purity
-
బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..
బంగారాన్ని కొందరు ఆభరణంగా వినియోగిస్తే, ఇంకొందరు పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దాంతో పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే రిటైల్ షాపుల్లో తీసుకునే బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అయినా అంత పెద్దషాపు నిర్వహిస్తున్నవారు ఎందుకు మోసం చేస్తారని అనుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నడుపుతున్న షాపుల్లో ఈ మోసాలు తక్కువే. సరైన నిబంధనలు పాటించనివారు మాత్రం బంగారం స్వచ్ఛత విషయంలో వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో బంగారం నాణ్యతను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.బంగారం నాణ్యతను క్యారట్లలో కొలుస్తారు. బంగారం కొనేందుకు షాపులోకి వెళ్లిన వెంటనే నచ్చిన ఆభరణాలు ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు షాపు సిబ్బంది 24, 22, 18 క్యారట్ల బంగారం అని చెబుతూ తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 18 క్యారట్ నాణ్యత కలిగిన బంగారం చూపుతూ..అది 22 క్యారట్ గోల్డ్ అని చెబుతుంటారు. అది నమ్మి చివరకు 22 క్యారట్ బంగారం ధర చెల్లిస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలు ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బంగారు ఆభరణాలపై ముందుగా ప్రభుత్వ అధీనంలోని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సంస్థ హాల్‌మార్క్ ఉందో పరిశీలించాలి. దీంతోపాటు ఆభరణంపై కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. వాటిని బట్టి అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.24 క్యారట్ బంగారం: 999 అనే సంఖ్య ఉంటుంది.22 క్యారట్: 91618 క్యారట్: 75014 క్యారట్: 58310 క్యారట్: 417 అనే నంబర్ ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!24 క్యారట్ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్ బంగారంలో 8.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. 18 క్యారట్ బంగారంలో 25 శాతం ఇతర పదార్థాలతో కల్తీ చేస్తారు. 14 క్యారట్-41.7 శాతం, 10 క్యారట్-58.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. -
రేట్లు పెరిగి.. క్యారెట్లు తరిగి...
24కు 9 మార్క్ పడింది బంగారం ధర రోజు రోజుకూ కొండెక్కుతోంది. కొన్నాళ్లలో పది గ్రాముల ధర అక్షరాలా లక్ష అవుతుందంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవల గొలుసు దొంగతనాలు కూడా పెరిగాయని క్రైమ్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు బంగారం ధరను దించేదెలా? ఈ ఆలోచనతో కేంద్రం 9 కేరెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. పది గ్రాముల 9 క్యారెట్ల బంగారం ధర 20 వేల నుంచి 30 వేల రూ΄ాయల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ బంగారం వల్ల లాభం ఎంత? నష్టం ఎంత? అనే సందేహాలు అంతటా వినిపిస్తున్నాయి.తొమ్మిది క్యారెట్ బంగారంతో ఎలాంటి ఆభరణాలు తయారవుతాయి అనే సందేహం చాలా మందిలో తలెత్తవచ్చు. ఇప్పటికే మార్కెట్లో 22కె, 18కె, 14కె, 9కె బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.లెక్కల్లో బంగారంబంగారం స్వచ్ఛతను కొలిచే యూనిట్‌ను క్యారెట్లలో లెక్కిస్తారు. 24 క్యారెట్ బంగారంలో 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత స్థాయి 91.7 శాతం కాగా 18 క్యారెట్ల బంగారం 75 శాతం ఉంటుంది. 14 క్యారెట్ల బంగారం 58.3 శాతం స్వచ్ఛమైనది. 12 క్యారెట్ల బంగారం 50 శాతం, 10 కారెట్ల బంగారంలో స్వచ్ఛత 41.7 శాతం కాగా, 9 క్యారెట్లలో బంగారం స్వచ్ఛత 37.5 శాతం మాత్రమే ఉంటుంది. క్యారెట్ తగుతోంది అంటే ఇందులో వెండి, రాగి, జింక్, నికెల్ వంటి లోహాలు కలుపుతారని అర్థం. హాల్‌మార్క్ తప్పనిసరి!పెరుగుతున్న ధరల ప్రతికూల ప్రభావాన్ని ఐబిజెఎ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ ‘బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 9 క్యారెట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను అనుమతించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. సావరిన్ గోల్డ్ బాండ్ల ధరను నిర్ణయించడంలో ఐబీజేఏ సహకారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించడం ముఖ్యం’ అంటున్నారు. 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,000గా ఉంది. దీనిపై 3 శాతం జీఎస్టీ అదనం. ఈ బంగారానికి హాల్‌మార్కింగ్ ఆమోదిస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది.నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో2021తో ΄ోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకొని దొంగలకు ముట్టజెప్పడం దేనికి అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారాన్ని హాల్‌మార్క్‌తో అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.కాంటెంపరరీ డిజైన్లకే ్ర΄ాధాన్యతభారతదేశానికి చెందిన నగల కంపెనీలవాళ్లు ఇప్పటికే 9కె బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిని డిజైన్, తయారీ, మార్కెటింగ్‌తో అనుసంధానించి, నగల డిజైన్ల అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ ఆభరణాలు పెట్టుబడిగా కాకుండా రోజువారీ ఉపయోగకరమైన, కాంటెంపరరీ డిజైన్లతో వస్తున్నాయి. సన్నటి చైన్లు, రింగులు మాత్రమే ఉంటున్నాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ఈ జాబితాలో లేవు. 9కెలో వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఈ నగలపైన ఆ జ్యువెలరీ బ్రాండ్ లోగో ఉంటోంది. పది గ్రాముల బంగారం ధర 30 వేల లోపే ఉంటుంది అంటున్నారు. మేం ఎంత తక్కువ క్యారెట్లో ఉన్న లోహాలతోనైనా నగలు డిజైన్ చేస్తాం. అయితే, ప్రజలు ఎప్పుడూ క్వాలిటీ గోల్డ్‌నే కొంటారు. హాల్‌మార్క్ వేసి, తిరిగి అమ్ముకున్నా నష్ట΄ోం అనే నమ్మకం వుంటే 9 క్యారెట్ల నగలు అమ్ముడు΄ోవచ్చు. సాధారణంగా 9.16 బంగారంతో చేస్తే వేస్టేజ్‌లో కొంత బంగారం ΄ోతుంది. ఇక 9 క్యారెట్ గోల్డ్‌లో అంటే వేస్టేజ్ ఇంత ఉంటుందని ఇతమిద్ధంగా చెప్పలేం. ఆభరణం డిజైన్‌ను బట్టి వేస్టేజ్ ఖర్చు రెట్టింపు ఉండవచ్చు. – మలుగు రమేష్‌చారి, స్వర్ణకారుడుకరిగిస్తే తరుగే..!9 క్యారెట్ గోల్డ్ వల్ల అమ్మకాలు ఎక్కువ ఉండవచ్చు అని అనుకోవచ్చు. మార్కెట్లో ప్యూర్ గోల్డ్ గ్రామ్ ధర రూ.7 వేల కు పైనే ఉంది. 22 క్యారెట్ బంగారాన్ని ఆభరణాల కోసం, 18 క్యారెట్ గోల్డ్ ను డైమండ్ జ్యువెలరీకి ఉపయోగిస్తారు, దీంట్లో గోల్డ్ కాం΄ోజిషన్ తక్కువ ఉంటుంది. 14 క్యారెట్ గోల్డ్‌ను కాంటెంపరరీ డిజైన్స్ కోసం ఉపయోగిస్తారు. గోల్డ్ శాతం ఇంకా తగ్గి 9 క్యారెట్‌కి తీసుకురావచ్చు. అయితే, ఈ నగలను కరిగించినప్పుడు ఏ లాభం రాదు. అయితే, ఈ గోల్డ్ ఎంత మేరకు అమ్మడు΄ోతుంది అనేది మార్కెట్లోకి వచ్చాక మాత్రమే చెప్పగలం. – కళ్యాణ్‌కుమార్, జ్యువెలరీ మార్కెట్ నిపుణులు -
ఆభరణాల స్వచ్చతలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాల స్వచ్చత విషయంలో మరింత పారదర్శకతను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకువస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) సంఖ్యతో హాల్‌మార్క్ అయిన బంగారు ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా నాలుగు లోగోలతో కూడిన పాత హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల విక్రయానికి మార్చి 31 తర్వాత అనుమతి ఉండదు. సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఏప్రిల్ 1 నుంచి కొత్త హాల్‌మార్కింగ్ విధానం తప్పనిసరి చేయాలని జనవరి 18న నిర్ణయించారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ సంఖ్య అమలుకు ముందు (2023 ఏప్రిల్ 1కి ముందు) పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ నాలుగు లోగోలతో అమల్లో ఉంది. ఇందులో ఒకటి ఆర్టికల్ ప్యూరిటీని సూచిస్తూ ఉండే బీఐఎస్ లోగో ఒకటి. నగల వ్యాపారి, స్వచ్చత(అస్సేయింగ్), హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోలు మిగిలినవి. పాత విధానాల ప్రకారం వినియోగదారుల వద్ద ఉన్న ఆభరణాల హాల్‌మార్క్ చెల్లుబాటు అవుతుందని కూడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. -
స్వచ్ఛమైన తేనె ఎలా గుర్తించాలి?
వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్ జంగిల్ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి. అయితే మార్కెట్లో దొరికే తేనె నాణ్యత ఎంత..? ఈ తేనెలో ఆరోగ్యానికి మంచి చేసే సుగుణాలు ఉన్నాయా..? తెలుసుకొని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని గమనించండి.. ► స్వచ్ఛమైన తేనె కాస్త నల్లగా ఉంటుంది. పసుపుగా అందంగా కనిపించదు. కల్తీలేని తేనెను గాజుసీసాలో పోస్తే సీసాకు అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. కాలం గడిచేకొద్ది కల్తీ తేనెలు కూడా నల్లగా ముదురు రంగులోకి మారతాయి. అలా అని అది స్వచ్ఛమైన నిఖార్సైన తేనె అనుకోలేము. తయారీ తేదీని బట్టి రంగును గుర్తించాలి. ► తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్ ఉంటే అది స్వచ్ఛమైన తేనెగా గుర్తించాలి. ► ఒక స్పూన్‌తో కొద్దిగా తేనె తీసి దానిని ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడు ఆ తేనె చుక్కలు ముద్దగా లేదా ధారలా జారాలి. అప్పుడు అది మంచి తేనె అని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే అది కల్తీకలిసిన తేనెగా గుర్తించాలి. ► నాణ్యమైన తేనె అంటే ఆర్గానిక్ మాత్రమే. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు ఉండడం వల్ల అది పంచదార కంటే తియ్యగా ఉంటుంది. ► తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడిచేస్తారు. ఇలా వేడిచేసేటప్పుడు తేనెలోని ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్స్ తోపాటు ఇతర పోషకాలు దెబ్బతింటాయి. ► తీపిదనంతో పాటు తేనెలో 20 శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది. అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు. ► ఎక్కువ కాలం తేనె తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. శుభ్రమైన పొడి గాజుసీసాలో పోసీ గాలిపోకుండా టైట్‌గా మూతపెట్టి భద్రపరిస్తే ఎన్నేళ్లైనా తేనెకు శల్యం ఉండదు. -
కొత్త బాండ్ ఎవరో!
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో జేమ్స్ బాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే నటీనటులు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటారు. ఇప్పటికే 26 సినిమాల్లో కనిపించిన బాండ్ పాత్రల్లో సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లెజెన్బే, రోగర్ మోర్, టిమోతీ డాల్టన్, పియర్స్ బ్రోస్నన్ నటించగా చివరి నాలుగు చిత్రాల్లో డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో అలరించాడు. తాజాగా రిలీజ్ అయిన స్పెక్టర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా క్రెగ్ ఇక పై తనకు బాండ్ పాత్రలో నటించటం ఇష్టం లేదంటూ ప్రకటించాడు. దీంతో కొత్త బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు మరో బాండ్ ఎవరన్నది తేలకపోయినా డానియల్ క్రెగ్ మాత్రం బాండ్ పాత్రకు గుడ్ బై చెప్పినట్టే అన్నటాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం క్రెగ్ ప్యూరిటీ అనే అమెరికన్ టీవీ సీరీస్‌కు అంగీకరించాడు. ఈ సీరీస్ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది కనుక క్రెగ్ ఇక బాండ్ సినిమాకు అంగీకరించే ఛాన్స్ లేదు. దీంతో కొత్త బాండ్ కోసం అన్వేషణ ప్రారంభించారు. -
క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్!
హాలీవుడ్ చిత్రాల్లో లేటెస్ట్ జేమ్స్‌బాండ్ అయిన డేనియల్ క్రెగ్ ఇప్పుడు ఆ పాత్ర నుంచి పక్కకు తప్పుకుంటున్నారా? హాలీవుడ్లో ఇప్పుడు చర్చంతా దాని మీదే నడుస్తోంది. అమెరికాలోని తాజా టెలివిజన్ సిరీస్ ‘ప్యూరిటీ’లో నటించడానికి 47 ఏళ్ళ క్రెగ్ చర్చలు జరుపుతున్నారనీ, ఈ దెబ్బతో తదుపరి జేమ్స్‌బాండ్ సినిమాలో నటించడానికి ఆయనకు తీరిక ఉండదనీ వార్తలు వస్తున్నాయి. ఇరవయ్యేసి భాగాలు ఒక సిరీస్ చొప్పున ‘ప్యూరిటీ’ అనేక సిరీస్‌లుగా నడుస్తుందట! జొనాథన్ ఫ్రాన్జెన్ నవల ‘ప్యూరిటీ’ ఆధారంగా ఈ టీవీ సిరీస్‌ను రూపొందించ నున్నారు. ఒకవేళ అంతా కుదిరితే, బ్రిటిష్ యాక్టర్ డేనియల్ క్రెగ్ నటించే తొలి అమెరికన్ టీవీ సిరీస్ ఇదే అవుతుంది. తండ్రి కోసం వెతుకుతున్న ‘ప్యూరిటీ’ అనే ఆ అమ్మాయికి సాయపడే పాత్రలో క్రెగ్ కనిపిస్తారట! ఈ టీవీ సిరీస్ మాటెలా ఉన్నా, జేమ్స్‌బాండ్ పాత్రల్లో కొనసాగడం తనకిక పెద్దగా ఇష్టం లేదని క్రెగ్ కొన్నాళ్ళుగా చెబుతున్నారు. దశాబ్దకాలంగా ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ చిత్రాల్లో జేమ్స్‌బాండ్ పాత్రతో క్రెగ్ అలరించారు. ఆయన తాజా బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ 60 కోట్ల పౌండ్లు (రూ. 6 వేల కోట్లు) వసూలు చేసింది. ‘స్పెక్టర్’ చిత్ర షూటింగ్ టైమ్‌లో ఒంటికి దెబ్బలు తగిలి, క్రెగ్ మోకాలి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించిన మీరు అయిదోసారి ఆ పాత్ర చేపడతారా అన్నప్పుడు, ‘కేవలం డబ్బుల కోసమే చేయాలి’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘నాకూ వేరే జీవితం ఉంది. దాని సంగతి చూసుకోవాలి కదా! ప్రస్తుతానికైతే మళ్ళీ జేమ్స్‌బాండ్‌గా చేయాలనుకోవడం లేదు’ అని కొన్ని నెలల క్రితం ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలు, ఇప్పుడీ టీవీ సిరీస్ సన్నాహాలు చూస్తుంటే, క్రెగ్ ఇక జేమ్స్‌బాండ్‌గా చేయనట్లే అని కొందరి వాదన. ఇప్పటికే దర్శకుడు శామ్ మెన్‌డెస్ కూడా బాండ్ సిరీస్ నుంచి బయటకు వచ్చేశారు. హీరో క్రెగ్ కూడా గుడ్‌బై చెబుతున్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో మొన్నటి ‘స్పెక్టర్’ 24వ సినిమా గనక, రానున్న 25వ సినిమాలో ‘బాండ్... జేమ్స్‌బాండ్...007’గా ఎవరు కనిపిస్తారో? -
మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?
మీరు మా ఆఫీసులో సరఫరా చేసే మినరల్ వాటర్ తాగుతున్నారా? మీ వాటర్ ప్యూరిఫయర్ ను ఎన్నాళ్లకి ఓ సారి కడుగుతున్నారు? వాటర్ మంచి కంపెనీ నుంచే వచ్చి ఉండవచ్చు. కానీ వాటర్ ను తీసుకొచ్చే బబుల్స్ (ప్లాస్టిక్ సిలెండర్స్) ఎంత శుభ్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలను ఎప్పుడైనా వేసుకున్నారా? ముంబాయిలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎం జీ ఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన వివరాలు చూస్తే కళ్లు తేలవేయడం ఖాయం. ముంబాయిలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్ ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. మరి.. మీ ఆఫీసులో ఎలా ఉంది?