రూ.4,789 కోట్లు నిధుల సమీకరణ | Aditya Birla Fashion and Retail Ltd ABFRL launched a Qualified Institutional Placement QIP to raise funds | Sakshi
Sakshi News home page

రూ.4,789 కోట్లు నిధుల సమీకరణ

Published Fri, Jan 17 2025 8:46 AM | Last Updated on Fri, Jan 17 2025 11:40 AM

Aditya Birla Fashion and Retail Ltd ABFRL launched a Qualified Institutional Placement QIP to raise funds

ప్రయివేట్‌ రంగ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌(ABFRL) నిధుల సమీకరణ చేపట్టనుంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(QIP), ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా మొత్తం రూ.4,789 కోట్లు అందుకునే యోచనలో ఉంది. వృద్ధి వ్యూహాలకు పెట్టుబడులను సమకూర్చుకునే ప్రణాళికలో భాగంగా బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రమోటర్‌ సంస్థ పిలానీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌కు రూ. 1,298 కోట్లు, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ. 1,081 కోట్లు విలువైన ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా క్విప్‌ ద్వారా మరో రూ. 2,500 కోట్ల సమీకరణ(funds)కు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2024 సెపె్టంబర్‌ 19న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు అనుమతించిన నిధుల సమీకరణ ప్రతిపాదనకు తాజాగా బోర్డు మరోసారి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది చివరిలోగా కంపెనీ మదురా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా లైఫ్‌స్టైల్‌ బ్రాండ్స్‌కింద విడదీయనుంది.

ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులు

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం ప్లస్‌

ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌(Axis Bank) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 6,304 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 6,071 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 27,961 కోట్ల నుంచి రూ. 30,954 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 13,483 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.08 శాతం తగ్గి 3.93 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,028 కోట్ల నుంచి రూ. 2,156 కోట్లకు ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,923 కోట్ల నుంచి రూ. 5,432 కోట్లకు పెరిగాయి. దీంతో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.44 శాతం నుంచి 1.46 శాతానికి స్వల్పంగా పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 17.01 శాతంగా నమోదైంది. కాగా.. క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 6,491 కోట్ల నుంచి రూ. 6,742 కోట్లకు పుంజుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement