ముంబై: జ్యువెలరీ రిటైలర్ సెంకో గోల్డ్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) పద్ధతిలో రూ.459 కోట్లు సమీకరించింది. ఇందుకోసం సంస్థాగత ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ.1,125 చొప్పున మొత్తం 40.8 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ మేరకు కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 11న ప్రారంభమైన ఇష్యూ 13న ముగిసింది.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.49%, టాటా మల్టీక్యాప్ ఫండ్ 8.77%, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎమర్జెన్సీ ఆపర్చునిటీస్ 6.40%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6.54%, ఇతర ఫండ్ సంస్థలు మిగిలిన షేర్లను దక్కించుకున్నాయి. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 20 స్టోర్ల ప్రారంభానికి వినియోగిస్తామని సెంకో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment