10 గ్రాములకు రూ.400 పెరుగుదల
ఢిల్లీలో రూ.85,300కు చేరిక
న్యూఢిల్లీ: పసిడి పరుగు కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు మరో రూ.400 బలపడింది. 99.9 స్వచ్ఛత బంగారం రూ.85 వేల మార్క్‌ను దాటేసి రూ.85,300కు చేరుకుంది. రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను కొత్త గరిష్టాలకు చేర్చినట్టు ట్రేడర్లు తెలిపారు.
రూపాయి ఒక్కరోజే 55 పైసలు పడిపోవడం గమనార్హం. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.400 లాభపడి 10 గ్రాములకు రూ.84,900కు చేరింది. కిలో వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.96,000కు చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ.461 పెరిగి రూ.82,765కు చేరింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్స్‌కు 7.50 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment