![Gold jewellery sale without six-digit hallmark to be banned from next month - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/6/GOLD-JEWELRY.jpg.webp?itok=bhB-a3M6)
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాల స్వచ్చత విషయంలో మరింత పారదర్శకతను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకువస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) సంఖ్యతో హాల్‌మార్క్ అయిన బంగారు ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా నాలుగు లోగోలతో కూడిన పాత హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల విక్రయానికి మార్చి 31 తర్వాత అనుమతి ఉండదు.
సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఏప్రిల్ 1 నుంచి కొత్త హాల్‌మార్కింగ్ విధానం తప్పనిసరి చేయాలని జనవరి 18న నిర్ణయించారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ సంఖ్య అమలుకు ముందు (2023 ఏప్రిల్ 1కి ముందు) పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ నాలుగు లోగోలతో అమల్లో ఉంది. ఇందులో ఒకటి ఆర్టికల్ ప్యూరిటీని సూచిస్తూ ఉండే బీఐఎస్ లోగో ఒకటి. నగల వ్యాపారి, స్వచ్చత(అస్సేయింగ్), హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోలు మిగిలినవి. పాత విధానాల ప్రకారం వినియోగదారుల వద్ద ఉన్న ఆభరణాల హాల్‌మార్క్ చెల్లుబాటు అవుతుందని కూడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment