపిడీ
చండీగఢ్: సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకు ఉద్యోగులను బెదిరించి రూ. 10 లక్షల 44 వేలు లూటీ చేశాడు. అయితే, పోలీసులు సత్వరం స్పందించి నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హరియాణాలోని మొహాలీ జిల్లాలో జరిగింది. పార్చ్ గ్రామంలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో బల్జీత్ సింగ్ సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బ్యాంకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్ పని నిమిత్తం బటయకు వెళ్లారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు, మందులు తీసుకొస్తానని బల్జీత్ సింగ్ కూడా బయటకు వెళ్లాడు. బ్రాంచ్‌లో మేనేజర్ అమన్ గగ్నేజా, ఒక ప్యూన్ మాత్రమే మిగిలారు. అంతలోనే మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో లోనికి ప్రవేశించి వారిద్దరినీ బెదిరించి క్యాష్ బాక్స్‌తో పరార్ అయ్యాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమదైన రీతిలో ప్రశ్నించడంతో బల్జీత్ సింగ్ నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నగదుతోపాటు ఓ నాటు తుపాకీ, ఐదు తుపాకీ గుళ్ల కార్ట్రిజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: విషాద ఘటనలో ఒంటరైన ‘కూవి’, దాంతో) -
యాక్సిస్ బ్యాంక్ క్విప్ షురూ- షేరు అప్
ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 442.19ను బ్యాంకు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇది మంగళవారం ముగింపు ధర రూ. 429తో పోలిస్తే 3 శాతం అధికం. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత నెల 31న జరిగిన వార్షిక సమావేశంలోనే యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన హోల్‌టైమ్ డైరెక్టర్ల కమిటీ క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 8,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూకి అధిక స్పందన లభిస్తే మరో రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గతంలో యాక్సిస్ బ్యాంక్ ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో క్విప్ ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించింది. కాగా.. ఈ జూన్‌కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.29 శాతంగా నమోదైంది. తాజా నిధుల సమీకరణతో బ్యాంక్ టైర్-1 క్యాపిటల్ 1.5 శాతంమేర మెరుగుపడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు క్విప్, తదితర అంశాలపై తిరిగి ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సమీక్షను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 447 వరకూ జంప్ చేసింది. కోవిడ్-19 కారణంగా దేశ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్పీఏలు) సగటున 11.5 శాతంవరకూ ఎగసే వీలున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ అంచనా వేసిన విషయం విదితమే. దీంతో బ్యాంకులు తాజా పెట్టుబడుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సగటున గతేడాది మొండిరుణాలు 8.3 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్ షేరుకు క్యూ1 ఫలితాల జోష్..!
తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో యాక్సిస్ బ్యాంక్ షేరు బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 8శాతానికి పైగా లాభపడింది. బ్యాంక్ నిన్నటి రోజున క్యూ1 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల వెల్లడితో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరు టార్గెట్ ధరను పెంచాయి. ఫలితంగా నేడు బీఎస్ఈలో ఈ షేరు 6శాతం లాభంతో రూ.473 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నికరలాభం, ఆదాయం క్షీణించినప్పటికీ.., మొండిబాకీలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 5.25 శాతం నుంచి 4.72 శాతానికి దిగివచ్చాయి. అలాగే నికర ఎన్పీఏలు 2.04శాతం నుంచి 1.23శాతానికి తగ్గాయి. ఎన్‌పీలు తగ్గుముఖం పట్టడంతో ఆస్తుల నాణ్యత మెరుగైనట్లు బ్యాంక్ తెలిపింది. అలాగే జూన్ త్రైమాసికంలో మొండిబాకీలకు కేటాయింపులు గతేడాది క్యూ1తో పోలిస్తే రూ. 3,815 కోట్ల నుంచి రూ. 4,416 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇక సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఎం) 20 శాతం పెరిగి రూ. 5,844 కోట్ల నుంచి రూ. 6,985 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా ఉంది. మెరుగైన క్యూ1 ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్ ప్రారంభం నుంచే ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8శాతానికి పైగా లాభపడి రూ.482.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.446.20)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.466.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.285.00, రూ.765.90గా ఉన్నాయి. -
రేటింగ్ దెబ్బ- యాక్సిస్- బజాజ్ ఫైనాన్స్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వారాంతాన ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్.. బజాజ్ ఫైనాన్స్‌ల క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఎస్అండ్పీ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ బాటలో ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌ల రుణ నాణ్యత క్షీణించడంతోపాటు.. క్రెడిట్ వ్యయాలు పెరిగే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. ఫలితంగా లాభదాయకత క్షీణించనున్నట్లు అంచనా వేసింది. బాండ్లను BB కేటగిరీకి సవరిస్తే ‘జంక్’ స్థాయి రేటింగ్‌కు చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల(ఎకనమిక్ రిస్కులు) నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ అభిప్రాయపడింది. నేలచూపులో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4.5 శాతం పతనమై రూ. 406 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 402 వరకూ జారింది. ఇక బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం నీరసించి రూ. 2793 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2770 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా.. గత నెల రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ షేరు 25 శాతం లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్ 59 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్ బజాజ్ ఫైనాన్స్‌ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ‘జంక్’ హోదాను ప్రకటించింది. తద్వారా కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్ చేసింది. బాండ్ల రేటింగ్‌ను BB కేటగిరీకి సవరిస్తే జంక్ స్థాయికి చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎకనమిక్ రిస్కుల నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఈ సందర్భంగా పేర్కొంది. పటిష్టం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ సగటుతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ రుణ నాణ్యత అత్యుత్తమమంటూ ఎస్అండ్పీ పేర్కొంది. అయితే అంతర్జాతీయ సంస్థలతో చూస్తే.. మొండి బకాయిలు(ఎన్పీఏలు) అధికంగా నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. అయినప్పటికీ మార్కెట్ వాటాను నిలుపుకోవడంతోపాటు, తగినన్ని పెట్టుబడులతో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. ఈ బాటలో మరో ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం BB/ప్రతికూలం/B నుంచి BB/watch Negative/Bకు డౌన్‌గ్రేడ్ చేసింది. ఇదే విధంగా ఇండియన్ బ్యాంక్ రేటింగ్‌ను క్రెడిట్ వాచ్‌గా సవరించింది. రానున్న త్రైమాసికాలలో బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడనున్నట్లు ఎస్అండ్పీ అంచనా వేసింది. అలహాబాద్ బ్యాంక్ విలీనంతోపాటు.. కోవిడ్-19 కారణంగా బ్యాంక్ అధిక రిస్కులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు ఎస్అండ్పీ భావిస్తోంది. కొనసాగింపు.. ఇతర బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్‌లకు గతంలో ఇచ్చిన రేటింగ్స్‌ను కొనసాగించనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. అయితే మణప్పురం ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్ప్‌ల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్‌ల రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. -
యాక్సిస్ బ్యాంక్‌లో కార్లయిల్ పెట్టుబడి!
దేశీ ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో గ్లోబల్ పీఈ సంస్థ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రిఫరెర్షియల్ కేటాయింపుల ద్వారా 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7500 కోట్లు) విలువైన యాక్సిస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా యాక్సిస్ బ్యాంకులో కార్లయిల్‌కు 5-8 శాతం వాటా లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతక్రితం 2017 నవంబర్‌లో బెయిన్ కేపిటల్ సైతం యాక్సిస్ బ్యాంకులో 1.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇండస్ఇండ్, ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ ఫస్డ్ సైతం కొద్ది నెలలుగా పెట్టుబడి సమీకరణ యోచనలో ఉన్న విషయం విదితమే. దీనిలో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం(26న) అర్హతగల సంస్థాగత వాటాదారులకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 7460 కోట్లకుపైగా సమీకరించేందుకు సన్నద్ధమైంది. కాగా.. కార్లయిల్ గ్రూప్ పెట్టుబడి వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 387కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 392 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై : యస్ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ చర్యల్ని ఆర్బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్స్ట్రక్షన్ స్కీమునకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. యస్ బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులకు ఎస్బీఐ నిర్ణయించింది. అలాగే ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు రూ. 10 చొప్పున కొనుగోలు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపెట్టబడుల ప్రకటన తరువాత వరుసగా ప్రైవేటు బ్యాంకులు యస్‌బ్యాంకు వాటాల కొనుగోలుకు క్యూ కట్టాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ ,కోటక్ మహీంద్ర బ్యాంకు బోర్డులు ఈపెట్టుబడులకు ఆమోదం తెలిపాయి. ప్రైవేటుబ్యాంకు యాక్సిస్ బ్యాంకు కూడా రూ. 600 కోట్లు పెట్టుబడికి అంగకీరించింది. ఐసీఐసీఐ తరువాత, యాక్సిస్ బ్యాంక్ ఈ పెట్టుబడులను ప్రకటించింది. శుక్రవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో 60 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ. 600 కోట్ల (రూ.ఆరు వందల కోట్లు మాత్రమే) పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చిందని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం యస్ బ్యాంక్ పునర్నిర్మాణం ప్రతిపాదిత ప్రణాళికలోఈక్విటీ షేరుకు రూ .2 (రూ.8 ప్రీమియంతో)కు కొనుగోలు చేయనున్నామని యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ కూడా వెయ్యికోట్ల రూపాయల పెట్టుడిని యస్‌బ్యాంకుకు సమకూర్చనుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .10 చొప్పున 50 కోట్ల యస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. (రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్) చదవండి : ‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత -
దొంగల తెలివి.. కొత్త తరహాలో ఏటీఎం చోరీ
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఏటీఏం మిషిన్‌ను కట్‌చేసి డబ్బు దోచుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున హయత్ నగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషిన్‌ను కట్ చేసి, మిషన్‌లో ఉన్న లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. మొదటిసారి కొత్త తరహాలో ఏటీఎం మిషన్‌లోంచి డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, గత జనవరి నెలలో అనంతపురం జిల్లా పెనుగొండలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీనికితోడు గ్యాస్ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. -
క్రెడిట్ కార్డుతో రూ.లక్షలు కాజేసి..
బంజారాహిల్స్: అత్యవసర పనిమీద క్రెడిట్ కార్డు వాడుకుంటానని నిమ్మించి నిమిషాల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు కాజేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెం–12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న అచ్యుత్ వెంకట్‌ప్రసాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 31న ఆస్పత్రి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆయనతో మాటలు కలిపాడు. కాసేపటి తర్వాత తనకు అత్యవసర పనిమీద క్రెడిట్ కార్డు అవసరముందని కాసేపట్లో మళ్లీ తిరిగి ఇస్తానంటూ ఆయన వద్దనుంచి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అచ్యుత్ వెంకట్‌ప్రసాద్ సెల్‌ఫోన్‌కు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ సందేశాలు వచ్చాయి. నాలుగు నిమిషాల వ్యవధిలో 17 లావాదేవీల్లో రూ.2.12లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అచ్యుత్ వెంకటప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాడు. మరుసటి రోజు ఉదయాన్నే బేగంపేటలోని యాక్సిస్‌బ్యాంక్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించాడు. బ్యాంక్ అధికారుల సూచనలతో బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై 66సి. 66డి ఐటియాక్ట్ 2008 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాక్సిస్ బ్యాంకుకు 15వేలమంది గుడ్‌బై
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగస్థుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా యాక్సిస్ బ్యాంక్‌లో 15వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ వర్గాల ప్రకారం..ఎక్కువగా సీనియర్, మధ్య స్థాయి, వినియాగదారులకు సేవలందించే శాఖకు సంబంధించిన ఉద్యోగులే కంపెనీని వీడుతున్నారు. బ్యాంకులో ఇటీవల తీసుకొచ్చిన నిర్మాణాత్మక, కార్యనిర్వాహక సంస్కరణలు ఈ రాజీనామాలకు దోహదం చేసినట్టుగా భావిస్తున్నారు. బ్యాంక్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన సీఈవో శిఖా శర్మ రాజీనామా తర్వాత కొత్త ఎండీ, సీఈవోగా అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నూతన మేనేజ్మెంట్ సరికొత్త సంస్కరణలకు నాంది పలికిన విషయం తెలిసిందే. కొత్తగా నైపుణ్యాలను స్వీకరించేవారు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, స్వీకరించని వారే సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా రాజీనామాలు పరంపర కొనసాగుతున్నప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నామని, రాబోయే రెండేళ్లలో 30 వేల మందిని నియమించుకోనున్నామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌లో 72 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. కొత్త ఉద్యోగాల వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగయ్యాయని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజేష్ దహియా అన్నారు. ఆయన స్పందిస్తూ..వృద్ది, ఆదాయ పురోగతి, స్థిరత్వం అంశాలలో పురోగతి సాధించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని, తమ ఉద్యోగులే నిజమైన ఆస్థి అని తెలిపారు. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వల్ల కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి ఎలాంటి నష్టం లేదని, ప్రతిభను మెరుగుపర్చుకోని వారికి ఉద్వాసన తప్పదని తెలిపారు. -
‘అదో రోగం.. అవును త్వరగా కోలుకోండి’
థానే: యాక్సిస్ బ్యాంక్‌లో సీనియర్ అధికారిణి అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు, శివసేన డిప్యూటీ నేత ప్రియాంక చతుర్వేదికి మధ్య ట్విటర్ వేదికగా గొడవ తలెత్తడంతో యాక్సిస్ బ్యాంక్‌కు తలనొప్పి తెస్తోంది. ఏడాదికి రూ.11వేల కోట్ల లావాదేవీలుండే మహారాష్ట్ర పోలీసు విభాగం తన వేతన ఖాతాలను వేరే బ్యాంక్‌కు మార్చనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా శివసేన చేతుల్లోని థానే మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ఉద్యోగుల వేతన ఖాతాలను యాక్సిస్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చాలని నిర్ణయించుకుంది. ‘నా పేరు రాహుల్ సావర్కర్ కాదు’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను అమృత విమర్శించడంతో వివాదం ముదిరింది. తన పేరు వెనుక ఠాక్రే ఇంటి పేరు తగిలించుకున్న వ్యక్తి విలువలకు తిలోదకాలు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారంటూ పరోక్షంగా ఉద్ధవ్‌పై విమర్శలు చేశారు అమృత. దీనికి ప్రియాంక సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోపే రైతు రుణాలు మాఫీ చేశారని, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉద్ధవ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అంతకుముందు కూడా అమృత, ప్రియాంకల మధ్య ట్విటర్ వార్ జరిగింది. బాల్ ఠాక్రే మెమొరియల్ కోసం ఔరంగాబాద్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో వెయ్యి చెట్లను నేలమట్టం చేయనున్నారని వార్తలు వచ్చినప్పడు శివసేన పార్టీని విమర్శిస్తూ అమృత ట్వీట్ చేశారు. ఆరే ప్రాంతంలో చెట్ల కూల్చివేతను వ్యతిరేకించిన శివసేన.. ఔరంగాబాద్‌లో చెట్ల నరికివేతకు పూనుకోవడాన్ని విమర్శిస్తూ.. ‘సంకుచిత్వం అనేది వ్యాధి లాంటిద’ని అమృత పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఒక్క చెట్టు కూడా కొట్టేయడం లేదని ఔరంగాబాద్ మేయర్ ధ్రువీకరించారు. పదేపదే అబద్ధాలాడటం పెద్ద రోగం. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలువాల’ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
జనవరి 15లోగా తేల్చండి
న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటిషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలం టూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్) పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. కార్వీ తనఖా పెట్టిన షేర్లపై యాక్సిస్ బ్యాంక్ రూ. 81 కోట్లు రుణమిచ్చింది. ఆ షేర్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా.. కార్వీ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ నియంత్రణ సంస్థలను యాక్సిస్ బ్యాంక్ కోరుతోంది. -
కోటక్ ఖాతాలో యస్ బ్యాంక్!
ముంబై: యస్ బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు లేవని యస్‌బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి. కోటక్‌కే ఆ సత్తా... యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్ కోటక్‌కే ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌ను టేకోవర్ చేయడానికి భారీగా నిధులు అవసరమని, ఆ సత్తా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కే ఉందని వివరించారు. ఇక్కడ జరిగిన టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. కాగా ఇదే అభిప్రాయాన్ని యాక్సిస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ అమితాబ్ చౌధురి వ్యక్తం చేశారు. తమ బ్యాంక్ ఇప్పటికింకా చిన్నదేనని, పెద్ద బ్యాంక్‌గా వృద్ధి చెందే ప్రయత్నాలు చేస్తున్నామని, పెద్ద బ్యాంక్‌గా మారినప్పుడే ఇతర బ్యాంక్‌లను కొనుగోలు చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఊసుపోని ఊహాగానాలు... ఈ కొనుగోలు వార్తలు ఊసుపోని ఊహాగానాలని యస్ బ్యాంక్ చీఫ్ రవ్నీత్ గిల్ కొట్టిపడేశారు. విలీనప్రయత్నాలు ఏమీ లేవని తెగేసి చెప్పారు. కాగా విలీన వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమేనని, తమకెలాంటి సంబంధం లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రోహిత్ రావు పేర్కొన్నారు. యస్‌బ్యాంక్ చీఫ్‌గా రవ్నీత్ గిల్ పగ్గాలు చేపట్టి మొండి బకాయిల గుర్తిపు ప్రక్రియను మరింత వేగిరం చేశారు. మరోవైపు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలప్రదం కావడం లేదు. దీంతో ఈ బ్యాంక్‌ను చేజిక్కించుకోనే యత్నాలు ఊపందుకుంటున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక, పుష్కలమైన నిధులతో పటిష్టంగా ఉన్న కోటక్ బ్యాంక్... చిన్న బ్యాంక్‌లను టేకోవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. బలమైన బ్యాంకులే నిలుస్తాయ్ బలమైన బ్యాంక్‌లే నిలబడగలుగుతాయని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. బలం ఉన్న జీవులే మనగలుగుతాయని చార్లెస్ డారి్వన్ పేర్కొన్నారని, ఈ సిద్ధాంతం ఇప్పుడు భారత్ బ్యాంకులకూ వర్తిస్తుందని వివరించారు. బలహీనమైన కంపెనీలను బలమైన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని, వివిధ రంగాల్లో విలీనాల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విలీనమైన దృష్టాంతాలు గతంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. -
యాక్సిస్ మ్యూచువల్ నుంచి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలకు తగ్గట్లుగా మూడు వేర్వేరు ప్లాన్స్ (అగ్రెసివ్, డైనమిక్, కన్జర్వేటివ్) ఇందులో ఉంటాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్)కు కట్టే వాయిదాల పరిమాణాన్ని బట్టి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐప్లస్ సిప్ ఇన్సూరెన్స్ పేరిట బీమా సదుపాయం కూడా లభిస్తుందని సంస్థ సీఈవో చంద్రేశ్ కుమార్ నిగమ్ తెలిపారు. -
హోంగార్డుల సంక్షేమంలో మనమే బెస్ట్
సాక్షి, అమరావతి: హోంగార్డ్‌ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
వాహనదారులకు యాక్సిస్ ఉచిత ఫాస్టాగ్స్
ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. 70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
యాక్సిస్ నష్టం రూ.112 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.112 కోట్ల నికర నష్టాలు (స్టాండ్అలోన్) వచ్చాయి. కార్పొరేట్ పన్ను రేటులో మార్పుల వల్ల రూ.2,138 కోట్ల వన్ టైమ్ పన్ను వ్యయాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఈ క్యూ2లో నికర లాభం 157 శాతం వృద్ధితో రూ.2,026 కోట్లకు పెరిగి ఉండేదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.790 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం రూ.15,959 కోట్ల నుంచి రూ.19,334 కోట్లకు పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.5,952 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లు ... నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.6,102 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. 3.51 శాతం నికర వడ్డీ మార్జిన్‌ను సాధించామని, ఇది తొమ్మిది క్వార్టర్ల గరిష్ట స్థాయని పేర్కొంది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 5.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 5.03 శాతానికి తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 2.54 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గాయని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 5.25 శాతంగా, నికర మొండి బకాయిలు 2.04 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.2,927 కోట్ల నుంచి రూ.3,518 కోట్లకు పెరిగాయని తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు తగ్గాయి. ఈ క్యూ1లో రూ.3,815 కోట్ల కేటాయింపులు జరిపామని వివరించింది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 78 శాతం నుంచి 79 శాతానికి పెరిగిందని పేర్కొంది. లోన్ బుక్ రూ.24,318 కోట్లకు పెరిగిందని, ఇది రెండేళ్ల గరిష్ట స్థాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 0.4 శాతం లాభంతో రూ.713 వద్ద ముగిసింది. -
రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..
సాక్షి,సిటీబ్యూరో: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పనామా వద్ద గల యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద మే 7వ తేదీన రూ.58,97,600 నగదును చోరీ చేసిన రామ్జీనగర్ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల పాటు శ్రమించిన రాచకొండ ఎస్ఓటీ, సీసీఎస్, వనస్థలిపురం పోలీసులు.. నగరంలో మరో చోరీ చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యులతో కూడిన ముఠాను వనస్థలిపురం ఆటోనగర్‌లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4.10 లక్షల నగదు, కారు, 15 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ మీడియాకు వివరించారు. ఏడాదిపాటు నేరాల క్యాలెండర్ తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లా రామ్జీనగర్ పేరుతో 15 ఏళ్ల క్రితం గుజరాతీ బిజినెస్మెన్ స్పిల్మిన్నింగ్ ప్రారంభించారు. దీంతో ఈ ఊరుకి రామ్జీనగర్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇక్కడి ప్రజలు ఈజీమనీ కోసం నేరాలబాట పట్టారు. ఏడాదంతా నేరాల కోసం క్యాలెండర్ పెట్టుకోని మరీ చోరీలు చేస్తున్నారు. 15 నుంచి 18 ముఠాలున్న ఈ గ్యాంగ్ సభ్యులు ఒక్కో నెలలో ఒక్కో ముఠా చోరీలు చేస్తుంటుంది. వీరిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, ఢిల్లీ, బెంగళూరు.. ఇలా చాలా రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదయ్యాయి. అయితే, మే 7న వనస్థలిపురంలో చాకచాక్యంగా దొంగతనం చేసిన ఈ ముఠాను పట్టుకునేందుకు వనస్థలిపురం, ఎల్బీనగర్ ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి 45 రోజులు పాటు రామ్జీనగర్ పరిసరాల్లో మాటు వేసి ప్రయత్నించారు. అయితే, తొలుత భాషా సమస్యతో వీరితో ఎవరూ మాట్లాడలేదు. 90 శాతం మంది తమిళ భాషలోనే మాట్లాడుతుండటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో తమకు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు ఇక్కడి ముఠా సభ్యుడైన దీపక్ ఇన్ఫార్మర్ను మర్డర్ చేశాడు. అయితే, రాచకొండ పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నా భయంతో స్థానికులు ఎవరూ సాహసించలేదు. కేసు సవాల్‌గా మారడంతో మరో రెండుసార్లు అక్కడికి వెళ్లి స్థానికులతో మాట్లాడి ముఠాపై నిఘా వేశారు. బుధవారం తెల్లవారుజామూన ఇండికా కారులో వస్తున్న రామ్జీనగర్ గ్యాంగ్ నాయకుడు ప్రతిబాన్ దీపక్ అలియాస్ టిప్పు, సత్యరాజ్, యోగేశ్, సురేశ్‌లు పోలీసులకు చిక్కారు. అయితే, అరెస్టయిన నలుగురిని పోలీసు కస్టడీకి తీసుకొని డబ్బు రికవరీపై దృష్టి సారిస్తామని, కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.. పీడీ యాక్ట్ కూడా తెరుస్తామని వివరించారు. మూడు నెలల శ్రమకు ఫలితం.. ఈ ఏడాది మే 7న పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్‌లో రూ.58,97,600 నగదును డిపాజిట్ చేసేందుకు ఏపీ09టీవీ 2864 టాటా విక్టా వాహనంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్రైవర్, గన్‌మెన్‌తో పాటు రైటర్ సేఫ్‌గార్డు సంస్థకు చెందిన ఇద్దరు కస్టోడియన్లు ఉన్నారు. అయితే, ఇద్దరు కస్టోడియన్లు ఏటీఎం లోపలికి వెళ్లగా అక్కడే వాహనం సమీపంలో రామ్‌జీ ముఠా సభ్యులు కొన్ని నోట్లను పడేసి గన్‌మెన్ దృష్టిని మళ్లించి మొత్తం నగదు బ్యాగ్‌ను ఆటోలో వేసుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. దొగలు అక్కణ్నుంచి రైలులో సొంతూరెళ్లి అటునుంచి పారిపోయారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జ్‌లు అన్నీ గాలించినా ఫలితం లేకపోవడంతో వనస్థలిపురం, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి మూడుసార్లు రామ్జీనగర్, తిరుచిరపల్లికి వెళ్లొచ్చారు. అయితే అక్కడి లోకల్ అధికారులకు దొంగతనం చేసిన డబ్బుల్లో కొంత అందుతుండటంతో సమాచారం కష్టమైంది. ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో దొంగలపై నిఘా ఉంచిన పోలీసులకు వనస్థలిపురం ఆటోనగర్‌లో బుధవారం ఉదయం దొరికిపోయారు. కారులో మాదకద్రవ్యాలు ఉండటంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అనంతరం ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, వనస్థలిపురం డీఐ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఇతర సిబ్బందికి రివార్డులిచ్చి సత్కరించారు. రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా రామ్‌జీనగర్‌లో 300 నుంచి 500 కుటుంబాలతో 15 నుంచి 18 గ్రూపులు దొంగల ముఠాలున్నాయి. ఈ ముఠా సభ్యులు ఎక్కడైనా దొంగతనానికి వెళితే రూ.30 లక్షలపైన చోరీ చేసి తీసుకొస్తే వెంటనే డబ్బులిచ్చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు దొరికితే పోలీసులు దృష్టిలో ఉంటామనే భావనతో అక్కడి దొంగల ముఠా ఈ నిబంధనను పెట్టుకుంది. ఈ మేరకు పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.50 లక్షలతో కూడిన బ్యాగ్‌తో పరారైన ఈ గ్యాంగ్ వెంటనే ఆ డబ్బు సొతూరిలో ఇచ్చేసి ఇతర ప్రాంతాలకు పరారైంది. ఇదే అంశం వారికి కలిసిరావడంతో పాటు ఈ నేరం జరిగిన వెంటనే రాచకొండ పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసుల వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో చోరీ చేసింది రామ్‌జీ గ్రూప్ అని తెలిసిపోయింది. ఈ విషయం వారికి కూడా తెలిసిపోవడంతో చాకచాక్యంగా పరారయ్యారని ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. రామ్‌జీ ముఠా నేరాలు ఇవీ.. ముఠా సభ్యుడు రామ్‌జీనగర్‌కు చెందిన పత్రివన్ దీపక్ అలియాస్ దీపుపై పోలీసులకు సమాచామిచ్చాడని 2012లో ఇన్ఫార్మర్ను హత్య చేశాడు. ఈ కేసు రామ్జీనగర్ ఠాణాలో నమోదైంది. 2017లో విశాఖపట్నం ద్వారాకానగర్ పోలీసు స్టేషన్, గుడివాడ పోలీసు స్టేషన్లో అటెన్షన్ డైవర్షన్ కేసులు, 2019లో వనస్థలిపురం అటెన్షన్ డైవర్షన్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇతని ప్రధాన అనురచరుడు సత్యరాజ్‌పై కూడా వనస్థలిపురంతో పాటు ఇతర ఠాణాల్లో కేసులున్నాయి. యోగరాజ్, సురేశ్‌పై కూడా కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న దీపక్ ముఠా సభ్యులు ముఖేష్, సరవణన్, ఆర్ముగం, తొమోదరన్, కుమారన్, కుమార్, వడివేలు, రాజు, గోకుల్, ఆదిత్యను తొందర్లోనే పట్టుకుంటామని మహేష్ భగవత్ తెలిపారు. -
రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్ బ్యాంకు నిర్ణయం
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఈక్విటీ షేర్ల జారీ, డిపాజిటరీ రిసీట్స్ లేదా కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. సంబంధిత ప్రతిపాదనకు శనివారం నాటి బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్టు బ్యాంకు ప్రకటించింది. అయితే, ఎప్పుడు ఈ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టేదీ బ్యాంకు పేర్కొనలేదు. -
రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం
ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, దీంతో రుణాల పంపిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు యాక్సిస్ బ్యాంకు ఎండీ అమితాబ్ చౌదరి అన్నారు. ఒకవైపు అధిక ఎన్పీఏల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నిదానించిన సమయంలోనే ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మేము జాగ్రత్తగా ఉన్నాం’’ అని అమితాబ్ చౌదరి ముంబైలో మీడియాతో అన్నారు. కొత్త విభాగాల్లో ఒత్తిళ్ల గురించి చౌదరి మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఈ రెండు విభాగాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు. అయితే, వీటిల్లో చాలా కంపెనీలు మంచి స్థితిలోనే ఉన్నట్టు ఆ వెంటనే ఆయన పేర్కొన్నారు. ‘‘మేం మరీ రిస్క్ చేయదలుచుకోవడం (కన్జర్వేటివ్) లేదు. మా రిస్క్ నిర్వహణ విధానాలు సరిగ్గా ఉండాలనుకుంటున్నాం’’ అని చౌదరి వివరించారు. అయితే, యాక్సిస్ బ్యాంకు తన ప్రధాన వ్యాపారమైన రిస్క్ తీసుకుని, రుణాలను ఇవ్వడాన్ని బాగా తగ్గించుకుంటుందని భావించొద్దంటూ స్పష్టతనిచ్చారు. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ... ఏడాది అవుతున్నా ఇంత వరకు పరిష్కారం లభించలేదని, కొన్ని కంపెనీలు మంచిగానే పనిచేస్తున్నందున ఈ విషయంలో సూక్ష్మ పరిశీలన అవసరమన్నారు. ఇది వ్యవస్థాపరమైన అంశంగా మారుతుందని తాను భావించడం లేదని, ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవస్థకు సమయం పడుతుందన్నారు. కొన్ని కంపెనీలకు త్వరితంగా ఈక్విటీ నిధుల అవసరం ఉందని పేర్కొన్నారు. బ్యాంకు సొంతంగా రుణాల జారీకే ప్రాధాన్యమిస్తుందని, అదే సమయంలో ఎన్బీఎఫ్సీ పోర్ట్‌ఫోలియో కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని చెప్పారు. -
కస్టమర్లకూ ‘రెపో’ లాభం!
సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పరంగా అనేక అడుగులు వేస్తోందని, అందుకే తాము పలు కార్యక్రమాల్లో భాగం కాగలిగామని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తెలియజేసింది. తెలంగాణలో ప్రస్తుతం తమకు 135 బ్రాంచీలుండగా... ఈ ఏడాది డిసెంబరు ఆఖరునాటికి మరో 30 ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 150 బ్రాంచీలున్నాయని... డిసెంబరు ఆఖరికల్లా రెండు రాష్ట్రాల్లోనూ ఇంచుమించు సమాన సంఖ్యలో బ్రాంచీలుంటాయని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. సోమవారమిక్కడకు వచ్చిన సందర్భంగా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఏపీ, తెలంగాణ సర్కిల్ మధుసూదన రావుతో కలిసి ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... తెలంగాణ ప్రభుత్వం అనేకరకాలుగా ముందుకొస్తున్నట్లు మీరు చెబుతున్నారు. ఏ రకంగానో చెప్పగలరా? సిద్ధిపేటను నగదు రహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మేం 10 గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఖాతాలు తెరిచాం. అన్ని దుకాణాలకూ ఈడీసీ మెషీన్లు అందజేశాం. ఇక ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌కు, గనులు–భూగర్భ వనరుల శాఖ లావాదేవీలకు, ఇసుక నిర్వహణ వ్యవస్థకు, ఫాస్టాగ్ సొల్యూషన్స్‌కు, ఫిషరీస్ విభాగ బ్లూ రివొల్యూషన్ పథకానికి, పశు సంవర్థక శాఖ గొర్రెలు–మేకల పథకానికి ఇలా అన్నిటికీ మేం అధికారిక బ్యాంకరుగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డెయిరీకి కూడా నగదు నిర్వహణ సేవలందిస్తున్నాం. ఇలాంటి ఒప్పందాలు మిగతా ఏ రాష్ట్రంతోనైనా ఉన్నాయా? గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక... ఇలా చాలా రాష్ట్రాలతో రకరకాల అంశాలకు సంబంధించి ఒప్పందాలున్నాయి. పలు సేవలందిస్తున్నాం. ఇలాంటివన్నీ మా నుంచి కాకుండా స్థానికంగా ఉండే ప్రభుత్వాన్ని బట్టే ఉంటాయి. ప్రభుత్వం ముందుకొచ్చి పారదర్శకంగా, వేగవంతమైన సేవలందిస్తామంటే ఇలాంటివి ఎన్నయినా సాధ్యమవుతాయి. సరే! ఆర్బీఐ గడిచిన ఆరు నెలల్లో రెపోరేటు ముప్పావు శాతం... అంటే 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కానీ ఏ బ్యాంకూ దీన్ని పూర్తిగా వినియోగదారుకు అందించలేదు. ఎందుకని? నిజం! ఆర్బీఐ మూడు దఫాలుగా రెపో రేటు తగ్గించినా అదింకా పూర్తిగా వినియోగదారు స్థాయికి చేరలేదు. కాకపోతే మా బ్యాంకయినా, ఏ బ్యాంకయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గతంలో ఇలాంటివి వినియోగదారు స్థాయికి బదిలీ కావటానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ ప్రక్రియ మెరుగుపడి, వేగవంతమయింది. మొదట డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించటంతో మొదలై.. మెల్లగా రుణాలపై రేట్లు కూడా తగ్గుతాయి. త్వరలోనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాం. కాకపోతే ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడు చెప్పలేం. మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్ బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు తగ్గుతాయని చెబుతున్నా కావటం లేదు. ఎందుకని? మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే ఎన్పీఏలకు కేటాయింపుల విషయంలో మేం చాలా సంప్రదాయకంగా వ్యవహరిస్తున్నాం. అంటే ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాం. ఏ కొంచెం అవకాశమున్న ఖాతాలనైనా దాచకుండా ఎన్పీఏలుగా వర్గీకరిస్తున్నాం. ఈ కారణాల వల్లే మా ఎన్పీఏలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇలా వ్యవహరించటం బ్యాంకు ఆరోగ్య రీత్యా మంచిదే. ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల సంక్షోభం మాటేంటి? ఇందులో మీ బ్యాంకు వాటా ఎంత? సంక్షోభం కొలిక్కి వస్తుందనే నేను భావిస్తున్నాం. చర్చల ప్రక్రియతో ఇలాంటి సంక్షోభాలను మరింత ముదరకుండా నివారించవచ్చన్నది నా నమ్మకం. మాకు వీటిలో ఎంత వాటా ఉందనేది ఇప్పుడు చెప్పటం సాధ్యం కాదు. బ్రోకింగ్ సేవల విషయానికొస్తే మీరెందుకు చాలా వెనకబడ్డారు? నిజమే! ఇప్పుడొచ్చిన డిస్కౌంట్ స్టాక్ బ్రోకరేజీ సంస్థలు, ఇతరులతో పోలిస్తే యాక్సిస్ డైరెక్ట్ కొంత వెనకబడినట్టే. కాకపోతే మేం కస్టమర్ల సంఖ్యపై కాకుండా మా కస్టమర్లకు ఈ సేవల్ని ఎంత మెరుగ్గా అందించగలమనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. ఇటీవలే ట్రేడ్–20ని అమల్లోకి తెచ్చాం. దీనిద్వారా షేర్లకు సంబంధించి ఏ లావాదేవీకైనా రూ.20 మాత్రమే వసూలు చేస్తాం. కాకపోతే కస్టమర్లు తమ ఖాతాల్లో రూ.75వేల సగటు బ్యాలెన్స్ నిర్వహించాలనే షరతు ఉంది. బ్రోకింగ్ సేవల్ని ఇపుడు బాగా విస్తరిస్తున్నాం. మా మొబైల్ బ్యాంకింగ్, బ్రోకింగ్ యాప్‌లు చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయి. మీకింకా నగదు కొరత ఉందా? ఏటీఎంలు తగ్గిస్తున్నారా? అలాంటిదేమీ లేదు. ఇపుడు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అందరికీ పుష్కలంగా నగదు అందుబాటులో ఉంచుతోంది. కొత్త వాటితో సహా ప్రతి బ్రాంచిలోనూ ఏటీఎంను ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి మాకు 4,050 బ్రాంచీలు, 11,801 ఏటీఎంలు ఉన్నాయి. మున్ముందు బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ జరుపుకోవటానికి వీలయ్యే సెల్ఫ్ సర్వీస్ ఏటీఎంల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
58.97 లక్షలు కొట్టేసిన కేసులో కీలక పురోగతి
-
కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపు కంపెనీల దివాలా పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కంపెనీ దివాలా ప్రక్రియ జాబితాలో చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ దివాలాకు అనుమతినిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కోల్‌కతాకు చెందిన పంకజ్ దనుఖాను తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్, నాఫ్తా ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. కార్యకలాపాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఈ విధంగా యాక్సిస్ బ్యాంకుకు 2018 ఆగస్ట్ 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు ఎన్సీఎల్ టీని ఆశ్రయించి, ల్యాంకో కొండపల్లి దివాలాను ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి విచారణ జరిపారు. ల్యాంకో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదుపులో లేని పరిస్థితుల వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, గ్యాస్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ ప్రారంభించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తరువాత యాక్సిస్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ల్యాంకో కొండపల్లికి ఏ సంబంధం లేదని తెలిపింది. రుణం చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా ల్యాంకో కొండపల్లి స్పందించలేదన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, ల్యాంకో కొండపల్లి దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీల ఆస్తుల క్రయ, విక్రయాలు, బదలాయింపులపై నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. -
10,900 పాయింట్ల పైకి నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, షేర్ల వారీ కదలికల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 15 పాయింట్లు పెరిగి 10,905 పాయింట్లకు చేరింది. 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 53 పాయింట్ల లాభంతో 36,374 పాయింట్ల వద్ద ముగిసింది. మరో మూడు వారాల్లో మధ్యంతర బడ్జెట్ రానుండటం, కీలక కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఇటీవల పుంజుకున్న ముడి చమురు ధరలు 1% మేర పతనం కావడం, గత ఐదు రోజులుగా పతనమవుతున్న రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. 297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతులో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 147 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరొక దశలో 150 పాయింట్లవ వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 297 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కొరియా సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.679ను తాకిన ఈ షేర్ చివరకు 2 శాతం లాభంతో రూ.676 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► సన్ ఫార్మా షేర్ 5.7% నష్టపోయి రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు చెరో 1 శాతం నష్టపోయాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. -
బేస్ రేట్ పెంచిన యాక్సిస్ బ్యాంకు
సాక్షి, ముంబై : ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ తన బేస్ రేటు(రుణాలపై కనీస వడ్డీ) పెంచినట్లు గురువారం ప్రకటించింది. బేస్ రేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో యాక్సిస్ బ్యాంకు బేస్ రేటు 9.2 నుంచి 9.5 శాతానికి పెరిగింది. అయితే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) యథాతథంగా ఉంచినట్లు తెలిపింది. పెంచిన బేస్‌రేటు ఈరోజు(జనవరి 3)నుంచే అమలులోకి వచ్చిందని యాక్సిస్ బ్యాంక్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. -
83 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 83 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.432 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.790 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత మెరుగుపడటంతో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గాయని, దీంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.13,821 కోట్ల నుంచి రూ.15,959 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం అప్... నికర వడ్డీ ఆదాయం రూ.2,208 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,542 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో 3.12 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 2.54 శాతానికి తగ్గాయని పేర్కొంది. అయితే స్థూల మొండి బకాయిలు మాత్రం 5.90% నుంచి 5.96%కి పెరిగాయని వివరించింది. మొండిబకాయిలకు, ఇతరాలకు కేటాయింపులు రూ.3,140 కోట్ల నుంచి 7% తగ్గి రూ.2,927 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఫీజు ఆదాయం 9% పెరిగి రూ.2,376 కోట్లకు పెరిగిందని తెలిపింది. రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ 24 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. రుణాలు 11% పెరిగి రూ.4,56,121 కోట్లకు పెరిగాయని తెలిపింది. రిటైల్ రుణాలు 20%, ఎస్ఎమ్ఈ రుణాలు 14 శాతం, కార్పొరేట్ రుణాలు 21 శాతం చొప్పున పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1.2% లాభంతో రూ.610 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్‌కు కొత్త సీఈవో..
ముంబై : యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో కొత్త సీఈవో, ఎండీ దొరికేశారు. యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవో, ఎండీగా అమితాబ్ చౌదరిని మూడేళ్ల పాటు నియమిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసిన ఫైలింగ్ ఈ విషయాన్ని బ్యాంక్ వెల్లడించింది. ‘నేడు జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్‌లో 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అంటే మూడేళ్ల పాటు అమితాబ్ చౌదరిని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమించాలని నిర్ణయించాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఆమోదం తెలిపింది’ అని బ్యాంక్ తెలిపింది. ఈ నియామకం, రెమ్యునరేషన్ నియమ, నిబంధనల ప్రకారం ఉంటుందని పేర్కొంది. అమితాబ్ చౌదరి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో పనిచేస్తున్నారు. 2010లో ఆయన హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరారు. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరువలో దేశంలో అత్యంత విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉంది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌కు సీఈవో, ఎండీగా ఉన్న శిఖా శర్మ పదవి కాలం ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. ఈ పోస్టు కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను బ్యాంక్, ఆర్బీఐ వద్దకు పంపింది. వారిలో అమితాబ్ చౌదరిని ఈ పదవి వరించింది. చౌదరి బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరకముందు ఇన్ఫోసిస్ బీపీవో పనిచేశారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆసియాకు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్, హోల్‌సేల్ బ్యాంకింగ్‌కు, గ్లోబల్ మార్కెట్లకు రీజనల్ ఫైనాన్స్ హెడ్‌గా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పదవులు చేపట్టారు. -
శిఖాశర్మ స్థానంలో ప్రభుత్వ బ్యాంకర్
న్యూఢిల్లీ : పీఎస్ జయకుమార్.. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయనే ఇక యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ స్థానంలో, జయశంకర్ ఆ పదవిని అలంకరించబోతున్నారని తెలుస్తోంది. కొత్త సీఈవోను వెతుకులాడేందుకు బ్యాంక్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఇగోన్ జెహెండర్ను నియమించింది. జెహెండర్ ఆధ్వర్యంలోని సెర్చ్ ప్యానల్, జయకుమార్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జయకుమార్ అంతకముందు సిటీబ్యాంకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఓబీ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం బీఓబీలో ముగియబోతోంది. కాగ, శిఖా శర్మ ఈ ఏడాది చివరికి శాశ్వతంగా తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. 2018 సెప్టెంబర్ వరకు యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవోపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జయకుమార్తో పాటు ఈ పదవికి బ్యాంక్ డిప్యూటీ ఎండీ వీ శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్‌లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను, బోర్డు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనుంది. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి సీఈవో ఎవరో తేల్చేశాక, షేర్‌హోల్డర్స్, ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఆమోదం పొందుతుంది. కాగ, గతేడాది జూలైలోనే యాక్సిస్ బ్యాంక్, శిఖా శర్మను మరోసారి సీఈవో, ఎండీగా నియమించింది. 2018 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఆమెనే కొనసాగనున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఆర్బీఐ అభ్యంతరం తెలిపింది. బ్యాంక్ ప్రదర్శన, ఆస్తుల నాణ్యత బట్టి, మరోసారి యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. అయితే శిఖా శర్మనే తన నాలుగో టర్మ్ పదవి కాలాన్ని 2021 మే వరకు కాకుండా.. ఈ ఏడాది చివరికి ముగించేయాలని కోరినట్టు బ్యాంక్ బోర్డు, ఆర్బీఐకి లేఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరితోనే శిఖాశర్మ తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. -
బ్యాంకులే బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: ఏటీఎంల నిర్వహణ లోపం సేవా లోపం కిందకే వస్తుందని రాష్ట్ర వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది. ఏటీఎంల్లో నగదు తీసుకునేటప్పుడు చోటు చేసుకునే సాంకేతిక, ఇతర పొరపాట్లకు బ్యాం కులే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ బీఎన్ రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్ రావులతో కూడి న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా, షామీర్‌పేట్‌కు చెందిన శ్యామ్‌రావుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతా ఉంది. 2011 అక్టోబర్ 31న సికింద్రాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీ ఎం నుంచి ఆయన నగదు తీసుకోవడానికి వెళ్లా డు. కార్డు పెట్టి కావాల్సిన మొత్తం ఎంటర్ చేయగా.. ఏటీఎం స్క్రీన్‌పై సదరు లావాదేవీ విఫలమైనట్లు సందేశం వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు మినీ స్టేట్మెంట్లో నమోదైంది. దీనిపై ఆయన బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. ఖాతాలోకి నగదు వస్తుందన్నారు. నగదు రాకపోవడంతో ఆయన ఇరు బ్యాంకులకు లీగల్ నోటీసు ఇచ్చారు. బ్యాంకుల నుంచి స్పందన లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఫోరం శ్యామ్‌రావుకు ఇవ్వాల్సిన రూ.10 వేల తో పాటు పరిహారంగా రూ.3 వేలు ఇవ్వాలని, ఖర్చుల కింద మరో రూ.1,000 చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది. దీనిపై సదరు ఎస్బీఐ బ్రాంచ్ ఫోరంలో అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఎస్బీఐ అప్పీల్‌ను కొట్టేసింది. ఏటీఎంల నిర్వహణ లోపాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది. -
యాక్సిస్ బ్యాంక్ షాక్!
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగానికి మొండిబకాయిలు(ఎన్పీఏ) తూట్లు పొడుస్తున్నాయి. ప్రైవేటు రంగంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్.. యాక్సిస్ బ్యాంకుకు ఈ సెగ గట్టిగానే తగిలింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో బ్యాంక్ అనూహ్యంగా రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.1,225 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 1998లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత, అంటే రెండు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడంతో, వాటికి కేటాయింపులు(ప్రొవిజనింగ్) ఎగబాకడమే ఈ నష్టాలకు కారణంగా నిలిచింది. క్యూ4లో బ్యాంక్ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) ఎలాంటి పెరుగుదల లేకుండా రూ.4,730 కోట్లుగా నమోదైంది. మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. అంచనాలు తలకిందులు... విశ్లేషకులు క్యూ4లో బ్యాంక్ నికర లాభం 56 శాతం దిగజారి రూ.534 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, అసలు లాభం లేకపోగా భారీ నష్టాన్ని ప్రకటించడంతో మార్కెట్ వర్గాలు ఖంగుతిన్నాయి. గురువారం మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలను ప్రకటించారు. బీఎస్ఈలో షేరు ధర రూ.0.77 శాతం నష్టంతో రూ.495 వద్ద ముగిసింది. అత్యంత దుర్భర ఫలితాల నేపథ్యంలో నేడు(శుక్రవారం) షేరుపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పూర్తి ఏడాది లాభం 92.5 శాతం డౌన్... గడిచిన 2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా బ్యాంక్ అత్యంత ఘోరమైన పనితీరును నమోదుచేసింది. నికర లాభం కేవలం రూ.276 కోట్లకు పరిమితమైంది. 2016–17లో లాభం రూ.3,679 కోట్లతో పోలిస్తే ఏకంగా 92.5 శాతం పడిపోయింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా ఏమాత్రం పెరగలేదు. దాదాపు అదేస్థాయిలో రూ.56,233 కోట్ల నుంచి రూ.56,747 కోట్లకు చేరింది. ఎన్పీఏల బండ... మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 6.77 శాతానికి(విలువ రూ.34,248 కోట్లు) పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇవి 5.04 శాతం(రూ.21,280 కోట్లు) మాత్రమే. సీక్వెన్షియల్‌గా చూసినా స్థూల ఎన్పీఏలు భారీగానే పెరిగాయి. గతేడాది క్యూ3లో ఇవి 5.28 కోట్లు(రూ.25,000 కోట్లు)గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 2.11 శాతం(రూ. 8,627 కోట్లు) నుంచి 3.4 శాతానికి (రూ.16,592 కోట్లు) ఎగిశాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే... గతేడాది క్యూ3లో 2.56 శాతం(రూ.11,770 కోట్లు)గా నమోదయ్యాయి. ఎన్పీఏలు భారీగా పెరగడంతో వీటికి కేటాయింపులు(ప్రొవిజనింగ్) క్యూ4లో రూ.7,180 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ4లో ప్రొవిజనింగ్ రూ.2,581 కోట్లతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. క్యూ4లో దాదాపు రూ.16,536 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారిపోయాయి. ఇందులో రూ.13,900 కోట్లు కార్పొరేట్ కంపెనీల నుంచే ఉన్నాయి. విద్యుత్ రంగానికి తాము ఇచ్చిన రుణాలు రూ.9,000 కోట్లు కాగా, వీటిలో 40 శాతం ఎన్పీఏలుగా మారాయని బ్యాంక్ పేర్కొంది. డివిడెండ్ మిస్... లాభాలు కరువై.. నష్టాల్లోకి జారిపోవడంతో వాటాదారులకు బ్యాంక్ మొండిచెయ్యి చూపింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2017–18) సంబంధించి యాక్సిస్ డైరెక్టర్ల బోర్డు ఎలాంటి డివిడెండ్‌ను ప్రకటించలేదు. గడిచిన పదేళ్లలో బ్యాంక్ డివిడెండ్‌ను ఇవ్వకపోవడం ఇదే తొలిసారి కావడం దుర్భర పనితీరుకు నిదర్శనం. 2016–17 ఏడాదికిగాను రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున డివిడెండ్ ఇచ్చారు. కఠిన నిబంధనల ప్రభావం: శిఖా శర్మ ఇటీవలి కాలంలో మొండిబాకాయిల విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) విధించిన కఠిన నిబంధనలు కూడా తమ ఎన్పీఏలు ఎగబాకడానికి ఒక కారణమని బ్యాంక్ సీఈఓ, ఎండీ శిఖా శర్మ ఫలితాల సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఈ ప్రభావంతో కొన్ని ఖాతాలను ఎన్పీఏలుగా పరిగణించాల్సివచ్చిందన్నారు. ‘రుణ సంబంధ రిస్కులు బ్యాంకును తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రా రంగం చాలా కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ రిస్కులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రధానంగా దృష్టిపెడుతున్నాం. ఎన్పీఏల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ఇప్పుడు మా ప్రధాన కర్తవ్యం. అయితే, ఈ ప్రక్రియ దాదాపు చివరిదశకు వచ్చినట్టేనని భావిస్తున్నాం’ అని ఆమె వివరించారు. మొండిబకాయిల సమస్యతో బ్యాంక్ పనితీరు బాగోలేదని, శిశా శర్మ పదవీ కాలం పొడిగింపుపై పునరాలోచించాలంటూ ఆర్బీఐ యాక్సిస్ బోర్డుకు సూచించడం తెలిసిందే. ఈ కారణంగా మూడేళ్ల పదవీకాలాన్ని శిఖా శర్మ స్వచ్ఛందంగా ఈ ఏడాది డిసెంబర్‌కు(ఏడు నెలలకు) కుదించుకోవాల్సి వచ్చింది. కాగా, తదుపరి బ్యాంక్ చీఫ్‌గా సరైన వ్యక్తిని నియమించడంలో బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఇందుకు తన పూర్తి సహకారం అందిస్తానని శిఖా శర్మ వ్యాఖ్యానించారు. -
కొత్త సీఈఓ కోసం ఆ బ్యాంకు వెతుకులాట
ముంబై : ప్రైవేట్ రంగంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు తన కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది. కేవలం ఎనిమిది నెలల్లో శిఖా శర్మ తన పదవి నుంచి దిగిపోతుండగా.. కొత్త సీఈఓను నియామకంపై బ్యాంకు దృష్టిసారించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ పోస్టు కోసం ఆరుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని బోర్డు-సబ్‌కమిటీ ఫైనలైజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈఓ కోసం పోటీ పడే వారిలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇండియా సంజయ్ ఛట్టర్జీ, కేకేఆర్ కంట్రీ హెడ్ సంజయ్ నాయర్, మాజీ డ్యుయిస్ బ్యాంకు ఆసియా-పసిఫిక్ చీఫ్ గునీత్ చదా, సిటీ గ్రూప్ ఇండియా సీఈవో ప్రమీత్ జావేరీలు ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఛట్టర్జీ పేరు అంతకముందు ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా కేవీ కామత్ పదవి విరమణ చేసినప్పుడు కూడా వినిపించింది. కానీ తర్వాత చందా కొచర్‌ను నియమించారు. మిగతా ఇద్దరు బ్యాంకులోని అంతర్గత అభ్యర్థులే ఉన్నారు. వారిలో ఒకరు రిటైల్ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ కాగ, మరొకరు బ్లాక్‌రాక్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ కంపెనీ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్యాంకు ఇండిపెండెంట్ డైరెక్టర్ రోహిత్ భగత్ ఉన్నారు. అయితే ఇంతకముందే తాను కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఆసక్తితో ఉన్నానంటూ యాక్సిస్ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వీ శ్రీనివాసన్ చెప్పారు. ఒకవేళ ఆయనను కూడా సీఈఓ పోస్టుకు పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంకు నిబంధనలకు తగిన వారినే బ్యాంకు సీఈఓగా నియమించాలని బోర్డును ఆర్బీఐ ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు వీడియోకాన్ గ్రూప్ రుణ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు కూడా తాత్కాలిక సీఈఓను నియమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాత్కాలిక సీఈఓను బ్యాంకు నియమించాల్సి వస్తే, ఆయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ సందీప్ భక్షి ఉండొచ్చని సమాచారం. -
యాక్సిస్ కష్టం... ‘కొటక్’కు లాభం?
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... దేశీ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ విలీన, కొనుగోలు డీల్‌కు తెరతీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా శిఖా శర్మ వైదొలిగిన తర్వాత.. ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవడంపై కొటక్ మహీంద్రా దృష్టి పెట్టడానికి అవకాశాలున్నాయని బ్రోకింగ్ సంస్థ నొమురా పేర్కొంది. కొత్త సీఈవోగా బయటి నుంచి వేరెవరినైనా తీసుకొచ్చేందుకు యాక్సిస్ బ్యాంక్ వద్ద తక్కువ సమయమే ఉండటం, మొండిబాకీల ప్రక్షాళనపై ఆర్బీఐ నుంచి ఒత్తిడి పెరుగుతుండటం తదితర అంశాలు కొటక్‌కు సానుకూలాంశాలు కాగలవని వివరించింది. యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యంపై రిజర్వ్ బ్యాంక్ నమ్మకం సడలిందని, శిఖా శర్మ పునర్నియామకాన్ని ఆమోదించకపోవడమే ఇందుకు నిదర్శనమని నొమురా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో తాత్సారం చేయడానికి యాక్సిస్ బ్యాంక్ దగ్గర పెద్దగా సమయం కూడా ఉండకపోవచ్చని వివరించింది. కొటక్కి ప్రయోజనకరం..: యాక్సిస్ ఇప్పటికే ఎన్పీఏల ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం చేయడం కొటక్కి కలిసి రాగలదని తెలిపింది. గతంలో విలీన వార్తలు వచ్చినప్పట్నుంచి యాక్సిస్‌తో పోలిస్తే కొటక్ బ్యాంక్ షేర్లు 30 శాతానికి పైగా పెరగడం కూడా దానికి సానుకూలాంశమని పేర్కొంది. ఇక గణనీయమైన వ్యాపారపరిమాణం ఉన్న యాక్సిస్‌ను దక్కించుకోవడం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజాల స్థాయికి కొటక్ మహీంద్రా మరింత చేరువ కాగలదని నొమురా తెలిపింది. అటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్ల వాటాలను తగ్గించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని వివరించింది. యాక్సిస్ షేరు జూమ్..:సీఈవోగా శిఖా శర్మ పదవీకాలాన్ని కుదించడం తదితర వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు మంగళవారం 5 శాతం ఎగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.7,212 కోట్లు పెరిగి రూ. 1,40,133 కోట్లకు చేరింది. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు 5.43 శాతం పెరిగి రూ. 546 వద్ద, ఎన్ఎస్ఈలో 5.17 శాతం పెరిగి రూ. 546.15 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో 6.10 శాతం కూడా పెరిగి రూ. 549.50 స్థాయిని కూడా తాకింది. ఎన్ఎస్ఈలో 2 కోట్లు, బీఎస్ఈలో 11.98 లక్షల షేర్లు చేతులు మారాయి. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
శిఖా శర్మకు గుడ్ బై.. కానీ
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపు అంశంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శిఖా శర్మకు గుడ్ బై చెప్పేందుకు మొగ్గు చూపింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో తన పదవీకాలాన్నిపొడిగించాల్సిందిగా శిఖా శర్మ బోర్డును కోరారని బోర్డు ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. దీంతో ఆమె పదవీ విరమణ కాలాన్ని జులైలో కాకుండా డిసెంబర్ దాకా కొనసాగించేందుకు బోర్డు ఆమోదించిందనీ, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపినట్టు వెల్లడించింది. జులై 2018 ,డిసెంబర్ 2018దాకా తన పదవీకాలాన్ని పొడిగించాలన్న సీఈవో శిఖా శర్మ అభ్యర్థనను బోర్డు ఆర్బీఐ పరిశీలనకు పంపినట్టు తెలిపింది. అనంతరం కొత్త సీఈవో ఎంపికను చేపట్టనున్న్టటు ప్రకటించింది. వరుసగా మూడవ సారి సీఈవో బాధ్యతలు చేపట్టిన శిఖాశర్మ ప్రస్తుత పదవీకాలం 2018 జులైతో ముగియనుంది. అయితే నాలుగవసారికూడా ఆమెను కొనసాగించే ప్రతిపాదనను ఆమోదించిన బోర్డు ఆర్బీఐ ఆమోదం కోసం పంపింది. ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా బోర్డును కోరడంతో ఆమె నాలుగవ సారి సీఈవో అయ్యే ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. కాగా యాక్సిస్ బ్యాంకుకు తొలిసారి సీఈఓగా శిఖా శర్మ ప్రస్థానం 2009లో మొదలైంది. దాదాపు ఎనిమిదేళ్ల 10నెలల కాలంలో యాక్సిస్ బ్యాంకును విజయపథంలో నడిపించిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. మరోవైపు మొండిబాకీల విషయంలో ఆమె ఆరోపణలను కూడా మూట గట్టుకున్నారు. దీనికి తోడు గత సంవత్సరం అక్టోబర్‌లో యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా మరోసారి శిఖా శర్మ కొనసాగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ తాజాగా ఆ బ్యాంక్‌కు ఇంకో షాకిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం పసిడి, వెండి దిగుమతికి అనుమతి పొందిన 16 బ్యాంకుల జాబితాలో యాక్సిస్ పేరును పక్కన పెట్టింది. భారీ స్కామ్‌లో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ సారథ్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ లిస్టులో ఉన్నప్పటికీ.. యాక్సిస్ బ్యాంక్ పేరు మాత్రం లేదు. గతేడాది మొత్తం 19 బ్యాంకులు బులియన్ దిగుమతులకు లైసెన్సులు పొందగా.. పసిడి, వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న బ్యాంకుల్లో యాక్సిస్ కూడా ఉంది. సాధారణంగా బ్యాంకులు పసిడి, వెండిని దిగుమతి చేసుకుని, వ్యాపార సంస్థలకు విక్రయిస్తుంటాయి. ఫీజుల రూపంలో ఆదాయం ఆర్జించడంతో పాటు కీలకమైన పెద్ద ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకోవడానికి కూడా బ్యాంకులకు ఇది ఉపయోగపడుతుంది. సీఈవో, ఎండీగా శిఖా శర్మను మరోసారి కొనసాగించడాన్ని పునఃపరిశీలించాలంటూ యాక్సిస్ బ్యాంక్‌కు ఇప్పటికే సూచించిన ఆర్బీఐ .. తాజాగా బులియన్ దిగుమతి బ్యాంకుల లిస్టు నుంచి ఆ బ్యాంక్‌ను తొలగించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శిఖా శర్మ హయాంలో మొండిబాకీలు భారీగా పెరిగి, బ్యాంకు పనితీరు క్షీణించిందనే కారణంతో ఆమెను చీఫ్‌గా కొనసాగించాలన్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలంటూ బ్యాంక్‌కు ఆర్బీఐ సూచించిన సంగతి తెలిసిందే. ఈసారి బులియన్ దిగుమతి లైసెన్సులు కోల్పోయిన వాటిల్లో కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఉన్నాయి. అనుమతులు పొందిన వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్ మొదలైన వాటితో పాటు అంతర్జాతీయ బ్యాంక్‌లైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ నోవా స్కోషియా కూడా ఉన్నాయి. -
శిఖా శర్మకు ఆర్బీఐ చెక్?
సాక్షి, ముంబై: ఆర్థికరంగంలో ఆణిముత్యాలుగా రాణించిన బ్యాంకుల మహిళా ఉన్నతాధికారులకు వరుసగా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. ఇప్పటికే ఐసీఐసీఐ సీఎండీ చందా కొచ్చర్ వీడియోకాన్ రుణాల విషయంలో ఆరోపణలు, ఆమె భర్త సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో బ్యాంకు అధికారికి ఆర్బీఐ రూపంలో చిక్కులు మొదలయ్యాయి. యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా యాక్సిస్ బ్యాంకు బోర్డును కోరడం ఇపుడు ఆసక్తికరంగా మారిది. సీఈవోగా వరుసగా నాలుగోసారి శిఖా శర్మను కొనసాగిస్తూ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచన చేయమని ఆర్బీఐ సూచించినట్లు బ్యాంకు వర్గాల సమాచారం. ఈ మేరకు బ్యాంకు ఛైర్మన్ సంజీవ్ మిశ్రాకు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొండి బకాయిల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రెగ్యులేటరీ అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ అపాయింట్ మెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఇప్పటికే పలు బ్యాంకులను కోరింది. ఇందులో భాగంగానే శిఖాశర్మ పదవి కొనసాగింపుపై కూడా ఆర్బీఐ సూచనలు చేసింది. దీనికితోడు గత సంవత్సరం అక్టోబర్ లోనే యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీనిపై వ్యాఖ్యానించడానికి యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. ఆర్బీఐ, బ్యాంకు మధ్య కమ్యూనికేషన్స్ కచ్చితంగా గోప్యంగా ఉండాలన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలపై బ్యాంకు బోర్డు ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తుందనీ, అనంతరం ఈ సిఫారసులను ఆర్బీఐకి పంపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉందనీ, ఈ అంశంపై తుది నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అటు ఆర్బీఐ నుంచి కూడా ఈ అంచనాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కాగా శిఖాశర్మ 2009లో తొలిసారి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుస్లారు సీఈవోగా బాధ్యతలు చేపట్టగా, రానున్న జూన్ మాసం నుంచి నాలుగవసారి సీఈవోగా ఆమె పదవీకాలం ప్రారంభం కానుంది. అయితే తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలు శిఖా శర్మ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నట్టేనని మార్కెట్ వర్గాల విశ్లేషణ. -
యాక్సిస్ కొత్త ‘బ్యాంక్ గ్యారంటీలు’ చెల్లవు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు సంబంధించి ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలను తీసుకోబోమని టెలికం శాఖ (డాట్) స్పష్టం చేసింది. గతంలో ఎయిర్‌సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలను చెల్లించడంలో యాక్సిస్ విఫలం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇది భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోరాదని మార్చి 16న జారీ చేసిన ఆఫీస్ మెమోలో టెలికం శాఖ తెలిపింది. మరోవైపు, తాము భారతి ఎయిర్టెల్ తరఫున మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరిపిన పక్షంలో టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ టీడీశాట్ ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుందని, అందుకే జరపలేదని వివరించాయి. టీడీశాట్ ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో నిబంధనలకు అనుగుణంగా సదరు గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరుపుతామని తెలిపాయి. వాస్తవానికి ఎయిర్‌సెల్ స్పెక్ట్రంను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారతి ఎయిర్టెల్ తరఫున బ్యాంక్ గ్యారంటీని ఇచ్చినట్లు యాక్సిస్ వర్గాలు వివరించాయి. అయితే, ఎయిర్‌సెల్, టెలికం శాఖల మధ్య వివాదంలో టీడీశాట్ ఉత్తర్వులవల్ల బ్యాంక్ గ్యారంటీ చెల్లింపులను జరిపేందుకు యాక్సిస్‌కు వీలు లేకుండా పోయిందని వివరించాయి. కాంట్రాక్టుల నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన టెలికం కంపెనీలు గానీ డిఫాల్ట్ అయిన పక్షంలో ప్రభుత్వం పెనాల్టీ కింద ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది. -
వాట్సాప్ పేమెంట్స్ కు యాక్సిస్ బ్యాంక్ రెడీ..
సాక్షి, బెంగళూర్ : చాటింగ్ అప్లికేషన్ వాట్సాప్ ద్వారా చెల్లింపులను త్వరలో ప్రాసెస్ చేయనున్నట్టు భారత్‌లో మూడవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే దేశంలో యూపీఐ ఆధారిత వాట్సాప్ పేమెంట్స్ ప్రాసెసింగ్‌ను తొలిసారి చేపట్టిన సంస్థగా యాక్సిస్ బ్యాంక్ నిలవనుంది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ద్వారా యాప్ యూజర్లు పేటీఎం, మొబిక్విక్, ఇతర పేమెంట్స్ సేవల మాదిరిగా నేరుగా డబ్బును పంపడంతో పాటు రిసీవ్ చేసుకోవచ్చు. ‘వాట్సాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం నడుస్తోంది..పూర్తి వెర్షన్ ఒకట్రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంద’ని యాక్సిక్ బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) గొప్ప అవకాశమని బ్యాంక్ పేర్కొంది. చెల్లింపుల్లో యూపీఐ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిందని..తమ కస్టమర్లకు ఈ సేవలను అందించేందుకు కసరత్తు సాగిస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ పేర్కొన్నారు. కస్టమర్లు చెల్లింపులు చేసుకునేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసే క్రమంలో గూగుల్, వాట్సాప్, ఊబర్, ఓలా, శాంసంగ్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. యూపీఐ మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ 20 శాతం వాటా కలిగిఉందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. -
పీఎన్బీ స్కాంలో సరికొత్త మలుపు
-
పీఎన్బీ స్కాంలో చందాకొచ్చర్, శిఖా శర్మలకు సమన్లు
ముంబై : పంజాబ్ నేషన్ బ్యాంకు భారీ కుంభకోణం కేసు సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంకులుగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు దర్యాప్తు సంస్థలు షాకిచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీచేసింది. చందా కొచ్చర్తో పాటు యాక్సిస్ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు కూడా నోటీసులు అందాయి. పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మోహుల్ చౌక్సిలకు సంబంధించే వీరికి నోటీసులు అందినట్టు తెలిసింది. అయితే నీరవ్‌మోదీ సంస్థలతో తమకేమీ సంబంధం లేదని, చౌక్సికి చెందిన గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం అందించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. అయితే ఎంత రుణం ఇచ్చామో ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించలేదు. యాక్సిస్ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూప్‌కు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. మరోవైపు గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ విపుల్ చిటిలియాను సీబీఐ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. పీఎన్బీ స్కాంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నిస్తోంది. సీబీఐ ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు, యాక్సిస్ బ్యాంకు షేరు నష్టాల బాట పట్టాయి. -
బ్యాంకింగ్ దిగ్గజాలకు భారీ జరిమానా
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెండు దిగ్గజ బ్యాంకులకు భారీ షాక్ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనలను పాటించని కారణంగా ప్రయివేటు బ్యాంకు దిగ్గజం యాక్సిస్ బ్యాంకుతోపాటు, ముఖ్య ప్రభుత్వ రంగు బ్యాంకులలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునకు (ఐవోబీ) భారీ జరిమానా విధించింది. కెవైసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఐవోబీకి 2కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అంతర్గత తనిఖీ నివేదిక సహా పత్రాల పరిశీలన అనంతరం ఆర్బీఐ జారీచేసిన ఉత్తర్వులను ఉల్లఘించినట్టు తేలిందని ఆర్బిఐ పేర్కొంది. అలాగే ఎన్పీఏల అంచనాలకు సంబంధించిన యాక్సిస్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించిందని ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకు గాను యాక్సిస్ బ్యాంకునకు రూ. 3కోట్ల జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలోతెలిపింది. -
ఈ నోట్లను ఏం చేసుకోమంటారు?
కాన్పూర్ : పొరపాటు ఎక్కడ దొర్లిందో తెలీదుగానీ ఖాతాదారులు మాత్రం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఏటీఎమ్ మెషీన్ నుంచి బొమ్మ నోట్లు రావటం కాన్పూర్‌లో కలకలం రేపింది. చెల్లని వాటిని ఏం చేయాలో తెలీక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే... స్థానిక మార్బుల్ మార్కెట్లో ఉన్న ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎమ్ నుంచి ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు నగదు విత్‌డ్రా చేశారు. అయితే అందులో 500 రూ.. నోట్లు చిన్న పిల్లలు ఆడుకునేవి (చిల్డ్రన్ బ్యాంక్) రావటంతో ఆందోళన చెందారు. వెంటనే సెక్యూరిటీ గార్డు దృష్టికి ఈ విషయాన్ని తెలియజేయగా... సోమవారం వాటిని మార్చి ఇప్పిస్తానని గార్డు తెలియజేశాడు. అంతకు ముందు డ్రా చేసిన మరికొందరికి కూడా ఇలాంటి నోట్లే వచ్చినట్లు తెలిసింది. దీంతో అంతా కలిసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏటీఎంను మూసివేయించారు. ఆదివారం సెలవు దినం కావటంతో సోమవారం ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని సౌత్ కాన్పూర్ ఎస్పీ తెలియజేశారు. ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... అప్పటిదాకా ఈ నోట్లను ఏం చేయాలని? తమ అవసరాలకు ఎలాగని? ఖాతాదారులు నిలదీశారు. కానీ, పోలీసుల నుంచి మాత్రం సమాధానం లేదు. తరచూ జరిగే ఇలాంటి ఘటనలపై విమర్శలు వినిపిస్తున్నా.. ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. Kanpur: An Axis Bank ATM located in Marble Market dispensed fake currency notes with 'Children Bank of India' printed on them. pic.twitter.com/fu7D2QbZtB — ANI UP (@ANINewsUP) 11 February 2018 -
తుపాకీ మిస్‌ఫైర్ ఇద్దరు గార్డులకు స్వల్పగాయాలు
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. తుపాకీలోని బుల్లెట్లను చెక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. మిస్‌ఫైర్ అయిన గన్‌లోని బుల్లెట్ నేలను కొట్టుకుని ముక్కలై పక్కనే ఉన్న ఇద్దరు గార్డులకు తగలడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ బేగంపేట గురిమూర్తినగర్‌లోని యాక్సిస్ బ్యాంక్ నుంచి నగదును ఏటీఎం సెంటర్లతో పాటు ఇతర బ్రాంచ్‌లకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో భద్రత కోసం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని చెక్మెట్ సెక్యూరిటీ సంస్థ గార్డ్ సురేశ్‌కుమార్ శనివారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చారు. అతని వద్దనున్న లైసెన్స్డ్ డబుల్ బారెల్ గన్‌లో బుల్లెట్లను చూపాల్సిందిగా అక్కడి సెక్యూరిటీ అధికారి రామకృష్ణ అడిగారు. బుల్లెట్లను చూపించే క్రమంలో సురేశ్ చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. బుల్లెట్ భూమిని తాకి ముక్కలై పక్కనే ఉన్న అదే సంస్థలో పనిచేసే తోటి గార్డులు శ్రీనివాసులు (40), మహేశ్వరరావు (45)లకు తగిలాయి. స్వల్ప గాయాలకు గురైన వీరిని చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బేగంపేటలో గన్ మిస్‌ఫైర్
-
యాక్సిస్ బ్యాంక్ లాభం 25% అప్
ముంబై: యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.726 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.580 కోట్లు)తో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు కూడా తగ్గినప్పటికీ, కేటాయింపులు తక్కువగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండడంతో నికర లాభంలో మంచి వృద్ధి సాధించినట్లు వివరించింది. రిటైల్ రుణాలు 29 శాతం వృద్ధి... ఈ త్రైమాసికంలో బ్యాంకు స్థూల మొండి బకాయిలు 5.22 శాతం నుంచి 5.28 శాతానికి, నికర మొండి బకాయిలు 2.18 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగాయి. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడింది. ఈ క్యూ2లో స్థూల మొండి బకాయిలు 5.90 శాతంగా, నికర మొండి బకాయిలు 3.12 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాలు 21 శాతం వృద్ధితో రూ.4,20,923 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాలు 29 శాతం వృద్ధితో రూ.1,93,296 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణాల్లో 41 శాతంగా ఉండే కార్పొరేట్ రుణాలు 12 శాతం పెరిగి రూ.1,72,743 కోట్లకు చేరాయి. స్వల్పంగా తగ్గిన మొత్తం ఆదాయం... గత క్యూ3లో రూ.14,501 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.14,315 కోట్లకు తగ్గిందని బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం 24 శాతం తగ్గి రూ.2,593 కోట్లకు, నిర్వహణ లాభం 17 శాతం తగ్గి రూ.3,854 కోట్లకు పరిమితమయ్యాయి. క్యూ3లో రూ.3,796 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.2,811 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు 26 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 11% చొప్పున తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం రూ.4,334 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.4,732 కోట్లకు, వ్యాపారం 11% వృద్ధితో రూ.6,43,938 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 10 శాతం ఎగిశాయి. ఈ క్యూ3లో 105 కొత్త బ్రాంచీలను ప్రారంభించామని, మొత్తం బ్రాంచీల సంఖ్య 3,589కు పెరిగిందని బ్యాంకు తెలియజేసింది. 25 శాతం తగ్గిన కేటాయింపులు ఏడు క్వార్టర్ల క్రితం రూ.22,600 కోట్లుగా ఉన్న సందేహాస్పద ఖాతాలకు సంబంధించిన వాచ్‌లిస్ట్ ఈ క్యూ3లో రూ.5,300 కోట్లకు తగ్గిందని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. మొత్తం కేటాయింపులు 25% తగ్గి రూ.2,811 కోట్లకు తగ్గాయని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 65%కి పెరిగిందని వివరించారు. క్యూ2 ఫలితాలు ప్రకటించక ముందే వాట్సాప్‌లో లీకైన కేసు దర్యాప్తు విషయంలో సెబీకి సహకరిస్తున్నామని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఫలితాలు అంచనాలను మించడంతో షేర్ 3.5% లాభంతో రూ.611 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.621ను తాకింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 25శాతం జంప్..కానీ..
సాక్షి,ముంబై: యాక్సిస్బ్యాంకు క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో వృద్దిని నమోదు చేసింది. నికర లాభంలో 25శాతం పెరుగుదలను నమోదు చేసింది, అధిక వడ్డీ, ఫీజు ఆదాయాలు,బ్యాడ్ లోన్ల తగ్గుదల నేపథ్యంలో లాభాల్లో మెరుగుపడింది. యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నికరలాభం 25 శాతం పెరిగి రూ .726 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .580 కోట్ల నుంచి రూ .780 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్ల బెడద 5.28 శాతానికి దిగివచ్చింది. ఇది గత క్వార్టర్లో 5.90శాతం ఉండగా, గత ఏడాది 5.22శాతంగా ఉంది. -
మొండి బాకీల ముప్పు.. మరో రూ.40 వేల కోట్లు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగానికి మొండిబకాయిల(ఎన్పీఏ) బెడద ఇప్పట్లో తీరేలా కనబడటంలేదు. ఇప్పటికే కొండలాపేరుకుపోయిన ఈ మొండిబాకీలకు మరో రూ.40 వేల కోట్ల మేర అదనంగా ఎన్పీఏలు జతయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ రంగం ఆందోళనచెందుతోంది. ఆర్బీఐ ఆదేశాలతో యాక్సిస్ బ్యాంక్ కన్సార్షియంకు చెందిన ఎనిమిది రుణ ఖాతాలను ఎన్పీఏలుగా పునర్‌వర్గీకరించడమే దీనికి ప్రధాన కారణం. 2016–17కు సంబంధించి వార్షిక రిస్క్ ఆధారిత పర్యవేక్షణ ప్రక్రియ(ఆర్బీఎస్)లో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికి యాక్సిస్ రుణాల వర్గీకరణ, కేటయింపులపై ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీచేసింది. దీని ఫలితంగా మొత్తం 9 స్టాండర్డ్ (క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవి)రుణ ఖాతాలను ఎన్పీఏలుగా చూపాల్సివచ్చిందని.. ఇందులో 8 ఖాతాలు కన్సార్షియం (ఇతర బ్యాంకులతో కలిపి ఇచ్చిన రుణాలు)కు చెందినవని ఇటీవలి క్యూ2(2017–18, సెప్టెంబర్ క్వార్టర్) ఫలితాల సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ వరకూ ఈ 9 ఖాతాలనూ యాక్సిస్ బ్యాంక్ స్టాండర్డ్ రుణాలుగానే ఖాతా పుస్తకాల్లో వర్గీకరించింది. జూన్ చివరినాటికి ఈ ఖాతాల రుణ బకాయిల విలువ దాదాపు రూ.42,000 కోట్లుగా అంచనా. వీటిలో కేవలం 6 శాతం రుణ బకాయిని మాత్రమే ఎన్పీఏలుగా యాక్సిస్ లెక్కగట్టడం గమనార్హం. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ ఎన్పీఏలుగా ప్రకటించడంతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకుల్లో భయం మొదలైంది. తమ రుణ బకాయిల పరిస్థితి ఏంటన్నది ఆయా బ్యాంకుల ఆందోళన. అవి కూడా ఆ ఖాతాల్ని ఎన్పీఏలుగా చూపించాల్సివుంటుంది.ఇప్పటికే బ్యాంకింగ్ రంగం రూ.8 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వెలువడిన క్యూ2 ఫలితాలను చూస్తే.. పరిస్థితి కుదుటపడకపోగా, ఎన్పీఏలు అంతకంతకూ పెరుగుతున్న దాఖలాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. లాభాలకు చిల్లు.. ‘యాక్సిస్ చర్యలతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ ఖాతాలకు సంబంధించి తమ రుణాలను కూడా ఆయా బ్యాంకులు రేపోమాపో ఎన్పీఏలుగా చూపాల్సివస్తుంది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఈ పునర్వర్గీకరణ ఉండొచ్చు. దీంతో మరిన్ని కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాల్సి వస్తుంది. మొత్తానికి వాటి లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని మెక్వారీ క్యాపిటల్ సెక్యూరిటీస్‌కు చెందిన సురేష్ గణపతి వ్యాఖ్యానించారు. మరోపక్క, ఇప్పటికే కన్సార్షియంలోని ఒక బ్యాంకు ఈ ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించిన నేపథ్యంలో.. మిగతా బ్యాంకులు ఈ ఖాతాలకు(రుణ గ్రహీతలు) కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని ఒక సీనియర్ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది మార్చి క్వార్టర్ స్థూల ఎన్‌పీఏల్లో రూ.5,637 కోట్లు తక్కువగా చూపినట్లు ఆర్బీఐ తనిఖీల్లో బయటపడింది. దీంతో మార్చి చివరినాటికి బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ.21,280 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు పెరిగినట్టు లెక్క. సెప్టెంబర్ క్వార్టర్లో స్థూల, నికర ఎన్పీఏలు భారీగా పెరగడం తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్‌కు మొండి బాకీల సెగ..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 38 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.319 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం ఈ క్యూ2లో రూ.432 కోట్లకు ఎగసిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడం, లెక్కలో చూపని మొత్తాలను ఆర్బీఐ కనిపెట్టడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, లో బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ బ్యాంక్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని నిపుణులంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఈ బ్యాంక్ రూ.1,305 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో మొత్తం ఆదాయం రూ.13,699 కోట్ల నుంచి రూ.13,821 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. మరింత అధ్వానంగా రుణ నాణ్యత... అగ్రశ్రేణి మూడు ప్రైవేట్ బ్యాంక్‌ల్లో ఈ బ్యాంక్‌కే అధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.16,379 కోట్ల నుంచి రూ.27,402 కోట్లకు, అలాగే నికర మొండి బకాయిలు రూ.8,926 కోట్లకు ఎగిశాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 4.17% నుంచి 5.90%కి, అలాగే నికర మొండి బకాయిలు 2.02% నుంచి 3.12%కి ఎగిశాయని పేర్కొన్నారు. రానున్న రెండు క్వార్టర్లలో రుణ నాణ్యతపై మరింత ఒత్తిడి తప్పదని, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.4,514 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.4,540 కోట్లకు చేరిందని, నికర వడ్డీ మార్జిన్ 3.45%గా నమోదైందని వివరించారు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రెండు మొండి బకాయిల జాబితాల్లో తమ బ్యాంక్‌కు చెందిన రూ.7,041 కోట్ల ఖాతాలున్నాయని వివరించింది. మరోవైపు తొమ్మిది ఖాతాల్లో రూ.4,800 కోట్ల అక్రమ మళ్లింపును ఆర్బీఐ గుర్తించిందని, వీటిని మొండి బకాయిలుగా పరిగణించాలని ఆదేశించిందని వివరించారు. ఈ ఖాతాల కోసం ఈ క్యూ2లో రూ.505 కోట్ల కేటాయింపులు జరిపామని, దీంతో ఈ మొండి పద్దుల కోసం మొత్తం కేటాయింపులు రూ.3,886 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ, బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1.4 శాతం నష్టపోయి రూ.513కు పడిపోయింది. -
యాక్సిస్ బ్యాంక్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
బ్యాంక్ నిఫ్టీలో భాగమైన బ్యాంకింగ్ షేర్లలో కొన్ని ఒకటి, రెండు వారాల గరిష్టస్థాయిలో ముగియగా, మరికొన్ని రెండు, మూడు వారాల కనిష్టస్థాయిలో క్లోజయ్యాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్ షేరు 2.1 శాతం మేర క్షీణించి మూడు వారాల కనిష్టస్థాయి రూ. 492.75 వద్ద ముగిసింది. ఈ షేరు ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 18.74 లక్షల షేర్లు (6.18 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 3.21 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ప్రీమియం మాత్రం రూ. 1.30 నుంచి రూ. 2.50కి పెరిగింది. స్పాట్ అమ్మకాలకు రివర్స్‌లో ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. షేరు క్షీణించినప్పటికీ, ఆప్షన్స్ విభాగంలో రూ. 500 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో మరో 20 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 13.65 లక్షల పుట్ బిల్డప్ వుంది. ఇదే స్ట్రయిక్ వద్ద తాజా కాల్ రైటింగ్ ఫలితంగా 6.30 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం కాల్ బిల్డప్ 9.75 లక్షలకు చేరింది. రూ. 510 స్ట్రయిక్ వద్ద సైతం భారీ కాల్‌రైటింగ్ ఫలితంగా 2.73 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం బిల్డప్ 13.29 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 490, రూ. 480 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ రైటింగ్ జరిగింది. ఈ స్ట్రయిక్స్ వద్ద 4.46 లక్షలు, 5.49 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ వుంది. ఈ కౌంటర్లో బుల్స్, బేర్స్ హోరాహోరీగా వున్నారని, దీంతో యాక్సిస్ బ్యాంక్ సమీప భవిష్యత్తులో రూ. 480–510 శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఫ్యూచర్స్, ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. -
కంపెనీలకు యాక్సిస్ బ్యాంకు హెచ్చరిక
సాక్షి, ముంబై : బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టి, ఏం పట్టనట్టు కాలయాపన చేస్తున్న సంస్థలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉక్కుపాదం మోపుతోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆ సంస్థలపై కఠిన చర్యలకు బ్యాంకులు కూడా సిద్ధమయ్యాయి. బ్యాంకులకు భారీగా బాకీపడిన కంపెనీల అదనపు జాబితాను ఆర్బీఐ రూపొందించిందని, వీటిపై బ్యాంకులు దృష్టిసారించాలని యాక్సిస్ బ్యాంకు చెప్పింది. డిసెంబర్ 13 వరకు వారు తమ సమస్యాత్మక రుణాలను పరిష్కారం చేసుకోకపోతే, దివాలా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని డిఫాల్టర్ సంస్థలను యాక్సిస్ బ్యాంకు హెచ్చరించింది. అయితే ఆ కంపెనీల జాబితాను మాత్రం యాక్సిస్ బ్యాంకు విడుదల చేయలేదు. ఎన్ని కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయో కూడా బహిర్గతం చేయలేదు. తొలిసారి ఆర్బీఐ జారీచేసిన ఆదేశాల్లో, డిసెంబర్ మధ్య వరకు కంపెనీలు తమ రుణాల సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే దివాలా కోర్టుకు తరలించాలని బ్యాంకులకు పేర్కొంది. ఈ జాబితాలో కనీసం 20 బాకీపడిన కంపెనీలుండగా... వాటిలో 12 అతిపెద్ద డిఫాల్టడ్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం రెండో విడత జాబితాను కూడా ఆర్బీఐ రూపొందించిందని తెలిసింది. వీటిలో 26 వరకు సంస్థలున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులకు అందిస్తున్న కొత్త అధికారాల కింద ఈ సంస్థలు గడువు లోపు బకాయిలను పరిష్కరించుకోకపోతే దివాలా కోర్టుకు తరలించాలని ఆదేశించింది. ఆర్బీఐ జాబితాలోని 12 కంపెనీల రుణాల్లో యాక్సిస్ బ్యాంకు అవుట్‌స్టాండింగ్ లోన్స్ 1843 కోట్లు. నాన్-ఫండ్ అవుట్‌స్టాండింగ్ లోన్స్ 649 కోట్లు. -
కొత్త హోం లోన్ ఆఫర్: కొన్ని ఈఎంఐలు రద్దు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్త గృహ రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గృహ ఋణ మార్కెట్లో ఎక్కువ మార్కెట్ వాటాను సంపాదించడానికి గుడ్ క్రెడిట్ అవార్డ్ కోసం ‘శుభ్ ఆరంభ్‘ పేరిట ఈ గృహ రుణ పథకాన్ని లాంచ్ చేసింది. ఇందులో కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. రూ. 30లక్షల రుణంపై దాదాపు మూడులక్షల దాకా తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అంటే 20 ఏళ్ల కాలానికి సంబంధించిన రుణాలపై ఈఎంఐలను రద్దు చేస్తోంది. అయితే ఫ్లోటింగ్ రుణ పథకం కింద వడ్డీ రేటుమాత్రం స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. దీంతోపాటు అర్హులైన వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును కూడా పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకనటలో తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ ట్విట్టర్ లో అందించిన సమాచారం ప్రకారం ఈ కొత్త రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని రూపొందించింది. 4, 8, 12 వ సం.రం చివరలో సంవత్సరానికి 4 నెలసరి వాయిదాలు చొప్పున రద్దు చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర ప్రయోజనం కస్టమర్లకు లభించనుంది. అంటే ఈ కొత్త పథకం ద్వారా సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. అలాగే రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. అంతేకాదు ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవని బ్యాంక్ స్పష్టం చేసింది. You're closer to owning a home with the launch of Shubh Aarambh Home Loans. It's the helping hand you need, w/ 4 EMIs waived* every 4 years pic.twitter.com/kibU6QzOqF — Axis Bank (@AxisBank) August 17, 2017 -
యాక్సిస్ బ్యాంక్ ‘శుభ్ ఆరంభ్’
♦ అందుబాటులోకి కొత్త గృహ రుణ పథకం ♦ కొన్ని ఈఎంఐల మాఫీ ప్రయోజనం ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ‘శుభ్ ఆరంభ్‘ పేరిట మరో గృహ రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. నాలుగు, ఎనిమిది, పన్నెండు సంవత్సరాల చివర్లో నాలుగు ఈఎంఐలను బ్యాంక్ మాఫీ చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర మాఫీ లభిస్తుంది. సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. ఆసాంతం వడ్డీ రేటు స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. ఒకవేళ ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవు. -
సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథాప్రకారం 4 శాతంగానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రూ. 1 కోటి కన్నా తక్కువగా డిపాజిట్లున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్లపై రేటును తగ్గించాయి. -
యాక్సిస్ బ్యాంకు కూడా తగ్గించేసింది
ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు కూడా వడ్డీరేటులో కోత పెట్టింది. అంచనాలకనుగుణంగానే యాక్సిస్ కూడా వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సేవింగ్ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది. పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ అర శాతం తగ్గించింది. 3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల వరకు వరకు నిల్వ (బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది. రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కూడా సేవింగ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
యాక్సెస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ వాలెట్
-
యాక్సిస్ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్
► రూ. 385 కోట్లకు విక్రయం ► 90 శాతం డిస్కౌంటుకు అమ్మేసిన స్నాప్‌డీల్ ముంబై: నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా తమ గ్రూప్‌లో భాగమైన పేమెంట్ వాలెట్ సంస్థ ఫ్రీచార్జ్‌ను.. యాక్సిస్ బ్యాంకుకు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ.385 కోట్లు. 2015లో ఫ్రీచార్జ్‌ను కొనేందుకు స్నాప్‌డీల్ వెచ్చించిన 400 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.2,600 కోట్లు) పోలిస్తే ఇది సుమారు 90 శాతం తక్కువ. మార్కెట్ వర్గాల ప్రకారం ఇతర సంస్థలు ఫ్రీచార్జ్ కొనుగోలుకు 15–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పోటీ వాలెట్ సంస్థ పేటీఎం సుమారు 10–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేయగా, ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుకు ఆఖర్లో పోటీకి దిగింది. టెక్నాలజీ ప్లాట్‌ఫాం, కస్టమర్ల సంఖ్య, బ్రాండ్, సమర్థత మొదలైన వాటి కారణంగా ఫ్రీచార్జ్‌పై తాము ఆసక్తి చూపినట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ తెలిపారు. ఇలాంటి డీల్స్‌కి ప్రత్యేకంగా విలువ కట్టడం కష్టమన్నారు. మరోవైపు, ఈ ఒప్పందం ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ చెప్పారు. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కొనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఫ్రీచార్జ్‌ను యాక్సిస్ బ్యాంకు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రీచార్జ్ .. యాక్సిస్‌ల కథ ఇదీ.. ఫ్రీచార్జ్‌కి 5.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. వీరిలో 70% మంది 30 ఏళ్ల లోపు వారే. గతేడాది సుమారు రూ.80 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక యాక్సిస్ బ్యాంక్‌కు 2 కోట్ల సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు.. బ్రోకరేజి, మ్యూచువల్ ఫండ్స్, ఇతరత్రా రుణగ్రహీతల రూపంలో మరో 30 లక్షల మంది యూజర్లున్నారు. యాక్సిస్‌కు ఇప్పటికే లైమ్ పేరిట ప్రీపెయిడ్ పేమెంట్ వాలెట్ ఉంది. ఇప్పుడు ఫ్రీచార్జ్‌ను కూడా కొనడంతో ఈ రెండింటిని విలీనం చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చని బ్యాంకు సీఈవో శిఖా శర్మ తెలిపారు. మూడోసారీ సీఈవోగా శిఖా శర్మే.. కొత్త ఎండీ, సీఈఓ పగ్గాలు చేపట్టే వారిపై ఊహాగానాలకు తెరదించుతూ మూడోసారి కూడా శిఖా శర్మే ఆ హోదాల్లో కొనసాగుతారని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2021 జూన్ దాకా ఆమె పదవీ కాలం ఉంటుంది. ‘ 2018 జూన్ 1 నుంచి మూడేళ్ల పాటు ఎండీ, సీఈవోగా శిఖా శర్మ పునర్నియామకాన్ని జులై 26న జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది’ అని యాక్సిస్ తెలియజేసింది. యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ వారసులను అన్వేషిస్తోందని, టాటా సన్స్ ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు రావడం తెలిసిందే. ఐసీఐసీఐలో 1980లో కెరియర్ ప్రారంభించిన శిఖా శర్మ.. 2009లో అయిదేళ్ల కాల వ్యవధికి యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా చేరారు. రెండో దఫా కూడా ఆమె నియమితులయ్యారు. -
రూమర్లకు చెక్.. బ్యాంకు సీఈవోగా మళ్లీ ఆమె
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు సీఈవోగా శిఖా శర్మ నిష్క్రమించబోతున్నారనే ఊహాగానాలకు చెక్ పడింది. మరో మూడేళ్ల పాటు బ్యాంకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా శిఖా శర్మనే నియమిస్తూ యాక్సిస్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అంటే 2021 జూన్ వరకు శిఖా శర్మ ఆ పదవిలో కొనసాగనున్నారు. 2017 జూలై 26న సమావేశమైన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, శిఖా శర్మ పునఃనియామకాన్ని ఆమోదించారు. 2018 జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని బ్యాంకు గురువారం బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ వారం మొదట్లో వచ్చిన రిపోర్టులలో టాటా ఫైనాన్సియల్ సర్వీసెస్ వర్టికల్ అధినేతగా శిఖా శర్మను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రతిపాదించారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆమె యాక్సిస్ బ్యాంకు వీడబోతున్నట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ రిపోర్టులను బ్యాంకు ఖండించింది. బ్యాంకు ఎండీ, సీఈవోగా హెడ్ హంటింగ్ ఏజెన్సీ ఇగోన్ జెహ్న్డర్ను నియమించుకుందని వచ్చిన రిపోర్టులను కూడా బ్యాంకు కొట్టిపారేసింది. ''ప్రస్తుతం మన మధ్య చక్కర్లు కొడుతున్నవన్నీ రూమర్లు, వాటిలో ఎలాంటి నిజాలు లేవు. ఇన్స్టిట్యూషన్కు ఎంతో అంకితభావంతో పనిచేసే నేను ఈ రూమర్లను మార్చలేను'' అని శర్మ చెప్పారు. బ్యాంకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, బ్యాంకు, షేర్హోల్డర్స్తో కలిసి పనిచేయడానికి తాను శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. 2018 జూన్ నాటికి తనకి, బ్యాంకుతో ఉన్న సంబంధానికి తొమ్మిదేళ్ల పూర్తవుతుందన్నారు. శిఖాశర్మను యాక్సిస్ బ్యాంకు 2009లో నియమించుకుంది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ నుంచి ఆమె యాక్సిస్ బ్యాంకుకు వచ్చారు. 1980లో ఇన్ఫ్రా లెండర్ ఐసీఐసీఐ లిమిటెడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన శిఖాశర్మ, గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బిజినెస్‌లలో కీలక పాత్ర పోషించారు. -
ఫ్రీచార్జ్‌పై యాక్సిస్ బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో భాగమైన ఫ్రీచార్జ్‌ను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 350–400 కోట్ల దాకా చెల్లించేలా స్నాప్‌డీల్‌తో ఒప్పందం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డీల్ దాదాపు పూర్తయిపోయినట్లేనని, మరికొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ’కీలకమైన వ్యాపార ప్రకటన’ చేసేందుకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించిన నేపథ్యంలో డీల్ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 ఏప్రిల్‌లో ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్‌గా నిల్చింది. ఫ్రీచార్జ్ కొనుగోలుతో దీని 5 కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు యాక్సిస్‌కు చేరువ కాగలరు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే? తమ సంస్థ కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 900–950 మిలియన్ డాలర్ల డీల్‌కు స్నాప్‌డీల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇక స్నాప్‌డీల్‌లోని మిగతా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో షేర్ల మార్పిడి నిష్పత్తిని ఫ్లిప్‌కార్ట్ ఖరారు చేయొచ్చు. విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 20% వాటాలు దక్కే అవకాశముంది. ప్రారంభ దశలో స్నాప్‌డీల్ బ్రాండ్ పేరును ఫ్లిప్‌కార్ట్ అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది. స్నాప్‌డీల్ కొనుగోలుకు తొలుత బిలియన్ డాలర్లు ఇవ్వజూపిన ఫ్లిప్‌కార్ట్.. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల మదింపు అనంతరం 550 మిలియన్ డాలర్లకు కుదించి.. మళ్లీ తాజాగా 900–950 మిలియన్ డాలర్లకు పెంచింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 16శాతం క్షీణత
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన క్వార్టర్లో 16 శాతం క్షీణించి రూ. 1,556 కోట్ల నుంచి రూ. 1,306 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు ఆదాయం రూ. 13,852 కోట్ల నుంచి రూ. 14,052 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2016 జూన్ క్వార్టర్‌తో పోలిస్తే తాజా త్రైమాసికంలో భారీగా 2.54 శాతం నుంచి 5.03 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 2.30 శాతానికి ఎగిశాయి. విలువపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,553 కోట్ల నుంచి రూ. 22,030 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ.4,010 కోట్ల నుంచి రూ. 9,766 కోట్లకు చేరాయి. ముగిసిన త్రైమాసికంలో అదనంగా రూ. 3,519 కోట్ల స్థూల ఎన్పీఏలు ఏర్పడ్డాయని, రూ. 2,462 కోట్ల మేర రైటాఫ్‌లు చేసినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,117 కోట్ల నుంచి రూ. 2,342 కోట్లకు పెరిగాయి. టెలికం, ఇన్ఫ్రా, ఇనుము, ఉక్కు, విద్యుత్ రంగాలకు ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని 1 శాతం మేర పెంచినట్లు బ్యాంకు తెలిపింది. -
ప్రైవేట్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు పడిపోయింది
ముంబై : దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు లాభాలు 16 శాతం క్షీణించి రూ.1,306 కోట్లగా నమోదయ్యాయి. అంచనాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంతే. గతేడాది ఇదే క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.1,555.53 కోట్లగా ఉన్నాయి. అయితే క్వార్టర్ క్వార్టర్‌కు బ్యాంకు లాభాలు 7 శాతం పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయాల వృద్ధి తక్కువగా ఉండటంతో పాటు, నిర్వహణ లాభాలు, అత్యధిక మొత్తంలో ప్రొవిజన్లు తమ లాభాలపై ప్రభావం చూపాయని బ్యాంకు చెప్పింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఏడాది ఏడాదికి 2.36 శాతం తగ్గి రూ.4,616.14 కోట్లగా నమోదైంది. ఇవి విశ్లేషకుల అంచనాలను మిస్ అయ్యాయి. గ్లోబల్‌గా నికర వడ్డీ మార్జిన్లు 3.63 శాతం, దేశీయ వడ్డీ మార్జిన్లు 3.85 శాతం క్షీణించాయి. స్థూల నిరర్థక ఆస్తులు 5.03 శాతం పెరిగినప్పటికీ, ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. మార్చి క్వార్టర్లో ఈ నిరర్థక ఆస్తులు 5.04 శాతంగా పెరిగిన సంగతి తెలిసిందే. నికర ఎన్పీఏలు స్వల్పంగా 2.11 శాతం నుంచి 2.30 శాతం పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 10.62 శాతం పెరిగి రూ.2,341.93 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇవి రూ.2117.17 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు షేర్లు నేటి మార్కెట్లో 1.94 శాతం పైన ముగిశాయి. -
గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోవాలో జీఎంఆర్ ప్రతిపాదించిన మోపా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ పూర్తయింది. విమానాశ్రయ అభివృద్ధికై యాక్సిస్ బ్యాంకు రూ.1,330 కోట్ల రుణాన్ని సమకూరుస్తోంది. ఉత్తర గోవాలోని మోపా ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టును 2016 నవంబరులో జీఎంఆర్ దక్కించుకుంది. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తోపాటు విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు జీఎంఆర్ నిర్వహిస్తుంది. మరో 20 ఏళ్లపాటు నిర్వహణ కాంట్రాక్టు పొడిగించేందుకు అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్‌కు అనుగుణంగా దశలవారీగా విస్తరణ చేపడతామని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. -
మాంచి జోష్‌తో మార్కెట్లు ఎంట్రీ
ముంబై : జూన్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ గడువు నేటితో ముగుస్తుండగా, మార్కెట్లు మంచి జోష్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పైకి ఎగిసి, 31,034 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 66.35 పాయింట్ల లాభంలో 9,550కి పైన లాభాలు పండిస్తోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస, టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ అండ్ టీలు ఎక్కువగా లాభాలు పండించాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 100 పాయింట్లు పైకి జంప్ చేసింది. గోవా కార్బన్, అమ్టెక్ ఆటో, మెటాలిస్ట్ ఫర్గింగ్స్, జేపీ ఇన్ఫ్రాటెక్, జయప్రకాశ్ అసోసియేట్స్, మైండ్ ట్రీ, హెక్సావేర్, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, శ్రీరేణుక, బజాజ్ హిందూస్తాన్, ఇండియా సిమెంట్స్ 1-5 శాతం ర్యాలీ జరిపాయి. ఇదే సమయంలో ఆర్సీఎఫ్ 5 శాతం మేర పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.44 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 7 రూపాయల లాభంతో 28,560 వద్ద నడుస్తున్నాయి. -
యాక్సిస్ బ్యాంక్ ద్వారానే కార్యకలాపాలు
డెక్కన్ క్రానికల్‌కు డీఆర్టీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) సంస్థ ఆర్థిక వ్యవహారాలు, ప్రకటనలు, సర్క్యులేషన్ ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలన్నీ యాక్సిస్ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) డీసీహెచ్ఎల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే డీసీహెచ్ఎల్ ఇతర బ్యాంకుల్లో నిర్వహిస్తున్న కరెంటు ఖాతాల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రవీణరెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తమ బ్యాంకు నుంచి డీసీహెచ్ఎల్ తీసుకున్న రూ.430 కోట్ల రుణం వసూలు కోసం యాక్సిస్ బ్యాంకు గతంలో డీఆర్టీని ఆశ్రయించింది. ఇందులో భాగంగా డీసీహెచ్ఎల్ ఆర్థిక కార్యకలాపాలన్నీ తమ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఇటీవల మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అప్పులేని బ్యాంకుల ద్వారానే ఆదాయ, వ్యయాల ఖాతాలను డీసీహెచ్ఎల్ నిర్వహిస్తోందని, అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లోనే ఆదాయ, వ్యయాల ఖాతాలు నిర్వహించాల్సి ఉందని యాక్సిస్ బ్యాంకు డీఆర్టీకి నివేదించింది. ఈనెల 19న ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో డీసీహెచ్ఎల్ కౌంటర్ దాఖలు చేయకపోగా, ఆ సంస్థ తరఫున న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీచేస్తూ ప్రధాన పిటిషన్‌పై విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. -
యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు కోత
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లపై గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో రేట్లను సమీక్షించినట్టు బ్యాంకు చెప్పింది. దీంతో 30 లక్షల వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికి దిగొచ్చింది. ఇండస్ట్రీలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి. 2017 మే 16 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని బ్యాంకు చెప్పింది. ఇప్పటివరకు 75 లక్షల వరకున్న గృహరుణాలపై 8.65 శాతం వడ్డీరేట్లున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీరేట్లను 8.35శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యర్థులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా గతవారంలోనే తమ వడ్డీరేట్లను తగ్గించాయి. యాక్సిస్ బ్యాంకు రుణాలు సమీక్షించిన వడ్డీరేట్లు సెగ్మెంట్ 30లక్షల వరకు 30-75 లక్షలు 75 లక్షలకు పైబడి శాలరీ 8.35శాతం 8.65 శాతం 8.70శాతం సెల్ఫ్ ఎంప్లాయిడ్ 8.40శాతం 8.70 శాతం 8.75శాతం -
యాక్సిస్‌కు ఎన్పీఏల సెగ!
► క్యూ4 లాభం 43% డౌన్; 1,225 కోట్లు ► నికర మొండి బకాయిలు 2.11 శాతం ► పూర్తి ఏడాదికి లాభం రూ.3,953 కోట్లు న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకుకు మొండిబకాయిల (ఎన్పీఏ) సెగ గట్టిగా తగిలింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లాభం 43 శాతం తరిగిపోయింది. ఈ కాలంలో బ్యాంకు రూ.1,225 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.2,154 కోట్లు కావడం గమనార్హం. వసూలు కాని మొండిబకాయిలకు నిధుల కేటాయింపులు చేయడమే లాభాలు తరిగిపోవడానికి కారణమని బ్యాంకు తెలియజేసింది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.13,593 కోట్లు. స్థూల ఎన్పీఏలు అంతకుముందు ఇదే కాలంలో ఉన్న 1.67 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగిపోయాయి. నికర ఎన్పీఏలు సైతం 0.70 శాతం నుంచి 2.11 శాతానికి చేరాయి. దీంతో ఎన్పీఏల కోసం ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ.2,581 కోట్లను కేటాయించి పక్కన పెట్టాల్సి వచ్చింది. 2015–16 మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు రూ.1,168 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికం. అయితే, 2016 డిసెంబర్ త్రైమాసికంలో కేటాయింపులు రూ.3,795 కోట్ల కంటే కొంచెం తగ్గాయి . స్థూల ఎన్పీఏలకు మార్చి త్రైమాసికంలో నికరంగా రూ.4,811 కోట్లు జతయ్యాయి. ఇదే సమయంలో వసూలైన బకాయిలు రూ.2,804 కోట్లుగానే ఉన్నాయి. దీంతో రూ.1,194 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు బ్యాంకు తెలిపింది. ఇక 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్జించిన లాభం రూ.3,953 కోట్లుగా ఉంది. 2015–16లో వచ్చిన లాభం రూ.8,223 కోట్లతో పోలిస్తే 52.65 శాతం తరిగిపోయింది. ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ.50,359 కోట్ల నుంచి రూ.56,233 కోట్లకు వృద్ధి చెందింది. కంపెనీకి ఇన్నాళ్లూ దన్నుగా నిలిచిన కార్పొరేట్ రుణాల విభాగం ఫ్లాట్‌గా కొనసాగగా, రిటైల్ రుణ విభాగం మాత్రం 21 శాతం వృద్ధితో బ్యాంకుకు కీలకంగా నిలిచింది. ఈ దృష్ట్యా భవిష్యత్తులో రిటైల్ రుణాలపై మరింత దృష్టి సారించనున్నట్టు బ్యాంకు తెలిపింది. ఇంకా తమ ముందు సవాళ్లున్నట్టు బ్యాంకు సీఎఫ్‌వో జైరామ్ శ్రీధరన్ పేర్కొన్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుపై రూ.5 (250శాతం) డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంకు షేరు ధర బుధవారం అర శాతం పెరిగి రూ.517 వద్ద క్లోజయింది. -
పడిపోయిన ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్
ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద దిగ్గజం యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. బుధవారం ప్రకటించిన 2017 క్యూ4 ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు నికర లాభాలు 43 శాతం క్షీణించి, రూ.1,225.1 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. ఎక్కువ ప్రొవిజన్లు, తక్కువ ఆపరేటింగ్ ఇన్కమ్ తో బ్యాంకు లాభాల్లో పడిపోయినట్టు తెలిసింది. అయితే పన్నుల లాభాల్లో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు అధిగమించింది. ఈ క్వార్టర్లో పన్నుల అనంతరం బ్యాంకు లాభాలు కేవలం రూ.919 కోట్లగానే ఉంటాయని ఈటీనౌ పోల్ లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తోనే బ్యాంకు లాభాలు 111 శాతం పెరిగాయని వెల్లడైంది. డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.579.57 కోట్లగానే ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏ లెవల్స్ ను బ్యాంకు స్వల్పంగా తగ్గించుకుంది. డిసెంబర్ క్వార్టర్ లో 5.22 శాతంగా ఉన్న ఎన్పీఏ లెవల్స్ ను, ఈ క్వార్టర్ లో 5.04 శాతంకు తగ్గించుకుని రూ.21,280కోట్లగా నమోదుచేసింది. మొత్తం రైటాఫ్ లు రూ.1,194కోట్లగా ఉన్నాయని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలను కూడా 2.18 శాతం నుంచి 2.11 శాతం తగ్గించుకుంది. మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నాలుగో క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు ధర 0.42 శాతం పెరిగి, 517.30 రూపాయలుగా ముగిసింది. -
ఫ్రాన్స్ ఎన్నికలపై మార్కెట్ ఫోకస్
♦ ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుతో ఒడిదుడుకులు ♦ ప్రభావితం చేయనున్న ఆర్ఐఎల్, విప్రో యాక్సిస్ బ్యాంక్‌ల ఫలితాలు ♦ ఈసీబీ పాలసీపైనా ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ఫ్రాన్స్ ఎన్నికలు, కార్పొరేట్ ఫలితాల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలో(ఈ నెల 27న–గురువారం) ముగియనున్నందున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు, ఫ్రాన్స్ ఎన్నికల.. తదితరాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక ఈ శుక్రవారం (ఈ నెల28న) పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, విదేశీ కరెన్సీ నిల్వలు, బ్యాంక్ డిపాజిట్ వృద్ధి, బ్యాంక్ రుణ వృద్ధి.. ఈ అంశాలకు సంబంధించిన గణాంకాలు వెలువడుతాయి. నేడు ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండు ప్రభావం ఇప్పుడు అందరి దృష్టి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. కానీ ఏప్రిల్ 23.. ఆదివారం జరిగిన తొలి రౌండు ఎన్నికలు మార్కెట్లకు కీలకమని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ తొలి రౌండు ఫలితంతో మార్కెట్ ముందుగా సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ వీకే శర్మ చెప్పారు. మే 7న రెండో రౌండు ఎన్నికలు జరుగుతాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య తాజా పరిణామాలేవైనా సంభవిస్తే భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ప్రభావితమవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సంఘానియా అన్నారు. ఈ వారం జరిగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పాలసీ సమావేశం సైతం మార్కెట్ ట్రెండ్‌ను శాసిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గురువారం (27న) ఈసీబీ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. దిగ్గజ కార్పొరేట్ల ఫలితాలు... ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీల జనవరి–మార్చి క్వార్టర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా వెలువడిన క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఈ వారంలో రానున్న కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తున్నారు. సోమవారం(ఈనెల 24న) మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలు వస్తాయి. అదే రోజు అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంగళవారం(ఈ నెల 25న) యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ ప్రులైఫ్, బుధవారం(ఈ నెల 26న) జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, గురువారం(ఈ నెల27) మారుతీ సుజుకీ, బయోకాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, శుక్రవారం(ఈ నెల28) అంబుజా సిమెంట్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ తదితర కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.18,890 కోట్లు దేశీయ కేపిటల్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.18,890 కోట్లను ఎఫ్‌పీఐలు నికరంగా పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ 3–21 తేదీల మధ్య ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.1,132 కోట్లుగాను, డెట్ విభాగంలో రూ.17,758 కోట్లుగానూ ఉన్నాయి. -
బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ: లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనల నుంచి ఆసియన్ మార్కెట్లు తేరుకోవడంతో పాటు బ్యాంకు స్టాక్స్ ర్యాలీతో దేశీయ స్టాక్ సూచీల సెంటిమెంట్ మెరుగుపడి, లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 172.37 పాయింట్ల లాభంలో 29,409 వద్ద, 55.60 పాయింట్ల లాభంలో 9,100 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. బ్యాంకు స్టాక్స్ ర్యాలీ జరుపడంతో మార్కెట్లు లాభాల్లో నడిచినట్టు విశ్లేషకులు చెప్పారు. యాక్సిస్ బ్యాంకు 3 శాతం, హెచ్డీఎఫ్సీ 2 శాతం లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీలతో పాటు ఐషర్ మోటార్స్ నేటి ట్రేడింగ్ లో టాప్ గెయినర్‌గా చోటు దక్కించుకుంది. ఓఎన్జీసీ, లుపిన్, టెక్ మహింద్రా, కొటక్ మహింద్రా బ్యాంకు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. మైనార్టి స్టాక్ ను అమ్మడం ద్వారా ఫండ్స్ ను పెంచుకుంటుందనే వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ స్టాక్ చివరి గంట ట్రేడింగ్ లో 2 శాతం మేర పైకి ఎగిసింది. ఈ ఫండ్స్ ను రుణాలు తగ్గించుకోవడానికి కంపెనీ వాడనుందని తెలిసింది. 2016 డిసెంబర్ నాటిని జెట్ ఎయిర్ వేస్ నికర రుణం రూ.7,423 కోట్లగా ఉంది. -
ఆ రూమర్లను కొట్టిపారేసిన యాక్సిస్ బ్యాంకు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో కొంతమంది అధికారుల అవకతవకలు యాక్సిస్ బ్యాంకు తీవ్ర ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో ఆ బ్యాంకు విసుగెత్తిపోయింది. ఆ సమస్య కొంత సద్దుమణిగిందో లేదో యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలన్ని అసత్యమని యాక్సిస్ బ్యాంకు కొట్టిపారేసింది. తమ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేయడం లేదని యాక్సిస్ బ్యాంకు బుధవారం తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తుందంతా అబద్ధమని, ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రైవేట్ దిగ్గజం బీఎస్ఈకి స్పష్టంచేసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో కొన్ని శాఖల్లో నెలకొన్న అక్రమాలతో ఆదాయపు పన్ను శాఖ ఆ బ్యాంకుపై పలు దాడులు నిర్వహించింది. అంతేకాక మూడో క్వార్టర్ ఫలితాలు బ్యాంకును నిరాశపరిచాయి. మొండిబకాయిలు గుట్టలుగుట్టలుగా పెరిగిపోవడంతో బ్యాంకు నికర లాభాలు 73 శాతం పడిపోయి రూ.580 కోట్లగా నమోదయ్యాయి. -
డబ్బు మీది.. మోత మాది..
ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా చార్జీల మోత మోగించడానికి రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండంపై ఖాతాదారులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్యులు. ఇప్పుడు బ్యాంకులు ట్రాన్సాక్షన్ చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. చిత్తూరు : జిల్లాలో సుమారు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జిల్లా జనాభాలో 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి నుంచి పై స్థాయి వరకు దాదాపుగా అందరికీ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ప్రస్తుతం ఉన్న ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త ఛార్జీల వివరాలు పంపాయి. ఈ పెంపుపై జాతీయమీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా నో బ్యాంక్ ట్రాన్సాక్షన్డేగా ఏప్రిల్ 6ను ప్రకటించారు నెటిజన్లు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్ని రకాల బ్యాంకు ట్రాన్సాక్షన్లను నిలేపేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుములు పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడు సార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవిపై సర్వీస్ టాక్స్, రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ. 100 ఫెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు సార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతి రోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. హెచ్డీఎఫ్సీ.. ప్రతి నెలా నాలుగు ట్రాన్సాక్షన్లకు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కో రోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోబ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ ఛార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ.. నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుము ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సి బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుము చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జీ ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు ఖాతాదారుల నుంచి. -
కొనుగోలు వార్తలతో ‘యాక్సిస్’ జోరు
యాక్సిస్ బ్యాంక్ కోసం పలు ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయన్న వార్తలతో మంగళవారం ఈ బ్యాంక్ షేరు భారీగా పెరిగింది. యాక్సిస్‌ను విలీనం చేసుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, యాక్సిస్ వాటాను కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇంద్ బ్యాంక్‌లు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయనే వార్తలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దాంతో ఈ షేర్ 5 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. కొటక్ బ్యాంక్‌తో విలీనమేదీ లేదని సోమవారం యాక్సిస్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ, మీడియాలో పదేపదే వార్తలు వెలువడుతుండటంతో బ్యాంక్ షేరు హఠాత్ ర్యాలీ జరిపింది. అలాంటిదేమీ లేదు..: కేంద్రం యాక్సిస్ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు, అందులో వాటా కొనుగోలుకు ఏ బ్యాంకూ తమవద్దకు ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి చెప్పారు. ఈ బ్యాంక్‌లో 12% వాటా ప్రభుత్వం వద్ద వుంది. ఆ వాటాను విక్రయించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి వుంది. అయితే తక్షణమే ఈ వాటాను విక్రయించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టంచేశారు. -
విలీన వార్తలను ఖండించిన యాక్సిస్ బ్యాంకు
ముంబై: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను, మరో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. తర్వలోనే కొటక్ బ్యాంక్ చేతికిఽ యాక్సిస్ బ్యాంక్ వెళ్లిపోనుందని, ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకును కోటక్ స్వాధీనం చేసుకోనుందనే నివేదికలు అటు ఇన్వెస్టర్లు, ఇటు మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవనీ కొట్టి పారేశారు. తాము బ్యాంకింగ్ సేవల్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా కొనసాగుతున్నామనీ, విలీనం అయ్యే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి స్పెక్యులేషన్స్ని నమ్మవద్దని కోరారు. కొటక్ మహీంద్రా మెర్జర్ ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కొటక్ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాక్సిస్ టేకోవర్‌కు మరిన్ని దిగ్గజ బ్యాంకులు పావులు కదిపే అవకాశమున్నట్లు పుకార్లు చెలరేగాయి. అసలే డిమానిటైజేషన్ ప్రక్రియలో ఉద్యోగుల అక్రమాలతో ఇబ్బందుల్లో పడ్డ యాక్సిస్ బ్యాంక్ ఈ విలీనం వార్తలతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. దీంతో మార్కెట్లో సంచలనంగా మారింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ షేరు దాదాపు 5.34 శాతం లాభపడగా కొటక్ బ్యాంక్ 0.4 శాతం నష్టపోయినా..చివరలో కోలుకుని 0.24 శాతం లాభాలతో ముగిసింది. -
ట్రంప్ ప్రభావం: మార్కెట్లు భారీగా పతనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రారంభోపన్యాసం చేయనున్న నేపథ్యంలో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 274.10 పాయింట్లు పతనమై 27034.50 వద్ద, నిఫ్టీ 85.75 పడిపోయి 8349.35 వద్ద ముగిశాయి. ట్రంప్ స్పీచ్‌తో పాటు, బ్యాంకు ఆస్తుల క్వాలిటీపై ఆందోళన నెలకొనడంతో పెట్టుబడిదారులు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగించారు. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ సబ్ ఇండెక్స్ 1.59 శాతం పడిపోయంది. వీటిలో ఎక్కువగా యాక్సిస్ బ్యాంకు కుదేలైంది. ఈ బ్యాంకు తన క్యూ3 ఫలితాల్లో నిరాశపరచడంతో (నికర లాభం 73 శాతం డౌన్) షేరు విలువ 7.26 శాతం పతనమైంది. బ్యాంకు ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 2.5 శాతం నుంచి 3.8 శాతం పడిపోయాయి. ఇతర బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అయితే నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టెలికాం స్టాక్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్టెల్ 2.96 శాతం, 1.14 శాతం పైగా లాభపడ్డాయి. యస్ బ్యాంకు, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, బజాజ్ ఆటోలు మేజర్ గెయినర్లుగా ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు పడిపోయి 68.20 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 45 రూపాయలు పెరిగి 28,573గా నమోదైంది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 73% డౌన్
• ఐదు రెట్లు పెరిగిన కేటాయింపులు • ఉద్యోగుల అవకతవకలపై త్వరలో నివేదిక • బ్యాంక్ సీఎఫ్ఓ జైరామ్ శ్రీధరన్ వెల్లడి ముంబై: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 73 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.2,175 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.580 కోట్లకు తగ్గిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.12,531 కోట్ల నుంచి రూ.14,501 కోట్లకు పెరిగిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, సీఎఫ్ఓ జైరామ్ శ్రీధరన్ పేర్కొన్నారు. ఫీజు, ట్రేడింగ్ లాభం, తదితరాలతో కూడిన ఇతర ఆదాయం రూ.2,338 కోట్ల నుంచి రూ.3,400 కోట్లకు పెరిగిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 1.68 శాతం నుంచి 5.22 శాతానికి, నికర మొండి బకాయిలు 0.75 శాతం నుంచి 2.18 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు. రుణ నాణ్యతపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని పేర్కొన్నారు. కాగా వడ్డీ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.4,334 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 45% వృద్ధితో రూ.3,400 కోట్లకు పెరిగిందని శ్రీధరన్ వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తదనంతర పరిణామాల కారణంగా తమ బ్యాంక్ సిబ్బంది కొందరు అవకతవకలకు పాల్పడడం, అరెస్ట్ కావడం, సస్పెండ్ కావడం జరిగిందని తెలిపారు. ఈ అంశాలపై అధ్యయనం చేస్తున్న నివేదిక మరికొన్ని రోజుల్లో చేతికి వస్తుందని తెలిపారు. అయితే డీమానిటైజేషన్‌తో డిపాజిట్ అయిన పెద్ద నోట్లు ఎన్ని, ఎంత మొత్తంలో కౌంటర్లలో మార్పిడి జరిగిందో తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1 శాతం క్షీణించి రూ.484 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
పేలవమైన ట్రేడింగ్ అనంతరం స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.96 పాయింట్ల లాభంలో 27308.60 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్ల లాభంలో 8435.10 వద్ద క్లోజ్ అయ్యాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటామోటార్స్, గెయిల్ ఇండియా లాభాలతో పేలవంగా ఉన్న మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. గ్లోబల్ సంకేతాలపై పెట్టుబడిదారులు మరింత క్లారిటీ కోసం వేచిచూస్తున్నారని విశ్లేషకులన్నారు. 5.8 శాతం లాభంతో గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచింది. బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, భారీ ఎయిర్ టెల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా... యాక్సిస్ బ్యాంకు, అరబిందో ఫార్మా, లుపిన్, సన్ ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్ నష్టాలు గడించాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు నేటి సెషన్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు 1 శాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 0.4 శాతం, 0.3 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు పడిపోయి 68.18 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు కూడా 200 రూపాయల నష్టంతో 28,591గా నమోదైంది. -
యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు
వివిధ కాలాలకు 0.70% వరకూ కోత ముంబై: పెద్దనోట్ల రద్దుతో వచ్చిన భారీ డిపాజిట్లు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) నేపథ్యంలో రేటు కోత నిర్ణయం తీసుకుంటున్న పలు బ్యాంకుల జాబితాలో తాజాగా యాక్సిస్ బ్యాంక్ చేరింది. దేశంలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల తర్వాత మూడవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేటును 70 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. శుక్రవారం సమావేశం అయిన బ్యాంక్ అసెట్ లైబిలిటీ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందనీ, ఈ నిర్ణయం జనవరి 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా రేట్లు ఇలా...: వార్షిక ఎంసీఎల్ఆర్ 0.65% తగ్గి 8.25 శాతానికి చేరింది. బ్యాంక్ ఓవర్‌నైట్ (ఒకరోజు) రుణ రేటు కూడా 0.65 శాతం తగ్గి 7.90 కి చేరింది. అత్యధికంగా 0.70 శాతం తగ్గింపు 3, 6 నెలల కాలానికి వర్తిస్తుంది. 3 నెలల రేటు 8.05 తగ్గుతుండగా, ఆరు నెలల రేటు 8.15%కి చేరింది. ఇప్పటికి ఇంతే...: ఇంతకుమించి రుణరేటు కోత అవకాశం ప్రస్తుతానికి లేదని ట్రెజరీ హెడ్ శశికాంత్ రాఠీ అన్నారు. ఆర్బీఐతన రెపో రేటు తగ్గించినా... లేక తక్కువస్థాయిలో వడ్డీ చెల్లించే డిపాజిట్లు పెరిగినా తదుపరి కోత నిర్ణయం ఉంటుందన్నారు. ఇటీవలే 0.10% వరకూ బేస్‌రేట్‌ను బ్యాంక్ తగ్గించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు బాగోతం మరువకముందే మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాల వ్యవహారం కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు శాఖపై తాజాగా ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్ పెట్టారు. ఈ బ్యాంకులో దాదాపు రూ. 70 కోట్లు డిపాజిట్ చేసిన నకిలీ ఖాతాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఇందులో రూ. 39 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో తొమ్మిది నకిలీ ఖాతాలు తెరిచి.. అందులో సుమారు రూ. 39 కోట్లను డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నింటినీ రమేశ్ చంద్, రాజ్‌కుమార్ అనే వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, రాధికా జెమ్స్ అనే కంపెనీ పేరిట ఉన్న మరో నకిలీ ఖాతాలో మరో 36.40 కోట్లు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. నకిలీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయడమే కాదు.. పెద్ద ఎత్తున డిమాండ్ డ్రాప్ట్స్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమ బ్యాంకులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు అన్ని తీసుకున్న తర్వాత ఆయా ఖాతాల్లో డిపాజిట్లకు అనుమతించామని కోటక్ మహేంద్ర బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల విషయంలో ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తున్నట్టు పేర్కొంది. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
-
బద్దలవుతున్న యాక్సిస్ బ్యాంకు భాగోతాలు!
-
ఆ బ్యాంక్ అనుమానాస్పద ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత ఉద్యోగుల అవినీతితో ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. కొన్ని అనుమానాస్పద ఖాతాలను తాత్కాలింగా రద్దు చేసింది. ఉద్యోగుల అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా "అపూర్వమైన అడుగు" తీసుకున్నామని సోమవారం వెల్లడించింది. అనుమానాస్పద లావాదేవీల ఖాతాల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించినట్టు యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది అనుమానిత ఖాతాల అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.టి.ఆర్.లను) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ విజయవంతానికి, డిజిటల్ లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా గతవారం మూడు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన ఈడీ ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదుచేశారు. అటు బ్యాంకు కూడా అక్రమ లావాదేవీల ఆరోపణలతో 19 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు ఢిల్లీ బ్రాంచ్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ప్రతికూల పవనాలు: నష్టాల్లో మార్కెట్లు
జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు వీస్తుండటంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 87.04 పాయింట్ల నష్టంలో 26402 వద్ద, నిఫ్టీ 28.40 పాయింట్లు పడిపోయి 8111 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎఫ్ఎమ్సీజీ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా షేర్లు 0.4 నుంచి 1 శాతం పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, భారతీలు లాభాల్లో నడుస్తున్నాయి. అటు శుక్రవారం ముగింపుకు 5 పైసల నష్టంతో రూపాయి విలువ 67.81గా ప్రారంభమైంది. నిరంతరాయంగా ఎఫ్ఐఐ తరలిపోవడం, బలమైన డాలర్ ఇండెక్స్ వల్ల రూపాయిపై ఒత్తిడి నెలకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.132 బలపడి రూ.27,120గా నమోదవుతోంది. మరోవైపు ఆసియన్ స్టాక్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతోంది. -
మా వాళ్లే ముంచేశారు: యాక్సిస్ బ్యాంకు
-
యాక్సిస్ బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ కేపీఎంజీ చేతికి
న్యూఢిల్లీ: ఖాతాల మదింపు, బ్యాంకింగ్ కార్యకలాపాల భద్రతను పెంచేందుకుగాను గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం కేపీఎంజీతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత పలు యాక్సిక్ బ్యాంక్ శాఖలో ఇటీవల సిబ్బంది అవినీతికి పాల్పడిన కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో బ్యాంక్ ఈ చర్యలు చేపట్టింది. నోయిడాలోని ఒక యాక్సిస్ బ్రాంచ్‌లో 20 డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి అందులోకి రూ.60 కోట్లను మళ్లించి నట్లు ఐటీ శాఖ గతవారం బయటపెట్టిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ ఖాతాదారులకు లేఖ రాశారు. బ్యాంక్ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని.. అయితే, ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల నేపథ్యంలో అనుమానాస్పద ఖాతాలను గుర్తించే చర్యలు చేపట్టామని చెప్పారు. నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా వీటిని గుర్తించే పనిని మొదలుపెట్టినట్లు తెలిపారు. కార్యకలాపాల మదింపు, మరింత భద్రత కోసం ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా చేపట్టనున్నామని, ఇందుకోసం కేపీఎంజీని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ‘కొం దరు ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలతో చాలా కలత చెందా. దీనికి చింతిస్తున్నా.లావాదేవీలకు సంబంధించి బ్యాం కు అనుసరిస్తున్న విధానాలను కొంతమంది ఉద్యోగులు ఉల్లంఘించారు. వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. బ్యాంకు నియమావళిని ఉల్లంఘించినవారిని ఉపేక్షించం. ఈ ఉదంతంతో 55,000 మంది బ్యాంకు ఉద్యోగుల శ్రమ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కా ర్యకలాపాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు బ్యాంకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అని ఖాతాదారులకు రాసిన లేఖలో శిఖాశర్మ పేర్కొన్నారు. -
గతవారం బిజినెస్
రుణ రేటు తగ్గించిన యాక్సిస్ బ్యాంక్ ప్రైవేటు రంగంలోని మూడవ దిగ్గజ బ్యాంక్– యాక్సిస్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 0.1 శాతం నుంచి 0.15 శాతం శ్రేణిలో తగ్గించింది. శనివారం నుంచి తగ్గించిన రుణ రేట్లు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఓవర్‌నైట్ టెన్యూర్ విషయంలో 10 బేసిస్ పాయింట్లు, మిగిలిన అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. నిర్థిష్ట కాలానికి నిధుల సమీకరణ, వ్యయాల ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా నెలకు ఒకసారి ఈ రేట్ల సమీక్ష ఉంటుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ తాజా విధానం అమల్లోకి వచ్చింది. నవంబర్‌లో ఎగుమతులు ప్లస్‌లోనే! దేశీ ఎగుమతులు వరుసగా మూడవనెల కూడా వృద్ధి చెంది ప్రభుత్వానికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. నవంబర్‌లో ఇవి 2.29 శాతం వృద్ధి చెంది 20 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు మొత్తం గణాంకాలను ప్లస్‌లో ఉంచాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 14.10 శాతం పెరగగా, పెట్రోలియం ఉత్పత్తులు 5.73 శాతం పెరిగాయి. కెమికల్స్ విభాగంలో ఎగుమతులు 8.3 శాతం ఎగశాయి. మరోవైపు దిగుమతులు కూడా నవంబర్‌లో 10.44 శాతం ఎగసి 33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం... వాణిజ్య లోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెంపు అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 0.50–0.75 శాతం శ్రేణికి ఎగసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్ పేర్కొంది. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రేట్ల పెంపు అవకాశం ఉండవచ్చని ప్రకటించింది. ముందస్తు పన్నుల్లో బ్యాంకుల వెనుకంజ! ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి. దీంతో అతిపెద్ద రెవెన్యూ జోన్‌గా పేరొందిన ముంబైలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల వృద్ధి కేవలం 10 శాతంగా నమోదయింది. ఈ ప్రాంతంలోని 43 అతిపెద్ద కార్పొరేట్ల చెల్లింపులు వార్షికంగా చూస్తే, 10 శాతం వృద్ధితో రూ.24,811 కోట్ల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికంలో) రూ.27,321 కోట్లకు పెరిగాయి. ఎస్బీఐ చెల్లింపులు 25 శాతం పడిపోయి రూ.1,731 కోట్ల నుంచి రూ.1,282 కోట్లకు పడిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలో కూడా ఈ రేటు 27.3 శాతం క్షీణించి రూ.1,650 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు దిగింది. టోకు వస్తువుల డిమాండ్ డౌన్! పెద్ద నోట్లు రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో డిసెంబర్ టోకు ద్రవ్యోల్బ ణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఇక నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు గత నెలలో జోరుగా వచ్చాయి. ఈ నవంబర్‌లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల్లోకి రూ.36,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) పేర్కొంది. డెట్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని వివరించింది. అక్కడ కూడా మనం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా రూపొందించిన అమెరికాకు చెందిన 40 ఏళ్లలోపు సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు. బయోటెక్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 600 మిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానంలో నిలిచారు. అపూర్వ మెహ్తా 360 మిలియన్ డాలర్ల సంపదతో 31వ స్థానంలో ఉన్నారు. ఇక జాబితాలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గిన క్యాడ్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 0.6 శాతానికి తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడంతో క్యాడ్ జీడీపీలో 0.6 శాతంగా (340 కోట్ల డాలర్లు) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ క్యాడ్ జీడీపీలో 1.7 శాతంగా (850 కోట్ల డాలర్లు) ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో క్యాడ్ (జీడీపీలో 0.1 శాతం–30 కోట్ల డాలర్లు)తో పోల్చితే క్యూ2లో కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉంది. భారత్‌లోకి గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీలు! గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చే 6–9 నెలల కాలంలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముందని ఐఆర్డీఏ అంచనా వేసింది. ’దిగ్గజ గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మాకు ఏడు దరఖాస్తులు వచ్చాయి. లాయిడ్స్ వంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ భారత్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఈ దరఖాస్తులను పరిశీలిస్తోంది’ అని ఐఆర్డీఏ హోల్‌టైమ్ మెంబర్ (ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్) వి.ఆర్. అయ్యర్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఇండియన్ రి–ఇన్సూరెన్స్ మార్కెట్లో కేవలం ‘జీఐసీ’ మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నియామకం ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్‌గా వి.కె.శర్మ నియమితులయ్యారు. ఈయన ఎల్ఐసీ చీఫ్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈయన ప్రస్తుతం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా వ్యవహరిస్తూనే సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ చైర్మన్ పదవి నుంచి ఎస్.కె.రాయ్ జూన్‌లో హఠాత్తుగా వైదొలిగిన విషయం తెలిసిందే. డీల్స్.. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్... ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టింగ్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులందించే అడప్ట్రా సంస్థను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఈ కంపెనీ కొనుగోలుతో తమ బీమా వ్యాపార విభాగం మరింత శక్తివంతం కానున్నదని కాగ్నిజెంట్ వెల్లడించింది. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్... పుణేలోని వెస్ట్‌ల్యాండ్ మాల్లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్) అనుబంధ కంపెనీ ఒకటి లెదర్ బిజినెస్ ఆస్తులను హిందుస్తాన్ ఫుడ్స్‌కు విక్రయించనుంది. తమ అనుబంధ కంపెనీ, తోలు ఉత్పత్తులను తయారు చేసే పాండ్స్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెట్ లెదర్ బిజినెస్‌కు చెందిన కొన్ని చరాస్తులను, నిల్వలను హిందుస్తాన్ ఫుడ్స్‌కు విక్రయించనున్నామని హెచ్‌యూఎల్ తెలిపింది. -
మా వాళ్లే ముంచేశారు: యాక్సిస్ బ్యాంకు
న్యూఢిల్లీ: సంస్ధలో పనిచేసే ఉద్యోగులే యాక్సిస్ బ్యాంకు పేరును నాశనం చేశారని యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో షీఖా శర్మ ఆదివారం పేర్కొన్నారు. ఖాతాదారుల లావాదేవీలను మరింత భద్రంగా నిర్వహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అకౌంట్లలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లపై కన్నేసి ఉంచుతున్నామని తెలిపారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులందరికీ ఓ లేఖను రాసినట్లు వెల్లడించారు. సంస్ధలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఆమెను తలదించుకునేలా చేశారని చెప్పారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొందరు స్వార్ధపరుల కారణంగా 55 వేల మంది శ్రమ కొట్టుకుపోయిందని అన్నారు. గత వారం నోయిడాలోని ఓ యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో గల 20 అకౌంట్లలో గంపగుత్తగా పడిన రూ.60 కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు దేశంలోని పలు యాక్సిస్ బ్యాంకు బ్రాంచిల్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు సహకరించడానికి తాము సిద్ధమని షీఖా ప్రకటించారు. కేపీఎంజీ ద్వారా ఫోరెన్సిక్ విధానాన్ని ఉపయోగించి అనుమానస్పద అకౌంట్లను గుర్తిస్తామని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకుకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు సౌకర్యవంతంగా బ్యాంకు సేవలు వినియోగించుకునేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించామని చెప్పారు. -
రుణ రేటు తగ్గించిన యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని మూడవ దిగ్గజ బ్యాంక్– యాక్సిస్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 0.1 శాతం నుంచి 0.15 శాతం శ్రేణిలో తగ్గించింది. శనివారం నుంచీ తగ్గించిన రుణరేట్లు అమల్లోకి వస్తాయని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఓవర్‌నైట్ టెన్యూర్ విషయంలో 10 బేసిస్ పాయింట్లు, మిగిలిన అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం)తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. నిర్దిష్ట కాలానికి నిధుల సమీకరణ వ్యయాల ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా నెలకు ఒకసారి ఈ రేట్ల సమీక్ష ఉంటుంది. ఈ ఏడాది జూన్ నుంచీ ఈ తాజావిధానం అమల్లోకి వచ్చింది.