న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్(Havells) ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 3 శాతంపైగా క్షీణించి రూ. 278 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 4,953 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 4,414 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 4,576 కోట్లకు చేరాయి.
స్పెన్సర్స్ రిటైల్..
ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ సంస్థ స్పెన్సర్స్(Spencers) రిటైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో మరోసారి నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 47 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 51 కోట్లతో పోలిస్తే నష్టాలు 8 శాతంపైగా తగ్గాయి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం క్షీణించి రూ. 517 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 654 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు 20 శాతం తగ్గి రూ. 567 కోట్లకు చేరాయి. కాగా.. జిఫీ బ్రాండుతో క్విక్‌కామర్స్‌లోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొంది. తదుపరి దశలో యూపీలో విస్తరించనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ ప్రీమియం రిటైల్ చైన్ నేచర్స్ బాస్కెట్‌ను పునర్వ్యవస్థీకరించే యోచనేమీ లేదని చైర్మన్ శాశ్వత్ గోయెంకా స్పష్టం చేశారు. నష్టాలు నమోదు చేస్తున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల నుంచి వైదొలగినట్లు తెలియజేశారు.
డీబీ కార్ప్..
మీడియా రంగ దిగ్గజం డీబీ కార్ప్(DB Corp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 118 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2023 –24) ఇదే కాలంలో రూ. 124 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 643 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 645 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 497 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. ప్రింటింగ్, పబ్లిíÙంగ్ తదితర విభాగాల ఆదాయం యథాతథంగా రూ. 594 కోట్లుగా నమోదైంది. అయితే రేడియో బిజినెస్ 5 శాతం బలపడి రూ. 49 కోట్లకు చేరింది. సంస్థ దైనిక్ భాస్కర్, సౌరాష్ట్ర సమాచార్, దివ్య మరాఠీ తదితర ఐదు వార్తా పత్రికలను ప్రచురించే సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
ఎల్‌టీఐమైండ్‌ట్రీ...
ఐటీ సొల్యూషన్ల దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ(LTI MindTree) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 1,085 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,169 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 9,661 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 9,017 కోట్ల టర్నోవర్ సాధించింది. విభిన్న ఏఐ వ్యూహాల నేపథ్యంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.68 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ వెల్లడించారు. నూతన భాగస్వామ్యాలు, స్పెషలైజేషన్లు, ఏఐలపై కొనసాగుతున్న పెట్టుబడులు కొత్త ఏడాదిలోనూ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. 2024 డిసెంబర్31కల్లా 742 యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఈ కాలంలో 2,362 మందికి ఉపాధి కలి్పంచడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 86,800ను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment