న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 7 శాతం అదనపు వాటా కొనుగోలుకి సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో తాజా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం ఒప్పందంలో సవరణలకు తెరతీసినట్లు పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్ అనుబంధ కంపెనీలు యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ 2021లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తద్వారా మ్యాక్స్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్‌లో 20 శాతం వాటా కొనుగోలుకి సంతకాలు చేశాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 12.99 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. మిగిలిన వాటా కొనుగోలుకి తాజాగా ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు యాక్సిస్ బ్యాంక్, అనుబంధ కంపెనీలు తెలియజేశాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో భవిష్యత్ క్యాష్ ఫ్లో ఆధారంగా ఒక కంపెనీలో చేయనున్న పెట్టుబడి విలువను నిర్ధారిస్తారు. దీనిని ఫెయిర్ వ్యాల్యూగా పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment