jewellery companies
-
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సైతం సోదాలు చేపట్టింది. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీలో ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే తనిఖీలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంకు లావాదేవీలు, వాల్యూయేటర్ ద్వారా గోల్డ్ వంటి వాటిపై సోదాలు చేపట్టారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూముల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు.. విజయవాడలోనూ ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బిగ్‌సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేపట్టింది. హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు తనిఖీ చేశారు ఐటీ అధికారులు. హానర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. -
ఘన్‌శ్యాందాస్ జువెల్స్ ఆస్తుల అటాచ్
సాక్షి, హైదరాబాద్: తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలు, నకిలీ బ్యాంకు లేఖలతో బ్యాంకులో బం గారాన్ని కుదవపెట్టి రూ.90 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ మేనేజింగ్ పార్టనర్ సంజయ్ అగర్వాల్ ఆస్తులపై ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాంపల్లి సెషన్స్ కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదు కూడా చేసింది. ఎస్బీఐలో ఉన్న 250 కిలోల బంగారాన్ని విడిపించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలను బెంగళూరుకు చెందిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ భాగస్వాములు సమర్పించారు. దీనిపై సీబీఐ 2011 అక్టోబర్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సొమ్మును దారి మళ్లించి.. తమ మోసం వెలుగు చూడటంతో సంజయ్, అతని సోదరులు అజయ్‌కుమార్, వినయ్‌కుమార్.. అబిడ్స్‌లోని తమ దుకాణంలో ఉన్న బంగారు నిల్వలను స్థానిక మార్కెట్లో విక్రయించి నగదు రూపంలో సొమ్ము చేసుకున్నారు. ఈ నగదుతో 2012లో సంజయ్ తన భార్య పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు తన సోదరులు, ఓ ఉద్యోగి పేరుపైనా మరో 3 సంస్థలను తెరిచారు. కుటుంబీకుల పేరు మీద అనేక ఖాతాలను తెరిచి లెక్కచూపని నగదుతో లావాదేవీలు నిర్వహించడంతో పాటు శ్రీకాంత్ గుప్తా అనే నకిలీ పేరుతో పాస్‌పోర్టును పొంది అనేకసార్లు విదేశాల్లో పర్యటించాడు. అక్కడా బ్యాంకు ఖాతాలు తెరిచి అక్రమ సొమ్మును దారి మళ్లించి తన వద్ద పనిచేసే ఉద్యోగి అవినాశ్ సోని పేరిట బినామీ ఆస్తులను కూడబెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న సంజయ్‌ను అరెస్టు చేసిన ఈడీ అతనితో పాటు అతని కుటుంబీకులకు సంబంధించిన రూ.9.5 కోట్ల విలువ చేసే 9 స్థిరాస్థులను అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్, శంషాబాద్‌లోని వ్యవసాయ భూమి, రాయదుర్గంలో ప్లాటు, కొంపల్లిలో విల్లా, జూబ్లిహిల్స్‌లో వేయి చదరపు గజాల భూమి ఈ జాబితాలో ఉన్నాయి. -
ఆగస్టు 23న జువెలరీ వ్యాపారుల సమ్మె
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ "ఏకపక్షంగా అమలు" చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు 'సమ్మె'కు దిగనున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజెసి) నేడు తెలిపింది. ఈ సమ్మెకు జేమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతు ఇచ్చినట్లు జీజెసీ పేర్కొంది.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్బుక్!) జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ కేంద్రం వచ్చింది. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 256 జిల్లాలో హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ఒక లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. -
లేడీ మోడల్స్‌ని అలా చూపించొద్దు: గవర్నర్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని సూచించారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగు చూడటం పట్ల ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఏడవ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా కాకుండా వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్‌లో పెళ్లి కుమార్తె ఒంటి నిండ బంగారు ఆభరాణాలు వేసి.. చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంతే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి’’ అని కోరారు. ఇక కాన్వొకేషన్ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వము అని అండర్‌టేకింగ్ తీసుకున్నారు ఆరిఫ్. అంతేకాక విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం, తీసుకోం అని బాండ్ తీసుకోవాలన్నారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు జనాల్లో అవగాహన కూడా రావాలన్నారు ఆరిఫ్. -
జ్యూయలరీ రంగానికి నీరవ్ దెబ్బ!
ముంబై: నీరవ్ మోదీ స్కామ్.. వజ్రాభరణాల రంగంపై గణనీయంగానే ప్రభావం చూపుతోంది. కుంభకోణం దెబ్బతో ఈ రంగం రుణాలపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. బ్యాంకుల నుంచి లభించే రుణాలు దాదాపు పది శాతం మేర తగ్గిపోయాయి. దీంతో ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆభరణాల సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వజ్రాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఒక నివేదికలో ఈ విషయాలు తెలియజేసింది. ‘ఈ పరిశ్రమకు బ్యాంకు రుణాలే ప్రధాన ఆధారం. ఇవి తగ్గిపోతే వజ్రాభరణాల ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉంది‘ అని జీజేఈపీసీ వైస్ చైర్మన్ కొలిన్ షా తెలిపారు. నిఖార్సయిన సంస్థలు కూడా ఎంతో కష్టపడితే గానీ రుణాలు రావడం లేదని .. ఒకవేళ వచ్చినా ఇన్వాయిస్లన్నీ తమ దగ్గరే డిస్కౌంటింగ్ చేయాలంటూ బ్యాంకులు షరతులు పెడుతుండటంతో క్లయింట్స్‌తో సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు ఇప్పటిదాకా అందిస్తూ వచ్చిన పలు ప్రయోజనాలను కూడా ఉపసంహరించడంతో వడ్డీ వ్యయాలు కూడా పెరిగిపోయాయని షా చెప్పారు. వజ్రాభరణాల ట్రేడర్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన సంగతి తెలిసిందే. దీని మీద వారిపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. స్వయం నియంత్రణపై దృష్టి .. పరిశ్రమలో వివిధ సంస్కరణల ద్వారా స్వయం నియంత్రణను అమలు చేసేందుకు, వ్యాపార సంబంధ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు జీజేఈపీసీ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు. అయితే, బ్యాంకులు రుణాలను తగ్గించేయడం, మరింతగా హామీలు అడుగుతుండటం, డాక్యుమెంటేషన్‌ను పెంచేయడం వంటి అంశాలు ట్రేడర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో 41 బిలియన్ డాలర్ల వజ్రాభరణాల రంగం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే గణనీయంగా క్షీణించే అవకాశాలు ఉన్నా యని అగర్వాల్ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కొంత తోడ్పాటు చర్యలు ప్రకటించాలని కోరారు. జీజేఈపీసీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 11.1 బిలియన్ డాలర్లుగా ఉన్న వజ్రాభరణాల ఎగుమతులు ఈసారి జూన్ త్రైమాసికంలో 8.8 శాతం క్షీణించి 10.1 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
బంగారంకంటే వజ్రాలపైనే ఆసక్తి
సాక్షి, హైదరాబాద్ : భారతీయ వినియోగదారులు బంగారు ఆభరణాలకంటే వజ్రాభరణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ వజ్రాభరణాల తయారీ సంస్థ ఫరెవర్‌మార్క్ సీఈఓ స్టీఫెన్ లూసియార్ తెలిపారు. గురువారంనాడిక్కడ ఫరెవర్‌మార్క్ వజ్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈసందర్భంగా స్టీఫెన్మాట్లాడుతూ ఫరెవర్ సరికొత్త వజ్రాభరణాలను అత్యాధునిక నమూనాలతో వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఫరెవర్‌మార్క్ 170 ఔట్లెట్లతో వ్యాపారాన్ని కొనసాగిస్తుందన్నారు. రానున్న పండుగలు, పెళ్ళిళ్లను ఉద్దేశించి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. ప్రదర్శనలో భారతదేశపు ప్రముఖ ఆభరణాల సంస్థలు పాల్గొని స్టాళ్ళలో డైమండ్స్‌ను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో పరెవర్ మార్క్ ఇండియా ప్రెసిడెంట్ సచిన్‌జైన్, ప్రముఖ వ్యాపార వేత్తలు జీవీకె వైస్ చైర్మన్ సంజయ్‌రెడ్డి, ఫిన్స్మార్ట్ ఫౌండర్ మహేశ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అన్‌కట్ అదుర్స్
ఆభరణాలనేవి ఐశ్వర్యానికి ప్రతీకలుగా అన్పించేవేమోగానీ... ఇప్పుడలా కాదు. ఆధునిక పోకడలు పోతున్న నగరవాసుల దృష్టిలో అవి జీవనశైలికి ప్రతిబింబాలు. ధరించే దుస్తులైనా, ఆభరణాలైనా అభిరుచికి తగినట్లుగా ఉండాలని నవతరం కోరుకుంటోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి ఎంగేజ్మెంట్ల వరకు మహిళలు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక పెళ్లిళ్లైతే చెప్పనవసరం లేదు. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లిలో వధువు అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు ధగధగలాడే నగలు ధరించేలా నగరవాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి ఆసక్తిని బట్టి నగరంలోని జ్యువెలరీ సంస్థలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా నగల డిజైన్లను మారుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్‌కట్ డైమండ్ ఆభరణాలకు విపరీతమైన క్రేజ్. టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్), వివిధ డిజైన్లతో కూడిన సరికొత్త వడ్డాణం, జడ, నెక్లెస్, షార్ట్ నెక్లెస్లపై కూడా సిటీవాసులు మోజు పెంచుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో ఏ జ్యువెలరీ షాపు చూసినా రద్దీగా కనిపిస్తుంటుంది. మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు ఈ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైదరాబాద్‌లోనే తయారీ సిటీవాసులను కట్టిపడేస్తున్న ఈ ఆభరణాలన్నీ నగరంలోనే తయారవడం విశేషం. ఇవన్నీ హ్యండ్‌మేడ్ నగలు. దీంతో ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు. మెరుగైన డిజైన్లు చేయగల అద్భుత అనుభవం నగరవాసుల స్పెషాలిటీగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే అన్‌కట్ డైమండ్, టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్) తదితర ఆభరణాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఈ జ్యువెలరీకి మంచి డిమాండ్. దక్షిణ భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. అష్టలక్ష్మీ లాకెట్, విష్ణు, కృష్ణా, గణేష్.. ఇలా దేవతల బొమ్మలతో వీటిని తయారు చేస్తున్నారు. కెంపులు పచ్చలతో నెక్లెస్, జడ, బెల్టులు రెడీ చేస్తున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం దేశవిదేశాల మధ్య పెరిగిన రాకపోకలు, ఇంటర్నెట్, టీవీ చానల్స్ తదితర మాధ్యమాలు అంతులేని ఫ్యాషన్లను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో తాము ధరించే ఆభరణాల డిజైన్ సరికొత్తగా ఉండాలని కోరుకునే ఫ్యాషన్ ప్రియులు ఎక్కువయ్యారు. అందుకనుగుణంగానే అన్‌కట్ డైమండ్ తదితర ఆభరణాలను నగరంలోనే తయారు చేస్తున్నారు. సిటీవాసులు వీటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. - మహేందర్ తయాల్, అధ్యక్షుడు, హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ - - వాంకె శ్రీనివాస్