gold rush
-
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
రూ.85,000 పైకి పసిడి
న్యూఢిల్లీ: పసిడి పరుగు కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు మరో రూ.400 బలపడింది. 99.9 స్వచ్ఛత బంగారం రూ.85 వేల మార్క్‌ను దాటేసి రూ.85,300కు చేరుకుంది. రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను కొత్త గరిష్టాలకు చేర్చినట్టు ట్రేడర్లు తెలిపారు. రూపాయి ఒక్కరోజే 55 పైసలు పడిపోవడం గమనార్హం. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.400 లాభపడి 10 గ్రాములకు రూ.84,900కు చేరింది. కిలో వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.96,000కు చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ.461 పెరిగి రూ.82,765కు చేరింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్స్‌కు 7.50 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా ఉంది. -
అక్కడంతా బంగారుమయమే!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ ముందు వారికో శుభవార్త తెలిసి ఎగిరి గంతులేస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అంతటి ఆనందానికి ఆ శుభవార్త బంగారుమయం అవడమే. వేల్స్‌లోని స్నోడోనియాలో క్లోగావ్– సెయింట్ డేవిడ్ గనుల్లో దాదాపు 6.9 వేల కోట్ల రూపాయలు (700 మిలియన్ పాండ్లు) విలువైన బంగారు గని బయట పడింది. ఈ విషయాన్ని అక్కడ టెస్ట్ డ్రిల్లింగ్ జరిపిన ‘అల్బా మినరల్ రిసోర్సెస్’ కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవానికి 1998లోనే ఈ గనులను మూసివేశారు. ఇటీవలనే ఈ గనులకు అక్కడి ప్రభుత్వం వేల పాటను నిర్వహించగా పలు గనుల తవ్వకాల కంపెనీలు పోటీ పడి బిడ్డింగ్‌లు వేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు గని ప్రాంతాలను విభజించి ఇచ్చారు. తమకు కేటాయించిన స్థలంలో దాదాపు ఐదు లక్షల ఔన్సుల బంగారం ఉన్నట్లు టెస్ట్ డ్రిల్లింగ్‌లో బయట పడడంతో అల్బా కంపెనీ వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మిగతా కంపెనీలకు ఇప్పటి వరకు అలాంటి అదష్టం తగల లేదట. 1862 సంవత్సరం నుంచి 1911 మధ్యకాలంలో ఈ గనుల నుంచి 2.4 బంగారాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ తవ్వకాలకు సరిగ్గా 500 మీటర్ల దూరంలో తాజా బంగారం నిల్వలు బయట పడ్డాయి. 1862కు ముందు ఆ గనుల్లో రాగి, సీసం తీశారు. ఆ సంవత్సరం నుంచే బంగారు నిల్వలు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకు బయట పడిన బంగారంలో 90 శాతం సెయింట్ డేవిడ్ గనుల నుంచి వచ్చిందే. పైగా అక్కడి బంగారం అత్యంత స్వచ్చమైనది, విలువైనదని బంగారం నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రిటిష్ రాజ వంశమంతా తమ పెళ్లిళ్ల ఉంగరాలను అక్కడి బంగారంతోనే చేయించుకున్నారట. బ్రిటీష్ రాణి ఎలిజబెత్, యువ రాణి డయానా పెళ్లి రింగులు అక్కడి బంగారంతో చేసినవేనట. -
బతుకుదాం వీళ్ల స్ఫూర్తితో
అలాస్కా మంచుదిబ్బలు. ఘోరమైన తెల్లతుఫాను. తినడానికి తిండి లేదు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని వేడివేడి నీళ్లలో షూ ఉడకబెట్టుకుని తింటాడు చార్లీచాప్లిన్ ‘గోల్డ్ రష్’ సినిమాలో. కుటుంబంతో బతికే వ్యక్తిని తీసుకెళ్లి అమెరికా దక్షణాది రాష్ట్రాల్లో బానిసగా అమ్మేస్తారు కొందరు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని అతను స్వేచ్ఛ కోసం 12 ఏళ్ల పాటు ప్రయత్నించి పొందుతాడు ‘12 ఇయర్స్ ఏ స్లేవ్’ సినిమాలో. చనిపోవడానికి ఉండే కారణాలు ఎప్పుడూ స్వల్పమే. బతికేందుకు దొరికే దారులు వేయి. బతుకుదాం వీరి స్ఫూర్తితో. 1890ల చివరలో అలాస్కా– కెనెడా సరిహద్దు ప్రాంతంలో బంగారం బయటపడింది. అమెరికా లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా సియాటిల్, శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆ బంగారం కోసం లక్ష మంది వేటగాళ్లు బయలుదేరారు. కాని దారి సులువు కాదు. అలాస్కా మీదుగా కెనెడాలో ప్రవేశించి బంగారం దొరికే ప్రాంతానికి చేరుకోవాలి. దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం అలస్కా నుంచి. అలస్కా అంటే శరీరాన్ని క్షణాల్లో కట్టెగా మార్చేంత శీతల ప్రాంతం. కాని వేటగాళ్లు ప్రాణాలకు తెగించి బయలుదేరారు. లక్షమంది వెళితే కేవలం 30 వేల మంది తిరిగి వచ్చారు. అందరూ వెళ్లే దారిలో లేదా తిరిగి వచ్చేదారిలో మరణించారు. చార్లి చాప్లిన్ ఈ చారిత్రక ఘటన మీద ‘గోల్డ్ రష్’ సినిమా తీశాడు. బంగారం వేటకు వెళ్లి అలాస్కా మంచు తుఫానులో చిక్కుకుంటాడు చాప్లిన్. అతడికి ఆసరా ఒక చెక్కముక్కల గది. తోడుగా మరో వేటగాడు. తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. బయట తుఫాను ఎన్నిరోజులు గడిచినా ఆగదు. భయంకరమైన ఆకలి. తోటి వేటగాడు ఆకలితో భ్రాంతికి గురై చాప్లిన్నే తిందామన్నంత పిచ్చివాడైపోతాడు. చేతిలో తుపాకీ ఉంది. ఆత్మహత్య చేసుకోవడం చిటికెలో పని. కాని చాప్లిన్ బతకాలని నిర్ణయించుకుంటాడు. తిరిగి ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు. అందుకే తన కాలి షూ తీసి నీళ్లలో బాగా ఉడకబెడతాడు. తర్వాత దానిని తెచ్చి టేబుల్ మీద పెట్టి రెండు సగాలుగా కోస్తాడు. ఒక సగం తన పార్టనర్‌కు ఇచ్చి మరో సగం తీరిగ్గా భుజిస్తాడు. చచ్చిపోవడం కంటే షూ తిని ప్రాణాలు కాపాడుకోవడం బెటర్. బతికి ఉంటే ఆ తర్వాత బిరియాని దొరకొచ్చు. ఈ కష్టాలకు ఓర్చుకున్నాడు కనుకనే సినిమాలో చాప్లిన్‌కు బంగారం దొరుకుతుంది. కోటీశ్వరుడు అవుతాడు. ‘పాపియాన్’ (1969) ప్రఖ్యాత ఫ్రెంచ్ నవల. నిజ జీవిత ఘటనల ఆధారంగా రాసింది. సినిమాలూ వచ్చాయి. అందులో ‘పాపియాన్’ (అంటే సీతాకోకచిలుక) అనే చిల్లర దొంగను హత్యానేరం కింద ఇరికించి అతి భయంకరమైన ఫ్రెంచ్ గయానా దీవుల్లోని జైలుకు పంపుతారు. ఇది ఇంకో రకమైన మరణశిక్షలాంటిది. ఎందుకంటే అక్కడికి వెళ్లినవారు తిరిగి రావడం కల్ల. హత్యకు అయినా గురవుతారు. ఆత్మహత్య అయినా చేసుకుంటారు. కాని పాపియాన్ బతకాలని నిశ్చయించుకుంటాడు. ఎలాగైనా బతికి తీరాలని పదే పదే పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని తీసుకొచ్చి ఏకాంత శిక్ష వేసినా ఆకలితో మాడ్చినా బతికే తీరుతాడు. 1931 నుంచి 1945 వరకు అతడు జైల్లో గడిపిన జీవితమే ఆ నవల. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన నవల ఇది. ఇస్తున్న నవల. పాపియాన్ కంటే పెద్ద కష్టం ఎవరికీ రాకపోవచ్చు. మరి ఎందుకు చనిపోవడం? 1841లో సోలమన్ నార్తప్ అనే ఆఫ్రికన్–అమెరికన్‌ను బానిసల వ్యవస్థ లేని న్యూయార్క్ నుంచి పట్టుకెళ్లి బానిసల వ్యవస్థ ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మేస్తారు. అతని భార్యకు, పిల్లలకు ఈ విషయం తెలియనే తెలియదు. అమ్ముడుపోయిన బానిసలు పత్తి, చెరకు చేలలో బండ చాకిరి చేయాలి. రాక్షస హింసను ఎదుర్కోవాలి. దానిని భరించలేక చాలామంది చచ్చిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు. కాని నార్తప్ తాను బతికి తిరిగి కుటుంబానికి చేరుకోవాలనుకుంటాడు. తాను బతికే ఉన్నానని చెప్పి ఒక లేఖ రాయడానికి కావలసిన కాగితం కోసం అతడు 12 ఏళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తాడు. కాగితం దొరికాక అతడు రాసిన లేఖ చూసి అధికారులు వచ్చి విడిపిస్తారు. నార్తప్ జీవితంపై వచ్చిన బయోపిక్ ‘12 ఇయర్స్ అండ్ స్లేవ్’. ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి సినిమా చూడాలి. ‘మలావి’ అనే దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ దేశంలోని కసుంగు అనే ఊళ్లో ఒక 15 ఏళ్ల కుర్రాడి పేరు విలియమ్ కమ్క్వాంబ. తల్లి, తండ్రి, అక్క, ఒక పెంపుడు కుక్క, బడి ఇదీ అతని జీవితం. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. కొద్దిగా పొలం, ఒక సైకిల్ వారి ఆస్తి. కాని ఆ పొలం పండదు. దాని కారణం వానలు ముందే వచ్చి పోతాయి. విత్తు నాటే సమయానికి ఉత్త ఎండ. దేశమంతా కరువు వచ్చేస్తుంది. అందరి పొలాల్లో కొద్దిగా మొక్కజొన్న పండితే ఒకరి పంటను మరొకరు దొంగిలించేంత ఆకలి. ఈ పేదరికం భరించలేక అక్క పారిపోతుంది. గుప్పెడు తిండి కూడా పెట్టకపోవడంతో కుక్క చనిపోతుంది. అమ్మా నాన్న జీవచ్ఛవాలు అయినట్టే. ఆ కుర్రాడు ఒక్కడు. కాని పారిపోడు. పోయి ఏట్లో దూకడు. కరెంటు లేని ఆ ఊళ్లో బావిలోని నీటిని పొలానికి తీసుకురావడానికి విండ్మిల్ తయారు చేస్తాడు. చనిపోయే దారి ఉన్నా బతికే మార్గం వెతికే ఉపాయమిది. ఆ పిల్లవాడికి ఆ తర్వాత అమెరికా యూనివర్సిటీలు సీటిచ్చాయి. అతడి జీవితం ఆధారంగా ‘ద బాయ్ హూ హార్వెస్ట్ విండ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలే కాదు ఇలాంటి సినిమాలు ఎన్నో నెట్లో ఉన్నాయి. బతుకు మీద ఆశ కలిగించే సాహిత్యం ఉంది. విలోమ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పారదోలేందుకు సాయపడే హెల్ప్లైన్లు ఉన్నాయి. స్నేహితులు ఉంటారు. కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మరైతే చనిపోవడం ఎందుకు? ప్రకృతి మనిషికి బుద్ధి, చేతన, ఆలోచన ఇచ్చింది పాజిటివ్‌గా ఆలోచించేందుకు. వెలుతురు వైపు చూసేందుకు. చీకటి పడితే నిద్రపోయి (దానిని భరించి) వెలుతురులో మేల్కోవాలి. అదీ జీవితం. కష్టాలు ఇంతకుముందు లేవని కాదు. ఇక ముందు ఉండవనీ కాదు. మన పూర్వికులు కోట్లాది మంది కష్టాలకు తట్టుకుని నిలబడ్డారు. కనుక మనం ఇవాళ ఉన్నాం. మనం తట్టుకుని నిలబడి తర్వాతి తరాలకు ఆశ కల్పించాలి. ఇది నిరాశ ఉన్న కాలం నిజమే. ‘కరోనా’ మహమ్మారి మనల్ని ఆందోళనలో, నైరాశ్యంలో ముంచుతోంది నిజమే. కాని మరో మూడూ లేదా ఆరు నెలలు ఓపిక చేసుకోలేమా. ఇతర మన కష్టాలకు విరుగుడులను వెతుక్కోలేమా. ఆత్మీయులతో మన భారాన్ని పంచుకుని బతుకును పెంచుకోలేమా? బతుకుదాం. శతమానం భవతి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యుధ్ద భయాలతో గోల్డ్ రష్..!
► వారంలో 37 డాలర్లు పెరుగుదల ► మళ్లీ డాలర్ ఇండెక్స్ నేల చూపు ► పసిడిది బుల్ట్రెండే అంటున్న నిపుణులు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయంగా అమెరికా – ఉత్తర కొరియా మాటల ‘యుద్ధం’ పసిడిపై ప్రభావం చూపుతోంది. తక్షణ తమ పెట్టుబడుల రక్షణకు ఇన్వెస్టర్లు పసిడిని సాధనంగా ఎంచుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి సైతం డబ్బు పసిడికి వైపునకు తరలుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 4వ తేదీతో ముగిసిన వారంలో వారం వారీగా 11 డాలర్లు తగ్గి, 1,258 డాలర్లకు చేరిన ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర తాజాగా ముగిసిన వారంలో (ఆగస్టు 11) మళ్లీ ఒక్కసారిగా ఊపందుకుని 37 డాలర్ల లాభంతో 1,295 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,297 డాలర్లను సైతం దాటింది. భౌగోళిక ఉద్రిక్తతలతోపాటు, డాలర్ ఇండెక్స్ వారీ వారీగా 93.37 డాలర్ల నుంచి 92.99 డాలర్లకు తగ్గడమూ పసిడికి లాభంగా మారింది. అమెరికా వృద్ధి ధోరణులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపుపై సైతం అనిశ్చితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పసిడిది బులిష్ ధోరణేననీ, తగ్గినప్పుడల్లా అది కొనుగోళ్లకు అవకాశమనీ నిపుణులు చెబుతున్నారు. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందనీ, అటు తర్వాత 1,204 వద్ద మరో మద్దతు లభిస్తుందని వివరిస్తున్నారు. ఇక పై స్థాయిలో కీలక 1,275 డాలర్లు దాటింది కాబట్టి, తరువాత నిరోధం 1,300 డాలర్లని వారి విశ్లేషణ. ఇదీ దాటితో 1,345 డాలర్ల వద్ద మరో నిరోధం ఉందని టెక్నికల్స్ పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, మరో నెల రోజుల్లో పసిడి 1,390డాలర్లకు చేరుతుందని ఫండమెంటల్స్ వైపు నుంచి అంచనాలూ ఉన్నాయి. 1,204 వరకూ పడిపోయిన పసిడి తిరిగి నెలతిరక్కుండానే 100 డాలర్లు ఎగయడం గమనార్హం. దేశంలోనూ పరుగే...: అంతర్జాతీయంగా పసిడి పరుగు ధోరణి దేశీయంగానూ స్పష్టంగా కనిపించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వారం వారీగా భారీగా 63.75 (రూ.1.71) నుంచి 64.05కు బలహీనపడ్డమూ దేశీయంగా పసిడి పరుగుకు కొంత కారణమైంది. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో భారీగా రూ.897 పెరిగి రూ.29,203కి చేరింది. ఇక దేశీయ డిమాండ్ తోడు కావడంతో ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.520 ఎగసి రూ.29,210కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పెరిగి రూ. 29,060కు చేరింది. వెండి కేజీ ధర కూడా భారీగా 1,160 పెరిగి రూ. 39,110కి చేరింది. -
పొలంలో బంగారపు గని ఉందని..
బిజ్నోర్: జిల్లాలోని చాంద్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన పొలంలో దున్నుతుండగా హరప్పా నాగరికతకు చెందిన 4,500 సంవత్సరాలకు పూర్వం తయారుచేసిన రాగి వస్తువులు బయటపడ్డాయి. దీంతో ఆశ్చర్యపోయిన రైతు పొలంలో బంగారపు గని ఉండే అవకాశం ఉందని తవ్వకాలు ప్రారంభించాడు. కొద్ది సమయంలో ఈ వార్త హరినగర్ గ్రామం మొత్తం పాకడంతో ఆ రైతు చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు కూడా బంగారం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాల్లో మరికొన్ని రాగి వస్తువులు బయటపడ్డాయి. బంగారం కోసం హరినగర్ గ్రామం పొలాల్లో తవ్వకాలు జరుపుతున్నారనే వార్తను తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ బీ చంద్రకళ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సమాచారం అందించారు. దీంతో హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న ఏఎస్ఐ బృందం హరప్పా నాగరికతకు చెందిన వస్తువులు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించింది. ఇతరులను ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా పోలీసుల సాయం తీసుకుంది. వస్తువుల గురించి మాట్లాడిన ఏఎస్ఐ సూపరింటెండెంట్ భువన్ విక్రమ్ తవ్వకాల్లో దొరికిన రాగి వస్తువులన్నీ హరప్పా నాగరికతకు చెందినవిగా భావిస్తున్నామని తెలిపారు. పరిశోధనలు పూర్తయిన తర్వాత వీటి కచ్చితమైన వయస్సును నిర్దారిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని విలువైన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. -
కలలో మాట.. బంగారం వేట!
నమ్మే పిచ్చోళ్లు ఉంటే.. నాపరాయిని చూపించి వజ్రం అన్నాడట వెనకటికొకడు. ఉత్తరప్రదేశ్ బంగారు వేట వ్యవహారం అచ్చం అలాగే ఉంది. మన దేశంలో బాబాలు, బతికున్న దేవుళ్లకు ఏమాత్రం కొదవలేదు. వాళ్లు చెప్పిన మాటలను పట్టుకుని నిప్పుల్లో దూకడం లాంటి పిచ్చిపనులు చేసేవాళ్లకు కూడా కొదవ లేదు. కానీ.. ఏకంగా ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కదిలిపోయి జీఎస్ఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని బంగారం ఉందంటూ తవ్వకాలు మొదలుపెట్టడం.. నిజంగా ఎంత పిచ్చిపనో అనిపిస్తుంది. వెయ్యి టన్నుల బంగారం ఉందని ఓసారి, 2,500 టన్నులు ఉందని ఇంకోసారి చెబుతూ స్వామి శోభన్ సర్కార్ జనాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు కూడా తమకు ఇక్కడేదో లోహం ఉందని చెప్పడం వల్లే తాము తవ్వకాలు చేస్తున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించడం దీనంతటికీ మూలం అయ్యింది. శుక్రవారం నుంచి ఆ కోటలో ఏఎస్ఐ బృందం తవ్వకాలు మొదలుపెట్టింది. అక్కడేం జరుగుతోందో చూసేందుకు జనం కట్టలు కట్టుకుని మరీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సాధువు కన్న కల నిజం కావాలని, ప్రతి జిల్లాలో ఓ బంగారు నిధి ఉండాలని అంటున్నారు!! కేవలం ఒక సాధువుకు వచ్చిన కలను పట్టుకుని, ఆయన చెప్పిన మాటల ఆధారంగా కోటలో తవ్వకాలు చేస్తున్న ప్రభుత్వం.. దానిమీద పెట్టే ఖర్చుతో ఎంతమందికి కూడు, గూడు, గుడ్డ లాంటివి అందించవచ్చో ఆలోచించడంలేదు. పైపెచ్చు, భూమిని తవ్వేందుకు పలుగులు, పారలతో సిబ్బంది బయల్దేరడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోనే ఫతేపూర్ జిల్లా ఆదాంపూర్ గ్రామంలో కూడా మరో 2,500 టన్నుల బంగారం ఉందని, అక్కడ తవ్వకాలకు కావాలంటే తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని సాధువు శోభన్ సర్కార్ చెబుతున్నారట. అసలాయనకు ఆ 10 లక్షలు ఎక్కడివో, దానికి ఇన్నాళ్లూ ఆదాయపు పన్ను కట్టారో లేదో తేలిస్తే ఇలాంటి కూతలు ఆగుతాయని భావిస్తున్నారు. -
కలగంటి కలగంటి...అంటున్న స్వామిజీ
-
కల నిజమాయనా?
-
ఉత్తరప్రదేశ్‌లో గోల్డ్ రష్