Qip
-
రూ.459 కోట్లు సమీకరించిన సెంకో గోల్డ్
ముంబై: జ్యువెలరీ రిటైలర్ సెంకో గోల్డ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) పద్ధతిలో రూ.459 కోట్లు సమీకరించింది. ఇందుకోసం సంస్థాగత ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ.1,125 చొప్పున మొత్తం 40.8 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ మేరకు కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 11న ప్రారంభమైన ఇష్యూ 13న ముగిసింది.టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.49%, టాటా మల్టీక్యాప్ ఫండ్ 8.77%, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎమర్జెన్సీ ఆపర్చునిటీస్ 6.40%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6.54%, ఇతర ఫండ్ సంస్థలు మిగిలిన షేర్లను దక్కించుకున్నాయి. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 20 స్టోర్ల ప్రారంభానికి వినియోగిస్తామని సెంకో తెలిపింది. -
జొమాటో క్విప్ @ రూ. 266
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు తెరతీసింది. సోమవారం ప్రారంభమైన క్విప్‌నకు షేరుకి రూ. 265.91 చొప్పున ఫ్లోర్ ధరగా నిర్ణయించింది.బోర్డు ఏర్పాటు చేసిన నిధుల సమీకరణ కమిటీ క్విప్‌నకు ఆమోదముద్ర వేసినట్లు ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. బ్యాలన్స్‌షీట్ పటిష్టత కోసమే పెట్టుబడుల సమీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. క్విప్ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 2.4% బలపడి రూ. 280 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల క్యూఐపీ
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ కోసం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ/సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ) ప్రారంభించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. వ్యాపార వృద్ధికి, నియంత్రణపరమైన కనీస అవసరాలను చేరుకునేందుకు నిధుల సమీకరణ చేపట్టనుంది. క్యూఐపీ ఫ్లోర్‌ప్రైస్‌గా (షేరు ధర) రూ.66.19 నిర్ణయించింది. క్యూఐపీ కోసం ఈ నెల 10–23 మధ్య బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్‌షో కూడా నిర్వహించింది. యస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ట్రెజరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎడెల్వీజ్, ఎస్బీఐ లైఫ్, మిరే, కోటక్ లైఫ్, ఫెడరల్ బ్యాంకు తదితర ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఫ్లోర్ ప్రైస్‌పై గరిష్టంగా 5 శాతం మించకుండా తగ్గింపును ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది. క్యూఐపీ కింద షేరు కేటాయింపు ధర (తుది)పై ఈ నెల 30న క్యాపిటల్ ఇష్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న కేంద్ర సర్కారుకు ప్రస్తుతం 90 శాతానికిపైనే వాటా ఉంది. తాజా క్యూఐపీ అనంతరం ప్రభుత్వ వాటా చెప్పుకోతగ్గంత దిగిరానుంది. దీంతో కనీస ప్రజల వాటా విషయంలో నిబంధనలను పాటించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
ఇన్ఫో ఎడ్జ్ క్విప్ షురూ- షేరు జూమ్
ఇంటర్నెట్ ఫ్రాంచైజీ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 3177.18ను కంపెనీ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా.. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు జూన్ 22న జరిగిన సమావేశంలోనే ఇన్ఫో ఎడ్జ్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు.. తాజాగా క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆన్లైన్ క్లాసిఫైడ్ విభాగాలు.. నౌకరీ.కామ్, 99ఏకర్స్.కామ్, జీవన్సాథీ.కామ్, శిక్షా.కామ్‌ను కంపెనీ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇన్ఫోఎడ్జ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 3420ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 3395 వద్ద ట్రేడవుతోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 20.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019-20) క్యూ1లో రూ. 90 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 89 శాతం పడిపోయి రూ. 72 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ఎన్ఎస్ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 906 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 892 వరకూ పతనమైంది. -
భారీ క్యూఐపీకి భారతి ఎయిర్టెల్!
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ భారీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ)కి సిద్ధమవుతోంది. క్యూఐపి ద్వారా సుమారు 2 బిలియన్ డాలర్లు సేకరించాలని ఎయిర్టెల్ యోచిస్తోందన్నవార్తలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ పెట్టుబడుల సమీకరణకు పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ భారీ క్యూఐపీ వచ్చే రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2 బిలియన్ డాలర్ల వరకు ఈక్విటీని, మరో బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించే ప్రతిపాదనలకు భారతి ఎయిర్టెల్ వాటాదారుల అనుమతి లభించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల ప్రకారం వార్‌బగ్ పిన్కస్, ప్రుడెన్షియల్, క్యాపిటల్ ఇంటర్నేషనల్, జీఐసి, సహా టెమాసెక్ భారతి ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెమాసెక్, జీఐసీ సంస్థనుంచి చెరి 500 మిలియన్ డాలర్లు సమకూర్చుకోనుంది. ఇందుకు వాటాదారుల ఆమోదం లభించిందనీ, రానున్న రెండు వారాల్లోనే ఈ క్యూఐపీ మొదలు కానుందని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై భారతి ఎయిర్టెల్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. -
క్విప్ ద్వారా రూ.1,000 కోట్లు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ (క్విప్) ద్వారా డిసెంబరు నాటికి రూ.800–1,000 కోట్లు సమీకరించాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా ప్రస్తుతమున్న 61.26 శాతం నుంచి 60 శాతం దిగువకు చేరుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధనం కింద రూ.1,100 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధుల రాకతో బ్యాంకులో ప్రభుత్వ వాటా పెరిగింది. జీవిత బీమాలో సంయుక్త భాగస్వామ్య (జేవీ) కంపెనీ అయిన ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ ప్రతిపాదన ఏదీ లేదని బ్యాంకు అధికారి ఒకరు స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో ఈ కంపెనీ విలువ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జేవీ ద్వారా డివిడెండు పెద్దగా స్వీకరించనప్పటికీ లాభాలు వస్తున్నాయని గుర్తుచేశారు. జేవీలో ఆంధ్రాబ్యాంకుకు 30 శాతం వాటా, బ్యాంక్ ఆఫ్ బరోడా 44 శాతం, యూకేకు చెందిన లీగల్ అండ్ జెనరల్‌కు 26 శాతం వాటా ఉంది. -
క్విప్ ఇష్యూతో ఎస్బీఐకి లాభమే
మూడీస్ అంచనా న్యూఢిల్లీ: ఎస్బీఐ ఇటీవల అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్విప్) ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించడం బ్యాంకు పరపతికి సానుకూలమని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ మూడీస్ తెలిపింది. రుణాల వృద్ధికి ఈ నిధులు తోడ్పడతాయని వివరించింది. అంతేకాదు, ప్రభుత్వంపై ఆధారపడడాన్ని కూడా ఇది తగ్గిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం నుంచి కూడా నిధుల సాయం అందితే బ్యాంకు మూలధనం మరింత బలోపేతం అవుతుందని నివేదికలో వెల్లడించింది. బాసెల్–3 నిబంధనల మేరకు మూలధన అవసరాలు 2018 మార్చి నాటికి 7.8 శాతం, 2019 మార్చి నాటికి 8.6 శాతం అవసరం కాగా, తాజా నిధుల సమీకరణ అందుకు సాయపడుతుందని నోమురా పేర్కొంది. -
క్విప్ ద్వారా ఎస్బీఐ 15,000 కోట్ల సమీకరణ
ముంబై: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వెల్లడించింది. క్విప్ కింద షేరు ఒక్కింటికి రూ. 287.25 చొప్పున మొత్తం 52.2 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. జూన్ 5న ప్రకటించిన క్విప్ ఇష్యూని ముగిస్తున్నట్లు ఎస్బీఐ గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. ఈ నిధులను క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తిని మెరుగుపర్చుకోవడం, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. -
ఎస్బీఐ నుంచి 11 వేల కోట్ల క్విప్ ఇష్యూ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అర్హమైన సంస్థాగత ఇన్వెస్టర్లకు (క్విప్)ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన షేర్లను విక్రయించేందుకు ఇష్యూ ప్రారంభించింది. షేరుకు రూ. 287.58 ఫ్లోర్ ధరతో క్విప్ ఇష్యూను ఓపెన్ చేసినట్లు సోమవారం బీఎస్ఈకి తెలిపింది. సెబీ ప్రైసింగ్ ఫార్ముల్లా ప్రకారం ఇష్యూ ధరను నిర్ణయించామని, ఫ్లోర్ ధరతో పోలిస్తే 5 శాతంకంటే అధిక డిస్కౌంట్‌ను ఆఫర్ చేయబోమని బ్యాంకు వివరించింది. క్విప్ ఇష్యూ జారీ ధరను ఆమోదించేందుకు జూన్ 8న ఎస్బీఐ బోర్డు సమావేశమవుతుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు సమీకరించేందుకు ఎస్బీఐ సెంట్రల్ బోర్డు మార్చి నెలలో ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ లేదా క్విప్, ఏడీఆర్/జీడీఆర్‌ల జారీద్వారా నిధులు సమీకరించడానికి బ్యాంకును బోర్డు అనుమతించింది. ఈ ప్రణాళికలో భాగంగానే తాజా క్విప్ ఇష్యూను జారీచేస్తున్నది.