Hallmark
-
బంగారానికీ హాల్‌మార్క్..!
న్యూఢిల్లీ: బంగారంతో చేసిన ఆభరణాలు, కళాకృతులకు ఇప్పటికే హాల్‌మార్క్ తప్పనిసరి. అయితే బంగారు కడ్డీలకూ ఇకపై హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కంజ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే వెల్లడించారు. రత్నాలు, ఆభరణాల అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ప్రజలు నాణ్యమైన, ఖచి్చతమైన ఉత్పత్తులను పొందేలా చూడటం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘మార్కెట్లో వినియోగదారులకు ఎక్కు వ నమ్మకం, పారదర్శకతను హాల్‌మార్క్ నిర్ధారి స్తుంది. స్వర్ణకారులు వాస్తవానికి బంగారాన్ని దిగు మతి చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో వా రు పొందుతున్న, కొనుగోలు చేస్తున్న బంగారం నా ణ్యత గురించి వారికి ఖచి్చతంగా తెలియదు. కాబ ట్టి మొత్తం వ్యవస్థ ఖచి్చతత్వం కోసం, నిజా యితీ కోసం గుర్తింపు రావాలని నేను భావిస్తున్నాను’ అని వివరించారు. ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే బంగారు కడ్డీలు, బిస్కట్స్, కాయిన్స్‌కు హాల్‌మార్క్ తప్పనిసరి అవుతుంది. రెండవ అతిపెద్ద ఎగుమతిదారు.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాను ఈ రంగం కలిగి ఉందని నిధి వివరించారు. ‘భారత ప్రభుత్వం ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించింది. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తోంది. జెమ్స్, జువెల్లరీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మూలస్తంభం. ఈ రంగం ఎగుమతులు, ఉపాధి రెండింటికీ చాలా గణనీయంగా దోహదపడుతోంది’ అని నిధి ఖరే వివరించారు. అంతర్జాతీయ మా ర్కెట్లలో భారతీయ ఆభరణాలు ప్రాచుర్యం పొందేందుకు కృషి చేయాలని పరిశ్రమకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ముడిసరుకు నాణ్యతను నిర్ధారించడానికి బంగారు కడ్డీలకు తప్పనిసరిగా హాల్ మార్క్ చేయాల్సిన అవసరం ఉందని జెమ్స్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవ్యసాచి రే అన్నారు. 40 కోట్లకు పైగా ఆభరణాలు.. 2021 జూన్ 23 నుండి ప్రారంభమైన బంగారు ఆభరణాలు, కళాఖండాల తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధన విజయవంతంగా అమలవుతోందని నిధి ఖరే అన్నారు. ‘40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు ప్రత్యేక హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్‌తో (హెచ్‌యుఐడీ) హాల్‌మార్క్ చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదిత నగల వ్యాపారుల సంఖ్య దాదాపు 1.95 లక్షలకు చేరింది. అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏహెచ్‌సీ) సంఖ్య 1,600కి పైగా ఉంది. ల్యాబ్‌లో తయారైన వజ్రాలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం నిబంధనలను రూపొందిస్తున్నాం’ అని ఖరే చెప్పారు. భారత రత్నాలు, ఆభరణాల విపణి పరిమాణం 2023లో 44 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2030 నాటికి 134 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అని ఆమె తెలిపారు. -
మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’
బంగారు ఉత్పత్తులకు అందించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది. -
ధనత్రయోదశి 2024 : అసలే కొండెక్కిన గోల్డ్ , ఈ విషయాలు మీకోసమే!
దీపావళి అనగానే గుర్తొచ్చే ముఖ్యమైన వేడుక ధంతేరస్. ఐదు రోజుల దీపావళి పండుగకు నాంది ఈ ధనత్రయోదశి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం పదమూడో రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ ధన త్రయోదశి(ధంతేరస్) ఈ ఏడాది అక్టోబర్ 29న వస్తోంది. సాగర మథనం సమయంలో దుర్గాదేవి ,కుబేరుడు సముద్రం నుండి ఉద్భవించారని పురాణ కథ చెబుతోంది. అందుకే ఈ అందుకే త్రయోదశి నాడు ఇద్దరినీ పూజిస్తారు. అలాగే దేవతలు అసురులు "అమృతం"తో సముద్రంమీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడట. అందుకే ఈ పండుగను ధనత్రయోదశి , ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు.అలాగే సంపద , శ్రేయస్సును సూచించే లక్ష్మీ దేవిని, కుబేరుడిని భక్తితో పూజిస్తారు. ఎంతో శుభప్రదమైన ఈ రోజున ఒక గ్రాము అయినా బంగారం లేదా విలువైన వస్తువలను, కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు లాభాలను ప్రసాదిస్తాయని నమ్మకం. స్టాక్మార్కెట్లో కూడా దీపావళి రోజు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ కూడా ఉంటుంది.సాధారణంగా బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు ఈ రోజు కొత ఇల్లు, కొత్త కారు, టీవీ తదితరఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు అనేక ఆఫర్లు, బంపర్ ఆఫర్లు అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. అసలే బంగార ధర కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవల్సిన కనీసం జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!బంగారం స్వచ్ఛతబంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. సాధారణంగా 18 క్యారట్లు, 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం అందుబాటులో ఉంటుంది.హాల్ మార్క్ నమ్మకమైన దుకాణదారుని వద్ద మాత్రమే బంగారు, డైమండ్ ఆభరణాలను కొనుగోలు చేయడం ఉత్తమం. బంగారు ఆభరణాలు కొనుగోలులో అతి కీలకమైంది హాల్ మార్క్. బంగారు నాణ్యతకు ప్రామాణికమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్‌ను ప్రభుత్వం మాండేటరీ చేసినప్పటికీ, మన నగలపై హాల్ మార్క్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆభరణాల లోపలి వైపు ఉండే బీఐఎస్ సర్టిఫికేషన్ మీదే నగల విలువ ఆధారపడి ఉంటుంది.( Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!) తూకానికి సంబంధించి బంగారం, గ్రాములు. మిల్లీ గ్రాములు లెక్కను సరిగ్గా చూసుకోవాలి. లేదంటే, ఆదమరిచి ఉంటే, మోసపోయే, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్లో ధరను పరిశీలించాలి. తరుగు, మజూరీ చార్జీలను కూడా కూడా ఒక కంట గమనించాలి. డైమండ్నగల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. -
బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..
నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) చెబుతోంది. ఈ క్రమంలో వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందేనని స్పష్టం సంస్థ స్పష్టం చేసింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మొబైల్ఫోన్లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరని తెలిపింది. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ ట్రంక్.. వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. ఆర్డర్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయిని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి అధికారులు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లు 12 నెలల తర్వాత నిబంధనల పరిధిలోకి వస్తాయని సమాచారం. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండో, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే? బీఐఎస్ ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుందంటే.. తయారీదారులు, ప్రయోగశాలలు, సంబంధిత సైంటిస్టులు, నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ఆ రంగంలోని నిపుణులు కమిటీగా ఏర్పడి ప్రమాణాల ముసాయిదాను రూపొందిస్తారు. ఆపై భారతీయ ప్రమాణాలను తయారుచేస్తారు. ఏదైనా సంస్థ తయారు చేసిన వస్తువు నమూనా (శాంపిల్) తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలించి బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు ఉంటే ఐఎస్ఐ మార్కు వినియోగానికి లైసెన్స్ కేటాయిస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్
బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే.. కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్‌మార్కింగ్ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్క్ అంటే ఏమిటి? బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్‌మార్క్ అంటారు. ఈ హాల్‌మార్కింగ్‌లో మొదట బిస్ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త HUID హాల్‌మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. -
ఆభరణాల స్వచ్చతలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాల స్వచ్చత విషయంలో మరింత పారదర్శకతను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకువస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) సంఖ్యతో హాల్‌మార్క్ అయిన బంగారు ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా నాలుగు లోగోలతో కూడిన పాత హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల విక్రయానికి మార్చి 31 తర్వాత అనుమతి ఉండదు. సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఏప్రిల్ 1 నుంచి కొత్త హాల్‌మార్కింగ్ విధానం తప్పనిసరి చేయాలని జనవరి 18న నిర్ణయించారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ సంఖ్య అమలుకు ముందు (2023 ఏప్రిల్ 1కి ముందు) పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ నాలుగు లోగోలతో అమల్లో ఉంది. ఇందులో ఒకటి ఆర్టికల్ ప్యూరిటీని సూచిస్తూ ఉండే బీఐఎస్ లోగో ఒకటి. నగల వ్యాపారి, స్వచ్చత(అస్సేయింగ్), హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోలు మిగిలినవి. పాత విధానాల ప్రకారం వినియోగదారుల వద్ద ఉన్న ఆభరణాల హాల్‌మార్క్ చెల్లుబాటు అవుతుందని కూడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. -
బంగారం కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
సాక్షి, వరంగల్: బంగారు ఆభరణాల నాణ్యత పరీక్షలను గుడ్డిగా చేస్తూ.. కొన్ని హాల్‌మార్కింగ్ కేంద్రాలు బంగారు వ్యాపారులకు కొమ్ముకాస్తూ ‘క్యాష్’చేసుకుంటున్నాయి. ఈ బంగారమైన దందా వరంగల్ కేంద్రంగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. హాల్ మార్కింగ్ ఉండడంతో వినియోగదారులు కూడా గుడ్డిగానే నమ్మకంతో వ్యాపారుల వద్ద ఆభరణాలు కొంటూ మోసపోతున్నారు. 12, 14, 18, 22 క్యారెట్లు ఉన్న బంగారాన్ని ఇతర లోహల కల్తీ ఉన్నా.. ఇంకాస్త ఎక్కువగా బంగారం ఉన్నట్టుగా అస్సెయింగ్ విధానం ద్వారా పరీక్షలు చేసి హాల్ మార్కింగ్ ముద్ర వేస్తుండడం వివాదాస్పదమవుతోంది. వరంగల్ నగరంలో కొన్ని నెలల క్రితం బీఎస్ఐ నిబంధనలు పాటించని ఓ హాల్ మార్కింగ్ కేంద్రాన్ని మూసివేసినా.. మళ్లీ ప్రారంభమైందంటే వారి ‘లాబీ’యింగ్ ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా రూ.కోట్లలో సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర లోహాలు ఎక్కువగా ఉన్నా మంచి మార్కింగే.. బంగారంలో కలిపిన రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహల శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహలు ఉంటాయి. 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహలు 25 శాతం ఉన్నాయని అర్థం. 14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. సాధారణంగా 22 క్యారెట్లతోనే బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. 2022 జూన్ 1నుంచి ప్రతీ గోల్డ్‌షాపు నాణ్యమైన హాల్‌మార్క్ బంగారాన్ని అమ్మాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ బంగారు ఆభరణాల్లో కలిపే ఇతర లోçహాల శాతం ఎక్కువగా ఉన్నా కూడా స్వచ్ఛమైన బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం అంటూ మార్కింగ్ ఇస్తుండడం గమనార్హం. సిబ్బందిని మచ్చిక చేసుకొని.. బంగారు ఆభరణాల నాణ్యతను పరీక్షించే అస్సెయింగ్ విధానం దాదాపు ఆరు గంటల పాటు చేయాల్సి ఉన్నా కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే ఆయా ఆభరణాలపై çహాల్ మార్కింగ్ ఇస్తుండడం గమనార్హం. ముఖ్యంగా కొందరు బంగారు వ్యాపారులు కావాలనే ఇక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని మరీ మేలిమైన బంగారమంటూ హాల్‌మార్కింగ్ వేస్తుండడంతో వినియోగదారులు కూడా నిజమని నమ్మి కొనుగోలు చేసి మోసపోతున్నారు. బంగారు ఆభరణాల్లో తేడాలు కనిపిస్తే మౌలాలిలోని బీఎస్ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ‘దీనిపై మేం కూడా ఫిర్యాదు చేస్తున్నాం’ అని వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి తెలిపారు. చదవండి: చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. ఇంటికి వచ్చాక మాట మార్చిన మహేష్ -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త! కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: వినియోగదారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని బంగారం ఆభరణాల స్వచ్ఛతను బీఐఎస్ ధ్రువీకృత కేంద్రాలకు వెళ్లి పరీక్షించుకోవచ్చు. నాలుగు ఆర్టికల్స్ (ఆభరణాలు) వరకు స్వచ్ఛత కోసం రూ.200 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదు అంతకంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉంటే ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 చొప్పున చార్జీ ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. తద్వారా వినియోగదారులు తమవద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు పేర్కొంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) గుర్తింపు కలిగిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్‌కు వెళ్లి పరీక్షించుకోవచ్చని సూచించింది. ఇక వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించి ‘హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్’ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి పరిశీలించుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయమని తెలిపింది. హాల్‌మార్క్ అంటే ? కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..! -
హాల్‌మార్కింగ్ విధాన విస్తరణకు కసరత్తు
న్యూఢిల్లీ: పసిడి హాల్‌మార్కింగ్ విధానం కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా 256 జిల్లాల్లో ప్రస్తుతం సక్రమంగా, సజావుగా, ఎటువంటి అవరోధాలూ లేకుండా కొనసాగుతోందని వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నెలవారీ నివేదిక తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఈ విధాన విస్తరణపై కసరత్తు జరుగుతోందని కూడా నివేదిక వివరించింది. క్యాబినెట్ కోసం సిద్ధమైన నివేదికలోని అంశాలు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు క్లుప్తంగా.. - కనీసం ఒక పరీక్షా, హాల్‌మార్కింగ్ కేంద్రం(ఏహెచ్‌సీ) ఉన్న దేశంలోని 256 జిల్లాల్లో 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు– కళాఖండాలకు 2021 జూన్ 23 నుండి హాల్‌మార్కింగ్, నాణ్యతా ధృవీకరణ తప్పనిసరి చేయబడింది. అన్ని జిల్లాలకు దీనిని విస్తరించే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. - ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆభరణాల కోసం జీరో రిజిస్ట్రేషన్ రుసుము, రిజిస్ట్రేషన్ జీవితకాల చెల్లుబాటు మొదలైన సులభతరమైన చర్యలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తీసుకుంటూ.. ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’ విధానం ప్రారంభించినప్పటి నుండి బీఐఎస్‌లో నమోదు చేసుకున్న ఆభరణ తయారీ, అమ్మకపు వర్తకులు, సంస్థల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. - ఇప్పటి వరకు 1.27 లక్షల మంది నగల వ్యాపారులు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను విక్రయించడానికి బీఐఎస్ నుండి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. బీఐఎస్ గుర్తింపు పొందిన 976 ఏహెచ్‌సీలు దేశంలో పనిచేస్తున్నాయి. - ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన తర్వాత ఐదు నెలల వ్యవధిలో దేశంలో దాదాపు 4.5 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్ జరిగింది. - బంగారు ఆభరణాల పరిశ్రమ పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా అలాగే వినియోగదారులకు హాల్‌మార్క్ విశ్వసనీయతను అందించడానికి హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడీ (హెచ్‌యూఐడీ) ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. - హాల్‌మార్కింగ్‌కు సంబంధించి సమస్యలపై పరిశ్రమ వర్గాలతో నిరంతర, వివరణాత్మక పరస్పర చర్యలు, చర్చల ద్వారా వారి ఆందోళనల పరిష్కారానికి బీఐఎస్ ప్రయత్నిస్తోంది. - 2021 జనవరి 15 నుండి దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు– కళాఖండాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయనున్నట్లు 2019 నవంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ గడువును జూన్ 1వ తేదీకి అటు తర్వాత జూన్ 23వ తేదీకి కేంద్రం పొడిగించింది. జూన్ 23 నుంచి ఈ తప్పనిసరి విధానం అమల్లోకి వచ్చింది. మహమ్మారి కరోనా నేపథ్యంలో అమల్లో కష్టనష్టాలు ఉంటాయని వర్తకులు కేంద్రానికి విన్నవించడం ‘గడువు పొడిగింపులకు’ ప్రధాన కారణం. - భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. భారత్ తన బంగారం అవసరాలకు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఏటా 700–800 టన్నుల శ్రేణిలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశంలో 2016–2020 మధ్య జరిగిన మొత్తం సరఫరాల్లో దిగుమతుల వాటానే 86 శాతం వరకూ ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి. చదవండి: గనుల వేలానికి హైపవర్ కమిటీ ఆమోదం -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్‌మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్‌పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్‌మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్‌రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
‘హాల్‌మార్క్’ తప్పనిసరి ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
సాక్షి, అమరావతి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఏపీ బులియన్ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటి అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విజయకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం ఇచ్చే వివరాల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులు.. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది మువ్వా రవీంద్ర వాదనలు వినిపిస్తూ.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమన్నారు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులున్నాయని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 వేల మంది బంగారు వ్యాపారులు ఉన్నారు. హాల్‌మార్క్ ముద్రించాల్సిన ఆభరణాల సంఖ్య దాదాపు 1,000 కోట్లు ఉంటుంది. హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్ 15తో ముగిసింది. హాల్‌మార్క్ లేకుండా ఆభరణాలు అమ్మినవారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. హాల్‌మార్క్ వేసే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా, లాక్డౌన్ వల్ల కేంద్రం నిర్దేశించిన గడువులోపు ఆభరణాలకు హాల్‌మార్క్ వేయించడం అసాధ్యంగా మారింది. హాల్‌మార్క్ వేసిన ఆభరణాలకు మెరుగుపెట్టిస్తే అది పోతుంది. అప్పుడు ఏం చేయాలనే దానికి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు’ అని రవీంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారుల ప్రయోజనాల కోసమే.. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. వినియోగదారుల ప్రయోజనాల కోసం ఆభరణాల నాణ్యత, శుద్ధత, మోసాలను అరికట్టడం కోసం కేంద్రం హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసిందన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు. -
ఆగస్టు 23న జువెలరీ వ్యాపారుల సమ్మె
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ "ఏకపక్షంగా అమలు" చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు 'సమ్మె'కు దిగనున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజెసి) నేడు తెలిపింది. ఈ సమ్మెకు జేమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతు ఇచ్చినట్లు జీజెసీ పేర్కొంది.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్బుక్!) జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ కేంద్రం వచ్చింది. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 256 జిల్లాలో హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ఒక లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. -
జువెలరీ షోరూమ్‌లో స్వచ్చమైన బంగారాన్ని గుర్తించడం ఎలా..?
మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆభరణాల షోరూమ్‌లోకి వెళ్లినప్పుడు మీ మనస్సులో ఉన్న బడ్జెట్ గురించి ఆభరణాల వ్యాపారికి చెప్పిన వెంటనే, అతను మీ ముందు విభిన్న రకాల బంగారు ఆభరణాల సెట్ డిజైన్లను ఉంచుతారు. బంగారం ధర అనేది స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్వచ్ఛమైన బంగారం కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు స్వచ్ఛమైనవా? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉన్నాయని మీరు ఎలా ధృవీకరిస్తారు?. దీనికి సంబందించి ఆగ్మోంట్ డైరెక్టర్ కేతన్ కొఠారి బంగారం కొనుగోలు ప్రక్రియ, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, దేశంలో కొత్త హాల్ మార్క్ నియమాలు, హాల్ మార్క్ చేయని మీ పాత బంగారు ఆభరణాల గురుంచి వివరణ ఇచ్చారు. కేతన్ కొఠారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం వివిధ రకాల స్వచ్ఛత స్థాయిల్లో ఉంటుంది. బంగారం అనేది అతి తక్కువ స్వచ్ఛత కలిగిన 10 క్యారెట్ల బంగారం నుంచి అత్యధిక స్వచ్చత కలిగిన 24 క్యారెట్ల బంగారం వరకు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని ఎందుకు అంటారు అంటే? దీనిలో వేరే ఇతర లోహాలను కలపరు. ఇది మృదువుగా ఉంటుంది. దీనిని బంగారు కడ్డీలు, నాణేలు, విద్యుత్ పరికరాలు, వైద్య పరికరాల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి, జింక్, నికెల్ వంటి ఇతర మిశ్రమలోహాలు బంగారం కలిగి ఉన్న వాటిని 23కె, 22కె, 22కె, 20కె, 18కె, 14కె, 10కె బంగారం అని అంటారు. ఈ ఇతర గ్రేడ్ల బంగారం మన్నికైనవి, దృఢమైనవి. మన భారత దేశంలో ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం వాడుతారు. కొత్త హాల్ మార్క్ నిబంధనలు ఏమిటి? బంగారం కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు బంగారు ఆభరణాల విషయంలో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ప్రభుత్వ లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేసే సమయంలో స్వచ్చమైన ఆభరణాలను గుర్తించడం కష్టమవుతోంది. స్వచ్చమైన బంగారం, నకిలీ బంగారం అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్ విధానాన్ని కేంద్రం తీసుకోచింది. ప్రస్తుతం 256 జిల్లాల్లో మాత్రమే హాల్ మార్క్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆభరణాల షోరూమ్ కు వెళ్లినప్పుడు హాల్ మార్క్ ఆభరణాలు గుర్తుంచడం ఎలా? గోల్డ్ హాల్ మార్క్ ఆంక్షలు దశలవారీగా అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 256 జిల్లాల్లో ఆభరణాల దుకాణాలు హాల్ మార్క్ లోగోను ముద్రిస్తున్నాయి. కొనుగోలుదారుడు షోరూమ్‌లోకి ప్రవేశించినప్పుడు జ్యూయలర్ బీఐఎస్ రిజిస్టర్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం కొరకు బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ అడగాలి. కొనుగోలుదారుడు స్వచ్ఛత కోసం నాలుగు సంకేతాలను పరిశీలించిన తరువాత మాత్రమే హాల్ మార్క్ చేయబడ్డ ఆభరణాలను కొనుగోలు చేయాలి. అలాగే కొన్న తర్వాత ఆభరణాల షోరూమ్ నుంచి బిల్లును తీసుకోవాలి. బంగారు ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవడం కోసం ఆ ఆభరణాలపై నాలుగు సంకేతాలు గల ముద్ర ఉంటుంది. ఆ ముద్ర కనిపించకపోతే 10ఎక్స్ భూతద్దం ఉపయోగించి దానిని మీకు ప్రదర్శించమని ఆభరణాల వ్యాపారిని అడగండి. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. మీకు నగల వ్యాపారి నకిలీ ఆభరణాలు మీకు విక్రయిస్తే స్వచ్చత, బరువు కోసం మీరు చెల్లించిన టెస్టింగ్ ఛార్జీలతో వచ్చిన తేడాకు రెండు రెట్లు కొనుగోలుదారుడికి షాప్ ఓనర్ రీఎంబర్స్ మెంట్ చేయాలి. కొనుగోలుదారుడు గమనించాల్సిన సంకేతాలు ఏమిటి? ఆభరణాలపై నాలుగు ప్రధాన హాల్ మార్కింగ్ గుర్తులు ఉంటాయి. త్రిభుజం గుర్తు అనేది బీఐఎస్ మార్క్ సూచిస్తే, స్వచ్ఛతను 916 నెంబర్(22 క్యారెట్)తో సూచిస్తారు. తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు, ఇక మిగిలనవి హాల్ గుర్తింపు పొందిన ఆస్సాయిగ్ సెంటర్ మార్క్, అది తయారు చేసిన సంవత్సరం. భారతదేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయవచ్చు. పాత ఆభరణాల కొనుగోలు, అమ్మకాలు ఎలా? మీ పాత బంగారు ఆభరణాల విలువ గురించి ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఇది ఇప్పటికీ చట్టబద్ధం. బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ లేనప్పటికీ, ఆభరణాల తయారీదారులు దానిని కస్టమర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఆభరణాల వ్యాపారి దాని మీద హాల్ మార్క్ లోగో ముద్రన కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనుగోలుదారులకు విక్రయించవచ్చా? అలాంటి అవకాశం లేదు. బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 29 ప్రకారం, హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయిస్తే నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా లక్ష రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి వరకు భారత దేశ ప్రజల దగ్గర 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఆభరణాలు ఉన్నాయి. -
బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గమనించండి..!
మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారం కొనేటప్పుడు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు సరైనదా కాదా..! అని నిర్థారణకు వచ్చిన తరువాతనే కోనుగోలు చేస్తాం. బంగారం స్వచ్చమైనదేనా కాదా అనే విషయంలో బీఐఎస్ హాల్‌మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా తాజాగా దేశంలోని 256 జిల్లాలో బుధవారం నుంచి బంగారు నగలపై హాల్‌మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బంగారంపై ఉన్న హాల్‌మార్క్ సరైనదా.. కాదా అని కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఎందుకంటే తాజాగా కొన్ని గోల్డ్‌షాపు నిర్వహకులు తమ సొంతంగా హాల్‌మార్క్‌ను ను ముద్రించే అవకాశం ఉంది. కావున గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని కచ్చితంగా గమనించండి..! హాల్‌మార్క్ గుర్తులో త్రిభుజాకారంలో ఉన్న బీఐఎస్(BIS) గుర్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. గోల్డ్ స్వచ్చత విషయంలో క్యారెటేజ్ 22k915 కచ్చితంగా ఉండేలీ చూడాలి. వీటితో పాటు ఏహెచ్‌సీ గుర్తు ఉండేలా చూసుకోవాలి. గోల్డ్‌షాపు యాజమానిని బీఐఎస్ లైసెన్స్‌ను చూపించమని అడగవచ్చు. బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత బిల్లులో హాల్‌మార్కింగ్ ఛార్జీలు ఉండేలా చూసుకోవాలి. కొనుగోలు చేసిన బంగారంలో స్వచ్చత లేకపోతే విక్రయదారుడ్ని ప్రశ్నించవచ్చు. చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట! -
బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ (డీజీ) ప్రమోద్‌కుమార్ తివారి తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లోను, తెలంగాణలోని ఏడు జిల్లాల్లోను ఇకపై విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్కు తప్పనిసరని తెలిపారు. ఆయన బుధవారం వర్చువల్‌గా మీడియా సమావేశంలో మాట్లాడారు. వార్షిక టర్నోవరు రూ.40 లక్షల కన్నా తక్కువ ఉన్న నగల వ్యాపారులను దీని నుంచి మినహాయిస్తున్నామని తెలిపారు. కేంద్ర వాణిజ్య పాలసీకి అనుగుణంగా ఎగుమతి, దిగుమతి ఆభరణాలు, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల ఆభరణాలు, ప్రభుత్వ అనుమతితో బీ2బీ డొమెస్టిక్ ఎగ్జిబిషన్ల ఆభరణాలకు కూడా మినహాయిస్తున్నట్లు వివరించారు. గడియారాలు, ఫౌంటెన్ పెన్నులు, కుందన్ పోల్కి తదితర ప్రత్యేక నగలను కూడా మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాల విక్రేతలు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఎలాంటి రుసుములు ఉండవని చెప్పారు. ఎగుమతి, దిగుమతిదారులు, టోకు వర్తకులు, పంపిణీదారులు, విలువైన మెటల్ వస్తువుల రిటైల్ విక్రయదారులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. చేతివృత్తిదారులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. హాల్‌మార్క్ లేని పాత బంగారు నగలు ఇంట్లో ఉంటే వాటిని దుకాణదారులకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఆ బంగారు నగల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైలర్లకు ఆగస్టు చివరివరకు ఎలాంటి జరిమానా విధించబోమని చెప్పారు. హాల్మార్కులో ఆరు అంకెలకోడ్, బీఐఎస్ మార్కు, ప్యూరిటీ, డెలివరీ ఓచర్లను అమ్మకందార్లకు ఇస్తామన్నారు. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి భాగస్వాములు, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో హాల్‌మార్క్ కేంద్రాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణలో: మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ (గ్రామీణ), వరంగల్ (పట్టణ), రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు -
ఇకపై బంగారం కొనాలంటే ఇది తప్పనిసరి
ముంబై: ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న హాల్ మార్కింగ్ విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్‌మార్క్ లేని బంగారం విక్రయించడం చట్టపరంగా నేరం. దీంతో బంగారం నాణ్యత విషంయలో కష్టమర్లకు మరింత భరోసా లభించనుంది, నాణ్యతకు భరోసా బంగారు ఆభరణాల తయారీకి సంబంధించి చిన్న పట్టణాలు, గ్రామాల్లో హాల్ మార్కింగ్ ఉండటం లేదు. దీని వల్ల ఆ ఆభరణం ఎంత నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత తాము నష్టపోయినట్టు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో బంగారం కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాల్‌మార్క్ విధానం అమల్లోకి తెచ్చింది. హాల్‌మార్క్ ఇలా 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి. BIS హాల్‌మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, మదింపు, హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. చదవండి : మూడో రోజు తగ్గిన బంగారం ధరలు -
పసిడి మోసాలకు పంచ్
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారు ఆభరణాల విక్రయంలో మోసాలకు చెక్ పడనుంది. ఇకపై నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. జూన్ 1నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ పలు జ్యుయలరీ షాపుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ నగలను విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బంగారు, వెండి నగలపై వాటి స్వచ్ఛతను తెలియజేసే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జూన్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనుంది. ఈలోగా నగల దుకాణాల యజమానులు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ద్వారా హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ పొందిన జ్యుయలరీ దుకాణాలను మాత్రమే 14 (585), 18 (750), 22 (916) క్యారెట్ల బంగారు ఆభరణాల అమ్మకానికి అనుమతిస్తారు. హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తే చట్టరీత్యా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ షాపులోని ఆభరణాలనూ సీజ్ చేస్తారు. అలాగే నగల కొనుగోలుదారుకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోయినా షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఇకపై ఆభరణాల నాణ్యతపై అనుమానం వచ్చి బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి స్వచ్ఛతను పరీక్షిస్తారు. స్వచ్ఛతలో తేడాలుంటే ఆ మొత్తాన్ని షాపు యజమాని నుంచి వసూలు చేసి కొనుగోలుదారుకు ఇప్పిస్తారు. మోసాలు ఇలా.. బంగారంలో ఇతర లోహాలను కలిపినా దాని సహజ రంగు పూర్తిగా కోల్పోదు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకుని కృత్రిమ లేపనాలతో మెరిసేలా చేసి, రాగి వంటి లోహాలను కలిపి మేలిమి బంగారంగా అంటగడతారు. ఇకపై అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వినియోగదారుడిని కల్తీ నుంచి కాపాడటానికి బీఐఎస్ హాల్‌మార్క్ నిబంధన ఉపయోగపడుతుందని కన్సూ్యమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రంలో 876 షాపులే.. ఆంధ్రప్రదేశ్‌లో 876 దుకాణాలకు మాత్రమే హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లైసెన్స్ లేని షాపులు రాష్ట్రంలో 7 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. రాష్ట్రంలో ఇలాంటి షాపుల గణనను చేపట్టే పనిలో బీఐఎస్ అధికారులున్నారు. హాల్‌మార్క్ అంటే.. ఆభరణాల బంగారంలో స్వచ్ఛత పాళ్లను తెలియజేసేదే హాల్‌మార్క్. నగలపై బంగారం స్వచ్ఛత, ముద్ర, హాల్‌మార్క్ వేసిన కేంద్రం పేరు, ఆభరణం తయారు చేసిన తేదీ, విక్రయించిన షాపు పేరు ఉంటాయి. ఆభరణం నాణ్యతలో తేడాలుంటే.. దీనిని బట్టి అది ఏ షాపులో కొనుగోలు చేసిందీ తెలిసిపోతుంది. ముద్ర లేజర్‌తో వేసింది కాబట్టి చెరిగిపోయే లేదా చెరిపేసే వీలుండదు. శిక్ష, జరిమానాలు తప్పవు జూన్ 1 నుంచి జ్యుయలరీ షాపుల్లో హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించాలి. ఈలోగా దుకాణాల వారు బీఐఎస్ నుంచి హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికేషన్ పొందాలి. దీనిపై జ్యుయలరీ అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. – ఆర్.తిరుమలరావు, సైంటిస్ట్–డి, బీఐఎస్ -
జూన్ నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్‌గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (బీఐఎస్)తో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు. -
జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు
ఇక జూన్ 1 నుంచి బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను 1 జూన్ 2021 తర్వాత అమ్మలేము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు గల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. దీనివల్ల కస్టమర్, స్వర్ణ కారుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని తెలిపింది. బంగారం నాణ్యత గురించి ఇరు వర్గాలకు ఎటువంటి సందేహం ఉండదని పేర్కొంది. ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పని సరికాదు. కానీ, ప్రభుత్వం గతంలో 15 జనవరి 2021 లోపు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. జ్యువెలర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు ఆ గడువును 2021 జూన్ 1కి పెంచారు. ఆభరణాల హాల్‌మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్ ఎ అండ్ హెచ్ సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తాయి. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఎ అండ్ హెచ్ సెంటర్లో ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పుడు ఇంటి నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. దీనికోసం ఈ-బీఐఎస్(www.manakonline.in) వెబ్సైట్ కు వెళ్లండి. ఇక్కడ సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత దరఖాస్తుదారుడు బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. ఒక ఆభరణాల టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు 7500 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 5 వేల కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వార్షిక టర్నోవర్‌కు 15 వేల రూపాయలు, 25 కోట్లకు పైగా టర్నోవర్‌కు 40 వేల రూపాయలు. ఒక ఆభరణాల టర్నోవర్ 100 కోట్లకు మించి ఉంటే, ఈ రుసుము 80 వేల రూపాయలుగా నిర్ణయించారు. చదవండి: బంగారం ధరలు మరింత తగ్గుతాయా?! -
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పదిక
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. వీటికి మినహాయింపు.. 2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. -
మెరిసేదంతా బంగారం కాదు!
► ఆభరణాల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు ► బంగారం స్వచ్ఛత చూసి ధర చెల్లించాలి ► మేకింగ్ చార్జీలు, స్టోన్ చార్జీలపై అప్రమత్తత అవసరం ► ‘అక్షయ తృతీయ’ సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, బెంగళూరు: అక్షయ తృతీయత రోజున బంగారాన్ని కొంటే ఇంట సిరులు కురిపించే మహాలక్ష్మి చల్లని చూపులకు పాత్రులు కావచ్చని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ రోజున ఒక గ్రాము బంగారాన్నైనా ఖరీదు చేయాలని తహతహలాడుతుంటారు. దీంతో మామూలు రోజుల్లో కంటే అక్షయ తృతీయ జరుపుకునే రెండు రోజులు బంగారం మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అక్షయ తృతీయకు ముందునుంచే వినియోగదారులు బంగారం కోసం నగల సంస్థల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. మరో వైపు అక్షయ తృతీయ మార్కెట్‌ను తమ వైపునకు తిప్పుకోవడానికి నగరంలోని అనేక నగల వ్యాపార సంస్థలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. అయితే అత్యంత ఖరీదైన బంగారాన్ని, రేటు పెరగడమే తప్ప తగ్గడం తెలియని వజ్రాన్ని కొనేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వ్యాపారుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థలు ప్రకటించే ఆఫర్లను చూసి కాకుండా, మనం కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛత చూసి రేటు చెల్లించాలని చెబుతున్నారు. ఈనెల 9న అక్షయ తృతీయ సందర్భంగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. హాల్‌మార్క్‌ని ఇలా గుర్తించండి.. బంగారం స్వచ్ఛతను తెలియజేయడానికి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ణయించిందే హాల్‌మార్క్. ప్రతి నగల దుకాణం హాల్‌మార్క్ నగలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. బీఐఎస్‌లో రిజిస్టర్ అయిన నగల దుకాణాలాకు హాల్‌మార్క్ పొందే సౌకర్యం ఉంటుంది. తయారీ సంస్థలు తాము రూపొందించిన నగల స్వచ్ఛతను పరీక్షించడానికి నగలన్నింటిని బీఐఎస్‌కి పంపుతారు. అక్కడి అధికారులు నగ స్వచ్ఛతను పరీక్షించి హాల్‌మార్క్ ఇస్తారు. ఇందులో మళ్లీ కొన్ని దుకాణాలు 80శాతం హాల్‌మార్క్ అని, 75శాతం హాల్‌మార్క్ నగలనీ విక్రయిస్తుంటాయి. అయితే ఖరీదు చేయాల్సింది 100శాతం హాల్‌మార్క్ పొందిన నగలను మాత్రమే. 100శాతం హాల్‌మార్క్ ఉండాలంటే.. 100శాతం హాల్‌మార్క్‌ను బీఐఎస్ నుంచి పొందిన నగలను మాత్రమే పూర్తి స్వచ్ఛమైన నగలుగా పరిగణించాలి. ఈ విధంగా బీఐఎస్ గుర్తించాలంటే బంగారం 91.6శాతం స్వచ్ఛంగా ఉండాలి. 91.59శాతం స్వచ్ఛత కలిగి ఉన్నా హాల్‌మార్క్ పొందలేము. 91.6శాతం స్వచ్ఛత కూడా నగలా ఉన్నపుడు కాకుండా నగను కరిగించిన తరువాత ఉండాలి. అపుడే మనం చెల్లిస్తున్న డబ్బుకు సరైన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లెక్క. అందుకే నగల తయారీ సంస్థలు పంపిన నగల నుంచి కొన్ని శాంపిల్లను బీఐఎస్ వేరుచేసి వాటిని కరిగించి చూస్తుంది. వాటిలో 91.6శాతం బంగారం, మిగతా 8.4శాతం సిల్వర్, అలాయ్(కొన్ని రకాల లోహాలు కలవడం వల్ల ఏర్పడిన మిశ్రమం)లు ఉంటేనే వాటికి 91.6 హాల్‌మార్క్ లభిస్తుంది. ఈ విధంగా హాల్‌మార్క్‌ను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చార్జీలను అదనంగా వసూలు చేయదన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఈ 91.6 శాతమే వాడుకలో 916గా మారిపోయింది. కేడీఎం అంటే... కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను తెలిపే ఒక మాపనంగా చాలా మంది భావిస్తుంటారు. అయితే కేడీఎం అంటే క్యాడ్మియం అనే లోహం మాత్రమే. పాత కాలంలో అలాం అనే లోహంతో ఒక నగకు కావలసిన రూపాన్ని, అందుకు కావాల్సిన సాల్డరింగ్స్ని( అతుకు వేయడానికి) చేసేవారు. దీని మూలంగా బంగారంలో ఎక్కువ శాతం అలాం కలిసిపోయి బంగారం స్వచ్ఛత తగ్గుతూ వచ్చేది. ప్రస్తుతం క్యాడ్మియంతో సాల్డరింగ్ నిర్వహిస్తున్నారు. ఇది అతుకు వేస్తుందే తప్ప బంగారంలో కలవదు. అందుకే క్యాడ్మియంతో సాల్డరింగ్ చేసిన బంగారు నగల స్వచ్ఛత ఏమాత్రం తగ్గదు. ఈ విషయంపై అవగాహన లేని చాలా మంది కేడీఎం అనగానే స్వచ్ఛతను తెలియజేస్తుందని, 916 కేడీఎం అంటే చాలా స్వచ్ఛతను కలిగిన బంగారంగా భావించి మోసపోతుంటారని నగరంలోని ఓ ప్రముఖ జువెలరీ సంస్ధ నిర్వాహకులు మధుకర్ వెల్లడించారు. మేకింగ్ చార్జీలతో జర భద్రం.. బంగారం కొనుగోలులో వినియోగదారుడు ఎక్కువగా మోసపోవడానికి అవకాశమున్నది మేకింగ్ చార్జీల అంశంలో. ఈ చార్జీలు ఒక్కో నగల షోరూంకు ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. డిజైన్, నగ బరువును అనుసరించి గ్రాముకు 100నుంచి 500వరకు మేకింగ్ చార్జీలను నగల తయారీ సంస్థలు వసూలు చేస్తుంటాయి. బంగారం ధరలో 25శాతం వరకు మేకింగ్ చార్జీల పేరుతో వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. అయితే అక్షయ తృతీయ సీజన్ అనగానే నగల తయారీ సంస్థలన్నీ మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నామంటూ ప్రకటనలను గుప్పిస్తుంటాయి. ఈ చార్జీలు, స్టోన్ చార్జీల వద్దే వినియోగదారులు అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని రాజ్ డైమండ్స్ ఎండీ నితిన్ బెతలా చెబుతున్నారు. ‘అక్షయ తృతీయ సీజన్లో మేకింగ్ చార్జీల తగ్గింపు అన్న మాటవినగానే చాలా మంది ఎటువంటి బంగారాన్ని విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకోకుండానే కొనుగోలు చేస్తుంటారు. వీటి వల్ల వినియోగదారులు చాలా మోసపోయే అవకాశం ఉంది. అందులోను ఈ మోసం వజ్రాల నగల్లో అధికంగా ఉంటుంది. వజ్రానికి ఇదే రేటు అని మార్కెట్లో స్థిరంగా ఉండదు కాబట్టి మేకింగ్ చార్జీలను తగ్గించామని చెబుతూ, వజ్రం ధరని రెట్టింపు చేసి అమ్ముతుంటారు. ఉదాహరణకు ఇవాల్టి ఒక క్యారట్ వజ్రం ధర రూ.60వేలు అయితే మేకింగ్ చార్జీ ఫ్రీ అంటూ అదే వజ్రాన్ని రూ.80వేలకు అందిస్తారు. కాబట్టి ఈ మేకింగ్ చార్జీల విషయంలో గందరగోళానికి గురికాకుండా మీరు కొనే బంగారం స్వచ్ఛత, వజ్రం నాణ్యతలపై దృష్టి సారించాలి’అని నితిన్ తెలిపారు. -
రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు సుష్కవాగ్దానాలని ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. ఏపి శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ఆర్బీఐ నియమాలు హామీ ఇచ్చే ముందు తెలియాదా? అని ఆయన ప్రశ్నించారు. 94-95లో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోని విషయం ప్రజలకు తెలుసన్నారు. వాగ్దానాల్లో రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్‌గా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమను దూరం చేస్తే మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాయలసీమ ప్రజలు ఉద్యమం చేస్తే ఆపడం ఎవరి తరం కాదని కూడా ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారని టీడీపీ సభ్యులు మర్చిపోవద్దని సి.రామచంద్రయ్య అన్న సమయంలో ఏపీ శాసనస మండలిలో టీడీపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనపై ఇరు పార్టీ సభ్యుల మద్య వాడివేడి చర్చ జరిగింది.