కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ "ఏకపక్షంగా అమలు" చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు 'సమ్మె'కు దిగనున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజెసి) నేడు తెలిపింది. ఈ సమ్మెకు జేమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతు ఇచ్చినట్లు జీజెసీ పేర్కొంది.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్‌బుక్!)
జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ కేంద్రం వచ్చింది. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 256 జిల్లాలో హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ఒక లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment