
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు తెరతీసింది. సోమవారం ప్రారంభమైన క్విప్‌నకు షేరుకి రూ. 265.91 చొప్పున ఫ్లోర్ ధరగా నిర్ణయించింది.
బోర్డు ఏర్పాటు చేసిన నిధుల సమీకరణ కమిటీ క్విప్‌నకు ఆమోదముద్ర వేసినట్లు ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. బ్యాలన్స్‌షీట్ పటిష్టత కోసమే పెట్టుబడుల సమీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. క్విప్ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్‌ఈలో 2.4% బలపడి రూ. 280 వద్ద ముగిసింది.