వజ్రాల ఆభరణ రిటైలర్ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా బ్లూస్టోన్ బ్రాండుతో డైమండ్, గోల్డ్, ప్లాటినం, స్టడ్డెడ్ జ్యువలరీ విక్రయిస్తోంది.
ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కళారి క్యాపిట ల్, సామా క్యాపిటల్, సునీ ల్ కాంత్ ముంజాల్ తది తరులు షేర్లను ఆఫర్ చేయనున్నారు.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్టర్లకు 26.82 శాతం వాటా ఉంది. కంపెనీ దేశవ్యాప్తంగా 203 స్టోర్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) మొత్తం ఆదాయం 64 శాతం జంప్‌చేసి రూ. 1,266 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: ఐపీవో వేవ్.. ఇన్వెస్టర్ల క్యూ
మరోవైపు ప్యాకేజింగ్ మెషినరీ తయారీలో కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్ కంపెనీ ‘మమతా మెషినరీ లిమిటెడ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు రూ.230–243 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ మేరకు రూ.179 కోట్ల నిధులు సమీకరించనుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లు స్వీకరించనుంది. 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం కోటాను నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment